ఎడ్యుకేషన్ & జాబ్స్ | Education & Jobs | Sakshi
Sakshi News home page

ఎడ్యుకేషన్ & జాబ్స్

Published Tue, Sep 15 2015 1:15 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Education & Jobs

ఒడిశా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
ఒడిశా రాష్ర్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పోస్టుల వివరాలు.. సీనియర్ మెటర్నల్ హెల్త్ మేనేజర్(టెక్నికల్), నర్‌‌స(ట్రైనర్), హాస్పిటల్ మేనేజర్, లాజిస్టిక్ మేనేజర్, ఆర్‌ఎంఎన్‌సీహెచ్‌ఏ కౌన్సిలర్. పోస్టులను బట్టి అర్హతలుంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది సెప్టెంబర్ 23. వివరాలు www.nrhmorissa.gov.in చూడొచ్చు.
 
సీడబ్ల్యూసీలో అసిస్టెంట్ గ్రేడ్‌లు
సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ).. అసిస్టెంట్ గ్రేడ్-2(ఖాళీలు-22) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి నిమిషానికి 30 పదాలు టైపింగ్ చేయగలగాలి. నిర్దేశిత నమూనాలో పూర్తి చేసిన దరఖాస్తులను ‘ ద రీజనల్ మేనేజర్ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, రీజనల్ ఆఫీస్, బే నం.35-38, సెక్టార్ 4, పంచకుల-134112’కు పంపాలి. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 12. వివరాలకు http://cewacor.nic.in చూడొచ్చు.
 
యూపీఎస్సీ ఉద్యోగాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)..వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఉద్యోగ వివరాలు.. రీజనల్ డైరక్టర్, టెక్నికల్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రేడ్-2, అసిస్టెంట్ డైరక్టర్, మైన్‌‌స రీజనల్ కంట్రోలర్, సూపరింటెండెంట్లు, ప్రొఫెసర్లు. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 1. వివరాలకు  www.upsc.gov.in చూడొచ్చు.
 
ఇండియన్ కోస్ట్ గార్‌‌డ ఉద్యోగాలు
ఇండియన్ కోస్ట్‌గార్‌‌డ.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. అసిస్టెంట్ కమాండెంట్, జనరల్ డ్యూటీ ఆఫీసర్లు, లా ఆఫీసర్లు, పైలట్లు, ఇంజనీర్లు.  ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది సెప్టెంబర్ 17, లా పోస్టులకు చివరి తేది సెప్టెంబర్ 22. అర్హతలు, శారీరక ప్రమాణాలు తదితర వివరాలకు www. joinindiancoastguard.gov.in చూడొచ్చు.
 
ఎంఏఎన్‌ఐటీలో వివిధ పోస్టులు
మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఏఎన్‌ఐటీ) -భోపాల్.. వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతుంది. వివరాలు.. రిజిస్ట్రార్, డిప్యూటీ రిజి స్ట్రార్, లైబ్రేరియన్, డిప్యూటీ ైలైబ్రేరియన్, టెక్నికల్ ఆఫీసర్లు, జూనియర్ ఇంజనీర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, వర్‌‌క అసిస్టెంట్లు. నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తును ‘ద అసిస్టెంట్ రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్ సెల్), మౌలానా అజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మాతా మందిర్(దగ్గర), లింక్ రోడ్ నెం.3, భోపాల్-462003, మధ్యప్రదేశ్’కు పంపాలి. చివరి తేది అక్టోబర్ 30. అర్హతలు, దరఖాస్తు వివరాలకు  www.manit.ac.in చూడొచ్చు.
 
రిమ్స్‌లో స్టాఫ్ నర్సులు
రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (రిమ్స్)-ఇంఫాల్.. స్టాఫ్ నర్‌‌స (ఖాళీలు -116) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పీయూసీ/ హెచ్‌ఎస్‌ఎస్‌ఎల్‌సీతో పాటు జనరల్ నర్సింగ్‌లో డిప్లొమా పూర్తి చేసినవారు అర్హులు. ఆన్‌లైన్ నుంచి దర ఖాస్తును డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిచేసి నిర్దేశిత చిరునామాకు పంపాలి. దరఖాస్తులకు చివరి తేది సెప్టెంబర్ 29. వివరాలకు www.rims.edu.in చూడొచ్చు.
 
ఐఐసీటీలో సైంటిస్టులు
హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్‌‌చ(సీఎస్‌ఐ ఆర్)కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఖాళీల వివరాలు.. సైంటిస్టులు, సీనియర్ సైంటిస్టులు-16, ప్రిన్సిపల్, సీనియర్ సైంటిస్టులు-04. దరఖాస్తులను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేది అక్టోబర్ 10. వివరాలకు www.iictindia.org చూడొచ్చు.
 
డైట్ ప్రవేశాల నిబంధనలు తెలంగాణకు వర్తింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్, ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టేందుకు 2013లో జారీ చేసిన నిబంధనలను ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి వర్తింపజేసింది. ఈ మేరకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్.ఆర్.ఆచార్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల్లో ఏపీ పేరు ఉన్న స్థానంలో తెలంగాణ పదాన్ని చేర్చుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు 2014 జూన్ 2 నుంచే వర్తిస్తాయని తెలిపారు.
 
అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకు డీపీసీ

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పరీక్షల విభాగంలో అసిస్టెంట్ కమిషనర్ (మొదటి స్థాయి గెజిటెడ్ అధికారి) పోస్టుల్లో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించేందుకు డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీని (డీపీసీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పాఠశాల విద్యా డెరైక్టర్ చైర్మన్‌గా, పరీక్షల విభాగం డెరైక్టర్ కన్వీనర్‌గా, పరీక్షల విభాగం డిప్యూటీ/జాయింట్/అడిషనల్ కార్యదర్శి సభ్యులుగా వ్యవహరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement