'రైతులను బెదిరిస్తే సహించేది లేదు' | YSRCP leaders visit tulluru | Sakshi
Sakshi News home page

'రైతులను బెదిరిస్తే సహించేది లేదు'

Published Sat, Oct 24 2015 5:48 PM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

YSRCP leaders visit tulluru

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి భూములు ఇవ్వని రైతులను బెదిరిస్తే సహించేదిలేదని వైఎస్ఆర్ సీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, క్రిస్టియన్ హెచ్చరించారు. శనివారం తుళ్లూరు మండలం మల్కాపురంలో పర్యటించి.. దుండగులు నిప్పంటించిన చెరుకుతోటను పరిశీలించారు. గద్దే చంద్రశేఖర్ రావుకు చెందిన 5 ఎకరాల చెరుకు తోట కాలిబూడిదైంది.

రాజధానికి భూములు ఇవ్వని రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడం సరికాదని వైఎస్ఆర్ సీపీ నేతలు అన్నారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా సహించేదిలేదని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజధానికి భూములు ఇవ్వని రైతులపై కొనసాగుతున్న దమనకాండను ఖండించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement