రాజ్యాంగం- ప్రాథమిక స్వరూప సిద్ధాంతం
భారత రాజ్యాంగం-విహంగ వీక్షణం
‘ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాల ప్రాధాన్యత’ విషయంలో మొదటి నుంచి పార్లమెంటు, సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయూలను వెలిబుచ్చుతూనే ఉన్నారుు. పార్లమెంటు... ఆదేశసూత్రాలకు ప్రాధాన్యమిస్తూ, వాటి అవులు కోసం ప్రాథమిక హక్కుల పరిధిని పరిమితం చేసేందుకు కూడా వెనుకాడలేదు. ఈ క్రమంలో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం (1951) ఆస్తిహక్కును పరిమితం చేసింది. తొమ్మిదో షెడ్యూల్‌ను చేర్చడం ద్వారా న్యాయు వ్యవస్థ సమీక్షాధికారాన్ని పరిమితం చేసింది.
గోలక్‌నాథ్ కేసు (1967) విచారణ వరకు పార్లమెంటుకున్న రాజ్యాంగ సవరణ అధికారాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించలేదు. గోలక్‌నాథ్ కేసులో మెజార్టీ న్యాయువుూర్తులు.. పార్లమెంటుకు 368వ రాజ్యాంగ ప్రకరణ కింద ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదని, రాజ్యాంగ పరిషత్‌కు వూత్రమే ఆ అధికారం ఉందన్నారు. న్యాయువుూర్తుల దృష్టిలో రాజ్యాంగ సవరణ కూడా చట్టమే కాబట్టి రాజ్యాంగ ప్రకరణ 13(2) మేరకు ‘‘ప్రాథమిక హక్కులను పరిమితం చేసే లేదా తొలగించే ఏ చట్టమైనా చెల్లదు.’’
గోలక్‌నాథ్ కేసులో ఇచ్చిన తీర్పును అధిక్రవుణ చేసేందుకు, పార్లమెంటు 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (1971) 368వ ప్రకరణను సవరించింది. దీని ప్రకారం ‘‘రాజ్యాంగ సవరణకు చేసిన చట్టాలు 13(2) ప్రకరణ కింద చెల్లవని ప్రకటించటానికి వీల్లేదు.’’ 368వ ప్రకరణ కింద చేసిన రాజ్యాంగ సవరణ 13వ ప్రకరణలోని అంశాలకు వర్తించదు. 24వ రాజ్యాంగ సవరణ.. కేశవానందభారతి కేసు(1973)లో సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చింది. ఈ కేసులో ఒకవైపు పార్లమెంటుకు ప్రాథమిక హక్కులు సహా రాజ్యాంగంలోని ఏ అంశాన్నయినా సవరించే అధికారవుుందని ఒప్పుకుంటూ... మరోవైపు ‘‘368వ ప్రకరణ రాజ్యాంగ వలిక స్వభావాన్ని వూర్చే హక్కు పార్లమెంటుకు ఇవ్వలేదని’’ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీన్నే రాజ్యాంగ ప్రాథమిక స్వరూప సిద్ధాంతంగా వర్ణిస్తున్నారు. కేశవానందభారతి కేసులో తీర్చు ఇచ్చిన న్యాయువుూర్తుల్లో ఒకరైన జస్టిస్ సిక్రి రాజ్యాంగ ప్రాథమిక స్వరూప లక్షణాలను పట్టికాబద్ధం (్ట్చఛఠ్చ్ట్ఛ) చేసేందుకు ప్రయత్నించారు.
సిక్రి అభిప్రాయుంలో
రాజ్యాంగ ప్రాథమిక స్వరూప లక్షణాలు
1. రాజ్యాంగ సర్వోన్నతం
2. గణతంత్ర లేదా ప్రజాస్వావ్యు ప్రభుత్వం
3. రాజ్యాంగ లౌకిక స్వభావం
4. అధికార పృథఃకరణ (separation of powers)
5. రాజ్యాంగ సవూఖ్య లక్షణం
ఇదే కేసులో పాల్గొన్న న్యాయువుూర్తి హెగ్డే, న్యాయువుూర్తి ముఖర్జీ మరికొన్ని అదనపు లక్షణాలను రాజ్యాంగ ప్రాథమిక స్వరూప లక్షణాలుగా పేర్కొన్నారు. అవి...
1. భారతదేశ సార్వభౌవూధికారం, ఏకత్వం
2. వున రాజకీయు వ్యవస్థ ప్రజాస్వావ్యు లక్షణం
3. వ్యక్తి స్వేచ్ఛ
ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్‌నారాయుణ్ కేసు (1976) లో తీర్పు ఇస్తూ, సుప్రీంకోర్టు న్యాయువుూర్తి చంద్రచూడ్ కొన్ని అదనపు లక్షణాలను రాజ్యాంగ ప్రాథమిక స్వరూప సిద్ధాంతంలో భాగంగా గుర్తించారు. అవి...
1. ఇండియూ ఒక సార్వభౌవూధికార, ప్రజాస్వావ్యు, గణతంత్ర రాజ్యాంగం
2. సవూన హోదా, సవూన అవకాశాలు
3. లౌకికతత్వం, అంతరాత్మ స్వాతంత్య్రం
4. సవున్యాయుం
ఆయనే... మినర్వామిల్స్ కేసులో (1980) వురికొన్ని అంశాలను చేర్చారు. అవి..
1. పార్లమెంటుకున్న రాజ్యాంగ సవరణాధికారం
2. న్యాయుసమీక్ష
3. ప్రాథమికహక్కులు, ఆదేశసూత్రాల వుధ్య సవుతుల్యత
న్యాయమూర్తి చంద్రచూడ్ అభిప్రాయుంలో... ‘రాజ్యాంగ పీఠిక ప్రాథమిక స్వరూపానికి కాదు’. కానీ, న్యాయువుూర్తి బేగ్ అభిప్రాయుంలో పీఠిక ప్రాతిపదికగా రాజ్యాంగ సవరణలు సక్రవుమైనవో కాదో పరీక్షించవచ్చు. రాజ్యాంగ సవరణలకు కొలబద్ధ పీఠికే! అయితే 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) రాజ్యాంగ వలిక స్వభావ సిద్ధాంతాన్ని నీరుగార్చడానికి ప్రయుత్నించింది. 368వ ప్రకరణకు చేర్చిన 4, 5 క్లాజుల ప్రకారం: 1) 368 (1) నిబంధన ప్రకారం పార్లమెంటుకు సంక్రమించిన రాజ్యాంగ సవరణ అధికారంపై ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష పరిమితులుండవు.
2) రాజ్యాంగ సవరణ చట్టం ఏ కారణం వల్లనైనా న్యాయు సమీక్ష పరిధిలోకి రాదు.
కానీ, మినర్వామిల్స్ కేసులో (1980) సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రాథమిక స్వరూప సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించింది. 368వ ప్రకరణకు చేర్చిన 4, 5 క్లాజులు చెల్లవని తీర్పు వెలువరించింది. ఎందుకంటే.. ఇవి ప్రాథమిక లక్షణాల్లో ఒకటైన న్యాయు సమీక్ష అధికారాన్ని తొలగిస్తున్నాయి. కేశవానందభారతి కేసులో ప్రతిపాదించిన ప్రాథమిక స్వరూప సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు తలకిందులు చేయునంతవరకు, ఏ రాజ్యాంగ సవరణనైనా... ప్రాథమిక స్వరూప సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉందనే కారణంతో తోసిపుచ్చవచ్చు.
అత్యవసర పరిస్థితులు
సవూఖ్య వ్యవస్థలో జాతీయు, ప్రాంతీయు ప్రభుత్వాల వుధ్య అధికార విభజన జరుగుతుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ రెండు ప్రభుత్వాలు సవూన ప్రతిపత్తి కలిగి ఉన్నప్పటికీ, అసాధారణ పరిస్థితులు తలెత్తితే దేశ సవుగ్రత కోసం కేంద్ర ప్రభుత్వం విశేషాధికారాలను ఉపయోగించాల్సి వస్తుంది. రాజ్యాంగంలో ప్రస్తావించిన అత్యవసర అధికారాలు యుూనియున్ ప్రభుత్వానికి ఏకకేంద్ర ప్రభుత్వంలా వ్యవహరించే అవకాశాన్నిస్తున్నాయి. రాజ్యాంగంలో 3 రకాల అసాధారణ పరిస్థితుల్ని పేర్కొన్నారు. 1.యుుద్ధం, విదేశ దురాక్రవుణ, సాయిధ తిరుగుబాటు. దీన్ని ‘‘జాతీయు అత్యవసర పరిస్థితి’’ అంటారు. (352వ ప్రకరణ) 2.రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధ యుంత్రాంగం విఫలం కావడం (356వ ప్రకరణ). దీన్నే ‘రాష్ట్రపతి పాలన’ గా మీడియూ ప్రచారంలోకి తెచ్చింది.
3.ఆర్థిక సంక్షోభం (360వ ప్రకరణ)
జాతీయు అత్యవసర పరిస్థితిని వుంత్రివుండలి లిఖిత పూర్వక సలహా మేరకు రాష్ట్రపతి ప్రకటిస్తారు. ఈ ప్రకటనను పార్లమెంటు నెల రోజుల్లోగా ప్రత్యేక మెజార్టీ ద్వారా ఆమోదించాలి. పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత ఆ అత్యవస పరి స్థితి ఆరు నెలల వరకు అవుల్లో ఉంటుంది. అవసరాన్ని బట్టి ప్రతి ఆరు నెలలకోసారి పార్లమెంటు అనువుతితో నిరవధికంగా కొనసాగించవచ్చు. ఇది అవుల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయువచ్చు.
అంటే కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికార పరిధి విస్తృతమవుతుంది. లోక్‌సభ, విధానసభల పదవీ కాలాన్ని ఒక ఏడాదిపాటు (ఐదేళ్ల నుంచి ఆరేళ్లకు) పొడిగించవచ్చు. ఆపై, అవసరాన్ని బట్టి సం వత్సరానికోసారి పార్లమెంటు తీర్మానం ద్వారా పొడిగించవచ్చు. అత్యవసర పరిస్థితి అవుల్లో ఉన్న కాలంలో ఏడో షెడ్యూల్లో పొందుపరచిన అన్ని అంశాల మీద (యుూనియున్, రాష్ట్ర, ఉవ్ముడి జాబితా) చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు... కేంద్ర- రాష్ట్రాల వుధ్య ఆర్థిక సంబంధాలను క్రవుబద్ధం చేసే 268-279 ప్రకరణలకు సంబంధించిన అంశాలను సవరించే అధికారం రాష్ట్రపతికి సంక్రమిస్తుంది. ఈ పరిస్థితుల్లోనే ప్రాథమిక హక్కుల అవులును తాత్కాలికంగా నిలిపివేయువచ్చు. వాటి అవులుకు సంబంధించిన రిట్లను జారీ చేసే అధికారం న్యాయుస్థానాలకు తాత్కాలికంగా ఉండదు. అరుుతే 20, 21వ ప్రకరణల్లోని హక్కు లను వూత్రం నిలిపేయడానికి వీల్లేదు.
352 ప్రకటరణ
352వ ప్రకరణ కింద అత్యవసర పరిస్థితిని మొదటిసారిగా 1962లో... చైనా దురాక్రవుణ నేపథ్యంలో ప్రకటించారు. 1968లో రద్దు చేశారు. 1971లో భారత్-పాకిస్తాన్ వుధ్య సంభవించిన యుుద్ధం నేపథ్యంలో రెండోసారి జాతీయు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. 1975లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వుూడోసారి అత్యవసర పరిస్థితి ప్రకటనకు దారితీసింది. అయితే దీన్ని ‘అంతర్గత అలజడుల’ కారణంగా విధించారు. 1977లో రద్దు చే శారు. 44వ సవరణ ‘అంతర్గత అలజడుల’ స్థానంలో ‘సాయుుధ తిరుగుబాటు’ అనే సవూసాన్ని చేర్చింది. ఈ సవరణ ప్రకారం అత్యవసర పరిస్థితి ప్రకటన సమీక్షకు గురవుతుంది.
రాష్ట్రంలో అసాధారణ పరిస్థితి తలెత్తితే
రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం సక్రవుంగా కొనసాగలేని అసాధారణ పరిస్థితి తలెత్తినప్పుడు, సంబంధిత గవర్నరు నివేదిక ఆధారంగా (నివేదికతో నిమిత్తం లేకుండా కూడా)... వుంత్రివుండలి సలహా మేరకు 356వ ప్రకరణ కింద రాష్ట్రంలో అసాధారణ పరిస్థితి నెలకొందని రాష్ట్రపతి ప్రకటించవచ్చు. దీన్ని పార్లమెంటు రెండు నెలల్లోపు సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. 1994లో సుప్రీంకోర్టు బొమ్మైకేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం... పార్లమెంటు ఆమోదం పొందే వరకు రాష్ట్ర శాసనసభను రద్దు చేయుకూడదు. రాష్ట్ర వుంత్రివుండలిని రద్దు చేసి, రాష్ట్రం రాష్ట్రపతి పాలన కిందకు వస్తుంది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం నిబంధనల మేరకు సుప్రీంకోర్టుకు అసాధారణ పరిస్థితి ప్రకటనను సమీక్షించే అధికారం సంక్రమించింది. పార్లమెంటు ఆమోదించిన ఆరు నెలల వరకు 356వ ప్రకరణ కింద చేసిన ప్రకటన అవుల్లో ఉంటుంది. అవసరాన్ని బట్టి పార్లమెంటు ఆమోదం మేరకు మరో ఆరు నెలల వరకు రాష్ట్రపతి పాలనను పొడిగించవచ్చు. మొత్తం మీద ఒక సంవత్సర మొత్తం లేదా ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పొడిగించాలంటే...
1. ఆ రాష్ట్రంలో పూర్తిగా లేక కొంత భాగంలో 352వ ప్రకరణ కింద అత్యవసర పరిస్థితి అవుల్లో ఉండాలి.
2. ఆ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం లేదని ఎన్నికల సంఘం ధ్రువీకరించాలి.
ఈ రెండు షరతుల మేరకు రాష్ట్రపతి పాలనను గరిష్టంగా వుూడేళ్ల వరకు పొడిగించవచ్చు. ఆ తర్వాత కూడా కొనసాగించాలంటే రాజ్యాంగ సవరణ చేయూలి. ఈ విధంగానే జవుూ్మకాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో వుూడేళ్ల కంటే ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన కొనసాగింది. 356వ ప్రకరణ అవుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పాలనకు కేంద్రం బాధ్యత వహిస్తుంది. ఆ రాష్ట్రానికి చెందిన బిల్లులు, బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదిస్తుంది. ఎక్కువ సందర్భాల్లో 356వ ప్రకరణ దుర్వినియోగమైంది. బొమ్మైకేసులో సుప్రీం తీర్పు కొంత వరకు ఈ దుర్వినియోగాన్ని అరికట్టింది. 360వ ప్రకరణ కింద ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు రాష్ట్రపతి వుంత్రివుండలి సలహా మేరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు.
పార్లమెంట్ దీన్ని రెండు నెలల్లోపు సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. దీన్ని నిరవధికంగా కొనసాగించవచ్చు. ప్రతి ఆర్నెళ్లకోసారి పార్లమెంట్ దీన్ని ఆమోదిస్తూ తీర్మానం చేయూల్సిన అవసరం లేదు. ఇది అవుల్లో ఉంటే పొదుపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఉత్తర్వులివ్వవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధించవచ్చు (సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయుర్తుల జీతభత్యాలతో సహా). రాష్ట్ర ద్రవ్యబిల్లులను, రాష్ట్రపతి అనువుతి మేరకు శాసనసభలో ప్రవేశపెట్టాలి. ఇప్పటివరకు దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించలేదు.
ముఖ్యాంశాలు
368వ ప్రకరణ కింద చేసిన రాజ్యాంగ సవరణ 13వ ప్రకరణలోని అంశాలకు వర్తించదు. 352వ ప్రకరణ కింద అత్యవసర పరిస్థితిని మొదటిసారిగా 1962లో... చైనా దురాక్రవుణ నేపథ్యంలో ప్రకటించారు. 1971లో భారత్-పాకిస్తాన్ వుధ్య యుుద్ధం నేపథ్యంలో రెండోసారి జాతీయు అత్యవసర పరిస్థితి ప్రకటించారు.1975లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వుూడోసారి అత్యవసర పరిస్థితి ప్రకటనకు దారితీసింది.356వ ప్రకరణ అవుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర పాలనకు కేంద్రం బాధ్యత వహిస్తుంది. ఆ రాష్ట్రానికి చెందిన బిల్లులు, బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదిస్తుంది. 360వ ప్రకరణ కింద ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు రాష్ట్రపతి వుంత్రివుండలి సలహా మేరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు.