Nationalization
-
గ్రామాల్లో బ్యాంక్ సేవలు విస్తరించాలి
న్యూఢిల్లీ: ఆర్థిక సేవలను మరింత మందికి చేరువ చేయాల్సిన అవసరం ఉందని, చిన్న రుణ గ్రహీతల అవసరాలపై దృష్టి సారించాలని అఖిల భారత బ్యాంక్ అధికారుల సమాఖ్య (ఏఐబీవోసీ) కోరింది. దేశవ్యాప్తంగా భిన్న ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్యల వార్తలను ప్రస్తావిస్తూ.. ఎన్బీఎఫ్సీలు, స్థానిక రుణదాతలు పెద్ద మొత్తంలో వడ్డీలు వసూ లు చేస్తుండడం, దీనికితోడు ప్రతిఫలం ఇవ్వని పంట మద్దతు ధరలు ఈ పరిస్థితికి కారణమని పేర్కొంది. బ్యాంకుల జాతీయీకరణ దినం సందర్భంగా ఏఐబీవోసీ ప్రకటన విడుదల చేసింది. బ్యాంకుల కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించాలంటూ.. దీనివల్ల ఎన్బీఎఫ్సీలు, స్థానిక రుణదాతల ఉచ్చులో పడకుండా రైతులను కాపాడొచ్చని అభిప్రాయపడింది. కేవలం 74 వేల గ్రామాలకే బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయన్న ఇటీవలి ఒక నివేదికను ఉటంకించింది. గ్రామీణ పేదలకు రుణ లభ్యత అన్నది ఇప్పటికీ పెద్ద సవాలుగా మిగిలినట్టు ఏఐబీవోసీ జనరల్ సెక్రటరీ రూపమ్ రాయ్ తెలిపారు. విలీనాల తర్వాత బ్యాంక్‌లు పెద్ద కస్టమర్లకు ప్రాధాన్యం ఇస్తుండడంతో, చిన్న వ్యాపారులకు బ్యాంకు రుణాల అందుబాటు తగ్గిందని.. దీంతో వారు ఎన్బీఎఫ్సీలను ఆశ్రయించాల్సి వస్తోందని చెప్పారు. అధిక వడ్డీ రేట్లు, ఎన్బీఎఫ్సీ రంగం దోపిడీ పద్ధతులు ఎస్ఎంఈలపై పెద్ద భారాన్ని మోపుతోందంటూ.. అది వాటి వృద్ధిని అడ్డుకుంటున్నట్టు తెలిపారు. ప్రైవేటీకరణ పరిష్కారం కాదు.. బ్యాంక్‌ల ప్రైవేటీకరణ, పెద్ద బ్యాంక్‌ల మధ్య స్థిరీకరణ అన్నవి ఆర్థిక సేవల మార్కెట్లో సమస్యలకు పరిష్కారాలు ఎంత మాత్రం కోబోవని ఏఐబీవోసీ ప్రకటన పేర్కొంది. ప్రైవేటీకరణ అన్నది సామాజిక అవసరాల కంటే సాధ్యమైనంత లాభాలు పొందడానికి దారితీస్తుందని, అది ఆర్థిక అసమానతలను మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకప్పుడు 26 వరకు ప్రభుత్వరంగ బ్యాంక్‌లు ఉండగా, విలీనాలతో 12 బ్యాంక్‌లు మిగలడం తెలిసిందే. దీన్ని ప్రైవేటీకరణకు దొడ్డిదారిగా ఏఐబీవోసీ అభివరి్ణంచింది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం, 2020 కరోనా విపత్తు సమయంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన ప్రభుత్వరంగ బ్యాంక్‌ల కృషిని ఈ చర్యలు పట్టించుకోకపోవడమేనని పేర్కొంది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ల విలీనంతో అవి మార్కెట్ వాటా ను కోల్పోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2017–18 నాటికి మొత్తం డిపాజిట్లలో 66 శాతంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంక్‌ల వాటా 2023 డిసెంబర్ నాటికి 59 శాతానికి క్షీణించినట్టు ప్రకటనలో వివరించింది. -
సాధారణ బీమా చట్ట సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: సాధారణ బీమా వ్యాపారం (జాతీయీకరణ) సవరణ బిల్లు, 2021కి లోక్‌సభ మంగళవారం ఎటువంటి చర్చా లేకుండా ఆమోదం వేసింది. పెగాసస్, ఇతర సమస్యలపై సభ్యుల ఆందోళనల నడుమ ఈ బిల్లును సభలో ఆమోదం నిమిత్తం ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వ రంగ బీమా కంపెనీల్లో కేంద్రం తన వాటాల విక్రయానికి మార్గం సుగమం చేయడం బిల్లు ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ రంగంలో ప్రస్తుతం నాలుగు సాధారణ బీమా కంపెనీలు పనిచేస్తున్నాయి. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇందులో ఉన్నాయి. వీటిలో ఒకటి ప్రైవేటుపరం కానుంది. అయితే ఈ పేరును ఇంకా కేంద్రం ఖరారు చేయలేదు. ప్రభుత్వ రంగంలోని బీమా కంపెనీల ప్రైవేటీకరణకు ఉద్దేశించిన జీఐబీఎన్‌ఏ (జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్– నేషనలైజేషన్ యాక్ట్) సవరణలకు కేంద్రం క్యాబినెట్ గత వారమే ఆమోదముద్ర వేసింది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు, ఒక సాధారణ బీమా కంపెనీని ప్రైవేటీకరణ చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన 2021–22 బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ బాధ్యతను నీతి ఆయోగ్‌కు అప్పగించడమూ జరిగింది. ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమకూర్చుకోవాలన్నది బడ్జెట్ లక్ష్యం. ఫైనాన్షియల్ రంగంలో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఎల్ఐసీ మెగా ఐపీఓకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికితోడు ఐడీబీఐ బ్యాంక్‌లో తన మిగిలిన వాటా విక్రయాలకూ సిద్ధమవుతోంది. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్‌లో వాటాల విక్రయానికి నీతి ఆయోగ్ సూచనలు చేసినట్లు సమాచారం. ఇక రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 సవరణల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. -
వైద్యం జాతీయీకరణే మందు
గత మూడు దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణను ప్రైవేటీకరించడాన్ని ప్రోత్సహిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో ప్రజారోగ్య వ్యవస్థకు నిధులను సమకూర్చడం క్రమానుగతంగా తగ్గిస్తూ వచ్చారు. వైద్యం ప్రైవేటీకరణ విధానమే ప్రస్తుత సంక్షోభానికి మూలకారణం. కరోనా వైరస్ నేపథ్యంలో మరింతమంది ప్రజలు బాధలకు గురవుతూ ప్రాణాలు పోగొట్టుకోవడానికి ముందే ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణ రంగంపై అధికంగా డబ్బు ఖర్చుపెట్టే మార్గాలను అన్వేషించాలి. ప్రైవేట్ ఆసుపత్రుల జాతీయీకరణ ఒక్కటే మరిన్ని పడకలను రోగులకు అందుబాటులోకి తీసుకురాగలదు. సంపూర్ణ విధ్వంసాన్ని తప్పించాలంటే ప్రైవేట్ ఆసుపత్రులను తక్షణం జాతీయం చేయడం గురించి మనం ఆలోచించాల్సి ఉంది. రష్యాను ఇప్పటికే అధిగమించిన భారతదేశం ప్రస్తుతం కోవిడ్–19 బారిన పడి తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లో రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత, ఉదాసీనతే దీనికి కారణం అని చెప్పాలి. ఉదాహరణకు కరోనా వైరస్ ప్రారంభ దినాల్లో ఐసీఎమ్ఆర్ సూచించిన కరోనా పరీక్షల వ్యూహం కేసి చూద్దాం. కేంద్ర వైద్య సంస్థ ఆలోచన ఒకటి కాగా, రాష్ట్ర ప్రభుత్వాల అనధికారిక విధానం మరొకటిగా మారిపోయింది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించి కరోనా రోగులను ఏకాంతంలో పెట్టడానికి బదులుగా రోగుల సంఖ్యను తక్కువ చేసి చూపుతూ వచ్చారు. రోజుకు వంద కంటే తక్కువ కేసులు ఉంటున్న దశలో అనవసరంగా, కఠినాతికఠినంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పథకం పాడూ లేకుండా అమలు చేశారు. అదే సమయంలో ఆరోగ్య కార్యకర్తలకు పీపీఈ కిట్లను భారీ స్థాయిలో సేకరించి ఇవ్వడాన్ని పట్టించుకోలేదు. అంతకుమించి వలస కార్మికులు దుస్థితి పట్ల స్పందించడలో విఫలమయ్యారు. పరీక్షలను పెద్ద సంఖ్యలో నిర్వహించేలా రాష్ట్రాలకు దిశానిర్దేశం ఇవ్వడంలో విఫలమయ్యారు. ఇతర దేశాల్లో లాక్డౌన్ ముగిసిన తర్వాత నిబంధనలను సడలించి పథకం ప్రకారం ముందుకెళుతుండగా భారత్‌లో మాత్రం లాక్ డౌన్ అనంతరం కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ కేంద్రంతో పాటు, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి. పైగా లాక్డౌన్ దిగ్విజయంగా పూర్తయిందని, ఆట్టహాసంగా అన్‌లాక్–1, అన్‌లాక్–2ని ప్రకటించేశారు. లాక్డౌన్ కాలంలో ఏ ప్రభుత్వం నుంచి అయినా కనీసంగా ఆశించేది ఏమిటంటే, కరోనా పరీక్షల సామర్థ్యాన్ని తగినంతగా పెంచడం మాత్రమే. వ్యవస్థాగతంగా క్వారంటైన్ సౌకర్యాలను, ఆసుపత్రులను, ఐసీయూ పడకలను, వెంటిలేటర్లను, ఇతర సంస్థాగత అవసరాలను తీర్చడం ప్రభుత్వాల బాధ్యతగా ఉండాలి. కానీ దీనికి పూర్తి భిన్నంగా ఏం జరిగిందంటే మనం ఇప్పుడు ముంబై, ఢిల్లీ, చెన్నైల్లో కరోనా రోగుల దుస్థితిని చూసి చెప్పవచ్చు. భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించి చికిత్స చేయాల్సిన తరుణంలో ఆసుపత్రులు రోగులకు ముఖం చాటేశాయి. కరోనా చికిత్స చేసే ఆసుపత్రులు కనిపించక కొందరు దయనీయంగా మరణిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను కరోనా రోగులకు అందుబాటులో ఉంచలేకపోవడం, కుటుంబ సభ్యులతో సహా మిగతా జనాభానుంచి వారిని దూరం చేయడం ద్వారా వైరస్‌ని కట్టడి చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయనే చెప్పాలి. చెన్నైలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల కొరత ఏర్పడింది. నగరంలో అసంఖ్యాకంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల్లో 61 ఆసుపత్రులు మాత్రమే కోవిడ్–19 రోగులకు చికిత్స చేయడానికి ముందుకొచ్చాయి. చివరకు ఈ ఆసుపత్రుల్లో కూడా పడకలు ఖాళీగా లేవు. పైగా కోవిడ్–19 రోగులకు, ఇతర వ్యాధిగ్రస్తులకు చికిత్స చేయడం నుంచి అనేక ఆసుపత్రులు తప్పుకోవడం గమనార్హం. కాబట్టి ఆసుపత్రి సంరక్షణ లేక, నగరంలోని ఆసుపత్రుల సామర్థ్యంలో ఎక్కువ భాగం ప్రైవేట్ రంగంలో ఉండిపోయి అవి కూడా తలుపులు మూసేయడం కారణంగా కరోనా రోగులు, ఇతరులు నిస్సహాయంగా మృత్యువు బారిన పడుతున్నారు. ఈ ప్రమాదకరమైన పరిస్థితిలో మనం సాంక్రమిక వ్యాధి పతాకావస్థకు చేరుకుందని భావించేటంత అజ్ఞానంలో మాత్రం లేము. రెండు రోజుల క్రితం ఈ వ్యాసం రాసేనాటికి చెన్నైలో 22,375 యాక్టివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీరిలో కొన్ని వేలమందికి మాత్రమే ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఉంది. మరి, 70 లక్షల పైగా ఉన్న జనాభాలో కొన్ని వేలమంది రోగుల పరిస్థితి ఇలా ఉండగా, అంతర్జాతీయ వైద్య టూరిజం అవసరాలను నెరవేరుస్తోందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రైవేట్ హెల్త్ కేర్ వ్యవస్థ అసలు స్వరూపం బయటపడి ఆరోగ్య సంరక్షణ అనే భావనే కుప్పకూలుతున్న దశను సమీపిస్తోంది. ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం చెన్నైలో కోవిడ్–19 రోగులకు చికిత్స అందించడానికి ప్రభుత్వం అనుమతించిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేవలం 4,145 పడకలు మాత్రమే ఉంటున్నాయి. 2020 జూన్ 28 నాటికి వీటిలో 2,258 పడకలు మాత్రమే రోగులకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 1,887 పడకలు ఖాళీగా ఉండగా ప్రభుత్వం అనుమతించిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకోకుండా ఎందుకు పంపించి వేస్తున్నారు అన్నదే అంతుపట్టని మిస్టరీగా ఉంటోంది. అయితే ఎలాగోలా పడక సౌకర్యం చేజిక్కించుకున్నప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే వెసులుబాటు అత్యధిక శాతం జనాభాకు లేదు. అక్కడి ఖర్చులు భరించడం అసాధ్యం. తమిళనాడు ప్రభుత్వం బీమాపథకం కింద కోవిడ్–19 చికిత్సలో భాగంగా ఆసుపత్రులు విధించే బిల్లులకు గరిష్ట పరిమితిని నిర్ణయించింది. అయితే ఇలా గరిష్ట పరిమితి విధించినప్పటికీ దాన్ని అమలు చేయడం ఎవరి తరమూ కాదని ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాకాలకు సంబంధించిన ఉదాహరణలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. దీనికి మించి జనాభాలోని అధిక శాతం ప్రజల ఆరోగ్య సంరక్షణా బాధ్యతనుంచి రాష్ట్ర ప్రభుత్వం తన చేతులు దులుపుకుంది. మరో ప్రశ్న ఎదురవుతోంది. జూలై చివరినాటికి తమిళనాడులో రోజుకు 25 వేల కొత్త కేసులు బయట పడనున్న సందర్భంగా మిగిలి ఉన్న ఆ 1,887 పడకలు ఏ మూలకు వస్తాయి అన్నదే అసలు సమస్య. వాస్తవానికి చెన్నైలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలు మరి కొన్ని వారాల్లోనే పూర్తిగా భర్తీ అవుతాయి. వ్యాక్సిన్ కనుగొనకపోయినట్లయితే, చెన్నై నగరంలోని 40 నుంచి 56 లక్షల మంది జనం (మొత్తం జనాభాలో 50 నుంచి 70 శాతం) వైరస్ బారిన పడటం ఖాయం. ఈరోజు ఆసుపత్రులు చాలావరకు మూసివేతకు గురై ఉండవచ్చు కానీ కోవిడ్–19 రోగులు, ఇతర వ్యాధిగ్రస్తులు దశాబ్దాలుగా ఆరోగ్య సంరక్షణను ప్రైవేటీకరిస్తూ పోయిన