
గ్రహం అనుగ్రహం, జులై 18, 2015
శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు..
శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు
నిజ ఆషాఢ మాసం, తిథి శు.విదియ ఉ.7.48 వరకు, తదుపరి తదియ, నక్షత్రం ఆశ్లేష రా.6.11 వరకు, వర్జ్యం ఉ.6.07 నుంచి 7.49 వరకు, దుర్ముహూర్తం ఉ.5.38 నుంచి 7.17 వరకు, అమృతఘడియలు సా.4.27 నుంచి 6.09 వరకు
భవిష్యం
మేషం: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటా బయటా చికాకులు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
వృషభం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మిథునం: కుటుంబ, ఆరోగ్య సమస్యలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు.
కన్య: వ్యవహారాలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు అందుకుంటారు. కీలక నిర్ణయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహన యోగం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉన్నత స్థితి.
తుల: నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
వృశ్చికం: కొన్ని పనులలో ఆటంకాలు కలగవచ్చు. బంధుమిత్రులతో మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. ధన వ్యయం. కుటుంబంలో చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
ధనుస్సు: శ్రమ తప్ప ఫలితం కనిపించదు. పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. వృథా ఖర్చులు. ఆధ్యాత్మిక చింతన. మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. శుభకార్యాలకు హాజరవుతారు. మీ సత్తా చాటుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం నెలకొంటుంది.
కుంభం: పరిచయాలు పెరుగుతాయి. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
మీనం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు రావచ్చు. ఆలోచనలు కలసి రావు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు తప్పవు.
- సింహంభట్ల సుబ్బారావు