ఉన్నత విద్యకు పీజీ మార్గాలెన్నో...
ఉన్నత విద్యకు పీజీ మార్గాలెన్నో...
Published Wed, Apr 9 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM
డిగ్రీ తర్వాత విద్యా పరంగా ఎన్నో కోర్సులు.. మరెన్నో అవకాశాలు.. ఆయా అవకాశాలను యుక్తితో అందుకోవడం ద్వారా కెరీర్ ప్రస్థానాన్ని విజయవంతం చేసుకోవచ్చు.. అందుకు చక్కని వేదికలు.. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సులు.. ఇవి డిగ్రీలో చదివిన సబ్జెక్ట్‌లో సంపూర్ణ అవగాహనను పెంచుకోవడంతోపాటు.. సదరు అంశంలో నిష్ణాతులుగా రూపొందడానికి
తోడ్పాటునందిస్తాయి.. రాష్ట్రంలోని ప్రముఖ యూనివర్సిటీలు వచ్చే విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్లు విడుదల చేశాయి.. వీటిలో విజయం సాధించడం ద్వారా మేధో వికాసానికి వేదికలుగా నిలిచే వర్సిటీ క్యాంపస్ కాలేజీల్లో అడుగుపెట్టడంతోపాటు.. చక్కని భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చు.. ఈ నేపథ్యంలో ఆయా నోటిఫికేషన్ల వివరాలు..
గతంలో మాదిరిగా కేవలం సంప్రదాయ సబ్జెక్ట్‌లకే పరిమితం కాకుండా.. జాబ్ మార్కెట్ డిమాండ్, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను అందించే ఎన్నో నూతన స్పెషలైజేషన్స్‌తో కూడిన కోర్సులను వివిధ యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో ప్రవేశం పొందడం ద్వారా కెరీర్‌లో త్వరగా స్థిరపడొచ్చు. అంతేకాకుండా కొన్ని యూనివర్సిటీలు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను కూడా అందిస్తున్నాయి. పీజీ కోర్సులకు అర్హత: సంబంధిత అనుబంధ కోర్సుల్లో డిగ్రీ. ఇంటిగ్రేటెడ్ కోర్సులకు: ఇంటర్మీడియెట్/డిగ్రీ.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
వివిధ విభాగాల్లో ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడీ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్,
ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ టెక్.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:ఏప్రిల్ 28,2014
దరఖాస్తుల అప్‌లోడ్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 30, 2014
పింట్ అవుట్ కాపీల స్వీకరణకు చివరి తేదీ:
మే 3, 2014 పవేశ పరీక్షలు: మే 24 నుంచి 31 వరకు
వివరాలకు: : http://svudoa.sssolutions.co.in
ఆదికవి నన్నయ యూనివర్సిటీ-రాజమండ్రి
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
ఎంఎస్సీ (బోటనీ, కెమిస్ట్రీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జియాలజీ-పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్). ఎంఏ (తెలుగు, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హిస్టరీ, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సోషల్ వర్క్).
దరఖాస్తు విధానం:వెబ్‌సైట్ నుంచి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకోవాలి.
రాత పరీక్షలు ప్రారంభం: మే 5, 2014.
వివరాలకు: www.nannayauniversity.info
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ-అనంతపురం
ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంఏ (ఎకనామిక్స్, సోషియాలజీ, అప్లయిడ్ ఎకనామిక్స్, అడల్ట్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ, తెలుగు), ఎంఎస్‌డబ్ల్యూ, ఎంఎస్సీ (స్టాటిస్టిక్స్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, అప్లయిడ్ మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెరికల్చర్, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, జాగ్రఫి, జియాలజీ), ఎంకామ్, ఎంఈడీ, ఎంపీఈడీ.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 22, 2014
రాత పరీక్షలు: మే 19 నుంచి 29 వరకు
వివరాలకు: www.skupgcet.org
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
ఆంధ్రా యూనివర్సిటీ ప్రవేశాల కోసం ఏయూసెట్, ఏయూఈఈటీ అనే రెండు రకాల పరీక్షలను నిర్వహిస్తుంది.
ఏయూసెట్ ద్వారా ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంజేఎంసీ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంపీఈడీ, ఎంఈడీ, ఎంటెక్, ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్-జియాలజీ, ఎంఏ ఇంటిగ్రేటెడ్-ఎకనామిక్స్. ఏయూఈఈటీ ద్వారా ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు: బీటెక్+ఎంటెక్/ఎంబీఏ (సీఎస్‌ఎస్‌ఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ నెట్‌వర్కింగ్, సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ), ట్విన్నింగ్ ప్రోగ్రాములు (బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీర్-ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రో మెకానికల్/కెమికల్/ఎలక్ట్రానిక్స్).