ప్రభుత్వ పాలసీ ఘోర వైఫల్యానికి పరమ నిదర్శనాలుగా మనముందు కనిపిస్తున్నారు. వరుసగా ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణను ప్రైవేటీకరించడాన్ని ప్రోత్సహిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో ప్రజారోగ్య వ్యవస్థకు నిధులను సమకూర్చడం క్రమానుగతంగా తగ్గిస్తూ వచ్చారు. గత మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వాలు సాగిస్తూ వచ్చిన ఈ విధానమే ప్రస్తుతం సంక్షోభానికి మూలకారణమై నిలిచింది. ప్రైవేట్ ఆసుపత్రులపై అమలు కాని ఆదేశాలు, మార్గదర్శకాలు విధించి పబ్బం గడుపుకోవడానికి బదులుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం ప్రైవేట్ ఆసుపత్రులను జాతీయం చేసితీరాలి. కరోనా వైరస్ నేపథ్యంలో మరింతమంది ప్రజలు బాధలకు గురవుతూ ప్రాణాలు పోగొట్టుకోవడానికి ముందే ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణ రంగంపై అధికంగా డబ్బు ఖర్చుపెట్టే మార్గాలను అన్వేషించాలి. ప్రైవేట్ ఆసుపత్రుల జాతీయీకరణ ఒక్కటే మరిన్ని పడకలను రోగులకు అందుబాటులోకి తీసుకురాగలదు. ఉదాహరణకు చెన్నై నగరంలో 84,210 ఆసుపత్రి పడకలు అందుబాటులో ఉన్నాయి. జాతీయీకరణ చేస్తే కోవిడ్–19, ఇతర వ్యాధిగ్రస్తులకు చికిత్స చేయడానికి ప్రభుత్వం ఈ పడకలన్నింటినీ ఉపయోగించుకోవచ్చు. చెన్నై వంటి నగరాల్లో్ల ప్రైవేట్ ఆసుపత్రులను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే కేంద్రీకృత నిర్వహణలో ఆరోగ్య వ్యవస్థల యంత్రాంగాన్ని ఏర్పర్చడానికి అవకాశం లభిస్తుంది పైగా తగిన సిబ్బంది, వైద్యసామగ్రి, ల్యాబరేటరీ ఇతర మౌలిక వసతులను కేంద్రీకృత నెట్‌వర్క్‌లోకి తీసుకొచ్చి మరింత సమర్ధంగా వైద్య సేవలను అందించవచ్చు. ప్రైవేట్ ఆసుపత్రుల జాతీయీకరణ వల్ల మరణాల రేటు తగ్గిపోతుంది. రోగుల వ్యధలు తగ్గిపోతాయి. వైరస్ గుర్తింపు, ప్రజలను ముందే ఏకాంతంలో ఉంచడం వంటి చర్యల కొనసాగింపు వల్ల మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించవచ్చు. ప్రపంచంలోనే అత్యంత కఠినంగా అమలు చేసిన లాక్ డౌన్ ఇప్పటికే విఫలమైపోయింది. అయితే నగరాలు పూర్తిగా విధ్వంసం బారిన పడకుండా ఈ లాక్ డౌన్ కొంతమేరకు ఫలితం ఇచ్చిందని చెప్పాలి. ఈలోగా ప్రైవేట్ ఆసుపత్రుల జాతీయీకరణకు డిమాండ్లు రానురాను పెరుగుతున్నాయి. ఇప్పటికే తమిళనాడులో ఎంపీ, వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరమావులన్ ప్రయివేట్ ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండుకు ఇటీవలే నిర్వహిం చిన ట్విట్టర్ పోల్‌లో మెజారిటీ మద్దతివ్వడం గమనార్హం. సంపూర్ణ విధ్వంసాన్ని తప్పించాలంటే ప్రైవేట్ ఆసుపత్రులను జాతీయం చేయడం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. అంతిమంగా ప్రభుత్వాల ముందు ప్రస్తుతం ఉన్న అవకాశం స్పష్టం గానూ, సరళంగానూ కనిపిస్తోంది. జనాభాలోని మెజారిటీని నిశ్శ బ్దంగా బాధలకు గురి చేయడం కొనసాగించడమా లేక ప్రజల బాధలను వీలైనంతగా తగ్గించడానికి అందుబాటులో ఉన్న వనరులన్నిం టినీ ఉపయోగించడమా? అసలు ప్రశ్న ఇదేమరి. - అసుర, అసిస్టెంట్ ప్రొఫెసర్, బయోకెమిస్ట్రీ, (ది వైర్ సౌజన్యంతో) -
తప్పనిసరై జాతీయం.. తప్పులతో పతనం
సాగుకు రుణాల్లేవు. చిన్న సంస్థలను పట్టించుకునే వారే లేరు. అలాంటి దశలో బ్యాంకుల్ని జాతీయీకరించి... వాటి రుణ ప్రాధాన్యాలను పునఃనిర్వచించింది నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం. చాలా వర్గాలు వద్దన్నాయి. ఆర్బీఐ కూడా సరికాదని చెప్పింది. అయినాసరే... 50 ఏళ్ల కిందట ఇదే రోజున(1969, జూలై 19) ఇందిర తను అనుకున్నదే చేశారు. ప్రత్యేక ఆర్డినెన్స్‌తో 14 బ్యాంకుల్ని జాతీయం చేశారు. నిజానికి ఈ జాతీయీకరణ ఆశించిన మేర కొన్ని ప్రయోజనాలనైతే ఇచ్చింది. కానీ... ఆ ప్రయాణంలో బ్యాంకులు ప్రభుత్వం చేతిలో ఆటబొమ్మల్లా మారిపోయాయి. చివరికిపుడు శక్తికి మించిన మొండి బాకీల్ని మోస్తూ కుదేలవుతున్నాయి. చివరికి వీటిని ప్రైవేటీకరించాలన్న సలహాలూ వస్తున్నాయి. అంటే... మళ్లీ మొదలెట్టిన చోటికే చేర్చమని!!. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? జాతీయీకరణ ఎందుకు జరిగింది? ఇపుడు దారేంటి? వీటన్నిటి సమాహారమే ఈ ప్రత్యేక కథనం... సాక్షి, బిజినెస్ విభాగం బ్యాంకుల జాతీయీకరణ వెనక రాజకీయాలు పక్కనపెడితే ఇతరత్రా కారణాలూ ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన చాన్నాళ్ల దాకా బ్యాంకులు స్పెక్యులేటివ్, వాణిజ్య కార్యకలాపాలకు తప్ప ఎక్కువగా పరిశ్రమకు, వ్యవసాయ రంగానికి రుణాలివ్వటంపై పెద్దగా దృష్టి పెట్టలేదు. అటు నియంత్రణ సంస్థగా రిజర్వ్ బ్యాంక్ కూడా పూర్తి స్థాయిలో పట్టు సాధించలేకపోయింది. దీంతో 300 పైచిలుకు ఉన్న బ్యాంకులను అదుపు చేయడం కష్టంగా మారింది. 1960ల్లో పాలయ్ సెంట్రల్ బ్యాంక్, లక్ష్మి కమర్షియల్ బ్యాంక్ దివాలా తీయడంతో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ ఒత్తిడితో బ్యాంకుల సంఖ్యను తగ్గించడంపై ఆర్బీఐ దృష్టి పెట్టింది. 1960లో 328 పైచిలుకు ఉన్న బ్యాంకుల సంఖ్యను విలీనాలు, మూసివేతలుతో 1965 నాటికి 94 స్థాయికి తెచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో 1969 జూలై 19న కనీసం రూ.50 కోట్ల మేర డిపాజిట్లున్న బ్యాంకులను జాతీయం చేస్తున్నట్లు ఇందిరా గాంధీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ బ్యాంకులతో పాటు 14 బ్యాంకులు ప్రభుత్వ రంగ పరిధిలోకి వచ్చాయి. అప్పటి బ్యాంకింగ్ రంగంలోని మొత్తం డిపాజిట్లలో వీటి వాటా ఏకంగా 85 శాతం!!. మళ్లీ 1980లో రూ.200 కోట్ల పైగా డిపాజిట్లున్న మరో 6 బ్యాంకులను జాతీయీకరించారు. ఆర్బీఐని తోసిరాజని.. బ్యాంకుల జాతీయీకరణ ప్రక్రియలో ఆర్బీఐ గవర్నర్‌ను కూడా ప్రభుత్వం పెద్దగా లెక్క చేయలేదనే చెప్పాలి. ఇందిరా గాంధీతో పాటు ప్రధాని ప్రిన్సిపల్ కార్యదర్శి పీఎన్ హక్సర్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎ.బక్షి, డీఎన్ ఘోష్ అనే జూనియర్ స్థాయి అధికారి మాత్రమే ఈ ప్రక్రియలో పాలు పంచుకున్నారు. ఆర్బీఐ వర్గాల కథనం ప్రకారం.. బ్యాంకులు అప్పటికే సమగ్రమైన సామాజిక నియంత్రణ పరిధిలో పనిచేస్తున్నాయని, వాటి జాతీయీకరణ వల్ల ఎలాంటి లాభం ఉండకపోగా ప్రభుత్వం, ఆర్బీఐపై అనవసర బాధ్యతలు పెరుగుతాయంటూ ఆర్బీఐ గవర్నర్ ఎల్కే ఝా అప్పటికే ఒక నోట్‌ను సిద్ధం చేసుకుని ప్రధానికి తెలిపేందుకు వెళ్లారు. అయితే, ఆయన్ను చూసిన ప్రధాని ఇందిరాగాంధీ ‘మీ చేతిలో భారీ నోట్ ఏదో కనిపిస్తోంది. దాన్ని ఈ పక్కన టేబుల్ మీద ఉంచండి. పక్క గదిలో ప్రైవేట్ బ్యాంకుల జాతీయీకరణ ఆర్డినెన్స్‌పై కసరత్తు చేస్తున్న టీమ్‌కు కాస్త సాయం అందించండి‘ అని సూచించడంతో ఝా తప్పనిసరై ఆ ప్రక్రియలో భాగమయ్యారు. బ్యాంకింగ్ విస్తరణకు ఊతం.. జాతీయీకరణకు ముందు బ్యాంకులిచ్చే రుణాల్లో దాదాపు 78 శాతం పెద్ద, మధ్య స్థాయి పరిశ్రమలు, హోల్‌సేల్ వ్యాపారాలకే కాగా... వ్యవసాయం వాటా 2.2 శాతం మాత్రమే. 1969లో రూ.162 కోట్లుగా ఉన్న వ్యవసాయ రుణాలు 2011 నాటికి రూ.4 లక్షల కోట్లకు చేరాయి. చిన్న పరిశ్రమలకు బ్యాంకు రుణాలు కూడా రూ.251 కోట్ల నుంచి రూ. 3.6 లక్షల కోట్లకు చేరాయి. బ్యాంకులిచ్చే మొత్తం రుణాల్లో ప్రాధాన్యతా రంగ రుణాల వాటా 1969లో 15 శాతంగా ఉంటే 2011 నాటికి 41 శాతానికి పెరిగింది. సాధారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు తమకు నిర్దేశించిన లక్ష్యాల సాధనలో మెరుగైన పనితీరే కనపర్చాయి. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులోకి రావాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన జన్ ధన్ ఖాతాల్లో 80 శాతం అకౌంట్లు ప్రభుత్వ రంగ బ్యాంకులే (పీఎస్బీ) ఇచ్చాయి. వ్యవసాయం, చిన్న తరహా సంస్థలకు ప్రాధాన్యతా రంగ రుణాల్లో 68 శాతం వాటా వీటిదే ఉంది. మొండిబాకీలతో కుదేలు.. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే. తాజా పరిస్థితి చూస్తే మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకుల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. మొండిబాకీలతో బ్యాంకులు కుదేలవుతున్నాయి. 2014 మేలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ చూస్తే పీఎస్‌బీల విలువ దాదాపు రూ.2.97 లక్షల కోట్ల మేర కరిగిపోయింది. బ్యాంకింగ్ రంగ మార్కెట్ క్యాప్‌లో వీటి వాటా 40 శాతం నుంచి 26కు పడిపోయింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో ప్రైవేట్ బ్యాంకుల రుణ వృద్ధి 21 శాతంగా ఉంటే పీఎస్బీలది కేవలం 9.6 శాతమే. ప్రైవేట్ బ్యాంకుల డిపాజిట్లు 17.5 శాతం పెరిగితే పీఎస్‌బీలవి 6.5 శాతమే పెరిగాయి. ప్రైవేట్ బ్యాంకుల్లో ఎన్పీఏలు 3.7 శాతం స్థాయిలో ఉంటే పీఎస్‌బీలవి ఏకంగా 12.6 శాతం మేర ఉన్నాయి. దీంతో కేంద్రం దఫదఫాలుగా పీఎస్బీలకు అదనపు మూలధనం సమకూరుస్తూ కుప్పకూలకుండా చూస్తోంది. తప్పెవరిదంటే.. పీఎస్‌బీల పరిస్థితి ఇంత అధ్వానంగా మారడానికి బాధ్యులెవరంటే.. ఇటు స్వయంగా బ్యాంకులు అటు ప్రభుత్వం కూడానని చెప్పాలి. ప్రత్యేక ఫైనాన్స్ సంస్థల స్థానంలో భారీ ప్రాజెక్టులకు పీఎస్‌బీలు రుణాలివ్వాల్సి వచ్చింది. ఇలాంటి అంశాల్లో అంతగా అవగాహన లేకపోవడంతో ఈ దీర్ఘకాలిక రుణాల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయాయి. ఇవే నేటి మొండిబాకీలకు మూలకారణం. పీఎస్బీల్లో కేంద్రం వాటాలు తగ్గించుకుంది కానీ అజమాయిషీ మాత్రం దాని చేతుల్లోనే ఉంది. బ్యాంకింగ్‌తో సంబంధంలేని పనులకూ ఒకోసారి వాటిని ఉపయోగిస్తోంది. ఇక, పీఎస్బీ బ్యాంకర్లకు మార్కెట్ స్థాయిలో జీతభత్యాలు లేకపోవడం, నిరంతరం వారిపై దర్యాప్తు సంస్థల నిఘా ఉండటం వంటి అంశాలు సైతం వారిని సాహసోపేత నిర్ణయాలు తీసుకోనివ్వకుండా చేతులు కట్టేసినట్లుగా ఉంటున్నాయి. తరుణోపాయం ఏంటి? జాతీయీకరణ జరిగి 50 సంవత్సరాలవుతున్న ఈ తరుణంలోనైనా పీఎస్‌బీలపై కేంద్రం తగు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత దివాలా చట్టంతో మొండిబాకీలకు కొంత పరిష్కారం దొరుకుతున్నా, ఊరట అంతంతమాత్రంగానే ఉంటోంది. అవి ఎదగకుండా చేతులు కట్టేసి.. మూలధనాన్ని అందిస్తూ కూర్చోవడమా.. లేక వాటి మానాన వాటిని వదిలేయడమా లేక ప్రైవేటీకరించడమా అన్నది ప్రభుత్వం తేల్చుకోవాలనేది బ్యాంకింగ్ వర్గాల మాట. జాతీయీకరణ ఇలా తొలి విడత 1969లో: అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండో విడత 1980లో: పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, విజయ బ్యాంక్, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోడల్ మార్చాలి... ప్రభుత్వ రంగ బ్యాంకుల మోడల్ కొన్నాళ్ల పాటు పనిచేసింది. అదనపు మూలధనం రూపంలో పీఎస్‌బీల్లోకి వెడుతున్న ట్యాక్స్‌పేయర్స్ సొమ్ము విలువ ఎంతో కొంత పెరగాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ పెరగడం మాట అటుంచి ఎందుకు తగ్గుతోంది అన్నదే ప్రశ్నార్థకం. ఒకవేళ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానమే ఇందుకు కారణమైతే మోడల్‌ను మార్చే అంశాన్ని కచ్చితంగా పరిశీలించాలి. – అరుంధతి భట్టాచార్య, ఎస్బీఐ మాజీ చైర్మన్ మెరుగైన బ్యాంకులకు తోడ్పాటు అప్పట్లో ప్రైవేట్ బ్యాంకుల రికార్డు అంత బాగాలేకపోవడంతో బ్యాంకుల జాతీయీకరణ సమంజసమైనదే కావచ్చు. ప్రస్తుతం ప్రైవేట్ రంగ బ్యాంకులు మెరుగుపడ్డాయి.. కానీ పీఎస్‌బీల పరిస్థితే సందేహాస్పదంగా ఉంది. ఇలాంటప్పుడు పీఎస్‌బీల అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయ, ఆర్థికపరమైన అంశాల వల్ల ఈ వ్యవహారం చాలా సంక్లిష్టంగా మారింది. అయితే, అలాగని పీఎస్‌బీలు పూర్తిగా అవసరం లేదని కాదు. బ్యాంకింగ్‌లో నిర్దిష్ట శాతం ప్రభుత్వ రంగంలో ఉండాలని నిర్ణయించాలి. పోటీ ద్వారా ఏ బ్యాంకులు మెరుగ్గా ఉన్నాయో తేల్చి వాటికి తోడ్పాటునివ్వాలి. సరిగ్గా లేని వాటిల్లో షేర్లు అమ్మేసేయాలి. ఎకానమీ అవసరాలను తీర్చేలా ప్రభుత్వ నియంత్రణలో సుమారు 30 శాతం బ్యాంకింగ్ రంగం ఉంటే చాలని అంచనాలు ఉన్నాయి. – వైవీ రెడ్డి, ఆర్బీఐ మాజీ గవర్నర్ -
బ్యాంకుల జాతీయీకరణకు కారణం ‘నీలం’
సాక్షి, హైదరాబాద్: దేశంలో బ్యాంకుల జాతీయీకరణకు.. మాజీ రాష్ట్రపతి, తెలుగువాడు నీలం సంజీవరెడ్డి కారణమా? అప్పటి ప్రధాని ఇందిరాగాం«ధీ ఇష్టాన్ని కాదని కాంగ్రెస్ పార్టీ సంజీవరెడ్డి పేరును రాష్ట్రపతి పదవికి ప్రతిపాదించడం పరోక్షంగా బ్యాంకుల జాతీయీకరణ వేగంగా జరిగేలా చేసిందా? దీనికి అవుననే సమాధానం చెపుతున్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్. రాష్ట్రపతిగా బాబూ జగ్జీవన్‌రామ్‌ను చూడాలని ఇందిర అనుకున్నారని, అయితే పార్టీ ఆమె అభీష్టానికి విరద్ధంగా నీలం పేరును ప్రతిపాదించడంతో ఇందిర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, లండన్‌లో తన క్లాస్మేట్ అయిన పీఎన్ హక్సర్ సలహా మేరకు బ్యాంకుల జాతీయీకరణ ప్రక్రియను వేగవంతం చేశారని చెప్పారు. 1967–73 మధ్య అప్పటి ప్రధాని ఇందిరకు ‘ఆత్మ’గా వ్యవహరించినట్టు చెప్పే పీఎన్ హక్సర్ జీవిత చరిత్రను ‘ఇంటర్‌ట్వైన్డ్ లైవ్స్’పేరుతో జైరాం పుస్తకంగా రాశారు. ఈ పుస్తకం ఇటీవల విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో చర్చా వేదిక మంథన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన జైరాం ఈ పుస్తకం వెనక దాగున్న అనేక ఆసక్తికరమైన అంశాలను వివరించారు. ఇందిర హయాంలో అత్యంత శక్తివంతుడైన అధికారిగా హక్సర్ ఎన్నో సేవలు అందించారని, బ్యాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దు, అణ్వస్త్ర ప్రయోగాలు, అంతరిక్ష కార్యక్రమాల రూపకల్పన వంటి అనేక కీలకమైన విధానాల వెనుక ఉన్నది ఆయనేనని జైరాం తెలిపారు. దేశం బాగోగుల కోసం ప్రభుత్వ విధానాల రూపకల్పన చేసే వ్యవస్థగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని (అప్పట్లో ప్రధానమంతి సెక్రటేరియట్)ను ఏర్పాటు చేసింది కూడా హక్సర్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నప్పుడేనని వివరించారు. సర్వం తానై.. జవహర్లాల్ నెహ్రూ మరణం తర్వాత.. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని పగ్గాలు చేపట్టిన ఇందిర తన చిన్ననాటి మిత్రుడైన హక్సర్‌ను లండన్ నుంచి రప్పించుకుని మరీ కార్యదర్శిగా చేర్చుకున్నారని జైరాం తెలిపారు. 1967–73 మధ్య హక్సర్ సర్వం తానై అటు ప్రభుత్వాన్ని, ఇటు రాజకీయంగానూ ఇందిరకు సహరించారని, 1967 ఎన్నికల్లో 282 స్థానాలు మాత్రమే కలిగిన కాంగ్రెస్.. తర్వాత ఎన్నికలు వచ్చేనాటికి మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించే స్థాయికి చేరడం వెనుక హక్సర్ మంత్రాంగం, ఇందిరకు ఆయన ఇచ్చిన సలహాలు కీలకమయ్యాయన్నారు. నెహ్రూ స్మారక గ్రంథాలయంతో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో ఉన్న హక్సర్ లేఖలు, కార్యదర్శిగా ఆయన జారీ చేసిన మెమోలు, ఫైల్ నోటింగ్స్ అన్నింటినీ ఏడాది పాటు క్షుణ్ణంగా పరిశీలించి తాను ఈ పుస్తకాన్ని రాసినట్లు తెలిపారు. 1971లోనే ఎమర్జెన్సీ పెట్టమన్నాడు.. దేశ రాజకీయాల్లో చీకటి అధ్యాయంగా చెప్పుకునే ఎమర్జెన్సీని హక్సర్ సూచనల ప్రకారం 1971లోనే విధించి ఉంటే దేశం పరిస్థితి ఇంకోలా ఉండేదేమోనని జైరాం అభిప్రాయపడ్డారు. యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయం సాధించి బంగ్లా దేశ్‌ను విముక్తం చేసిన తర్వాత కొన్ని లక్షల మంది శరణార్థులు దేశంలో ఉండేవారని.. ఆ నేపథ్యంలో విదేశీ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందన్న నెపంతో ఎమర్జెన్సీ విధించి ఉంటే రాజకీయంగా ఇందిరకు లాభం కలిగేదని హక్సర్ భావించారని, అయితే ఇందిర ఆ సలహాను తోసిపుచ్చి.. ఆరేళ్ల తర్వాత రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు అత్యవసర పరిస్థితిని ప్రకటించారని వివరించారు. 1972లో జుల్ఫికర్ అలీ భుట్టోతో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందం కశ్మీర్ సమస్యకు కారణమన్న కొందరి వాదనను తాను అంగీకరించబోనన్న జైరాం.. ఆ ఒప్పందం ద్వారా భారత్‌కు మేలే జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ఐఏఎస్ అధికారులు, మంథన్ నిర్వాహకులు అజయ్, విక్రం గాంధీ పాల్గొన్నారు. -
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే బ్యాంకుల జాతీయీకరణ
శ్రీకాకుళం అర్బన్ : దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి బ్యాంకుల జాతీయీకరణ ఎంతగానో తోడ్పాటునందించిందని ఆలిండియా ఆంధ్రాబ్యాంక్ అవార్డు ఎంప్లాయీస్ యూనియన్ సెంట్రల్ కమిటీ సభ్యురాలు జి.కరుణ అన్నారు. బ్యాంకులను జాతీయీకరణ చేసి 50 ఏళ్లవుతున్న సందర్భంగా యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీకాకుళంలోని ఆంధ్రాబ్యాంక్ ఆర్సీబీ కార్యాలయంలో మహిళా ఉద్యోగులు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం నాటికి 648 వాణిజ్య బ్యాంకులు పూర్తిగా ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉండేవని, స్వాతంత్య్రానంతరం రెండు దశాబ్దాల్లో(1948–1968) దాదాపు 300కు పైగా బ్యాంకులు మూతపడ్డాయన్నారు. 1969 జూలై 19న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా దేశంలోని 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయీకరణ చేశారని గుర్తు చేశారు. 1980 ఏప్రిల్ 15న మరో ఆరు బ్యాంకులను జాతీయీకరణ చేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ అసిస్టెంట్ ఉమెన్ కన్వీనర్ వీఎస్ఆర్ సౌమ్య మాట్లాడుతూ దేశ ప్రజల నగదుకు భద్రత బ్యాంకులేనని అన్నారు. సామాజిక సంక్షేమానికి, బ్యాంకింగ్ వ్యవస్థను, గ్రామీణ ప్రాంతాలకు విçస్తృత పరచడానికి, ప్రాధాన్యతా రంగాలకు రుణ వితరణ ద్వారా ఆర్థిక స్వావలంబన, ప్రజల్లో బ్యాంకుల ద్వారా ఆర్థిక అవగాహన కల్పించడాని జాతీయీకరణ దోహదపడిందన్నారు. కార్యక్రమంలో యూనియన్ మహిళా ప్రతినిధులు స్వాతి, దివ్య, ప్రతిభ, మానస, సౌజన్య, మాధవీలత, శాంతకుమారి, స్వర్ణశ్రీ, శ్రీలక్ష్మి, మహిళా ఖాతాదారులు పాల్గొన్నారు. -
