Basic rights
-
రాజ్యాంగంలో ప్రస్తావించని రిట్?
ప్రకరణ 32 – రిట్లు – పరిధి – పరిమితులు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు జారీ చేసే ప్రత్యేక ఆదేశాలను న్యాయశాస్త్ర పరిభాషలో రిట్లు(writs)అంటారు. వీటిని జారీచేసే పద్ధతిని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. నిబంధన–32 ప్రకారం వీటిని జారీ చేసే అధికారం సుప్రీంకోర్టుకు, నిబంధన–226 ప్రకారం రాష్ట్ర హైకోర్టులకు కల్పించారు. పార్లమెంటు ప్రత్యేక చట్టం ద్వారా ఈ అధికారాన్ని జిల్లా న్యాయస్థానాలకు కూడా కల్పించొచ్చు. కానీ, ఇప్పటివరకు పార్లమెంటు ఇలాంటి చట్టాలను రూపొందించలేదు. అందువల్ల సుప్రీంకోర్టు, హైకోర్టులకు మాత్రమే రిట్లు జారీచేసే అధికారం ఉంది. అయితే రిట్ల జారీలో సుప్రీం కోర్టు, హైకోర్టుల మధ్య వ్యత్యాసాలున్నాయి. ప్రత్యేక వివరణ: ప్రాథమిక హక్కుల పరిరక్షణలో సుప్రీంకోర్టుకు ప్రత్యేక, ప్రధాన, ప్రాథమిక విచారణ పరిధి ఉంటుంది. అందుకే సుప్రీంకోర్టును ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్త అంటారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణలో సుప్రీంకోర్టు, హైకోర్టులకు ఉమ్మడి పరిధి ఉంటుంది. అంటే పౌరులు ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ప్రకరణ–32 ప్రకారం నేరుగా సుప్రీంకోర్టును లేదా ప్రకరణ–226 ప్రకారం హైకోర్టును ఆశ్రయించొచ్చు. పౌరులు హైకోర్టు ద్వారా తగిన రక్షణ, ఉపశమనం లభిస్తుందని భావిస్తే మొదట హైకోర్టును ఆశ్రయించాలని కనుభాయ్ బ్రహ్మభట్ V/టస్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది. వివిధ రిట్లు– అర్థం– పరిధి– ప్రాముఖ్యత హెబియస్ కార్పస్ (బందీ ప్రత్యక్ష అధిలేఖ): ఈ పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. ఇది అతి పురాతన రిట్. హెబియస్ అంటే Have అని, కార్పస్ అంటేBody అని అర్థం. అంటే ఒక వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు హాజరుపర్చడం. నిబంధన 19 నుంచి 22 వరకు పొందుపర్చిన వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగినప్పుడు ఈ రిట్‌ను జారీ చేస్తారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప న్యాయస్థానంలో హాజరుపర్చకపోతే, ఈ రిట్ దాఖలు చేస్తే వెంటనే ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపర్చాలని కోర్టు ఆదేశిస్తుంది. ఈ రిట్ ప్రధాన ఉద్దేశం వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ, చట్ట వ్యతిరేకంగా ఏ వ్యక్తినీ నిర్బంధించకుండా, శిక్షించకుండా కాపాడటం. ఈ రిట్‌ను ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు కూడా జారీ చేయొచ్చు. మూడో వ్యక్తి కూడా (Third person) ఇందులో జోక్యం చేసుకొనే హక్కు (Locus standi) ఉంటుంది. బాధితుల తరఫున సామాజిక స్పృహ ఉన్న సంస్థ లేదా వ్యక్తి ఈ రిట్ దాఖలు చేయొచ్చు. అందుకే దీన్ని ఉదారమైన రిట్ అంటారు. అలాగే వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనం అని కూడా అంటారు. మినహాయింపులు: పార్లమెంటు స్వాధికారాలకు భంగం కలిగించిన కారణంగా వ్యక్తిని నిర్బంధించినప్పుడు, కోర్టు ద్వారా నేరారోపణ రుజువై, ఖైదీగా శిక్షను అనుభవిస్తున్నప్పుడు ఇది వర్తించదు. మాండమస్ (పరమాదేశ అధిలేఖ): భాషాపరంగా మాండమస్ అంటే ‘ఆదేశం’ అని అర్థం. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జారీ చేసే అత్యున్నత ఆదేశంగా దీన్ని చెప్పవచ్చు. ప్రభుత్వాధికారి లేదా సంస్థ తన చట్టబద్ధ విధులను నిర్వర్తించనప్పుడు ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఆ విధులను నిర్వర్తించాలని న్యాయస్థానం ఈ రిట్‌ను జారీ చేస్తుంది. దీన్ని పబ్లిక్, క్వాజి పబ్లిక్, జ్యుడీషియల్, క్వాజి జ్యుడీషియల్ సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయొచ్చు. మినహాయింపులు: రాష్ట్రపతి, గవర్నర్లకు ఈ రిట్ వర్తించదు. ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేటు సంస్థలకు వ్యతిరేకంగా ఈ రిట్‌ను జారీ చేయడానికి వీల్లేదు. దీన్ని అంతిమ ప్రత్యామ్నాయంగా మాత్రమే జారీచేస్తారు. అంటే పాలనపరంగా ఉన్న ప్రత్యామ్నాయాల ద్వారా పౌరులు న్యాయాన్ని పొందలేనప్పుడు ఈ రిట్ ద్వారా ఉపశమనం పొందొచ్చు. అందువల్ల ఈ రిట్ జారీ కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అధికారుల తప్పనిసరి విధులకే ఈ రిట్ వర్తిస్తుంది. సంబంధిత అధికారి విచక్షణాపూర్వక విధులకు ఇది వర్తించదు. ప్రొహిబిషన్ (నిషేధం): భాషాపరంగా ప్రొహిబిషన్ అంటే నిషేధించడం అని అర్థం. ఏదైనా దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ తన పరిధిని అతిక్రమించి కేసును విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తదుపరి ఆదేశాల వరకు నిలిపివేయాలని కోర్టు ఆదేశిస్తుంది. దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే ఈ రిట్ ముఖ్య ఉద్దేశం. ఇది న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. పాలనా, చట్టపరమైన సంస్థలకు వర్తించదు. సెర్షియోరరి (ఉన్నత న్యాయస్థాన పరిశీలనాధికారం): భాషాపరంగా సెర్షియోరరి అంటే ‘సుపీరియర్’ లేదా ‘టు బి సర్టిఫైడ్’ లేదా ‘బ్రింగ్ ద రికార్డ్స్’ అని అర్థం. ఏదైనా దిగువ కోర్టు తన పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు చెప్పినప్పుడు, ఆ తీర్పును రద్దుచేసి, కేసును పైస్థాయి కోర్టుకు బదిలీ చేయాలని ఇచ్చే ఆదేశమే సెర్షియోరరి. ఈ రిట్ ఉద్దేశం కూడా దిగువ న్యాయస్థానాలు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే. ప్రైవేటు, శాసన సంస్థలకు వ్యతిరేకంగా దీన్ని జారీ చేసే వీల్లేదు. అయితే ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్న పాలనా సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయొచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్–లీగల్ యాక్షన్ V/టయూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ప్రొహిబిషన్, సెర్షియోరరి మధ్య తేడాలు: దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నియంత్రించడమే ఈ రెండు రిట్ల ముఖ్య ఉద్దేశం. అయితే ప్రక్రియలో తేడా ఉంది. కేసు ప్రారంభ దశలో ఉంటే ప్రొహిబిషన్ రిట్, తీర్పు వెలువడిన తర్వాత సెర్షియోరరి రిట్ జారీ చేస్తారు. సెర్షియోరరి రిట్ దిగువ కోర్టులను నియంత్రించడమే కాకుండా అవి చేసిన తప్పిదాలను కూడా సవరిస్తుంది. ప్రొహిబిషన్ రిట్ కేవలం నిలుపుదల చేస్తుంది. కోవారంటో (అధికార పృచ్ఛ): భాషాపరంగా దీన్ని ‘బై వాట్ వారంట్’ అంటారు. అంటే.. ఏ అధికారం ద్వారా? అని ప్రశ్నించడం. ప్రజా సంబంధ పదవుల్లోకి అక్రమంగా ప్రవేశించినా లేదా ప్రజా పదవులను దుర్వినియోగపర్చినా, పదవిలో ఉన్న వ్యక్తి తాను ఆ పదవిలో కొనసాగడానికి చట్టబద్ధంగా ఉన్న అధికారాన్ని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి. చట్టబద్ధత లేకపోతే ఆ పదవి నుంచి వెంటనే తప్పుకోవాలని ఆదేశిస్తాయి. ప్రజా పదవుల దుర్వినియోగాన్ని అరికట్టడం ఈ రిట్ ప్రధాన ఉద్దేశం. ప్రజా పదవి అంటే చట్టం ద్వారా ఏర్పాటైన స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థలో పదవి. ఉదా: ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు మొదలైనవారు. ఈ రిట్‌కు సంబంధించి బాధితులు మాత్రమే న్యాయస్థానాలను ఆశ్రయించాలనే నియమం లేదు. ప్రజా పదవులను దుర్వినియోగం నుంచి కాపాడాలనే సామాజిక స్పృహ ఉన్న ఏ పౌరుడైనా కోర్టును ఆశ్రయించవచ్చు. మూడో వ్యక్తి కూడా ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది. ఇన్‌జంక్షన్ (నిలుపుదల ఆదేశం): రాజ్యాంగంలో ఈ రిట్ గురించిన ప్రస్తావన లేదు. కేవలం సివిల్ వివాదాల్లో యథాతథా స్థితిని కొనసాగించడానికి దీన్ని జారీ చేస్తారు. భర్తీ చేయడానికి వీల్లేని నష్టాన్ని అరికట్టేందుకు ఇన్‌జంక్షన్‌ను జారీ చేస్తారు. కాబట్టి ప్రాథమిక హక్కుల పరిరక్షణకు, ఈ రిట్‌కు సంబంధం లేదు. ప్రాథమిక హక్కులు – ఇతర నిబంధనలు ప్రకరణ–33ను అనుసరించి కింద పేర్కొన్న వర్గాలకు ప్రాథమిక హక్కులు వర్తించే విషయంలో పార్లమెంటు చట్టం ద్వారా కొన్ని పరిమితులను విధించవచ్చు. ఎ) సైనిక, పారా మిలటరీ దళాలు బి) పోలీసులు, ఇతర రక్షణపరమైన విధులను నిర్వర్తిస్తున్న సంస్థలు, అధికారుల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించవచ్చు. సి) గూఢచార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు డి) అత్యవసర సర్వీసులైన టెలీకమ్యూనికేషన్లు, ఇతర బ్యూరోల్లో పనిచేసే ఉద్యోగులు. ప్రకరణ34–సైనిక చట్టం (Marshal Law) – ప్రాథమిక హక్కులపై పరిమితులు: దేశంలో ఏదైనా ప్రాంతంలో సైనిక చట్టం ప్రకటించినప్పుడు ఆ సమయంలో సైనిక బలగాలు తీసుకొన్న చర్యలకు, తద్వారా జరిగిన నష్టాలు, పరిణామాలకు వారిని బాధ్యులను చేయడానికి వీల్లేదు. పార్లమెంటు ఒక చట్టం ద్వారా వారి చర్యలకు రక్షణ కల్పిస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీల్లేదు. ప్రకరణ–34, 35కు మధ్య తేడా: ప్రకరణ–34లో ప్రస్తావించిన అంశాలు కొన్ని వర్గాల ఉద్యోగులు, వారి హక్కులపై పరిమితులు అయితే ప్రకరణ–35లో ప్రస్తావించిన అంశాలు ప్రత్యేక ప్రాంతాల్లో ప్రాథమిక హక్కులకు సంబంధించినవి. అందువల్ల ఒకటి వర్గానికి, మరొకటి ప్రాంతానికి సంబంధించినవి. ఉదా: 1958లో రూపొందించిన సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (అటఝ్ఛఛీ ఊౌటఛ్ఛిటSp్ఛఛిజ్చీ∙్కౌఠ్ఛీటటఅఛ్టి అఊ్కఅ). దీన్ని పలు పర్యాయాలు సవరించి అసోం, మణిపూర్ కల్లోలిత ప్రాంతాల్లో ప్రయోగించారు. అలాగే 1983లో పంజాబ్, ఛండీగఢ్‌లో కూడా ఉపయోగించారు. శాంతిభద్రతల నిర్వహణలో పోలీసులు వైఫల్యం చెందినప్పుడు ఈ చట్టం ద్వారా సాయుధ బలగాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ప్రకరణ–35 చట్టబద్ధత, శిక్షలు: మూడో భాగంలో పేర్కొన్న కొన్ని నిబంధనల అమలుకు చట్టబద్ధత కల్పించడం, శిక్షలు నిర్ణయించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. రాష్ట్ర శాసనసభలకు ఉండదు. ప్రాథమిక హక్కుల అమలుకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే పద్ధతి లేదా ప్రక్రియ ఉండాలనే ఉద్దేశంతో ఈ అధికారాన్ని పార్లమెంటుకు మాత్రమే ఇచ్చారు. ఉదా: ప్రకరణ 16(3)– రిజర్వేషన్లు, అమలు, ప్రకరణ 32(3) ప్రకారం రిట్లు జారీ చేసే అధికారాన్ని న్యాయస్థానాలకు సంక్రమింపజేయడం, ప్రకరణ–33 ప్రకారం సాయుధ బలగాల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించడం, ప్రకరణ–34 ప్రకారం సైనిక పాలన మొదలైన అంశాలపై పార్లమెంటుకు మాత్రమే చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అలాగే, ఈ భాగంలో పేర్కొన్న నేరాలకు (ఉదా: ప్రకరణ–17 (అస్పృశ్యత), 23 (దోపిడీ), 24 (బాలకార్మిక వ్యవస్థ) తదితర శిక్షలు నిర్ణయించే అధికారం పార్లమెంటుకే ఉంటుంది. -
గొప్ప ప్రపంచ శక్తిగా ఆవిర్భవించాలంటే..
అవలోకనం పెద్ద సేనలు, అణ్వస్త్రాలు ఉన్నంత మాత్రాన ఆ దేశాలు గొప్ప శక్తులు అవుతాయనడానికి హామీ లేదు. లేకపోతే ఉత్తర కొరియా, పాకిస్తాన్‌లు గొప్ప శక్తులు అయ్యేవే. ఆరోగ్యవంతులైన, విద్యావంతులైన జనాభాను, సమర్థవంతమైన రాజ్యాన్ని పెంపొందింప జేసుకోగల దేశాలు మాత్రమే ఆధునిక యుగంలో గొప్పవి కాగలుగుతున్నాయి. భారత్ దీనిపై అసలు దృష్టిని కేంద్రీకరించడమే లేదని నా ఉద్దేశం. మౌలిక హక్కులు మనకు లభించే వరకు ఒక గొప్పశక్తిగా ఎదగడం కోసం మనం చేసే ప్రయాణం మెల్లగానే సాగుతుంది. భారతదేశం ఒకప్పుడు ఆర్థికంగా స్వర్ణయుగంలో ఉండేదని తరచూ వింటూ ఉంటాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెద్ద భాగం భారత ఉపఖండానిదిగా ఉన్న నాటి సంగతి అది. ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ) నేడు 3 శాతంగా ఉన్న ఉపఖండం జీడీపీ నాడు 20 నుంచి 25 శాతం వరకు ఉండేది. ఆ స్థాయిని మనం తిరిగి సాధించగలమా? యుగయుగాలుగా ఎలాంటి దేశాలు గొప్ప శక్తులుగా ఆవిర్భవించాయో ఒక్కసారి చూద్దాం. 2,500 ఏళ్ల క్రితం నాటి పర్షియా, మొట్టమొదటి గొప్ప ప్రపంచ శక్తి. ప్రపంచవ్యాప్తంగా ప్రాబల్యాన్ని నెరపగల నైపుణ్యం దానికి ఉండేది. ఇదే గొప్ప ప్రపంచ శక్తికి నిర్వచనం. పర్షియాకు చెందిన పార్సీ రాజులు కాందహార్ నుంచి టర్కీ వరకు విస్తరించిన సామ్రాజ్యాన్ని పరిపాలించారు. చరిత్రకారుడు హెరాడిస్ క్రీస్తు పూర్వం 479 నాటి ప్లటియా యుద్ధాన్ని నమోదు చేశాడు. పార్సీ రాజు జెరెక్సీజ్ గ్రీస్పైకి తనసేనలను నడిపాడు. అతడి సేనలలో భారత కిరాయి సైనికులు కూడా ఉన్నారు, వారు బహుశా పంజాబ్‌కు చెందిన వారు కావచ్చు, ప్రాచీన కాలపు గ్రీకులు పర్షియా రాజును ఎప్పుడూ ‘గొప్ప’ వానిగా సంబో ధిస్తూ ఉండేవారు రెండవ గొప్ప ప్రపంచ శక్తి ‘గొప్ప’ వాడైన అలెగ్జాండర్‌ది. మాసిడోనియాకు చెందిన ఆ సైనిక యోధుడిని గొప్పవాడిగా పిలవడానికి కారణం ఆయన సాధించిన విజయాలు కావు. డారియస్‌ను ఓడించి అలెగ్జాండర్ ‘గొప్ప’ అనే అతని బిరుదాన్ని స్వీకరించాడు.ఇక మూడవ ప్రపంచ శక్తి రోమన్ సామ్రాజ్యం. అది మొదట ఇటలీ అంతటికీ, తర్వాత ఫ్రాన్స్, స్పెయిన్లు సహా యూరప్‌లోని చాలా భాగానికి, సుదూర ప్రాచ్యంలోని పాలస్తీనా వరకు కూడా విస్తరించింది. జూలియస్ సీజర్ రోమన్ సైన్యాలను బ్రిటన్‌లోకి (లండన్ ఆనాటిదే) ప్రవేశించాడు. కానీ రోమ్ ఒక నావికా శక్తి కాదు. నాలుగవ పెద్ద ప్రపంచ శక్తిగా ఉండిన ముస్లింలు వివిధ దేశాలతో కూడిన వారు. అరబ్బులు ఉత్తర ఆఫ్రికాను, స్పెయిన్‌లో కొంత భాగాన్ని ఆక్రమించారు (ఈజిప్షియన్లు అరబ్బీ భాషను మాట్లాడేది అందువల్లనే). అయితే నిజంగానే బలమైన ముస్లిం శక్తులుగా ఉన్నవారు. టర్కులు, పర్షియన్లు, మధ్య ఆసియా వాసులు, అఫ్ఘాన్లే. ముస్లిం శక్తులు కూడా నావికా శక్తులు కావు. మొత్తం ఉత్తర భారతాన్ని ఔరంగజేబు శాసిస్తున్న కాలంలో సైతం యూరోపియన్ శక్తులు గొప్ప ప్రభావాన్ని నెరపగలిగేవి. యూరోపియన్ల అధీనంలోని సముద్ర జలాల నుంచి రాజవంశీ కులు మక్కా హజ్ యాత్రకు పోవాల్సి ఉండటమే అందుకు కారణం. పదిహేనవ శతాబ్దంలో