నేషనల్ హెల్త్ మిషన్‌లో
141 పోస్టులు
నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో (బ్లాకుల్లో) కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసేందుకు కావాల్సిన సిబ్బంది నియామకానికి మిషన్ డెరైక్టర్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కాంట్రాక్ట్ గడువును 31-3-2017గా పేర్కొన్నారు. అభ్యర్థి పనితీరు, డిపార్ట్‌మెంట్ అవసరాలకు అనుగుణంగా ఈ వ్యవధిని పెంచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్‌లోని సమగ్ర వివరాలు..

ఖాళీల వివరాలు: మొత్తం వేకెన్సీ 141 కాగా అవి పోస్టుల వారీగా..
1. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ (మేల్)-35
2. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ (ఫిమేల్)-33
3. ఫార్మాసిస్ట్-35
4. ఫిమేల్ హెల్త్ వర్కర్-38
వేతనం: మెడికల్ ఆఫీసర్ (మేల్, ఫిమేల్)కు నెలకు రూ.19,125. ఫార్మాసిస్ట్‌కు రూ.8,910. ఫిమేల్ హెల్త్ వర్కర్‌కు రూ.8,710.
వయసు: నాలుగు రకాల పోస్టులకూ 18-45 ఏళ్ల మధ్య ఉండాలి.
విద్యార్హత: మెడికల్ ఆఫీసర్ (మేల్, ఫిమేల్) పోస్టులకు ఆయుర్వేదలో ఐదేళ్ల డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ (సీసీఐఎం) ఇంటర్న్‌షిప్ చేసుండాలి. ఫార్మాసిస్ట్ పోస్టుకు 10+2లో సైన్స్ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు బ్యాచిలర్ డిగ్రీ/డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా తత్సమాన విద్యార్హత. స్టేట్/సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్టరై ఉండాలి. ఫిమేల్ హెల్త్ వర్కర్ పోస్టుకు సైన్స్ సబ్జెక్టుతో మెట్రిక్యులేషన్/హయ్యర్ సెకండరీ పార్ట్-1 ఉత్తీర్ణత లేదా తత్సమానం. ఫిమేల్ హెల్త్ వర్కర్‌గా ఏడాదిన్నర పాటు శిక్షణ పొందినట్లు సర్టిఫికెట్ ఉండాలి. పైన పేర్కొన్న నాలుగు రకాల పోస్టులకూ సాంకేతిక విద్యార్హతకు సంబంధించి కంప్యూటర్/ల్యాప్‌ట్యాప్‌లో ఎంఎస్ వర్డ్ పరిజ్ఞానం అవశ్యం. హిమాచల్‌ప్రదేశ్ మాండలికాలు, అక్కడి ప్రజల తీరుతెన్నులు తెలిసుండాలి.
ఎంపిక విధానం: జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. సంబంధిత కోర్సుల్లో పొందిన మార్కులు, వృత్తికి సంబంధించిన పూర్వానుభవాన్ని బట్టి ‘ఒక పోస్టుకు ఐదుగురు అభ్యర్థులు’ చొప్పున ఇంటర్వ్యూకు పిలుస్తారు.
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులను సంబంధిత జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు పంపాలి.
దరఖాస్తు రుసుం: జనరల్ అభ్యర్థులు రూ.200; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు రూ.100 డీడీ తీసి దరఖాస్తుకు జత చేయాలి.
చివరి తేదీ: 2016, ఆగస్టు 20
వెబ్‌సైట్: అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు, ఇతర వివరాల కోసం www.nrhmhp.gov.in చూడొచ్చు.