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
వార్తల్లో వ్యక్తులు ప్రసార భారతి చైర్మన్‌గా ఎ. సూర్య ప్రకాశ్ ప్రసార భారతి బోర్డు చైర్మన్‌గా సీనియర్ పాత్రికేయుడు, పయనీర్ పత్రిక కన్సల్టింగ్ ఎడిటర్ ఎ. సూర్య ప్రకాశ్ అక్టోబరు 28న ఎంపికయ్యారు. ఆయన ఈ హోదాలో మూడేళ్లు కొనసాగుతారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ (44) అక్టోబరు 31న ముంబయిలో ప్రమాణ స్వీకారం చేశారు. ఐసీసీఆర్ అధ్యక్షునిగా లోకేశ్చంద్ర సాంస్కృతిక సంబంధాల భారతీయ మండలి (ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్) చైర్మన్‌గా లోకేశ్‌చంద్రను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అక్టోబరు 27న నియమించారు. ఆయన పదవీకాలం ముడేళ్లు. ఐరాస శాంతి పరిరక్షణ కమిటీలో భారతీయుడు ఐక్యరాజ్య సమితి అత్యున్నత శాంతి పరిరక్షణ కమిటీలో భారత విశ్రాంత సైన్యాధికారి లెఫ్టినెంట్ జనరల్ అభిజిత్ గుహా నియమితులయ్యారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో ఆయనను సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ నియమించారు. అవార్డులు ఉత్తమ కేంద్రీయ వర్సిటీకి రాష్ట్రపతి అవార్డు ఉన్నత విద్యలో అత్యుత్తమ ఫలితాలను సాధించేలా కేంద్రీయ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ‘విజిటర్స్’ అవార్డులను నెలకొల్పారు. ఉత్తమ వర్సిటీతోపాటు పరిశోధన, నూతన ఆవిష్కరణలకు సంబంధించి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి సందర్శకుని(విజిటర్)గా ఉన్న కేంద్రీయ వర్సిటీలకు ఈ అవార్డు పొందేందుకు అర్హత ఉందని రాష్ట్రపతి భవన్ తెలిపింది. ఉత్తమ వర్సిటీకి ప్రశంసాపత్రం, పరిశోధనలకు రూ. లక్ష చొప్పున నగదు అందజేస్తారు. మన్మోహన్‌సింగ్‌కు జపాన్ పురస్కారం మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ జపాన్ జాతీయ పురస్కారం ది గ్రాండ్ కార్డన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ పౌలోనియా ఫ్లవర్స్‌కు ఎంపికయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు, మైత్రీ బంధం పటిష్టతలో మన్మోహన్ కృషిని ఆ దేశం గుర్తించింది. ఈ గౌరవం లభించిన తొలి భారతీయుడు మన్మోహన్సింగ్. మలాలాకు ప్రపంచ బాలల అవార్డు నోబెల్ శాంతి బహుమతి విజేత, పాక్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్ జాయ్ ప్రపంచ బాలల అవార్డు (వరల్డ్ చిల్డ్రన్స్ ప్రైజ్ )ను అక్టోబరు 29న స్వీడన్‌లోని స్టాక్ హోమ్‌లో అందుకున్నారు. బాలల నోబెల్‌గా పిలిచే ఈ అవార్డును 2000లో ఏర్పాటు చేశారు. జాతీయం భారత్‌లో పర్యటించిన వియత్నాం ప్రధాని వియత్నాం ప్రధాన మంత్రి గుయెన్ టాన్ డుంగ్ భారత్‌లో పర్యటించారు. అక్టోబరు 28న ప్రధాని మోదీతో సమావేశమై పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో ప్రధానమైనది ఓఎన్జీసీ లిమిటెడ్, పెట్రో వియత్నాం సంస్థల మధ్య ఒప్పందం. దీని ప్రకారం దక్షిణ చైనా సముద్రంలో భారత్ కొత్తగా ఒక చమురు బ్లాకు, మరో సహజ వాయువు బ్లాకులో అన్వేషణ చేపడుతుంది. ఈ ప్రాంతంపై చైనా, వియత్నాంల మధ్య వివాదం కొనసాగుతోంది. న్యూఢిల్లీలో సార్క్ విద్యా మంత్రుల సదస్సు దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్) విద్యా మంత్రుల, అధికారుల రెండో సదస్సు న్యూఢిల్లీలో అక్టోబరు 31న జరిగింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, విద్యా నాణ్యతను మెరుగుపరచుకోవడంలో పరస్పరం సహకరించుకోవాలని సదస్సు నిర్ణయించింది. కర్ణాటకలో 12 నగరాలకు కొత్త పేర్లు 59వ కర్ణాటక రాజ్యోత్సవంలో అక్టోబరు 31న రాష్ట్ర ప్రభుత్వం 12 నగరాలకు కొత్త పేర్లను ప్రకటించింది. బెంగ ళూర్ను బెంగళూరు, మంగుళూర్ను మంగళూరు, బెల్గామ్‌ను బెలగావీ, గుల్బర్గాను కలబురగి, మైసూర్‌ను మైసూరు, హుబ్లీని హుబ్బలీగా పిలుస్తారు. భారత మత్స్యకారులకు ఉరిశిక్ష విధించిన శ్రీలంక భారత్‌కు చెందిన ఐదుగురు తమిళ జాలర్లకు శ్రీలంక లోని కొలంబో హైకోర్టు అక్టోబరు 30న ఉరిశిక్ష విధించింది. 2001లో భారత్ నుంచి శ్రీలంకకు మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ చేశారన్న అభియోగాలపై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రీయం తెలంగాణకు ఇండియా టుడే అవార్డు తెలంగాణ రాష్ట్రం ఇండియా టుడే అవార్డుకు ఎంపికయింది. మౌలిక వనరులున్న అతిపెద్ద రాష్ట్రం (బిగ్ బెస్ట్ స్టేట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)గా తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచింది. కేంద్ర సాంకేతిక,సమాచార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేతుల మీదుగా తెలంగాణ పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అవార్డును న్యూఢిల్లీలో అందుకున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మె.వా. విద్యుత్తు 1000 మెగావాట్ల విద్యుత్తును ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేసేందుకు తెలంగాణ ఒప్పందం కుదుర్చుకొంది. నవంబరు 3న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రమణ్‌సింగ్, కేసీఆర్‌ల సమక్షంలో ఇంధన శాఖ కార్యదర్శులు రాయ్‌పూర్‌లో సంతకాలు చేశారు. రాష్ట్ర ఉత్సవంగా ‘సంజీవయ్య’ జయంతి మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి రోజైన ఫిబ్రవరి 14న రాష్ట్ర ఉత్సవంగా జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబరు 30న ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడలో తొలి మహిళా బ్యాంకు ఆంధ్రప్రదేశ్‌లో తొలి భారతీయ మహిళా బ్యాంకును తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో నవంబరు 1న ఆ బ్యాంకు సీఎండీ ఉషా అనంత సుబ్రమణ్యన్ ప్రారంభించారు. అరేబియా సముద్రంలో నీలోఫర్ తుపాను అరేబియా సముద్రంలో ఏర్పడిన నీలోఫర్ తుపాను నవంబరు 1న గుజరాత్లో కచ్ జిల్లాలోని నాలియా గ్రామం వద్ద తీరం దాటింది. దీనివల్ల సౌరాష్ట్ర, కచ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. నీలోఫర్ కారణంగా ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడ్డాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ విజయవంతంగా షార్ ఎయిర్ డ్రాప్ పరీక్ష శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) అక్టోబరు 31న ఎయిర్ డ్రాప్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. మానవ రహిత ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి, తర్వాత భూ వాతావరణంలోకి తీసుకువచ్చేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు. భూమికి చేరిన చైనా లూనార్ ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యను చేరిన చైనా వ్యోమనౌక జియావోఫియ్ వారం రోజుల తర్వాత తిరిగి నవంబరు 1న భూమికి చేరింది. ఈ నౌకను అక్టోబరు 24న లాంగ్‌మార్చ్ రాకెట్ ద్వారా ప్రయోగించారు. 8.40 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ ఆర్బిటర్ భూమి, చంద్రుడి ఫోటోలు తీసి పంపింది. చంద్రుడి కక్ష్యలోకి వ్యోమ నౌకను పంపి తిరిగి భూమికి తీసుకొచ్చిన మూడో దేశంగా చైనా నిలిచింది. ఇప్పటికే అమెరికా, రష్యాలు ఈ ఘనత సాధించాయి. కూలిన వ్యోమనౌక స్పేస్ షిప్- 2 రోదసీలోకి పర్యాటకులను తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన వ్యోమనౌక స్పేస్‌షిప్-2 అక్టోబరు 31న కాలిఫోర్నియాలోని మొజావీ ఎడారిలో కూలిపోయింది. వర్జిన్ గెలాక్టిక్ అనే సంస్థ ఈ నౌకను రూపొందించి, పరీక్షిస్తున్నప్పుడు అది 45 వేల అడుగుల ఎత్తులో పేలిపోయింది. 2015లో ఇది సిద్ధం కావాల్సి ఉంది. క్రీడలు ఐఎస్ఎస్ఎఫ్ చైర్మన్‌గా అభినవ్ బింద్రా భారత షూటర్ అభినవ్ బింద్రా అంతర్జాతీయ షూటింగ్ క్రీడల సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) చైర్మన్‌గా ఎంపికయ్యాడు. ఈ నిర్ణయాన్ని ఐఎస్ఎస్ఎఫ్ అక్టోబరు 30న ప్రకటించింది. ప్రస్తుతం బింద్రా ఈ కమిటీలో సభ్యునిగా ఉన్నాడు. కాగా ఈ హోదాలో నియమితులైన తొలి భారతీయుడు ఆయనే. రూ.250 కోట్లు చెల్లించాలని విండీస్‌కు బీసీసీఐ నోటీసు వెస్టిండీస్ క్రికెట్ ఆటగాళ్లు సిరీస్‌ను రద్దుచేసుకొని అర్థంతరంగా తిరిగి వెళ్లడంతో నష్టపరిహారంగా రూ. 250 కోట్లు చెల్లించాలని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ నోటీసు ఇచ్చింది. పారితోషికం విషయంపై విండీస్ ఆటగాళ్లు,బోర్డుకు మధ్య వివాదం నెలకొనడంతో భారత్‌లో జరగనున్న మ్యాచ్‌లు ఆగిపోయాయి. దీంతో బీసీసీఐకి పలు రూపాల్లో భారీ నష్టం వాటిల్లింది. పంకజ్ అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ టైటిల్ భారత బిలియర్డ్స్ క్రీడాకారుడు పంకజ్ అద్వానీ టైమ్ ఫార్మాట్లో ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌లోని లీడ్స్‌లో అక్టోబరు 29న జరిగిన ఫైనల్లో రాబర్డ్ హాల్ (ఇంగ్లండ్) ను ఓడించాడు. మూడోసారి గ్రాండ్ డబుల్ సాధించిన తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కాగా కెరీర్లో 12వ ప్రపంచ టైటిల్. మహిళల టైటిల్ విజేత ఎమ్మా బోని (ఇంగ్లండ్). ఈమె రెవన్న ఉమాదేవి (భారత్)పై విజయం సాధించింది. బ్రాడ్‌మన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో సచిన్, స్టీవ్‌వాకు చోటు మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ (భారత్), స్టీవ్‌వా (ఆస్ట్రేలియా)లకు బ్రాడ్‌మన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు లభించింది. అక్టోబరు 29న సిడ్నీ మైదా నంలో నిర్వహించిన కార్యక్రమంలో సచిన్, స్టీవ్‌వా పేర్లను గార్డ్ ఆఫ్ ఆనర్స్‌లో చేర్చినట్లు బ్రాడ్‌మన్ ఫౌండేషన్ ప్రకటించింది. సెంట్రల్ జోన్‌కు దులీప్ ట్రోఫీ దులీప్ ట్రోఫీని సెంట్రల్ జోన్ క్రికెట్ జట్టు గెలుచుకుంది. నవంబరు 2న న్యూఢిల్లీలో జరిగిన పైనల్లో సౌత్ జోన్‌ను సెంట్రల్‌జోన్ ఓడించి పదేళ్ల తర్వాత తిరిగి దులీప్ట్రోఫీని దక్కించుకుంది. ఈ ట్రోఫీని సెంట్రల్‌జోన్ గెలుచుకోవడం ఆరోసారి. అంతర్జాతీయ లింగ అసమానత్వ సూచీలో భారత్‌కు 114వ స్థానం ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)-2014 లింగ అసమానత్వ సూచీలో భారత్ 114 వ స్థానంలో నిలిచింది. గతేడాది ఉన్న 101 స్థానం నుంచి 13 స్థానాలు భారత్ దిగజారింది. మొత్తం 142 దేశాల పనితీరు ఆధారంగా అక్టోబరు 28న విడుదల చేసిన సూచీలో మొదటి స్థానంలో ఐస్లాండ్ నిలిచింది. పాలస్తీనాను అధికారికంగా గుర్తించిన స్వీడన్ పాలస్తీనా ప్రాంతాన్ని అధికారికంగా గుర్తించిన తొలి యూరోపియన్ యూనియన్ దేశంగా స్వీడన్ నిలిచింది. ఇప్పటివరకు 130 ఇతర దేశాలు పాలస్తీనాను అధికారికంగా గుర్తించాయి. బంగ్లాదేశ్ జమాత్ అధ్యక్షుడికి మరణశిక్ష బంగ్లాదేశ్ జమాత్-ఇ-ఇస్లామీ అధ్యక్షుడు ఎం.రహ్మాన్ నిజామి (71)కు బంగ్లాదేశ్ యుద్ధ నేరాల ట్రైబ్యునల్ అక్టోబరు 29న మరణశిక్ష విధించింది. 1971 యుద్ధంలో అనేక మంది లౌకిక వాద మేధావుల హత్యలతో పాటు ఇతర నేరాల్లో కారకుడిగా గుర్తించిన ట్రైబ్యునల్ నిజామికి ఈ శిక్షను ఖరారు చేసింది. జపాన్‌లో ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జపాన్ రాజధాని టోక్యోలో ఏడాదిపాటు రెండు దశల్లో జరిగే ఫెస్టివల్ ఆఫ్ ఇండియా కార్యక్రమం అక్టోబరు 27 న ప్రారంభమయింది. ఈ ఏడాది ఆగస్టులో ఆ దేశంలో పర్యటించిన ప్రధాని మోదీ జపాన్-భారత్ ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వ్యాపార అనుకూల దేశాల్లో భారత్‌కు 142వ స్థానం ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్ 142వ స్థానంలో నిలిచింది. మొత్తం 189 దేశాలకు సంబంధించిన జాబితాను ప్రపంచ బ్యాంకు అక్టోబరు 29న విడుదల చేసింది. సింగపూర్, న్యూజిలాండ్, హాంకాంగ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ పర్చేజింగ్ పవర్ పారిటీ (పీపీపీ) విభాగంలో భారత్ మూడో స్థానంలో నిలిచిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం అక్టోబరులో పీపీపీ అంశంలో భారత్ 7277.279 బిలియన్ అమెరికన్ డాలర్లతో స్థూల జాతీయోత్పత్తిలో 6.8 శాతాన్ని చేరింది. చైనా ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 16.48 శాతంతో మొదటి స్థానంలో, అమెరికా ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 16.28 శాతంతో రెండోస్థానంలో నిలిచాయి. -
