మన రుచులకు విశేష స్పందన
మన రుచులకు విశేష స్పందన
Published Mon, Mar 13 2017 12:00 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కర్నూలు (అగ్రికల్చర్) : ఆర్గానిక్ ఫుడ్ ఫెస్టివల్ (మన సీమ రుచులు) నగర జనాన్ని విశేషంగా అలరించింది. రాష్ట్ర పర్యాటక సంస్థ హరిత హోటల్‌లో ఆదివారం నగర ప్రజలకు మన సీమ రుచుల పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ సందర్బంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాగిసంకటి, జొన్న రొట్టె, గోంగూర చెట్ని, ఆలు బఠానిఫ్రై, జీరారైస్, లెమన్ రైస్, మిర్యాల రసం, గోంగూర మాంసం, నాటుకోడి కర్రీ, చేపల పులుసు రుచులను నగర ప్రజలు ఆస్వాదించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈనెల చివరి వరకు ప్రతి శని,ఆదివారాల్లో సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహార ధాన్యాలతో మన రుచుల పేరుతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ఈ సందర్బంగా పర్యాటక అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ బాబ్జీ తెలిపారు. వచ్చే శుక్ర, శనివారాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయన్నారు. పెద్దలకు రూ.350, పిల్లలకు రూ.150, దంపతులకు రూ. 600 ప్రకారం నాన్ వెజిటేరియన్, పెద్దలకు రూ.275, పిల్లలకు రూ.125, దంపతులకు రూ.500 ప్రకారం వెజిటేరియన్ కూపన్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
Advertisement