స్పెయిన్, పోర్చుగల్, ఇంగ్లండ్, డచ్, ఫ్రాన్స్ వలస వాద శక్తులుగా ఆవిర్భవించాయి. వాటన్నిటి మధ్య ఉన్న సారూప్యత ఏమిటి? అవన్నీ అట్లాంటిక్ మహాసముద్ర తీర దేశాలే. అది అత్యంత దుర్గమమైన సముద్రం. ఆ సముద్రంపై ప్రయాణానికి అత్యంత నాణ్యమైన వస్త్రంతో తయారైన తెరచాపల సహాయంతో పయనించే దృఢమైన, పొడవాటి పెద్ద ఓడలు అవసరం. ఆ సముద్ర తీర దేశాలే ఆ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. వారి నౌకలు పెద్దవిగా ఉండటం వల్ల శక్తివంతమైన, భారీ ఫిరంగులు చాలా వాటిని తీసుకు పోగలిగేవి. అందుకే ఆ దేశాలు సముద్రాలు దాటి అమెరికా ఖండాలను వలస లుగా మార్చుకోగలిగాయి. అట్లాంటిక్ తీరంలో లేని జర్మనీ, రష్యా, ఇటలీ, తది తర పెద్ద యూరోపియన్ దేశాలు పెద్ద వలస శక్తులు కాలేక పోయాయి. ఆ సమయానికి ముందు ఏదైనా శతాబ్దంలో భారత్ ఒక గొప్ప ప్రపంచ శక్తిగా ఉన్నదా? భారత జీడీపీ ప్రపంచ జీడీపీలో ఐదో వంతు ఉండేది నిజమే. కానీ ప్రపంచ జనాభాలో ఐదో వంతు కూడా ఇక్కడ ఉండటం వల్లనే అది సాధ్యమైంది. చరిత్రలోని ఆ కాలానికి ప్రతి ఒక్కరూ వ్యవసాయదారులే. కుమ్మరిపని, నేత వంటి కొన్ని ప్రాథమిక వస్తువుల తయారీ కూడా ఉండేది. కానీ ఆర్థిక ఉత్పత్తిలో అత్యధిక భాగానికి మానవ శ్రమ శక్తే ఆధారం. ఒక దేశం లేదా ప్రాంతంలో ప్రజలు ఎక్కువ గా ఉంటే ప్రపంచ జీడీపీలో దాని వాటా కూడా ఎక్కువగా ఉండేది. 15వ శతాబ్దం తర్వాత, ప్రత్యేకించి న్యూటన్, హుక్, బాయల్ నేతృత్వంలో యూరప్‌లో జరిగిన విజ్ఞానశాస్త్ర విప్లవం తదుపరి మనం వెనుకబడిపోయాం. ఆర్థికంగా యూరోపియన్ దేశాలు ముందుకు దూసుకుపోగా మనం ఉన్నచోటే ఉండిపోయాం. అప్పటి నుంచి ఆ దేశాలే ఆర్థికంగా శక్తివంతమైనవిగా ఉంటూ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఉండేవి. అది అమెరికాతో అంతం అయింది. నేడు కేవలం పెద్దపెద్ద సేనలను, అణ్వస్త్రాలను సైతం కలిగి ఉన్నంత మాత్రాన ఆ దేశాలు గొప్ప శక్తులు అవుతాయనడానికి హామీ లేదు. లేకపోతే ఉత్తర కొరియా, పాకిస్తాన్‌లు గొప్ప శక్తులు అయ్యేవే. ఆధునిక యుగంలో ఆరోగ్యకరమైన, విద్యా వంతులైన జనాభాను, సమర్థవంతమైన రాజ్యాన్ని పెంపొందింపజేసుకోగల దేశాలు మాత్రమే గొప్పవి కాగలుగుతున్నాయి. జపాన్, కొరియా ఇటీవలి కాలంలో చైనా వాటిని సాధించగలిగాయి. భారత్ ఈ విషయంపై అసలు దృష్టిని కేంద్రీకరించడమే లేదని నా ఉద్దేశం. మన పరిపాలన తరచుగా అసమర్థమైనదిగా ఉంటోంది. 2016లో సైతం దేశ వ్యతిరేక నినాదాలు, పొరుగు దేశాలతో కొట్లాటలు, సాంస్కృతిక, అస్తిత్వ సంబం ధమైన సమస్యలతో ప్రభుత్వం సతమతమౌతోంది. ఆరోగ్యం, విద్యలపై నిరంత రాయమైన, సునిశిత కేంద్రీకరణ లోపిస్తోంది. న్యాయం చేయగల, చట్టాన్ని అమ లుచేయగల శక్తి సైతం లోపిస్తోంది. పాలనాపరమైన దక్షతకు అత్యంత ప్రాథమిక షరతులను సైతం మన ప్రభుత్వాలు నెరవేర్చలేకపోతున్నాయి. దీంతో హింసపై గుత్తాధిపత్యం నెలకొంటోంది. సామూహిక హింస, మారణకాండ సర్వ సాధార ణంగా మారడంతో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నదనేది అసలు పట్టించుకోవా ల్సిన పనేలేనిదిగా అవుతోంది. ఈ మౌలిక హక్కులు మనకు లభించే వరకు ఒక గొప్పశక్తిగా ఎదగడం కోసం మనం చేసే ప్రయాణం మెల్లగానే సాగుతుంది. వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com - ఆకార్ పటేల్ -
మనిషి మనుగడకు ప్రాథమిక హక్కులు!
అనాదిగా పౌరునికి, రాజ్యానికి మధ్య ఘర్షణ కొనసాగుతోంది. వీరి మధ్య సామరస్యం సాధించేందుకు కృషి జరుగుతూనే ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.వ్యక్తిగత స్వేచ్ఛ ఎంత అవసరమో, రాజ్యసమగ్రత కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి మధ్య సమతుల్యం సాధించేందుకు ఉపయోగపడే సాధనాలు ప్రాథమిక హక్కులు. సామాజిక ఆమోదం పొంది, సమాజంలో చట్టబద్ధత కలిగిన వ్యక్తులందరూ అనుభవించే సదుపాయాలను హక్కులుగా చెప్పొచ్చు. ఇవి మనిషి మనుగడకు ఎంతో అవసరం. అందుకే వీటిని ప్రాథమిక హక్కులుగా పిలుస్తున్నారు. దాదాపు ఆధునిక రాజ్యాంగాలన్నీ వీటిని ప్రస్తావించాయి. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మాత్రమే హక్కులను రాజ్యాంగంలో పొందుపరచలేదు. అంతమాత్రాన ఆయా దేశాల్లో ప్రజలు హక్కులు అనుభవించటం లేదని కాదు.. సంప్రదాయాలు, అలవాట్లు, ఆచారాలు, న్యాయస్థానాల తీర్పులు అక్కడి ప్రజలను పరిరక్షిస్తున్నాయి. అమెరికా, ఐరిష్ రాజ్యాంగాలు స్ఫూర్తిగా మన రాజ్యాంగ కర్తలు అమెరికా, ఐరిష్ రాజ్యాంగాల్లో పొందుపరచిన హక్కులను ఆదర్శంగా తీసుకొని, రాజ్యాంగంలోని మూడో భాగంలో ప్రస్తావించారు. ఫ్రెంచ్ విప్లవకాలంలో చేసిన మానవహక్కుల ప్రకటన, ఐక్యరాజ్యసమితి ఆమోదించిన మానవ హక్కుల చార్టర్.. రాజ్యాంగ కర్తలను ప్రభావితం చేశాయి. రాజ్య నిరపేక్షాధికారం నుంచి వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షిస్తూ, సమాజంలోని వివిధ వర్గాలు సగటు పౌరుడి స్వేచ్ఛను హరించకుండా నిరోధించే చట్టబద్ధ హామీలు (అవసరమై నప్పుడు) న్యాయస్థానాలు జారీచేసే రిట్ల ద్వారా అమలవుతాయి. రాజ్యాంగంలోని నాలుగో భాగంలో పొందుపరచిన ఆదేశ సూత్రాలు కూడా హక్కులే. అయితే ప్రాథమిక హక్కులు వ్యక్తి శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తే, ఆదేశ సూత్రాలు సామాజిక సంక్షేమానికి పెద్దపీట వేస్తాయి. ఆదేశ సూత్రాలను ఐరిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యాంగంలోని 12 నుంచి 35 ప్రకరణలు ప్రాథమిక హక్కులను వివరిస్తాయి. 12వ ప్రకరణ ప్రకారం కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు వినియోగించే అధికారం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకూడదు. 13(2) ప్రకారం ప్రాథమిక హక్కులను తొలగించటం, పరిమితం చేసే చట్టాలను పార్లమెంటు చేయకూడదు. కానీ, 24వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 368వ ప్రకరణ కింద తనకు సంక్రమించిన అధికారం ద్వారా ప్రాథమిక హక్కులను సవరించవచ్చు, తొలగించవచ్చు. ఈ అధికారాన్ని 13(4) రాజ్యాంగ ప్రకరణ పార్లమెంటుకు కట్టబెట్టింది. ప్రాథమిక హక్కులు - రకాలు రాజ్యాంగంలో ఏడు రకాల ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం (1978).. ఆస్తి హక్కు (31వ ప్రకరణ)ను ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించింది. దానికి చట్టబద్ధ, రాజ్యాంగ హక్కు హోదాను (300ఏ ప్రకరణ) కల్పించింది. ప్రస్తుతం ఆరు రకాల ప్రాథమిక హక్కులు అమల్లో ఉన్నాయి. అవి.. సమానత్వ హక్కు (14-18 ప్రకరణ వరకు): దీని ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానులే. లింగ, కుల, మత, ప్రాంత, పుట్టుక ప్రాతిపదికన వివక్షత నిషేధం. ప్రభుత్వ ఉద్యోగాలు పొందటంలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి. అంటరానితనం పాటించటం నేరం. బిరుదులు పొందడం నిషిద్ధం. స్వాతంత్య్ర హక్కు (19-22 ప్రకరణలు): పౌరులకు వాక్ భావ ప్రకటనా స్వాతంత్య్రం; సంఘాలుగా ఏర్పడేందుకు; శాంతియుతంగా సమావేశం కావడానికి; భారతదేశమంతా స్వేచ్ఛగా సంచరించడానికి; ఏ ప్రాంతంలోనైనా