జాతీయం
Cut from the same cloth అర్థం : Cut from the same cloth = To share a lot of similarities; to be similar, usually in terms of behaviour. వాక్య ప్రయోగం: The two girls are cut from the same cloth and are similar in every way. అమ్మాయి లిద్దరూ ఒకే తాను ముక్కలే, ప్రతి విషయంలోనూ ఒకేరకంగా ఉంటారు. వివరణ: ఈ జాతీయాన్ని మరోవిధంగా Made from the same mold అని కూడా వ్యవహరిస్తారు. దర్జీ సూటు కుట్టేటప్పుడు జాకెట్, ట్రౌజర్లు (ప్యాంటు) ఒకేరకంగా ఉండేలా చూసుకుంటాడు. అంటే ఒకే గుడ్డలోంచి ముక్కలు కత్తిరిస్తాడు. లేదంటే కుట్టిన దుస్తులు పరిపూర్ణంగా మ్యాచ్ కావు. చక్కగా నప్పే దుస్తులకు వాటి రంగు, నాణ్యమైన గుడ్డ, అల్లిక, నేతలాంటి విష యాలకు సంబంధించి సమన్వయం ఉంటుంది. ఇవన్నీ చక్కగా కుదరాలంటే ఒకే రకమైన గుడ్డను ఉపయోగించాలి. ‘ఒకే తాను గుడ్డలు’, ‘అధిక సారూప్యంతో’ అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడతారు. he and her brother are cut from the same cloth, they both tell lies all the time. అంటే ‘ఆమె, తన తమ్ముడు ఒకే తాను ముక్కలు, ఎప్పడూ అబద్ధాలు చెబుతారు’ అని అర్థం. Father and son are made from the same mold and even sound alike on the telephone. అంటే ‘తండ్రీ, కొడుకులకు చాలా దగ్గరి పోలిక ఉంది. టెలిఫోనులో ఇద్దరి గొంతూ ఒకేరకంగా వినబడుతుంది’ అని అర్థం. - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి email: vschary@gmail.com -
జాతీయం:నగరంలోని క్రికెట్ శిక్షకుల్లో మా శిక్షకుడే ఉన్నతమైన, మేలైన వ్యక్తి.
Head and shoulders above someone/something అర్థం: Head and shoulders above someone/ something = to be superior to someone or something వాక్య ప్రయోగం: Our cricket coach is head and shoulders above the other coaches in the city. నగరంలోని క్రికెట్ శిక్షకుల్లో మా శిక్షకుడే ఉన్నతమైన, మేలైన వ్యక్తి. వివరణ: ఓ వ్యక్తి లేదా వస్తువు మరో వ్యక్తి లేదా వస్తువుతో పోల్చినప్పుడు ఉన్నతంగా, ఉత్కృష్టంగా ఉండే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాం. ఈ ప్రయోగం ఎక్కువగా stand అనే క్రియతో వాడతారు. 'He always stands head and shoulders above the rest in the teaching but he is very modest' అంటే ‘బోధనలో ఆయన మిగతావారి కంటే ఎంతో మేలైన వ్యక్తి. కానీ, చాలా విధేయతతో అణకువతో ఉంటాడు’ అని అర్థం. 18వ శతాబ్దం నుంచి విస్తృతంగా వాడుకలోకి వచ్చిన ఈ జాతీయాన్ని ఉత్కృష్ట, ఉన్నత, ఉచ్ఛ, మేలైన అనే అర్థాలతో వాడతాం. Gold is head and shoulders above the rest of the metals అంటే లోహాలన్నింటిలో బంగారం మేలైనదని అర్థం. - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి email: vschary@gmail.com -
జాతీయం:గొంతు బొంగురుగా ఉంది.
Have a frog in one's throat అర్థం: Have a frog in one's throat = To have soreness in one's throat that prevents from speaking well. వాక్య ప్రయోగం: I had a frog in my throat this morning before I left my house. ఈ రోజు ఇంటి నుంచి బయలుదేరే ముందు నా గొంతు బొంగురుగా ఉంది. వివరణ: కంఠంలో లేదా ముక్కులో కఫం (శ్లేష్మం) ఉంటే గొంతులో అసౌకర్యంగా ఉంటుంది. మాటలో స్పష్టత ఉండదు. ఒకవేళ మాట్లాడినా బొంగురుగా, జీర ఉన్నట్లుగా మాట ధ్వనిస్తుంది. ఇలాంటి పరిస్థితిని వివరించడానికి ఈ జాతీయాన్ని వాడతాం. అస్పష్టంగా మాట్లాడే మాటలను కప్ప చేసే ధ్వని ‘బెక బెక’తో పోల్చి చెబుతారు. ఈ జాతీయాన్ని ‘బొంగురు/ జీర గొంతుతో మాట్లాడు’ అనే అర్థంతో వాడతాం. దీన్ని మెదటగా అమెరికా మతపెద్ద Harvey Newcomb 1847లో రాసిన How to be manలో ప్రయోగించారు. Execuse me, I have a frog in my throat now. I can't sing అంటే ‘నా గొంతు బొంగురుగా ఉన్నందువల్ల ఇప్పుడు పాడలేను, మన్నించండి’ అని అర్థం. - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి email: vschary@gmail.com -
జాతీయం:అసలు శ్వాస సమయం
Hardly have time to breathe అర్థం: Hardly have time to breathe = To be very busy. వాక్య ప్రయోగం: I hardly had time to breathe while I was preparing for group-I examinations. గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమయ్యే రోజుల్లో నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం దొరికేది కాదు. వివరణ: ఈ జాతీయంలో ఏ్చటఛీడ స్థానంలో ఛ్చిటఛ్ఛిడ, ఆ్చట్ఛడ పదాలను కూడా వాడవచ్చు. ‘చాలీ చాలనంతగా’, ‘అరుదుగా’ అనే అర్థాలతో వీటిని వాడతారు. Hardly, barely, scarcely, rarely, seldom లాంటి పదాలను Nagative meaning-ful words అంటారు. ఇవి Not అనే పదం లేకున్నా నెగటివ్ అర్థాన్నిస్తాయి. ‘ఊపిరి పీల్చడానికి కూడా సమయం లేనంతగా’, ‘తీవ్రమైన పని ఒత్తిడి’ అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడతారు. They made him work so hard that he scarcely had time to breathe అంటే ‘వారు అతడికి ఊపిరి పీల్చుకోలేనంత పని కల్పించారు’ అని అర్థం. నిరంతరం పనిలో నిమగ్నమయ్యే విషయం తెలియజేయడానికి తేనెటీగ, చీమను ఉదహరిస్తారు. దీనికి సమానార్థం ఇచ్చే ప్రయోగంగా అట busy as a bee ని చెప్పుకోవచ్చు. - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి email: vschary@gmail.com