
ఈదర హరిబాబు
ఒంగోలు: ప్రకాశం జిల్లా రాజకీయం మరో మలుపు తిరిగింది. జెడ్పీ చైర్మన్ చాంబర్కు టీడీపీ బహిష్కృత నేత, ప్రకాశం జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు మరో తాళం వేశారు. చాంబర్లో తనకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లు ఉన్నాయని హరిబాబు చెప్పారు. వాటి భద్రత కోసమే తాను మరో తాళం వేసినట్లు తెలిపారు.
అంతకు ముందు ఉదయం హరిబాబు వచ్చేసరికి చాంబర్‌కు తాళాలు వేసి ఉన్నాయి. దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే బైఠాయించారు. తాను జెడ్పీ చైర్మన్గా కొనసాగాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా సీఈఓ సహకరించటం లేదని ఆవేదన చెందారు.
**