Cut from the same cloth
అర్థం :
Cut from the same cloth = To share a lot of similarities; to be similar, usually in terms of behaviour.
వాక్య ప్రయోగం:
The two girls are cut from the same cloth and are similar in every way. అమ్మాయి లిద్దరూ ఒకే తాను ముక్కలే, ప్రతి విషయంలోనూ ఒకేరకంగా ఉంటారు.
వివరణ:
ఈ జాతీయాన్ని మరోవిధంగా Made from the same mold అని కూడా వ్యవహరిస్తారు. దర్జీ సూటు కుట్టేటప్పుడు జాకెట్, ట్రౌజర్లు (ప్యాంటు) ఒకేరకంగా ఉండేలా చూసుకుంటాడు. అంటే ఒకే గుడ్డలోంచి ముక్కలు కత్తిరిస్తాడు. లేదంటే కుట్టిన దుస్తులు పరిపూర్ణంగా మ్యాచ్ కావు. చక్కగా నప్పే దుస్తులకు వాటి రంగు, నాణ్యమైన గుడ్డ, అల్లిక, నేతలాంటి విష యాలకు సంబంధించి సమన్వయం ఉంటుంది. ఇవన్నీ చక్కగా కుదరాలంటే ఒకే రకమైన గుడ్డను ఉపయోగించాలి. ‘ఒకే తాను గుడ్డలు’, ‘అధిక సారూప్యంతో’ అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడతారు. he and her brother are cut from the same cloth, they both tell lies all the time. అంటే ‘ఆమె, తన తమ్ముడు ఒకే తాను ముక్కలు, ఎప్పడూ అబద్ధాలు చెబుతారు’ అని అర్థం. Father and son are made from the same mold and even sound alike on the telephone. అంటే ‘తండ్రీ, కొడుకులకు చాలా దగ్గరి పోలిక ఉంది. టెలిఫోనులో ఇద్దరి గొంతూ ఒకేరకంగా వినబడుతుంది’ అని అర్థం.
- డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి
email: vschary@gmail.com
జాతీయం
Published Mon, Apr 28 2014 10:01 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement