
నా పొరపాటుకు నేనే శిక్షించుకుంటున్నా
20 నిమిషాలు ఎండలో నిలబడిన ప్రకాశం జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు
ఒంగోలు: ప్రజాప్రతినిధిగా అధికార కార్యక్రమాలకు వినియోగించుకోవాల్సిన జెడ్పీ కారును రెండుసార్లు సొంతానికి వినియోగించుకున్నందుకు ప్రకాశం జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు స్వయంగా శిక్ష విధించుకున్నారు. 20 నిమిషాలు ఎండలో నిలబడ్డారు. ఒంగోలులో సోమవారం జరిగిన జెడ్పీ సమావేశంలో ప్రజాప్రతినిధులు తమ సొంతానికి వాహనాలు వాడుకుంటున్న విషయంపై ప్రస్తావన రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో పొదిలి జెడ్పీటీసీ సభ్యుడు సాయి రాజేశ్వరరావు ప్రస్తావించిన అంశంపై హరిబాబు స్పందించారు.తానెలా జడ్పీ వాహనాన్ని వినియోగించిందీ తెలిపారు.
అధికారుల సూచన ప్రకారం లాగ్‌బుక్‌లో ప్రైవేటు వినియోగాన్ని రాసి ఆ ఖర్చులు చెల్లించవచ్చని తెలిసిందనీ అరుుతే తాను అలా రాయలేదని, చలానా కట్టకుండా సొంతానికి వాడుకున్నానని, ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు బాధ్యుడిగా తనను తాను శిక్ష వేసుకుంటూ 20 నిమిషాలపాటు ఎండలో నిలబడతానని ప్రకటించారు. ఆ మేరకు సమావేశం బయటకు వచ్చి ఎండలో నిలబడ్డారు.