ఆర్‌బీఐ అసిస్టెంట్స్ పోస్టుల పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ).. అసిస్టెంట్స్ పోస్టుల పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
- ఫాతిమా బేగం, రాజేంద్రనగర్
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: ఆర్‌బీఐ అసిస్టెంట్స్ పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానాలకు 1/4 వంతు మార్కుల కోత ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీని ముఖ్యంగా మూడు విభాగాలుగా విభజించవచ్చు. అవి.. అర్థమెటిక్, డేటా అనాలిసిస్, టాపిక్ వైజ్ ప్రాబ్లమ్స్. వేగం, కచ్చితత్వం, సమయపాలన ఉంటే న్యూమరికల్ ఎబిలిటీలో ఎక్కువ మార్కులు సాధించొచ్చు. ఈ మూడింటిలో నైపుణ్యం సాధించాలంటే వీలైనన్ని పాత, మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ప్రధానంగా సింప్లిఫికేషన్స్ మీద అభ్యర్థులు దృష్టి సారించాలి. అంటే బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్, స్క్వేర్స్, స్క్వేర్‌రూట్స్, క్యూబ్స్, క్యూబిక్ రూట్స్‌తోపాటు కొన్ని సూత్రాలను కంఠస్తం చేయాలి. టాపిక్ వైజ్ ప్రాబ్లమ్స్‌లో నైపుణ్యం సాధించడానికి మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయడంతోపాటు ప్రశ్నను సాధించడానికి కావాల్సిన అవగాహనను పెంపొందించుకోవాలి. లాజిక్+కాలిక్యులేషన్ = సొల్యూషన్ అనే విధంగా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్కులు సాధించొచ్చు. అభ్యర్థులు ముఖ్యంగా కాలిక్యులేషన్ పరంగా చాలా ప్రశ్నలకు తప్పు సమాధానాలను గుర్తిస్తున్నారు. కాబట్టి కాలిక్యులేషన్స్‌పై ఎక్కువ దృష్టి సారించాలి. ప్రశ్నల్లోని వ్యాల్యూస్, కండీషన్స్ మారొచ్చు. కానీ, ప్రశ్న కాన్సెప్ట్ మారదు.
ఇంటర్‌నెట్‌లో మాదిరి ప్రశ్నపత్రాలు ఎన్నో లభిస్తున్నాయి. వీటిని వీలైనంత ఎక్కువ సాధన చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు. www.sakshieducation.com లో బ్యాంక్స్ మాక్, ఆన్‌లైన్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించుకోవచ్చు. పరీక్ష ఆన్‌లైన్‌లో కాబట్టి.. మాక్ టెస్టులను సాధన చేస్తే వేగం అలవడి నిర్దేశిత టైమ్‌లోగా సమాధానాలు గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
డేటా ఎనాలిసిస్‌లో పట్టిక, వెన్ డయాగ్రమ్, గ్రాఫ్, పై చార్ట్, బార్ గ్రాఫ్‌ల నుంచి ఒకటి లేదా రెండు డయాగ్రమ్స్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నారు. దీనివల్ల ప్రశ్నలు సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకుని సమాధానం గుర్తించాల్సి ఉంటుంది.
శాతాలు, బారువడ్డీ, చక్రవడ్డీ, నిష్పత్తులు, లాభనష్టాలు, భాగస్వామ్యం, వైశాల్యాలు, ఘన పరిమాణాలు, కాలం -పని, కాలం - దూరం వంటివాటిపై ప్రశ్నలు అడుగుతారు. ఈ అంశాలన్నింటినీ సాధన చేయాలి. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స్ పాఠ్య పుస్తకాల్లో ఈ అంశాలను ప్రాక్టీస్ చేస్తే అధిక మార్కులు సాధించొచ్చు. మిగిలిన విభాగాలకు కేటాయించిన సమయం పోగా దాదాపు 35 నుంచి 40 నిమిషాల సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. కష్టమైన ప్రశ్నలకు సమాధానం రాకపోతే వదిలేయాలి. వీటినే చేస్తూ కూర్చొంటే సమయం హరించుకుపోతుంది.
- ఇన్‌పుట్స్: ఈ.సంతోష్‌రెడ్డి,
సీనియర్ ఫ్యాకల్టీ
జనరల్ నాలెడ్‌జ: జాతీయ గేయం (వందేమాతరం)
- 1950, జనవరి 24న జాతీయ గేయంగా వందేమాతరంను ఆమోదించారు. దీన్ని బంకించంద్ర ఛటర్జీ 1882లో రచించిన ఆనంద్‌మఠ్ నవల నుంచి స్వీకరించారు.
1896 కలకత్తాలో జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో తొలిసారిగా ఆలపించారు. గ ఈ గేయాన్ని ‘అరబిందో ఘోష్’ ఆంగ్లంలోకి అనువదించారు.
జాతీయ జంతువు (పెద్దపులి)
భారత ప్రభుత్వం పెద్దపులిని (రాయల్‌బెంగాల్ టైగర్) జాతీయ జంతువుగా 1972లో గుర్తించింది.
పెద్దపులి శాస్త్రీయ నామం ‘ఫాంథారా టైగ్రిస్’ - 1972కు ముందు ‘సింహం మన జాతీయ జంతువుగా ఉండేది.
- 1973 నుంచి ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించి పులుల సంరక్షణ చేపట్టారు.
అంతరిక్ష రంగంలో మైలురాళ్లు
- మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు-వాలెంటీనా తెరిష్కోవా, రష్యా (1968) ఒ అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు-అలెక్సియే లినో, రష్యా (1965)
- అంతరిక్షంలో నడిచిన తొలి మహిళ-స్వెత్లానా సవిత్సకయా
- అంతరిక్షంలో నడిచిన మొదటి అమెరికా వాసి-ఎడ్వర్‌డ హెచ్‌వైట్ (1965) ఒ చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి మానవులు-నీల్ ఆర్‌మస్ట్రాంగ్ (అమెరికా), ఎడ్విన్ ఇ. ఆలిడ్రిన్ (1969, జూలై, 20, అపోలో - 11 అనే అంతరిక్ష నౌక ద్వారా) ఒ మొదటి అమెరికన్ అంతరిక్ష యాత్రికురాలు-షాలి కె రైడ్ (1983, ఛాలెంజర్ నౌక ద్వారా) ఒ అంతరిక్షయానం చేసిన మొదటి భారతీయుడు- రాకేశ్ శర్మ (1984, ఏప్రిల్ 3, సోయజ్ - టి11 నౌక ద్వారా) ఒ మొదటి భారత సంతతి మహిళా వ్యోమగామి-కల్పనాచావ్లా (1997, కొలంబియా నౌక ద్వారా) ఒ రెండో భారత సంతతి మహిళా వ్యోమగామి-సునీతా విలియమ్స్ (2006, డిసెంబర్ 9)
ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)
ప్రధాన కార్యాలయం: జెనీవా (స్విట్జర్లాండ్)
ప్రారంభం: 1995, జనవరి 1
సభ్య దేశాలు: 153
ప్రధాన లక్ష్యాలు: ప్రపంచదేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 1948లో GATT (General Agreement on Tariff and Trade) ఏర్పడింది.
- 1995, జనవరి 1న ఎఅఖీఖీ స్థానంలో డబ్ల్యూటీఓను ఏర్పాటు చేశారు.
- డబ్ల్యూటీఓ ఇప్పటివరకు తొమ్మిది సమావేశాలు నిర్వహించింది. (1995-సింగపూర్, 1998 - జెనీవా, 1999-సియాటెల్, 2001- దోహా, 2003-కాన్‌కున్ (మెక్సికో), 2005-హాంకాంగ్‌లు ముఖ్యమైనవి)