స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి; ఏ వృత్తి నైనా స్వీకరించడానికి, వ్యాపారం చేసుకోవడానికి స్వాతంత్య్రం ఉంది. నేరస్థాపన విషయంలో రక్షణ, విద్యాహక్కు, ప్రాణ హక్కు, వ్యక్తిగత స్వాతంత్య్ర రక్షణ. కొన్ని సందర్భాల్లో నిర్బంధం నుంచి రక్షణ. దోపిడీనిరోధన హక్కు (23-24 ప్రకరణలు): మానవుల క్రయవిక్రయాలు, బలవంతపు చాకిరీ నిషేధం; ఫ్యాక్టరీలు వంటి వాటిలో పిల్లలతో పని చేయించటం నిషేధం. మత స్వాతంత్య్రం హక్కు (25-28 ప్రకరణలు): అంతరాత్మానుసారం వ్యవహరించడానికి స్వాతంత్య్రం; స్వేచ్ఛగా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు; మతవ్య వహారాలను నిర్వహించడానికి స్వాతంత్య్రం ఉంది. అయితే మతం పేరిట పన్నులు చెల్లించాలని కోరడం; విద్యాసంస్థల్లో (అల్పసంఖ్యాక వర్గాలు నిర్వహించే) మత బోధన జరిగేటప్పుడు వాటికి హాజరుకావాలని నిర్దేశించడం నిషేధం. సాంస్కృతిక విద్యా విషయాల హక్కు (29-30 ప్రకరణలు): అల్పసంఖ్యాక వర్గాలకు తమ భాషను, లిపిని సంస్కృతిని కాపాడుకునే హక్కు ఉంది. ఈ సంస్థలకు విద్యాసంస్థల స్థాపన, నిర్వహణ హక్కు ఉంది. రాజ్యాంగ పరిరక్షణ హక్కు (32వ ప్రకరణ): పైన ప్రస్తావించిన 5 రకాల హక్కులకు భంగం కలిగినప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు హెబియస్ కార్పస్, మాండమస్, కోవారెంట్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ రిట్ల జారీ ద్వారా వాటి అమలును నిర్దేశిస్తాయి. సుప్రీంకోర్టు 32వ ప్రకరణ కింద.. హైకోర్టులు 226వ ప్రకరణ కింద రిట్లను జారీచేస్తాయి. రాజ్యాంగ పరిరక్షణ హక్కును డా.అంబేద్కర్ రాజ్యాంగానికి ‘ఆత్మ, గుండె’గా అభివర్ణించారు. ఈ హక్కులు నిరపేక్షం కాదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వీటికి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చు. 352వ ప్రకరణ కింద అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు 19వ ప్రకరణలో ఉన్న ఆరు ప్రాథమిక స్వాతంత్య్రాలను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు. అలాగే 20, 21 రాజ్యాంగ ప్రకరణల్లో ప్రస్తావించిన హక్కులు మినహా మిగిలిన వాటి అమలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కును రాష్ట్రపతి ఉత్తర్వు మేరకు నిలిపేయవచ్చు. సాధారణ పరిస్థితుల్లో కూడా బలహీన వర్గాల ప్రయోజనాలను ఉద్దేశించి ప్రభుత్వం కొన్ని పరిమితులు విధించవచ్చు. బలహీన వర్గాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ఈ కోవకే చెందుతాయి. 14, 20, 21, 23, 25, 27, 28 రాజ్యాంగ ప్రకరణల కింద సక్రమించే హక్కులు భారతదేశంలో నివసించే వారందరికీ (విదేశీయులతో సహా) లభిస్తాయి. కానీ, 15, 16, 19, 21ఎ, 30 రాజ్యాంగ ప్రకరణల కింద లభించే హక్కులు భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఆదేశ సూత్రాలు 36 నుంచి 51 వ రాజ్యాంగ ప్రకరణ వరకు పొందుపరిచిన ఆదేశాలను ప్రభుత్వం తన విధాన రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోవాలి. వీటి అమలు కోసం న్యాయస్థానాలు రిట్లను జారీచేసే అవకాశం లేదు. అయితే సామాజిక ప్రయోజనాల దృష్ట్యా సందర్భానికి తగిన ఉత్తర్వులను న్యాయస్థానాలు జారీ చేస్తాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వమైనా ఆదేశ సూత్రాలను విస్మరించలేదు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అభిప్రాయంలో ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలకు మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు ఆదేశ సూత్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. గత 60 ఏళ్లలో ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు, సాధారణ చట్టాల ద్వారా ఆదేశ సూత్రాల అమలుకు చొరవ తీసుకుంది. ఆదేశ సూత్రాలకు ఆటంకమన్న కారణంతో ఆస్తి హక్కు వంటి ప్రాథమిక హక్కును తొలుత సవరించి, ఆ తర్వాత తొలగించారు. ఆదేశ సూత్రాలు కొన్ని సామ్యవాద స్వభావాన్ని, మరికొన్ని గాంధీజీ ఆశయాలను ప్రతిబింబిస్తే.. ఇంకొన్ని ఉదారవాద స్వభావాన్ని కలిగి ఉన్నాయి. సమాన పనికి సమాన వేతనం, సంపద కేంద్రీకృతం కాకుండా నిరోధించడం, తద్వారా పంపిణీ; ప్రజలకు జీవనోపాధి కల్పించడం; కార్మికులు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమానికి కృషి చేయడం వంటివి సామ్యవాద స్వభావం ఉన్నవి. పంచాయతీరాజ్ వ్యవస్థల ఏర్పాటు; షెడ్యూల్డ్ కులాలు, తెగల సంక్షేమం; కుటీర పరిశ్రమల ప్రోత్సాహం; గోవధ నిషేధం; మద్యపాన నిషేధం వంటివి గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా ఉన్నాయి. ఉమ్మడి పౌరశిక్ష స్మృతి అమలు; శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయ నిర్వహణ; పౌష్టికాహారం అందించడం; అంతర్జా తీయ శాంతికి కృషి చేయడం; కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయడం వంటివి ఉదారవాద స్వభావం కలిగి ఉన్నాయి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఉచిత న్యాయసహాయం కల్పించడం; కార్మికులకు యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించడం; పర్యావరణ, వన్య జీవుల, అడవుల సంరక్షణ; పిల్లల ప్రగతికి తగిన అవకాశాలు కల్పించడం అనే అంశాలు చేర్చారు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆదాయం, హోదా, సదుపాయాలు, అవకాశాల విషయంలో అసమానతలు తగ్గించడం అనే అంశాన్ని రాజ్యాంగంలో పొందుపర్చారు. ఆదేశ సూత్రాల అమలు.. ప్రభుత్వ చొరవ ఆదేశ సూత్రాల అమలు విషయంలో ప్రభుత్వం తీసుకున్న చొరవలో కొన్ని ముఖ్యమైనవి... భూసంస్కరణల అమలు ద్వారా సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా నిరోధించడం. పంచాయతీ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ పరమైన హోదా కల్పించడంతో గాంధీజీ ఆశయాలు నేరవేర్చినట్లయింది. కుటీర పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి సమాజ వికాస అభి వృద్ధి కార్యక్రమాలను ప్రారంభించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దీనికి మంచి ఉదాహరణ. ఆదేశ సూత్రాల అమలుకు తీసుకున్న కొన్ని చర్యలు చట్టపరమైన వివాదాలకు దారితీశాయి. ప్రధానంగా ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయనే కారణంతో న్యాయస్థానంలో ప్రభుత్వ నిర్ణయాలను సవాలు చేశారు. దీనికి గోలక్‌నాథ్ కేసు (1967), కేశావనంద భారతి కేసు (1973), మినర్వామిల్స్ కేసు (1980) ఉదాహరణలు. న్యాయస్థానాలు కొన్ని పరిమితులు విధించాయి. 25, 42 రాజ్యాంగ సవరణ చట్టాలు ఆదేశ సూత్రాల పరిధిని విస్తృతం చేస్తూ ప్రాథమిక హక్కుల పరిధిని పరిమితం చేశాయి. 25వ రాజ్యాంగ సవరణ చట్టం 39(బీ, సీ) ప్రకరణల్లో ప్రస్తావించిన ఆదేశ సూత్రాలకు 14, 19 ప్రకరణల్లో పొందుపరచిన ప్రాథమిక హక్కుల కంటే అధిక ప్రాధాన్యం కల్పించింది. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఆదేశ సూత్రాల ఆధిక్యతను మరింత విస్తరిస్తూ ఆదేశ సూత్రాల అమలుకు చేసిన ఏ చట్టాలకైనా 14, 19 ప్రకరణల కంటే ఆధిక్యతను కల్పించింది. అయితే సుప్రీంకోర్టు ఈ సవరణను మినర్వామిల్స్ (1980) కేసులో కొట్టేసింది. ఈ తీర్పు ప్రకారం 39 బీ, సీ ప్రకరణల్లో పేర్కొన్న ఆదేశ సూత్రాల అమలుకు చేసిన చట్టాలు మాత్రమే 14, 19 ప్రకరణల కంటే ఆధిక్యతను కలిగి ఉంటాయి. మిగిలిన విషయాల్లో ప్రాథమిక హక్కులదే పైచేయని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నమూనా ప్రశ్నలు 1. ‘చట్టం ముందు సమానత్వం’ అనే హక్కు? ఎ) భారత పౌరులకు మాత్రమే లభిస్తుంది బి) భారతదేశంలో నివసించే వారందరికీ లభిస్తుంది సి) భారత పౌరులతో పాటు మిత్రదేశాలకు చెందిన విదేశీయులకు లభిస్తుంది. డి) కామన్వెల్త్ సభ్యదేశాల పౌరులకు లభిస్తుంది. 2. జీవించే హక్కును? ఎ) 352వ ప్రకరణ అమల్లో ఉన్నప్పుడు తాత్కాలికంగా రద్దు చేయవచ్చు బి) ఏ రకమైన అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నా రద్దవుతుంది సి) రాష్ట్రపతి ఉత్తర్వు మేరకు రద్దవుతుంది డి) ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని రద్దు చేయటానికి వీల్లేదు 3. ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 31(సి) ప్రకరణ చేర్చారు? ఎ) 1వ రాజ్యాంగ సవరణ బి) 24వ రాజ్యాంగ సవరణ సి) 25వ రాజ్యాంగ సవరణ డి) 42వ రాజ్యాంగ సవరణ 4. విద్యాహక్కు ప్రాథమిక హక్కు హోదా పొందిన సంవత్సరం? ఎ) 2002 బి) 2005 సి) 2001 డి) 2003 5. {పాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు రథానికి రెండు చక్రాల్లాంటివని ఏ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది? ఎ) గోలక్‌నాథ్ బి) ఎ.కె.గోపాలన్ సి) కేశవానందభారతి డి) మినర్వామిల్స్ సమాధానాలు 1) బి, 2) డి, 3) సి, 4) ఎ, 5) డి -
రాజ్యాంగం- ప్రాథమిక స్వరూప సిద్ధాంతం
భారత రాజ్యాంగం-విహంగ వీక్షణం ‘ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాల ప్రాధాన్యత’ విషయంలో మొదటి నుంచి పార్లమెంటు, సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయూలను వెలిబుచ్చుతూనే ఉన్నారుు. పార్లమెంటు... ఆదేశసూత్రాలకు ప్రాధాన్యమిస్తూ, వాటి అవులు కోసం ప్రాథమిక హక్కుల పరిధిని పరిమితం చేసేందుకు కూడా వెనుకాడలేదు. ఈ క్రమంలో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం (1951) ఆస్తిహక్కును పరిమితం చేసింది. తొమ్మిదో షెడ్యూల్‌ను చేర్చడం ద్వారా న్యాయు వ్యవస్థ సమీక్షాధికారాన్ని పరిమితం చేసింది. గోలక్‌నాథ్ కేసు (1967) విచారణ వరకు పార్లమెంటుకున్న రాజ్యాంగ సవరణ అధికారాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించలేదు. గోలక్‌నాథ్ కేసులో మెజార్టీ న్యాయువుూర్తులు.. పార్లమెంటుకు 368వ రాజ్యాంగ ప్రకరణ కింద ప్రాథమిక హక్కులను సవరించే అధికారం లేదని, రాజ్యాంగ పరిషత్‌కు వూత్రమే ఆ అధికారం ఉందన్నారు. న్యాయువుూర్తుల దృష్టిలో రాజ్యాంగ సవరణ కూడా చట్టమే కాబట్టి రాజ్యాంగ ప్రకరణ 13(2) మేరకు ‘‘ప్రాథమిక హక్కులను పరిమితం చేసే లేదా తొలగించే ఏ చట్టమైనా చెల్లదు.’’ గోలక్‌నాథ్ కేసులో ఇచ్చిన తీర్పును అధిక్రవుణ చేసేందుకు, పార్లమెంటు 24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (1971) 368వ ప్రకరణను సవరించింది. దీని ప్రకారం ‘‘రాజ్యాంగ సవరణకు చేసిన చట్టాలు 13(2) ప్రకరణ కింద చెల్లవని ప్రకటించటానికి వీల్లేదు.’’ 368వ ప్రకరణ కింద చేసిన రాజ్యాంగ సవరణ 13వ ప్రకరణలోని అంశాలకు వర్తించదు. 24వ రాజ్యాంగ సవరణ.. కేశవానందభారతి కేసు(1973)లో సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చింది. ఈ కేసులో ఒకవైపు పార్లమెంటుకు ప్రాథమిక హక్కులు సహా రాజ్యాంగంలోని ఏ అంశాన్నయినా సవరించే అధికారవుుందని ఒప్పుకుంటూ... మరోవైపు ‘‘368వ ప్రకరణ రాజ్యాంగ వలిక స్వభావాన్ని వూర్చే హక్కు పార్లమెంటుకు ఇవ్వలేదని’’ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీన్నే రాజ్యాంగ ప్రాథమిక స్వరూప సిద్ధాంతంగా వర్ణిస్తున్నారు. కేశవానందభారతి కేసులో తీర్చు ఇచ్చిన న్యాయువుూర్తుల్లో ఒకరైన జస్టిస్ సిక్రి రాజ్యాంగ ప్రాథమిక స్వరూప లక్షణాలను పట్టికాబద్ధం (్ట్చఛఠ్చ్ట్ఛ) చేసేందుకు ప్రయత్నించారు. సిక్రి అభిప్రాయుంలో రాజ్యాంగ ప్రాథమిక స్వరూప లక్షణాలు 1. రాజ్యాంగ సర్వోన్నతం 2. గణతంత్ర లేదా ప్రజాస్వావ్యు ప్రభుత్వం 3. రాజ్యాంగ లౌకిక స్వభావం 4. అధికార పృథఃకరణ (separation of powers) 5. రాజ్యాంగ సవూఖ్య లక్షణం ఇదే కేసులో పాల్గొన్న న్యాయువుూర్తి హెగ్డే, న్యాయువుూర్తి ముఖర్జీ మరికొన్ని అదనపు లక్షణాలను రాజ్యాంగ ప్రాథమిక స్వరూప లక్షణాలుగా పేర్కొన్నారు. అవి... 1. భారతదేశ సార్వభౌవూధికారం, ఏకత్వం 2. వున రాజకీయు వ్యవస్థ ప్రజాస్వావ్యు లక్షణం 3. వ్యక్తి స్వేచ్ఛ ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయుణ్ కేసు (1976) లో తీర్పు ఇస్తూ, సుప్రీంకోర్టు న్యాయువుూర్తి చంద్రచూడ్ కొన్ని అదనపు లక్షణాలను రాజ్యాంగ ప్రాథమిక స్వరూప సిద్ధాంతంలో భాగంగా గుర్తించారు. అవి... 1. ఇండియూ ఒక సార్వభౌవూధికార, ప్రజాస్వావ్యు, గణతంత్ర రాజ్యాంగం 2. సవూన హోదా, సవూన అవకాశాలు 3. లౌకికతత్వం, అంతరాత్మ స్వాతంత్య్రం 4. సవున్యాయుం ఆయనే... మినర్వామిల్స్ కేసులో (1980) వురికొన్ని అంశాలను చేర్చారు. అవి.. 1. పార్లమెంటుకున్న రాజ్యాంగ సవరణాధికారం 2. న్యాయుసమీక్ష 3. ప్రాథమికహక్కులు, ఆదేశసూత్రాల వుధ్య సవుతుల్యత న్యాయమూర్తి చంద్రచూడ్ అభిప్రాయుంలో... ‘రాజ్యాంగ పీఠిక ప్రాథమిక స్వరూపానికి కాదు’. కానీ, న్యాయువుూర్తి బేగ్ అభిప్రాయుంలో పీఠిక ప్రాతిపదికగా రాజ్యాంగ సవరణలు సక్రవుమైనవో కాదో పరీక్షించవచ్చు. రాజ్యాంగ సవరణలకు కొలబద్ధ పీఠికే! అయితే 42వ రాజ్యాంగ సవరణ చట్టం (1976) రాజ్యాంగ వలిక స్వభావ సిద్ధాంతాన్ని నీరుగార్చడానికి ప్రయుత్నించింది. 368వ ప్రకరణకు చేర్చిన 4, 5 క్లాజుల ప్రకారం: 1) 368 (1) నిబంధన ప్రకారం పార్లమెంటుకు సంక్రమించిన రాజ్యాంగ సవరణ అధికారంపై ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష పరిమితులుండవు. 2) రాజ్యాంగ సవరణ చట్టం ఏ కారణం వల్లనైనా న్యాయు సమీక్ష పరిధిలోకి రాదు. కానీ, మినర్వామిల్స్ కేసులో (1980) సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రాథమిక స్వరూప సిద్ధాంతాన్ని పునరుద్ఘాటించింది. 368వ ప్రకరణకు చేర్చిన 4, 5 క్లాజులు చెల్లవని తీర్పు వెలువరించింది. ఎందుకంటే.. ఇవి ప్రాథమిక లక్షణాల్లో ఒకటైన న్యాయు సమీక్ష అధికారాన్ని తొలగిస్తున్నాయి. కేశవానందభారతి కేసులో ప్రతిపాదించిన ప్రాథమిక స్వరూప సిద్ధాంతాన్ని సుప్రీంకోర్టు తలకిందులు చేయునంతవరకు, ఏ రాజ్యాంగ సవరణనైనా... ప్రాథమిక స్వరూప సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉందనే కారణంతో తోసిపుచ్చవచ్చు. అత్యవసర పరిస్థితులు సవూఖ్య వ్యవస్థలో జాతీయు, ప్రాంతీయు ప్రభుత్వాల వుధ్య అధికార విభజన జరుగుతుంది. సాధారణ పరిస్థితుల్లో ఈ రెండు ప్రభుత్వాలు సవూన ప్రతిపత్తి కలిగి ఉన్నప్పటికీ, అసాధారణ పరిస్థితులు తలెత్తితే దేశ సవుగ్రత కోసం కేంద్ర ప్రభుత్వం విశేషాధికారాలను ఉపయోగించాల్సి వస్తుంది. రాజ్యాంగంలో ప్రస్తావించిన అత్యవసర అధికారాలు యుూనియున్ ప్రభుత్వానికి ఏకకేంద్ర ప్రభుత్వంలా వ్యవహరించే అవకాశాన్నిస్తున్నాయి. రాజ్యాంగంలో 3 రకాల అసాధారణ పరిస్థితుల్ని పేర్కొన్నారు. 