ఫిజికల్ సైన్‌‌సలో ప్రావీణ్యం సాధించాలంటే | Achieve master the Physical Science | Sakshi
Sakshi News home page

ఫిజికల్ సైన్‌‌సలో ప్రావీణ్యం సాధించాలంటే

Published Thu, Jul 17 2014 3:34 AM | Last Updated on Fri, Aug 17 2018 2:18 PM

ఫిజికల్ సైన్‌‌సలో ప్రావీణ్యం సాధించాలంటే - Sakshi

ఫిజికల్ సైన్‌‌సలో ప్రావీణ్యం సాధించాలంటే

 నూతన సిలబస్‌లో భౌతిక రసాయన శాస్త్రంలో మొత్తం 14 అధ్యాయాలు ఇచ్చారు. ఇందులో ఉష్ణం, రసాయన చర్యలు - సమీకరణాలు, కాంతి పరావర్తనం, ఆమ్లాలు- క్షారాలు -లవణాలు, సమతల ఉపరితలాల వద్ద కాంతి వక్రీభవనం, వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం, మానవుని కన్ను- రంగుల ప్రపంచం, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ- ఆవర్తన పట్టిక, రసాయన బంధం, విద్యుత్ ప్రవాహం, విద్యుదయస్కాంతత్వం, లోహ సంగ్రహణ శాస్త్త్రం, కార్బన్ దాని సమ్మేళనాలు అనే అధ్యాయాలకు చోటు కల్పించారు. గతంతో పోల్చితే ఉష్ణం, రసాయన చర్యలు-సమీకరణాలు,మానవుని కన్ను-రంగుల ప్రపం చం, లోహ సంగ్రహణ శాస్త్త్రం అనే అధ్యాయాలు కొత్తవి.
 
 నిరంతరం:
 సిలబస్‌లోనే కాకుండా పరీక్ష నిర్వహణ విధానంలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. నిరంతర సమగ్ర మూల్యాంకనం (Continuous and Comprehensive Evaluation&CCపద్ధతిలో ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. కాబట్టి విషయావగాహన, ప్రశ్నించడం, ప్రాజెక్టు పనులు, బొమ్మలు గీయడం, నమూనాలను తయారు చేయడం, అభినందించడం, సౌందర్యాత్మక సృ్పహ, విలువలు పాటించడం, నిజజీవిత వినియోగం, జీవిత వైవిధ్యం పట్ల సానుభూతి వంటి విద్యా ప్రమాణాల ఆధారంగా అభ్యసనం చేయాల్సి ఉంటుంది.
 
 మొత్తం చదవాలి:
 కొత్త విధానంలో చెప్పుకోవాల్సిన కీలక అంశం.. గతంలో మాదిరిగా ప్రత్యేకంగా ఫలానా అధ్యాయానికి ఇంత వెయిటేజీ అంటూ ఏమీ పేర్కొనలేదు. కాబట్టి ఏ అధ్యాయం నుంచైనా ఎన్ని ప్రశ్నలైనా ఇవ్వవచ్చు. వాటిని ఏ రూపంలోనైనా అడగొచ్చు. అందువల్ల విద్యా ప్రమాణాల వారీగా, ప్రశ్నల రకం ప్రకారం విస్తృతంగా అభ్యసన సాగించాలి. ప్రతి అధ్యాయాన్ని క్షుణ్నంగా నేర్చుకోవాలి.
 
 పరీక్ష విధానం:
 పరీక్ష విధానంలో కూడా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఉండే నాలుగు యూనిట్ టెస్టులకు బదులుగా ప్రస్తుతం ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌లు, త్రైమాసిక (క్వార్టర్లీ), ఆర్థ సంవత్సర (హాఫ్ ఇయర్లీ) పరీక్షలకు బదులుగా రెండు సమ్మేటివ్ అసెస్‌మెంట్‌లు నిర్వహిస్తారు. మూడో సమ్మేటివ్ అసెస్‌మెంట్‌ను పబ్లిక్ పరీక్షగా నిర్వహిస్తారు. ఒక్కొక్క ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు (లఘు పరీక్షను) ఒక్కొక్క సమ్మేటివ్ అసెస్‌మెంట్‌కు 40 మార్కులు కేటాయించారు. ఫార్మేటివ్ అసెస్‌మెంట్లను పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయుడు నిర్వహిస్తాడు. పాఠశాలలో చేసే ప్రయోగశాల పనులు, రాతపనులు, ప్రాజెక్టు పనులు, లఘు పరీక్ష అనే నాలుగు అంశాల ఆధారంగా ఈ పరీక్ష ఉంటుంది.
 