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 15, 2014
రూ. 1000 లేట్ ఫీజుతో దరఖాస్తుకు చివరి తేదీ:
ఏప్రిల్ 22, 2014
వివరాలకు: www.audoa.in
కాకతీయ యూనివర్సిటీ-వరంగల్
ఆఫర్ చేస్తున్న కోర్సులు: ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంటీఎం, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా ఇన్ సెరికల్చర్/క్లినికల్ బయోకెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (కెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ), ఎంఎస్సీ (నానో సైన్స్/ నానోటెక్నాలజీ) దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 16, 2014 (రూ. 500 లేట్ ఫీజుతో ఏప్రిల్ 22, రూ.1000 లేట్ ఫీజుతో ఏప్రిల్ 26)
రాత పరీక్షలు ప్రారంభం: మే 2 నుంచి
వివరాలకు: www.kakatiya.ac.in
యోగివేమన యూనివర్సిటీ-కడప
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ(బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్స్)
పీజీ డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్
ఎంఎస్సీ (బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, బోటనీ-ప్లాంట్‌సైన్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జెనెటిక్స్ అండ్ జెనోమిక్స్, మైక్రోబయాలజీ, ఫిజిక్స్, మెటీరియల్ సైన్స్ అండ్ నానోటెక్నాలజీ, మ్యాథమెటిక్స్, జియాలజీ, సైకాలజీ, జువాలజీ-యానిమల్ సైన్స్). ఎంకామ్, ఎంఈడీ, ఎంఏ (తెలుగు, ఎకన మిక్స్, ఇంగ్లిష్, హిస్టరీ అండ్ ఆర్కియాలజీ, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్), ఎంపీఈడీ, ఎంసీజే క మ్యూనికేషన్ అండ్ జర్నలిజం.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 25, 2014
రూ.500 లేట్ ఫీజుతో రిజిస్ట్రేషన్:ఏప్రిల్ 26-మే 3, 2014 (దరఖాస్తుల అప్‌లోడ్‌కు చివరి తేదీ: మే 8)
వివరాలకు: www.yogivemanauniversity.ac.in
ఓయూ సెట్-2014
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
ఉస్మానియా యూనివర్సిటీతోపాటు తెలంగాణ, మహాత్మగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల్లో వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశం.
వివిధ కోర్సుల్లో కలిపి మొత్తం సీట్ల సంఖ్య: 18,625
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ ఫీజును ఏపీఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్, డిబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 9, 2014.
రూ.250 అపరాధ రుసుముతో: మే 16, 2014
ప్రవేశ పరీక్షలు: మే 30 నుంచి ప్రారంభం
వివరాలకు: www.ouadmission.com
www.osmania.ac.in
కృష్ణా యూనివర్సిటీ
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
ఎంఏ, ఎంఎస్సీ, పీజీ డిప్లొమా ఇన్ ఈ-బ్యాంకింగ్, ఎంఈడీ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంకామ్.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 18, 2014
రూ. 500 అపరాధ రుసుంతో: ఏప్రిల్ 20, 2014
రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ 25, 2014
వివరాలకు: www.krishnauniversity.ac.in
విజయం ఇలా
అన్ని యూనివర్సిటీలు రాత పరీక్ష ఆధారంగానే ప్రవేశం కల్పిస్తున్నాయి.
అధిక శాతం యూనివర్సిటీలు రాత పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తాయి.
ఆయా యూనివర్సిటీలను బట్టి రాత పరీక్ష సిలబస్‌లో వ్యత్యాసం ఉంటుంది.
ఆయా పరీక్షల్లో అడిగే ప్రశ్నలు డిగ్రీ సిలబస్ ఆధారంగానే ఉంటాయి.
కొన్ని ప్రశ్నలు అవగాహనను పరీక్షించే విధంగా ఆప్లికేషన్ మెథడ్‌లో ఉంటే మరికొన్ని జ్ఞాపకశక్త్తిని పరీక్షించేలా ఉంటాయి.
ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించిన అకడమిక్ పుస్తకాలను రిఫర్ చేయడం మంచిది. గత ప్రశ్నపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాథమెటిక్స్, సెన్సైస్ విద్యార్థులు సూత్రాలు, సిద్ధాంతాలు, కెమికల్ ఈక్వేషన్స్‌ను ఎక్కువగా గుర్తుంచుకోవాలి. మిగతా విద్యార్థులు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి ముఖ్యాంశాలను చదవాలి.
డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాసి ఉంటారు కాబట్టి డిగ్రీ మొదటి, రెండో సంవత్సరం అంశాలపై అధికంగా దృష్టి సారించాలి.
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం-తిరుపతి
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
ఎంఎస్సీ(అప్లయిడ్ మ్యాథమెటిక్స్, అప్లయిడ్ మైక్రోబయాలజీ, మైక్రోబియల్ టెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ బయోటెక్నాలజీ, బోటనీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్). ఎంఏ (ఎకనామిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ అండ్ ట్రాన్స్‌లేషన్, ఉమెన్స్ స్టడీస్, పబ్లిక్ రిలేషన్స్). ఎంఏ-మ్యూజిక్, బీఈడీ-స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంసీజే, ఎంఈడీ-స్పెషల్ ఎడ్యుకేషన్, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంపీఈడీ, ఎంకామ్.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 10, 2014
రాత పరీక్ష: మే 25, 2014
వివరాలకు:
రాయలసీమ యూనివర్సిటీ
ఆఫర్ చేస్తున్న కోర్సులు:
ఎంఎస్సీ(బోటనీ, కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, జువాలజీ, ఓఆర్ అండ్ ఎస్‌క్యూసీ-స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ), ఎంఏ(తెలుగు, ఇంగ్లిష్, ఎకనమిక్స్), ఎంకామ్, ఎంఈడీ.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 21, 2014
రూ. 500 అపరాధ రుసుంతో రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఏప్రిల్ 22 నుంచి 25 వరకు,
దరఖాస్తు అప్‌లోడ్‌కు చివరి తేదీ:
ఏప్రిల్ 29, 2014
వివరాలకు:
www.rayalaseemauniversity.ac.in
Advertisement
Advertisement