ఆంధ్రుల చరిత్ర.. మాదిరి ప్రశ్నలు | History of Andhra pradesh: Model Paper Questions | Sakshi
Sakshi News home page

ఆంధ్రుల చరిత్ర.. మాదిరి ప్రశ్నలు

Published Sat, Apr 5 2014 7:27 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

History of Andhra pradesh: Model Paper Questions

1.    ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచయిత ఎవరు?
      సురవరం ప్రతాపరెడ్డి    


 2.    ‘హరిశ్చంద్రోపాఖ్యానం’ను శంకరకవి  ఏ భాషలో రచించాడు?
      తెలుగు


 3.    కుతుబ్‌షాహీల రాజభాష ఏది?
      పారశీకం


 4.    ఏ గోల్కొండ నవాబును కవులు తమ రచనల్లో ఇభరాముడని కీర్తించారు?
      ఇబ్రహీం కుతుబ్‌షా (మూడో నవాబు)


 5.    ‘సుగ్రీవ విజయం’ యక్షగాన నాటకం తెలుగుభాషలో మొదటిది. దాని రచయిత ఎవరు?
      కందుకూరి రుద్రకవి


 6.    ‘నిరంకుశోపాఖ్యానం’ అనే శృంగార కావ్యాన్ని తెలుగుభాషలో ఎవరు రచించారు?
      కందుకూరి రుద్రకవి


 7.    పొన్నగంటి తెలగనార్యుడు ‘యయాతి చరిత్ర’ అనే అచ్చతెలుగు కావ్యాన్ని  ఎవరికి అంకితమిచ్చాడు?
      గోల్కొండ తరఫీదార్ అమీన్‌ఖాన్


 8.    మహ్మద్ కులీ కుతుబ్‌షా గోల్కొండ పాలకుల్లో ఎన్నో సుల్తాన్?
      ఐదు


 9.    ‘వైజయంతీ విలాసం’ అనే శృంగార కావ్యాన్ని రచించిన సారంగు తమ్మయ్య ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
      మహ్మద్ కులీ కుతుబ్‌షా


 10.    ప్రసిద్ధ పదకర్త, మువ్వగోపాల పదాలు రచయిత క్షేత్రయ్య ఏ కుతుబ్‌షాహీ పాలకుడికి సమకాలీకుడు?
      అబ్దుల్లా కుతుబ్‌షా


 11.    దాశరథీ శతకం రచయిత?
      కంచర్ల గోపన్న


 12.    కూచిపూడి (కృష్ణా జిల్లా) నాట్యాచార్యుల  సేవలకు గుర్తింపుగా ఏ గోల్కొండ నవాబు   ‘కూచిపూడి’ గ్రామాన్ని అగ్రహారంగా దానం చేశాడు?
      అబుల్ హసన్ తానీషా


 13.    మూసీ నదిపై  పురానాపూల్ (వంతెన)ను క్రీ.శ. 1578లో  ఏ గోల్కొండ నవాబు నిర్మించాడు?
      ఇబ్రహీం కుతుబ్‌షా


 14.    మహ్మద్ కులీ కుతుబ్‌షా చార్మినార్‌ని  ఎప్పుడు నిర్మించాడు?
      క్రీ.శ. 1591లో


 15.    దక్షిణ భారతదేశంలోనే అతిపెద్దదైన మక్కా మసీదును హైదరాబాద్‌లో  ఏ గోల్కొండ నవాబు నిర్మించాడు?
      మహ్మద్ కుతుబ్‌షా


 16.    తొలి ఉర్దూ గ్రంథంగా పేరు పొందిన ‘కుల్లియత్’ను ఎవరు రచించారు?
      మహ్మద్ కులీ కుతుబ్‌షా


 17.    గోల్కొండ సుల్తాన్‌లలో చివరి నవాబు?
      అబుల్ హసన్ తానీషా


 18.    గోల్కొండను స్వాధీనం చేసుకోవడానికి 1687లో మొగలు చక్రవర్తి ఔరంగజేబుకు ఎన్ని నెలల కాలం పట్టింది?
      8 నెలలు


 19.    కుతుబ్‌షాహీ - గోల్కొండ రాజ్యస్థాపకుడు?  
      సుల్తాన్ కుతుబ్ - ఉల్- ముల్క్


 20.    కైఫీయతులు అంటే ఏమిటి?
      స్థానిక కథనాలు


 21.    కుతుబ్‌షాహీలు ఏ మహ్మదీయ శాఖకు చెందినవారు?
      షియా మతస్థులు    


 22.    మజ్లిస్ - దివాన్ దరి - మజ్లిస్ - ఇ - కింగాష్‌లు దేన్ని సూచిస్తాయి?
      సుల్తాన్‌కు సలహాలు ఇవ్వడానికి  ఏర్పాటు చేసిన పండిత పరిషత్తులు


 23.    పీష్వా, దివాన్ పదాలు దేన్ని సూచిస్తాయి?
      ప్రధానమంత్రి పదవి    


 24. గోల్కొండ చివరి సుల్తాన్ అబుల్ హసన్ తానీషా ప్రధాన మంత్రి ఎవరు?
      మాదన్న    


 25.    అబుల్‌హసన్ తానీషా సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు?
      అక్కన్న    


 26.    మీర్ జుమ్లా అంటే ఎవరు?
      మంత్రి (ఆర్థిక - రెవెన్యూ శాఖల అధిపతి)     


 27.    కుతుబ్‌షాహీల కాలంలో మజుందార్ అంటే ఎవరు?
      గణాంకాధికారి    


 28.    కుతుబ్‌షాహీల తరఫీలు (రాష్ట్రాలకు) అధిపతి ఎవరు?
      తరఫీదార్ (గవర్నర్)    


 29.    కొత్వాల్ అంటే ఎవరు?
      రక్షక భటాధికారి    


 30.    కుతుబ్‌షాహీల  పాలనలో ప్రధాన రేవు అధికారిని  ఏమని పిలిచేవారు?
      షా బందర్    


 31.    గోల్కొండ రాజ్యంలో గ్రామ వ్యవహారా లను ఎవరు నిర్వహించేవారు?
      బారా బలవంతులు (పన్నిద్ధరు ఆయగాండ్రు)  

 
 32.    గోల్కొండ సైన్యం  ఎవరి పర్యవేక్షణలో ఉండేది?
      ఐనుల్ ముల్క్    


 33.    క్రీ.శ. 1687లో ఔరంగజేబు కాలంలో గోల్కొండ కోటను ముట్టడించారు. అప్పటి కుతుబ్‌షాహీ చివరి సుల్తాన్ అబుల్ హసన్ తానీషా సైన్యాధ్యక్షుడు?
      అబ్దుల్ రజాక్ లారీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement