ఈసీఐఎల్‌లో వివిధ పోస్టులు
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్).. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. వివరాలు.. సైంటిఫిక్ అసిస్టెంట్-ఏ (ఖాళీలు-3), జూనియర్ ఆర్టిసన్ (ఖాళీలు-1), టెక్నికల్ ఆఫీసర్ (ఖాళీలు-6). ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 2, 7, 17. వివరాలకు www.ecil.co.in చూడొచ్చు.
కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక.. వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 28. వివరాలకు www.cuk.ac.in చూడొచ్చు.
రాజీవ్‌గాంధీ ఆక్వాకల్చర్ సెంటర్‌లో వివిధ పోస్టులు
రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చర్ (ఆర్‌జీసీఏ).. వివిధ విభాగాల్లో రెగ్యులర్/ కాంట్రాక్ట్/ డిప్యుటేషన్ ప్రాతిపదికన 36 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఇంటర్వ్యూ తేదీలు నవంబర్ 17, 18, 19. వివరాలకు www.rgca.org.in చూడొచ్చు.
ఫుడ్ టెక్నాలజీ సంస్థలో బోధనేతర సిబ్బంది
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్.. ల్యాబ్ ఇన్‌చార్‌జ (ఖాళీలు-2), ల్యాబ్ టెక్నీషియన్ (ఖాళీలు-5) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 27. వివరాలకు www.niftem.ac.in చూడొచ్చు.
భువనేశ్వర్ ఐఐటీలో నాన్ టీచింగ్ పోస్టులు
భువనేశ్వర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 7. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది నవంబర్ 30. వివరాలకు www.iitbbs.ac.in చూడొచ్చు.
మైసూర్ పేపర్ మిల్స్‌లో కన్సల్టెంట్లు
ద మైసూర్ పేపర్ మిల్స్ లిమిటెడ్ (ఎంపీఎం).. వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 4. వయసు 26 ఏళ్లకు మించకూడదు. దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 30. వివరాలకు www.mpm.co.in చూడొచ్చు.
భారత నావికాదళంలో సర్వీస్ కమిషన్ ఆఫీసర్లు
ఇండియన్ నేవీ.. పర్మనెంట్, షార్‌ట సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి అవివాహిత పురుషులు/స్త్రీల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వయసు 25 ఏళ్లకు మించకూడదు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది 24. వివరాలకు www.joinindiannavy.gov.in చూడొచ్చు.
అలరిస్తున్న టెక్నోజియూన్
కాజీపేట రూరల్: వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో జరుగుతున్న టెక్నోజియూన్-15 సంబురాలు అలరిస్తున్నారుు. ఈ మేరకు రెండో రోజు శనివారం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు రోబో ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు. కాగా, సాయంత్రం వేళలో ఆటపాటలతో సందడి చేశారు. మధ్యాహ్నం వేళలో వెబ్‌నార్ ద్వారా ఇన్నో వెంటర్ ఆఫ్ ఈ-మెరుుల్ అండ్ సిస్టమ్స్ సైంటిఫిక్ డాక్టర్ శివ అయ్యదురై విద్యార్థులతో మాట్లాడారు. కాగా, ఆదివారం టెక్నోజియూన్ ముగియనున్నట్లు నిట్ అధికారులు తెలిపారు.
ఉద్యోగ సమాచారం
Published Sun, Nov 1 2015 4:43 AM | Last Updated on Sun, Sep 3 2017 11:47 AM
Advertisement
Advertisement