Have a frog in one's throat
అర్థం:
Have a frog in one's throat = To have soreness in one's throat that prevents from speaking well.
వాక్య ప్రయోగం:
I had a frog in my throat this morning before I left my house. ఈ రోజు ఇంటి నుంచి బయలుదేరే ముందు నా గొంతు బొంగురుగా ఉంది.
వివరణ:
కంఠంలో లేదా ముక్కులో కఫం (శ్లేష్మం) ఉంటే గొంతులో అసౌకర్యంగా ఉంటుంది. మాటలో స్పష్టత ఉండదు. ఒకవేళ మాట్లాడినా బొంగురుగా, జీర ఉన్నట్లుగా మాట ధ్వనిస్తుంది. ఇలాంటి పరిస్థితిని వివరించడానికి ఈ జాతీయాన్ని వాడతాం. అస్పష్టంగా మాట్లాడే మాటలను కప్ప చేసే ధ్వని ‘బెక బెక’తో పోల్చి చెబుతారు. ఈ జాతీయాన్ని ‘బొంగురు/ జీర గొంతుతో మాట్లాడు’ అనే అర్థంతో వాడతాం. దీన్ని మెదటగా అమెరికా మతపెద్ద Harvey Newcomb 1847లో రాసిన How to be manలో ప్రయోగించారు. Execuse me, I have a frog in my throat now. I can't sing అంటే ‘నా గొంతు బొంగురుగా ఉన్నందువల్ల ఇప్పుడు పాడలేను, మన్నించండి’ అని అర్థం.
- డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి
email: vschary@gmail.com
జాతీయం:గొంతు బొంగురుగా ఉంది.
Published Sun, Apr 6 2014 10:57 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement