
గ్రహం అనుగ్రహం, సెప్టెంబర్ 30, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం..
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం
తిథి బ.తదియ రా.1.54 వరకు, నక్షత్రం అశ్వని సా.4.53 వరకు తదుపరి భరణి
వర్జ్యం ప.1.09 నుంచి 2.38 వరకు
తిరిగి రా.1.56 నుంచి 3.29 వరకు
దుర్ముహూర్తం ప.11.25 నుంచి 12.15 వరకు
భవిష్యం
మేషం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
వృషభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ధన వ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి.
మిథునం: పనుల్లో విజయం. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు. వస్తు, వస్త్రలాభాలు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని అభివృద్ధి.
కర్కాటకం: నూతన ఉద్యోగప్రాప్తి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు,ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు,ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
కన్య: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. ధనవ్యయం. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
తుల: దూరపు బంధువుల కలయిక. శుభకార్యాలకు హాజరవుతారు. భూలాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. విద్య, ఉద్యోగావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు.
ధనుస్సు: బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.
మకరం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. ఇంటాబయటా చికాకులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు,ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కుంభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
మీనం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
- సింహంభట్ల సుబ్బారావు