1.యుుద్ధం, విదేశ దురాక్రవుణ, సాయిధ తిరుగుబాటు. దీన్ని ‘‘జాతీయు అత్యవసర పరిస్థితి’’ అంటారు. (352వ ప్రకరణ) 2.రాష్ట్రాల్లో రాజ్యాంగబద్ధ యుంత్రాంగం విఫలం కావడం (356వ ప్రకరణ). దీన్నే ‘రాష్ట్రపతి పాలన’ గా మీడియూ ప్రచారంలోకి తెచ్చింది. 3.ఆర్థిక సంక్షోభం (360వ ప్రకరణ) జాతీయు అత్యవసర పరిస్థితిని వుంత్రివుండలి లిఖిత పూర్వక సలహా మేరకు రాష్ట్రపతి ప్రకటిస్తారు. ఈ ప్రకటనను పార్లమెంటు నెల రోజుల్లోగా ప్రత్యేక మెజార్టీ ద్వారా ఆమోదించాలి. పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత ఆ అత్యవస పరి స్థితి ఆరు నెలల వరకు అవుల్లో ఉంటుంది. అవసరాన్ని బట్టి ప్రతి ఆరు నెలలకోసారి పార్లమెంటు అనువుతితో నిరవధికంగా కొనసాగించవచ్చు. ఇది అవుల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయువచ్చు. అంటే కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికార పరిధి విస్తృతమవుతుంది. లోక్‌సభ, విధానసభల పదవీ కాలాన్ని ఒక ఏడాదిపాటు (ఐదేళ్ల నుంచి ఆరేళ్లకు) పొడిగించవచ్చు. ఆపై, అవసరాన్ని బట్టి సం వత్సరానికోసారి పార్లమెంటు తీర్మానం ద్వారా పొడిగించవచ్చు. అత్యవసర పరిస్థితి అవుల్లో ఉన్న కాలంలో ఏడో షెడ్యూల్లో పొందుపరచిన అన్ని అంశాల మీద (యుూనియున్, రాష్ట్ర, ఉవ్ముడి జాబితా) చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు... కేంద్ర- రాష్ట్రాల వుధ్య ఆర్థిక సంబంధాలను క్రవుబద్ధం చేసే 268-279 ప్రకరణలకు సంబంధించిన అంశాలను సవరించే అధికారం రాష్ట్రపతికి సంక్రమిస్తుంది. ఈ పరిస్థితుల్లోనే ప్రాథమిక హక్కుల అవులును తాత్కాలికంగా నిలిపివేయువచ్చు. వాటి అవులుకు సంబంధించిన రిట్లను జారీ చేసే అధికారం న్యాయుస్థానాలకు తాత్కాలికంగా ఉండదు. అరుుతే 20, 21వ ప్రకరణల్లోని హక్కు లను వూత్రం నిలిపేయడానికి వీల్లేదు. 352 ప్రకటరణ 352వ ప్రకరణ కింద అత్యవసర పరిస్థితిని మొదటిసారిగా 1962లో... చైనా దురాక్రవుణ నేపథ్యంలో ప్రకటించారు. 1968లో రద్దు చేశారు. 1971లో భారత్-పాకిస్తాన్ వుధ్య సంభవించిన యుుద్ధం నేపథ్యంలో రెండోసారి జాతీయు అత్యవసర పరిస్థితి ప్రకటించారు. 1975లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వుూడోసారి అత్యవసర పరిస్థితి ప్రకటనకు దారితీసింది. అయితే దీన్ని ‘అంతర్గత అలజడుల’ కారణంగా విధించారు. 1977లో రద్దు చే శారు. 44వ సవరణ ‘అంతర్గత అలజడుల’ స్థానంలో ‘సాయుుధ తిరుగుబాటు’ అనే సవూసాన్ని చేర్చింది. ఈ సవరణ ప్రకారం అత్యవసర పరిస్థితి ప్రకటన సమీక్షకు గురవుతుంది. రాష్ట్రంలో అసాధారణ పరిస్థితి తలెత్తితే రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం సక్రవుంగా కొనసాగలేని అసాధారణ పరిస్థితి తలెత్తినప్పుడు, సంబంధిత గవర్నరు నివేదిక ఆధారంగా (నివేదికతో నిమిత్తం లేకుండా కూడా)... వుంత్రివుండలి సలహా మేరకు 356వ ప్రకరణ కింద రాష్ట్రంలో అసాధారణ పరిస్థితి నెలకొందని రాష్ట్రపతి ప్రకటించవచ్చు. దీన్ని పార్లమెంటు రెండు నెలల్లోపు సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. 1994లో సుప్రీంకోర్టు బొమ్మైకేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం... పార్లమెంటు ఆమోదం పొందే వరకు రాష్ట్ర శాసనసభను రద్దు చేయుకూడదు. రాష్ట్ర వుంత్రివుండలిని రద్దు చేసి, రాష్ట్రం రాష్ట్రపతి పాలన కిందకు వస్తుంది. 44వ రాజ్యాంగ సవరణ చట్టం నిబంధనల మేరకు సుప్రీంకోర్టుకు అసాధారణ పరిస్థితి ప్రకటనను సమీక్షించే అధికారం సంక్రమించింది. పార్లమెంటు ఆమోదించిన ఆరు నెలల వరకు 356వ ప్రకరణ కింద చేసిన ప్రకటన అవుల్లో ఉంటుంది. అవసరాన్ని బట్టి పార్లమెంటు ఆమోదం మేరకు మరో ఆరు నెలల వరకు రాష్ట్రపతి పాలనను పొడిగించవచ్చు. మొత్తం మీద ఒక సంవత్సర మొత్తం లేదా ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పొడిగించాలంటే... 1. ఆ రాష్ట్రంలో పూర్తిగా లేక కొంత భాగంలో 352వ ప్రకరణ కింద అత్యవసర పరిస్థితి అవుల్లో ఉండాలి. 2. ఆ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణకు అనుకూల వాతావరణం లేదని ఎన్నికల సంఘం ధ్రువీకరించాలి. ఈ రెండు షరతుల మేరకు రాష్ట్రపతి పాలనను గరిష్టంగా వుూడేళ్ల వరకు పొడిగించవచ్చు. ఆ తర్వాత కూడా కొనసాగించాలంటే రాజ్యాంగ సవరణ చేయూలి. ఈ విధంగానే జవుూ్మకాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో వుూడేళ్ల కంటే ఎక్కువ కాలం రాష్ట్రపతి పాలన కొనసాగింది. 356వ ప్రకరణ అవుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పాలనకు కేంద్రం బాధ్యత వహిస్తుంది. ఆ రాష్ట్రానికి చెందిన బిల్లులు, బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదిస్తుంది. ఎక్కువ సందర్భాల్లో 356వ ప్రకరణ దుర్వినియోగమైంది. బొమ్మైకేసులో సుప్రీం తీర్పు కొంత వరకు ఈ దుర్వినియోగాన్ని అరికట్టింది. 360వ ప్రకరణ కింద ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు రాష్ట్రపతి వుంత్రివుండలి సలహా మేరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు. పార్లమెంట్ దీన్ని రెండు నెలల్లోపు సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. దీన్ని నిరవధికంగా కొనసాగించవచ్చు. ప్రతి ఆర్నెళ్లకోసారి పార్లమెంట్ దీన్ని ఆమోదిస్తూ తీర్మానం చేయూల్సిన అవసరం లేదు. ఇది అవుల్లో ఉంటే పొదుపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఉత్తర్వులివ్వవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధించవచ్చు (సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయుర్తుల జీతభత్యాలతో సహా). రాష్ట్ర ద్రవ్యబిల్లులను, రాష్ట్రపతి అనువుతి మేరకు శాసనసభలో ప్రవేశపెట్టాలి. ఇప్పటివరకు దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించలేదు. ముఖ్యాంశాలు 368వ ప్రకరణ కింద చేసిన రాజ్యాంగ సవరణ 13వ ప్రకరణలోని అంశాలకు వర్తించదు. 352వ ప్రకరణ కింద అత్యవసర పరిస్థితిని మొదటిసారిగా 1962లో... చైనా దురాక్రవుణ నేపథ్యంలో ప్రకటించారు. 1971లో భారత్-పాకిస్తాన్ వుధ్య యుుద్ధం నేపథ్యంలో రెండోసారి జాతీయు అత్యవసర పరిస్థితి ప్రకటించారు.1975లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వుూడోసారి అత్యవసర పరిస్థితి ప్రకటనకు దారితీసింది.356వ ప్రకరణ అవుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర పాలనకు కేంద్రం బాధ్యత వహిస్తుంది. ఆ రాష్ట్రానికి చెందిన బిల్లులు, బడ్జెట్‌ను పార్లమెంటు ఆమోదిస్తుంది. 360వ ప్రకరణ కింద ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు రాష్ట్రపతి వుంత్రివుండలి సలహా మేరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు. -
వైద్యం.. పోతోంది !
- అందని సర్కార్ వైద్యం - చిన్నపాటి రోగాలకు సైతం అందుబాటులో లేని మందులు - పట్టించుకోని ప్రభుత్వం - అప్పు చేసి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు సాక్షి, బెంగళూరు : రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అందించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా విద్య ఏనాడో వ్యాపారంగా మారిపోయింది. ప్రస్తుతం వైద్యం కూడా అదే దారిలో పయనిస్తోంది. పేదల పాలిట సంజీవినిగా ఉన్న సర్కార్ ఆస్పత్రులు కనీస వైద్యం అందించడంలో విఫలమవుతున్నాయి. సర్జరీలు పక్కన పెడితే కనీసం చిన్నపాటి జబ్బులకు సైతం ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్సలు అందడం లేదు. దీంతో ‘సర్కారీ ఆస్పత్రిలో వైద్యం, యమపురికి ప్రవేశ ద్వారం’ అనే భావన ప్రజల్లో నాటుకుపోయింది. దీంతో జబ్బు నయం చేయించుకునేందుకు రోగులు అప్పు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళుతున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో మరింత జఠిలంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత, నైపుణ్యం కొరవడిన మానవ వనరుల కారణంగా అక్కడ చికిత్స పొందేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నట్లు అధ్యాయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 2,366 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8,891 ఉపకేంద్రాలు, 190 సముదాయ ఆరోగ్య కేంద్రాలు, 86 ఆయుర్వేద, యునానీతో పాటు 30 జిల్లా ఆస్పత్రులు ఉన్నాయి. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ జబ్బులకు అవసరమైన పారాసిట్మాల్ వంటి టాబ్లెట్లు కూడా అందుబాటులో ఉండడం లేదు. చిన్నచిన్న గాయాలకు అవసరమైన డ్రసింగ్ క్లాత్ కూడా ‘బయట కొనుక్కురా’ అన్న డిమాండ్ వైద్యుల నుంచి వినిపిస్తోంది. దీంతో అప్పులు చేసి మరీ పేద రోగులు ప్రైైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి ప్రస్తుతం 1,452 మహిళాశిశు సంబంధ (గైనిక్, పిడియాట్రిక్) వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో స్త్రీ, శిశు సంబంధ వ్యాధుల చికిత్స కోసం గ్రామీణులు ఖర్చు ఎక్కువైనా విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ గణాంకాల ప్ర కారం 2010-11 ఏడాదిలో 13 లక్షల మంది ప్రజలు సర్కారు ఆసుపత్రుల్లో చికిత్స పొందగా అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందినవారి సంఖ్య 1.20 కోట్లుగా ఉంది. 2011-12 ఏడాదిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 22.36 లక్షల మంది వైద్యం చేయించుకోగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినవారి సం ఖ్య 1.5 కోట్లుగా గణాంకాలు పేర్కొంటున్నాయి. 2012-13 ఏడాదిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య వరుసగా 25 లక్షలు, 1.73 కోట్లుగా ఉంది. ఇక 2013-14లో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన రోగుల సంఖ్య 29.35 లక్షలు కాగా, అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో 1.96 కోట్ల మంది చికిత్స పొందారు. 2014-15లో ఈ సంఖ్య వరుసగా 35 లక్షలు(ప్రభుత్వ), 2.60 కోట్లు(ప్రైవేట్)గా ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాలు చూసిన తర్వాత వైద్య రంగం నుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నట్లు స్పష్టమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలను, అవసరమైన మందులను అందుబాటులోకి తెస్తుందేమో వేచి చూడాలి. -
జీవించే హక్కును వివరించే అధికరణ?
ఇండియన్ పాలిటీ ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాలు వ్యక్తి పరిపూర్ణ అభివృద్ధికి, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు ప్రాథమిక హక్కులు పెట్టని కోట. భారత ప్రజాస్వామ్యానికి ఇవి పునాదిరాళ్లు. ప్రాథమిక హక్కులను మన రాజ్యాంగానికి మాగ్నాకార్టాగా పేర్కొంటారు. వీటికి, ఆదేశిక సూత్రాలకు మధ్య సంబంధం విషయంలో.. న్యాయ శాస్త్రవేత్తలకు, రాజ్యాంగ నిపుణులకు, రాజనీతిజ్ఞులకు మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. న్యాయ సంరక్షణ లేని హక్కులుగా బి.ఎన్.రావు వర్ణించిన ఆదేశిక సూత్రాల స్థితిగతులపై అనేక వాదనలున్నాయి. రాజ్యాధికార దుర్వినియోగం, నియంతృత్వ చట్టాల నుంచి పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించే బాధ్యతను మన రాజ్యాంగం సుప్రీంకోర్టు, హైకోర్టులకు అప్పగించింది. తద్వారా ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ లభించింది. వీటి రక్షణ కోసం సుప్రీంకోర్టు 32వ అధికరణ ప్రకారం, హైకోర్టులు 226వ అధికరణ ప్రకారం రిట్లను జారీ చేస్తాయి. రాజ్యాంగంలోని 37వ అధికరణను అనుసరించి ఎలాంటి న్యాయ సంరక్షణ లేని ఆదేశిక సూత్రాలు అంతగా పట్టించుకోదగినవి కావని కె. సంతానం వ్యాఖ్యానించడం గమనార్హం. నిర్దేశిక నియమాలకు న్యాయసంరక్షణ లేకపోయినప్పటికీ సామాజిక మద్దతు ఉందని డా.బి.ఆర్. అంబేద్కర్ పేర్కొన్నారు. ప్రభుత్వాలు సమాజానికి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఈ విషయాన్ని విస్మరించడానికి అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాల మధ్య సంబంధం: ప్రాథమిక హక్కులు- ఆదేశిక సూత్రాల మధ్య వైరుధ్యాలు, తేడాలు మాత్రమే ఉన్నాయని, ఎలాంటి సంబంధం, సమన్వయం లేదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. 19(1)(ఎ) అధికరణ వ్యక్తి భావ ప్రకటన, వాక్ స్వాతంత్య్రాల గురించి పేర్కొంటోంది. 21వ అధికరణ వ్యక్తి స్వేచ్ఛను తెలుపుతోంది. సాధారణంగా అన్ని రకాల ఆర్థిక వనరులను కలిగి రాజ్యాంగం, హక్కుల గురించి అవగాహన ఉన్నవారు వాటిని పొందడం పెద్ద సమస్య కాదు. కానీ పేదలు, నిరక్షరాస్యులు, ప్రాథమిక హక్కుల గురించి అవగాహనలేనివారు ఈ స్వేచ్ఛా స్వాతంత్య్రాలను పొందడానికి ఆదేశిక సూత్రాల్లోని 39-ఎ అధికరణ ఉచిత న్యాయ సేవా సహాయ కేంద్రాల ద్వారా అవకాశం కల్పిస్తోంది. పేదలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి ఉచిత న్యాయసేవా సహాయం అందించడానికి 1987లో లీగల్ ఎయిడ్ అథారిటీని ఏర్పాటు చేశారు. రాజ్యాంగంలోని 21వ అధికరణ జీవించే హక్కును వివరిస్తోంది. 41వ అధికరణ, 48ఎ అధికరణలు ప్రాథమిక హక్కులకు, ఆదేశిక సూత్రాలకు మధ్య అవినాభావ సంబంధాన్ని తెలుపుతున్నాయి. రాజ్యాంగంలోని 46వ అధికరణ వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగపరంగా ప్రత్యేక అవకాశాలను కల్పించాలని పేర్కొంటోంది. రిజర్వేషన్ల అమలు కోసం ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలను 15(4), 15(5), 16(4), 16(4ఎ) అధికరణలు సమర్థిస్తాయి. ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కుల అమలులో ఒకదానికి మరొకటి సహకరించడంతో పాటు ఒక అంశాన్ని మరొక అంశం పటిష్టపరిచేందుకు దోహదపడడం గమనార్హం. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య భిన్నత్వం: ప్రాథమిక హక్కులు ప్రధానంగా వ్యక్తి ప్రాతిపదికపై రూపొందించినవి. ఆదేశిక సూత్రాలు సమాజ సమష్టి ప్రయోజనం కోసం ఉద్దేశించినవి. హక్కులు వ్యక్తి స్వేచ్ఛను, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించేందుకు తోడ్పడతాయి. ప్రాథమిక హక్కుల సంరక్షణ, అమలు కోసం పౌరులు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు అవకాశం ఉండగా, వాటి సంరక్షణ కోసం న్యాయస్థానాలు కూడా ఆజ్ఞలు జారీ చేసే అధికారాన్ని కలిగి ఉంటాయి. ఆదేశిక సూత్రాలకు అలాంటి న్యాయ సంరక్షణ లేకపోవడం గమనార్హం. ప్రాథమిక హక్కులు ఎల్లప్పుడూ పౌరులకు అందుబాటులో ఉంటాయి. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన సందర్భంలో మాత్రమే భారత రాష్ర్టపతి వాటిని తాత్కాలికంగా సస్పెండ్ చేయొచ్చు. కానీ నిర్దేశిక నియమాలు ఎల్లప్పుడూ సుప్తచేతనావస్థలో ఉంటాయి. అంటే వాటికి జీవం పోయాలంటే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చట్టాలను చేసి అమలు పర్చాలి. ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యత న్యాయస్థానాలపై, నిర్దేశిక నియమాల అమలు బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలకు సకారాత్మక దృక్పథాన్ని కల్పిస్తాయి. అంటే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు మార్గదర్శకాన్ని చూపుతాయి. ప్రాథమిక హక్కులు ప్రధానంగా ఏ పనులు చేయకూడదో తెలుపుతాయి. అంటే కొన్ని హక్కులు తప్ప మిగతావన్నీ నకారాత్మక దృక్పథాన్ని తెలుపుతాయి. ఆదేశిక సూత్రాలు రాజ్యాంగ సంక్షేమ లక్ష్యాలను తెలిపితే... ప్రాథమిక హక్కులు ఆ లక్ష్యాలను సాధించే సాధనాలు, మార్గాలుగా ఉపయోగపడతాయి. సంక్షేమ రాజ్యస్థాపనలో నిమగ్నమైన మన దేశంలో నిర్దేశిక నియమాలు.. ప్రభుత్వ శాసనాల రూపకల్పనలో, పరిపాలనా విషయంలో మాత్రమే కాకుండా న్యాయస్థానాల న్యాయ నిర్వహణలోనూ అధిక ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. ప్రాథమిక హక్కులు - ఆదేశిక సూత్రాల మధ్య వైరుధ్యం: ఆదేశిక సూత్రాలను అమలు పర్చాల్సిన బాధ్యత కేంద్ర-రాష్ర్ట ప్రభుత్వాలపై ఉంది. ఆదేశిక సూత్రాల అమలుకు ప్రభుత్వాలు రూపొందించే చట్టాలు... ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఉన్నత న్యాయస్థానాలు న్యాయ సమీక్ష నిర్వహించి ఆ చట్టాలు చెల్లవని ప్రకటిస్తున్నాయి. - 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంలో మద్రాస్ రాష్ర్ట ప్రభుత్వం 46వ అధికరణను అమలు జరపడంలో భాగంగా ఎస్సీ, ఎస్టీలకు విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. సమానత్వపు హక్కుకు రిజర్వేషన్లు విరుద్ధమని పేర్కొంటూ చంపకం దొరై రాజన్ మద్రాస్ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై మద్రాస్ రాష్ర్ట ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టు కూడా రిజర్వేషన్ల చట్టం 13వ అధికరణ ప్రకారం ప్రాథమిక హక్కులకు విరుద్ధమని తీర్పునిచ్చింది. - 1950 లో వివిధ రాష్ర్ట ప్రభుత్వాలు 39(బి), 39(సి) అధికరణలను అమలు పర్చడంలో భాగంగా భూ సంస్కరణల చట్టాలను రూపొందించాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ హైకోర్టులు భూ సంస్కరణల చట్టాలను సమర్థించగా... బీహార్, పశ్చిమబెంగాల్ హైకోర్టులు ఈ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాయి. కారణం అప్పట్లో ఆస్తిహక్కు ప్రాథమిక హక్కుగా ఉండడమే. అంతేకాకుండా దేశంలోని వివిధ హైకోర్టుల్లో వందలాది కేసులు విచారణలో ఉన్నాయి. - రిజర్వేషన్లు, భూ సంస్కరణల చట్టాల విషయంలో ఉన్నత న్యాయస్థానాలిచ్చిన తీర్పులను దృష్టిలో ఉంచుకొని 1951 లో నెహ్రూ ప్రభుత్వం మొదటి రాజ్యాంగ సవరణను చేసింది. ఈ సవరణ ద్వారా భూ సంస్కరణల చట్టాలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పిస్తూ 9వ షెడ్యూల్‌ను రాజ్యాంగంలో చేర్చారు. ప్రైవేట్ ఆస్తులను చట్టబద్ధంగా ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ 31(ఎ), 31(బి) అధికరణలను మన రాజ్యాంగంలో పొందుపర్చారు. - రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధతను కల్పిస్తూ 15(4) అనే అధికరణను కూడా చేర్చారు. మొదటి రాజ్యాంగ సవరణ కూడా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందనే కారణంతో శంకరీ ప్రసాద్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. - 1951లో శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు... మొదటి రాజ్యాంగ సవరణను, తద్వారా రాజ్యాంగంలో చేర్చిన అంశాలను సమర్థించింది. ఈ కేసులో ఒక ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావించింది. 13వ అధికరణ ప్రకారం సాధారణ చట్టాలను మాత్రమే న్యాయ సమీక్షకు గురిచేయొచ్చని, 368 అధికరణ ప్రకారం చేసిన రాజ్యాంగ సవరణలను న్యాయ సమీక్షకు గురిచేసే అవకాశం లేదని పేర్కొంది. - బేలా బెనర్జీ వర్సెస్ పశ్చిమ బెంగాల్, కామేశ్వరీ సింగ్ వర్సెస్ బీహార్ మధ్య జరిగిన వ్యాజ్యాల్లో సుప్రీంకోర్టు... ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్న వ్యక్తిగత ఆస్తులను సమాజ ప్రయోజనం కోసం జాతీయం చేసినప్పుడు వారికి నష్టపరిహారం న్యాయబద్ధంగా చెల్లించాలని, అంటే మార్కెట్ విలువ ప్రకారం చెల్లించాలని తీర్పునిచ్చింది. దీంతో పార్లమెంట్ 4వ రాజ్యాంగ సవరణ చేసింది. వ్యక్తులకు చెల్లించే నష్టపరిహారాన్ని చట్టబద్ధంగా మాత్రమే చెల్లించాలని పేర్కొంది. - సజ్జన్‌సింగ్ వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగిన వ్యాజ్యంలో కూడా సుప్రీంకోర్టు 1965లో 4వ సవరణను సమర్థించింది. కానీ, 1967లో గోలక్‌నాథ్ వర్సెస్ పంజాబ్ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు... గత తీర్పులకు భిన్నమైన తీర్పునిచ్చింది. ఆదేశిక సూత్రాలను అమలు పర్చడానికి ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రాథమిక హక్కులను సవరించినట్లయితే.. ఆ సదరు సవరణలను కూడా న్యాయసమీక్షకు గురిచేస్తామని కోర్టు పేర్కొంది. - 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయం చేసిన అంశాన్ని, 1970లో రాజభరణాలను రద్దు చేస్తూ రాష్ర్టపతి జారీ చేసిన ఆర్డినెన్సలు కూడా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పులనిచ్చింది. దీంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం 24, 25, 26వ రాజ్యాంగ సవరణలను చేపట్టింది. - 24వ సవరణ ప్రకారం... ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. - 25వ సవరణ ప్రకారం ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు చెల్లించే నష్టపరిహారం అనే పదానికి బదులుగా కొంత మొత్తం చెల్లించాలని, ఈ అంశాన్ని ఏ న్యాయస్థానంలో కూడా సవాల్ చేసే అవకాశం లేదని పేర్కొంటూ ‘సి’ క్లాజును చేర్చారు. - 26వ సవరణ ప్రకారం రాజభరణాల రద్దుకు రాజ్యాంగబద్ధతను కల్పించారు. - పై మూడు రాజ్యాంగ సవరణలను 1973లో కేశవానంద భారతి వర్సెస్ కేరళ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. 24వ రాజ్యాంగ సవరణను సమర్థిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మాత్రం సవరించే అధికారం లేదని పేర్కొంది. - 25వ సవరణను సమర్థించినప్పటికీ అందులోని సి క్లాజు చెల్లదని తీర్పునిచ్చింది. - 26వ రాజ్యాంగ సవరణను సుప్రీకోర్టు సమర్థించింది. - 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాలను అమలు పర్చడానికి రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంట్ సవరిస్తుందని, అలా సవరించిన అంశాన్ని ఏ న్యాయస్థానం ముందు ప్రశ్నించొద్దని, ఆ అంశాన్ని న్యాయ సమీక్షకు గురిచేసే అధికారం కూడా న్యాయస్థానాలకు లేదని పేర్కొంది. - 42వ సవరణ ద్వారా చేర్చిన అంశాలను 1980లో జరిగిన మినర్వా మిల్స్ కేసులో ప్రశ్నించారు. మినర్వామిల్స్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు రెండూ పరస్పరం విరుద్ధమైనవి కావు, భారత ప్రజాస్వామ్యానికి రెండు రథచక్రాల వంటివి, ఈ రెండింటి మధ్య సమన్వయం సాధించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఆదేశిక సూత్రాలన్నింటికీ కాకుండా 39(బి), 39(సి) అధికరణలకు మాత్రమే న్యాయ సంరక్షణ ఉంటుందని పేర్కొంది. ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని వెల్లడిస్తూ ఆదేశిక సూత్రాలపై ప్రాథమిక హక్కుల ప్రాధాన్యతను చాటి చెప్పింది. - ఎం.హెచ్. హోస్కాట్ వర్సెస్ మహారాష్ర్ట మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు ఉచిత న్యాయ సేవా సహాయాన్ని అందించడం కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించాలని తీర్పునిచ్చింది. - 1992లో మోహినీజైన్ కేసులో, ఉన్నికృష్ణన్ కేసులో ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది. ఇందిరాసహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య వ్యాజ్యంలో సంక్షేమ స్వభావం కూడా మన రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొంది. - ఆదేశిక సూత్రాల్లో పర్యావరణ పరిరక్షణ అనే అంశాన్ని కూడా సమర్థిస్తూ ఎం.సి.మెహతా కేసులో తాజ్‌మహాల్ చుట్టూ కాలుష్యాన్ని వెదజల్లే 18 రకాల పరిశ్రమలను మూసివేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. - 2006లో భారత పార్లమెంట్ 93వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యాసంస్థల్లో ఇతర వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు కల్పించడాన్ని అశోక్‌కుమార్ ఠాకూర్ కేసులో సుప్రీంకోర్టు సమర్థించింది.