 
 ప్రశ్నపత్రం విశ్లేషణ:
 ప్రశ్నపత్రంలో కూడా మార్పులు ఉన్నాయి. పబ్లిక్ పరీక్ష ప్రశ్నాపత్రంలో 4 మార్కుల ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు, 1 మార్కు ప్రశ్నలు, 1/2 మార్కు (బహుళైచ్ఛిక ప్రశ్నలు) ఇస్తారు. వీటిలో 4 మార్కుల ప్రశ్నలకు మాత్రమే అంతర్గత ఎంపిక (ఇంటర్నల్ చాయిస్) ఉంటుంది. ఈ సారి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన గమనించాల్సిన కీలక అంశం.. పాఠ్య పుస్తకంలోని అభ్యాసాలలో ఇచ్చిన ప్రశ్నలు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నవి ఉన్నట్లుగా పబ్లిక్ పరీక్షలలో ఇవ్వరు. ప్రశ్నలకు సమాధానాలు ఒకే రకంగా రాయడానికి బదులు బహుళ సమాధానాలు వచ్చేలా ప్రశ్నల స్వభావం ఉంటుంది. ఒకసారి పబ్లిక్ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి పునరావృతం కావు. పరీక్షల్లో జ్ఞాపకం లేదా బట్టీ పట్టీ రాసిన మాదిరిగా సమాధానాలు ఉండకూడదు. ఆలోచించి రాసినవిగా ఉండాలి.
 
 సమాధానాలు ఇలా:
 వ్యాసరూప ప్రశ్నలకు 12 నుంచి 15 వాక్యాలలో సమాధానాలు రాయాలి. జవాబులు విశ్లేషణాత్మకంగా, అవసరమైన చోట ఉదాహరణాలను ప్రస్తావిస్తూ భాషా దోషాలు లే కుండా రాయాలి. అవసరమైనచోట సమాచారాన్ని బొమ్మ ద్వారా లేదా గ్రాఫ్ ద్వారా గానీ వివరించాల్సి ఉంటుంది. స్వల్ప సమాధాన ప్రశ్నలకు నిర్ధిష్టంగా ఒకటి- రెండు వాక్యాలలో సమాధానం రాయాలి. లఘు ప్రశ్నలకు జవాబులు 4-5 వాక్యాలలో సమాధానం ఇవ్వాలి. బహుళైచ్ఛిక ప్రశ్నలకు ఆలోచించి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈప్రశ్నలన్నీ అనువర్తిత రూపంలో ఉంటాయి.
 
 ప్రయోగశాల పనులు, రికార్‌‌డ- నిర్వహణ:
 ప్రయోగశాలలో విద్యార్థులు.. వ్యక్తిగతంగా లేదా జట్టుగా ప్రయోగాలు చేస్తున్న విధానం, పరికరం అమరిక, పరికరాలు ఉపయోగించటంలో ప్రదర్శించిన నైపుణ్యం, అంశాలను పరిశీలించే విధానం దాన్ని నమోదు చేసే విధానం, ఫలితాలను విశ్లేషించి నిర్ధారణకు రావడం వంటి అంశాల్లో తర్ఫీదు పొందుతాడు. నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ప్రయోగ కృత్యాలు చేయాలి. ఇందులో ప్రయోగం చేసిన పద్ధతికి 4 మార్కులు కేటాయిస్తారు. ప్రయోగశాల రికార్‌‌డకు 6 మార్కులు ఇస్తారు.
 
 ప్రాజెక్టు పనులు:
 నిర్మాణాత్మక మూల్యాంకనంలో నాలుగో సాధనంగా ప్రాజెక్టు పనులు ఉన్నాయి. వీటికి 10 మార్కులు కేటాయించారు. పాఠ్యపుస్తకంలోని ప్రాజెక్టులే కాకుండా స్థానిక వనరులు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు ఇచ్చే ప్రాజెక్టులు కూడా చేయాలి. పాఠంలో ఇచ్చిన కృత్యా లు ప్రాజెక్టులు కావు. ప్రాజెక్టులో భాగంగా ఒక సమస్యా పరిష్కారం కోసం వేర్వేరు సాధనాలు ఉపయోగించి సమాచారాన్ని సేకరించాలి. దాన్ని విశ్లేషించాలి. చివరగా ఒక నిర్ధారణకు రావాలి. ఈ మొత్తం ప్రక్రియను పట్టికలు, గ్రాఫ్ లు, పటాలు ఉపయోగిస్తూ నివేదికగా రూపొందించాలి.
 
 ప్రాజెక్టు పనులు సాధారణంగా రెండు రకాలు. అవి..
 1. పనిచేసే లేదా నిర్వహించే సభ్యుల సంఖ్యను బట్టి ఉండే ప్రాజెక్ట్‌లు 2. ప్రాజెక్టు స్వభావాన్ని బట్టి ఉండేవి.
 ప్రాజెక్టులో రెండు ప్రధానాలంశాలుంటాయి. అవి..
 1.ప్రాజెక్టును సిద్ధం చేయటం, దాన్ని నిర్వహించటం
 2.ప్రాజెక్టు నివేదిక రాయటం
 ప్రాజెక్టు నివేదికలో ఉండాల్సిన అంశాలు:
 1. ప్రాజెక్టు పేరు / సమస్య / ప్రశ్న 2. లక్ష్యాలు
 3. ఎంచుకునే సాధనాలు 4. అధ్యయన పద్ధతి
 5. పట్టికలు 6. ముగింపు 7. ఉపయోగించిన వనరులు
 
 కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు:
 1.    వంటింట్లో రసాయన శాస్త్రం
 2.    నిత్య జీవితంలో కార్బన్
 3.    వివిధ ద్రావణాలు - ్కఏ విలువలు లెక్కించటం
 4.    వివిధ లోహాలు - వాటి సంగ్రహణ విధానం
 5         మూలకాలు - చరిత్ర
 
 ముఖ్యమైనవి, గుర్తుంచుకోవాల్సినవి
 ప్రస్తుత సిలబస్ ప్రకారం చూస్తే అత్యంత కీలక అంశాలు.. పరమాణు నిర్మాణం, రసాయన బంధం, కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, విద్యుత్ ప్రవాహం, కార్బన్ దాని సమ్మేళనాలు. వీటిపై విద్యార్థులు ఎక్కువ దృష్టి సారించాలి. మానవుని కన్ను-రంగుల ప్రపంచం అనే అధ్యాయాన్ని జీవశాస్త్ర పాఠ్యపుస్తకాన్ని అన్వయిస్తూ నేర్చుకోవాలి. ఈ అధ్యాయాన్ని పూర్తిస్థాయిలో అవగాహన చేసుకోవాలంటే విద్యార్థులు దగ్గరలోని కంటి వైద్యున్ని లేదా ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్‌ను కలిసి సంబంధిత సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఉష్ణం, కాంతికి సంబంధించిన అధ్యాయాలపై పూర్తిస్థాయి పట్టు సాధించాలంటే మాత్రం గణితంలోని మౌలిక భావనలు కచ్చితంగా తెలిసి ఉండాలి. మూలకాల వర్గీకరణ అనే అంశంలో గ్రూపులు, పీరియడ్‌లలోని మూలకాలను గుర్తుంచుకోవాలి.
 
  రసాయన చర్యలు సమీకరణాలు అనే అధ్యాయంలో సమీకరణాలను తుల్యం చేయటం అనేది ముఖ్యం. దీన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. రసాయన చర్యలు -రకాలు అనే అంశాన్ని పూర్తిస్థాయిలో నేర్చుకోవాలంటే ప్రయోగ కృత్యాలు తప్పనిసరిగా చేయాలి. మూలకాల వర్గీకరణ, లోహ సంగ్రహణ శాస్త్త్రం, కార్బన్ దాని సమ్మేళనాలు అనే అంశంలో నూతన సమాచారం కోసం ఇంటర్నెట్ లేదా వివిధ మాధ్యమాలను ఉపయోగించుకోవచ్చు. ఆమ్లాలు - క్షారాలు - లవణాలు అనే పాఠ్యాంశాలపై పట్టు సాధించాలంటే..ఆయా విషయాలను నిజ జీవిత అంశాలతో అన్వయం చేసుకోవాలి.
 
 
 
 పది గ్రేడ్ పాయింట్లు సాధించాలంటే
 కొత్త సిలబస్‌పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలంటే ప్రయోగశాల కృత్యాలు, సాధారణ కృత్యాలను నిర్వహించాలి. ఉష్ణం, కాంతి, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, విద్యుత్ ప్రవాహం, కార్బన్ దాని సమ్మేళనాలు అనే అధ్యాయాలను క్షుణ్నంగా చదవాలి. పాఠ్యపుస్తకంలోని ‘అభ్యసనాలను మెరుగుపర్చుకుందాం’ అనే భాగంలోని ప్రశ్నలన్నింటిపై పూర్తిస్థాయిలో అవగాహన పొందితే సులువుగా సమాధానాలు రాయవచ్చు.
 
 సాధారణ విద్యార్థులు ఉష్ణం, లోహ సంగ్రహణ శాస్త్రం, కర్బన సమ్మేళన రసాయన శాస్త్రం, కాంతి, విద్యుత్ ప్రవాహం తదితర అధ్యాయాల్లోని అంశాలు తేలిగ్గా అర్థమవుతాయి. కాబట్టి వీటిలోని అన్ని భావనలను క్షుణ్న ంగా నేర్చుకోవాలి. విషయావగాహన ప్రశ్నలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ప్రతి అధ్యాయంలోని నిర్వచనాలు, సూత్రాలు, ప్రాథమిక భావనలను నేర్చుకోవటం వల్ల లఘు సమాధాన, అతిస్వల్ప సమాధాన, బహుళైచ్ఛిక ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు రాయవచ్చు. నూతన పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా కృత్యాధారితంగా (యాక్టివిటీ బేస్డ్) రూపొందించారు. కాబట్టి పాఠశాలకుతప్పక హాజరవుతూ ప్రయోగ కృత్యాలను, ప్రాజెక్టు పనులను, జట్టు కృత్యాలను నేర్చుకుంటేనే పూర్తిస్థాయి ఫలితాలను సాధించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement