Vangipuram Srinadha chary
-
జాతీయం:నగరంలోని క్రికెట్ శిక్షకుల్లో మా శిక్షకుడే ఉన్నతమైన, మేలైన వ్యక్తి.
Head and shoulders above someone/something అర్థం: Head and shoulders above someone/ something = to be superior to someone or something వాక్య ప్రయోగం: Our cricket coach is head and shoulders above the other coaches in the city. నగరంలోని క్రికెట్ శిక్షకుల్లో మా శిక్షకుడే ఉన్నతమైన, మేలైన వ్యక్తి. వివరణ: ఓ వ్యక్తి లేదా వస్తువు మరో వ్యక్తి లేదా వస్తువుతో పోల్చినప్పుడు ఉన్నతంగా, ఉత్కృష్టంగా ఉండే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాం. ఈ ప్రయోగం ఎక్కువగా stand అనే క్రియతో వాడతారు. 'He always stands head and shoulders above the rest in the teaching but he is very modest' అంటే ‘బోధనలో ఆయన మిగతావారి కంటే ఎంతో మేలైన వ్యక్తి. కానీ, చాలా విధేయతతో అణకువతో ఉంటాడు’ అని అర్థం. 18వ శతాబ్దం నుంచి విస్తృతంగా వాడుకలోకి వచ్చిన ఈ జాతీయాన్ని ఉత్కృష్ట, ఉన్నత, ఉచ్ఛ, మేలైన అనే అర్థాలతో వాడతాం. Gold is head and shoulders above the rest of the metals అంటే లోహాలన్నింటిలో బంగారం మేలైనదని అర్థం. - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి email: vschary@gmail.com -
జాతీయం:గొంతు బొంగురుగా ఉంది.
Have a frog in one's throat అర్థం: Have a frog in one's throat = To have soreness in one's throat that prevents from speaking well. వాక్య ప్రయోగం: I had a frog in my throat this morning before I left my house. ఈ రోజు ఇంటి నుంచి బయలుదేరే ముందు నా గొంతు బొంగురుగా ఉంది. వివరణ: కంఠంలో లేదా ముక్కులో కఫం (శ్లేష్మం) ఉంటే గొంతులో అసౌకర్యంగా ఉంటుంది. మాటలో స్పష్టత ఉండదు. ఒకవేళ మాట్లాడినా బొంగురుగా, జీర ఉన్నట్లుగా మాట ధ్వనిస్తుంది. ఇలాంటి పరిస్థితిని వివరించడానికి ఈ జాతీయాన్ని వాడతాం. అస్పష్టంగా మాట్లాడే మాటలను కప్ప చేసే ధ్వని ‘బెక బెక’తో పోల్చి చెబుతారు. ఈ జాతీయాన్ని ‘బొంగురు/ జీర గొంతుతో మాట్లాడు’ అనే అర్థంతో వాడతాం. దీన్ని మెదటగా అమెరికా మతపెద్ద Harvey Newcomb 1847లో రాసిన How to be manలో ప్రయోగించారు. Execuse me, I have a frog in my throat now. I can't sing అంటే ‘నా గొంతు బొంగురుగా ఉన్నందువల్ల ఇప్పుడు పాడలేను, మన్నించండి’ అని అర్థం. - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి email: vschary@gmail.com -
జాతీయం:అసలు శ్వాస సమయం
Hardly have time to breathe అర్థం: Hardly have time to breathe = To be very busy. వాక్య ప్రయోగం: I hardly had time to breathe while I was preparing for group-I examinations. గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమయ్యే రోజుల్లో నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం దొరికేది కాదు. వివరణ: ఈ జాతీయంలో ఏ్చటఛీడ స్థానంలో ఛ్చిటఛ్ఛిడ, ఆ్చట్ఛడ పదాలను కూడా వాడవచ్చు. ‘చాలీ చాలనంతగా’, ‘అరుదుగా’ అనే అర్థాలతో వీటిని వాడతారు. Hardly, barely, scarcely, rarely, seldom లాంటి పదాలను Nagative meaning-ful words అంటారు. ఇవి Not అనే పదం లేకున్నా నెగటివ్ అర్థాన్నిస్తాయి. ‘ఊపిరి పీల్చడానికి కూడా సమయం లేనంతగా’, ‘తీవ్రమైన పని ఒత్తిడి’ అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడతారు. They made him work so hard that he scarcely had time to breathe అంటే ‘వారు అతడికి ఊపిరి పీల్చుకోలేనంత పని కల్పించారు’ అని అర్థం. నిరంతరం పనిలో నిమగ్నమయ్యే విషయం తెలియజేయడానికి తేనెటీగ, చీమను ఉదహరిస్తారు. దీనికి సమానార్థం ఇచ్చే ప్రయోగంగా అట busy as a bee ని చెప్పుకోవచ్చు. - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి email: vschary@gmail.com -
జాతీయాలు: గో ఫర్ ది జగ్యు లర్
Go for the jugular అర్థం: Go for the jugular = To attack someone the most. వాక్య ప్రయోగం: When the polit- ician began to have problems, the other politici- ans decided to go for the jugular and attack. సమస్యలు ఎదురవడం మొదలవగానే ఆ నాయకుడిపై మిగతా రాజకీయ నాయకులు తీవ్రంగా దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. వివరణ: మనిషి మెడభాగంలో Jugular(జగ్యు లర్) అనే పెద్ద సిర రక్తాన్ని గుండెకు చేరవే స్తుంది. దీన్ని ‘గళసిర’ అంటారు. దీన్ని తీవ్రంగా గాయపరిస్తే ఆ వ్యక్తి ప్రాణం కోల్పోతాడు. ఎవరినైనా తీవ్రంగా గాయప రిచిన, నష్టపరిచిన సందర్భాల్లో ఈ జాతీ యాన్ని వాడతారు. ఇది క్రీ.శ. 1590 లో పుట్టింది. ‘తీవ్రంగా దాడి చేయు’, ‘కోలుకో లేనంతగా నష్టపరచు’ అనే అర్థాలతో ఈ జాతీయాన్ని వాడతారు. He is apolitician known as someone who goes for the jugularof his opponentఅంటే ‘అతడు ప్రత్యర్థిని కోలుకోలేనంతగా దెబ్బతీస్తాడన్న పేరున్న రాజకీయ నాయకుడు’ అని అర్థం. - డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి email: vschary@gmail.com