cut off marks
-
MBBS: ‘బీ’ కేటగిరీ సీట్లకు తగ్గిన కటాఫ్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో బీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్లలో 85 శాతం కోటా రాష్ట్ర విద్యార్థులకే ఇవ్వడంతో నీట్లో పొందిన మార్కుల కటాఫ్ తగ్గినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. గతేడాది కంటే కటాఫ్ తగ్గడం వల్ల, ఈసారి కొత్తగా వెయ్యి మంది రాష్ట్ర విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినట్లు చెబుతున్నారు. గతేడాది ఒక ప్రైవేట్ కాలేజీలో చివరి బీ కేటగిరీ సీటు 399 మార్కుల వరకు కటాఫ్ వచ్చిన విద్యార్థికి వచ్చింది. ఇప్పుడు ఇంకా రెండు దశలున్నప్పటికీ మొదటి విడత బీ కేటగిరీ సీట్లలో ఒక ప్రైవేట్ కాలేజీలో 309 మార్కులు వచ్చిన విద్యార్థికి కూడా సీటు వచ్చిందని వర్సిటీ వర్గాలు చెప్పాయి. గతేడాది చివరి కౌన్సెలింగ్ నాటి పరిస్థితితో పోలిస్తే, ఇప్పుడు మొదటి విడత సీట్ల భర్తీలోనే కటాఫ్ తగ్గిందన్నాయి. ఈసారి 290 మార్కులొచ్చిన వారికీ బీ కేటగిరీలో సీటు వచ్చే అవకాశముందని అంచనా వేస్తున్నారు. 287 మార్కులొచ్చిన ముస్లిం విద్యార్థినికి మైనారిటీ కాలేజీలో బీ కేటగిరీలో సీటు వచ్చింది. ముస్లిం విద్యార్థులకు కూడా తాజా రిజర్వేషన్ల వల్ల న్యాయం జరిగిందని చెబుతున్నారు. గతేడాది 6,500 మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు బీ కేటగిరీ సీట్లకు దరఖాస్తు చేసుకోగా, ఈసారి రెండు వేల వరకు మాత్రమే వచ్చినట్లు అంచనా. ఇతర రాష్ట్రాలకు తగ్గిన వలసలు ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో బీ కేటగిరీలోని 35 శాతం సీట్లలో 85 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే దక్కేలా వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల అడ్మిషన్ల నిబంధనలు సవరించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని మొత్తం 24 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 1,068 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా తెలంగాణ విద్యార్థులకే లభిస్తున్నాయి. రాష్ట్రంలో 20 నాన్ మైనార్టీ కాలేజీల్లో 3,200 సీట్లు ఉండగా ఇందులో బీ కేటగిరీ కింద 1,120 సీట్లు ఉన్నాయి. ఇప్పటివరకు వీటికి అన్ని రాష్ట్రాల విద్యార్థులు అర్హులుగా ఉన్నారు. తాజా సవరణతో బీ కేటగిరీలోని 85 శాతం సీట్లు అంటే 952 సీట్లు ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థుల కోసం కేటాయిస్తారు. మిగతా 15 శాతం సీట్ల(168)కు మాత్రమే ఓపెన్ కోటాలో ఇతర రాష్ట్ర విద్యార్థులు పోటీ పడతారు. ఓపెన్ కోటా కాబట్టి ఇందులో తెలంగాణ విద్యార్థులకూ అవకాశం ఉంటుంది. అలాగే 4 మైనార్టీ కాలేజీల్లో 25 శాతం బీ కేటగిరీ కింద ఇప్పటివరకు 137 సీట్లు ఉన్నాయి. తాజా సవరణతో ఇందులోనూ 85 శాతం అంటే 116 సీట్లు ఇక్కడి వారికే దక్కుతున్నాయి. ఇప్పటివరకు లోకల్ కోటా లేకపోవడంతో ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఎక్కువగా ఇక్కడి కాలేజీల్లో చేరేవారు. తద్వారా తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగేది. మన విద్యార్థులు ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడి విద్యార్థులకు సీటు రావడంతోపాటు తక్కువ మార్కులొచ్చిన వారూ సీట్లు పొందే వెసులుబాటు వచ్చింది. మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఓపెన్ కోటా విధానమే లేదు. గతేడాది నుంచి అన్ని సీట్లు ఆయా రాష్ట్రాల విద్యార్థులకే దక్కేలా నిబంధనల్లో మార్పులు చేశారు. దీంతో మన విద్యార్థులు అక్కడ కూడా సీటు పొందే అర్హత ఉండేది కాదు. కానీ ఇప్పుడు స్థానిక కోటా తేవడంతో పరిస్థితి మారిందని తెలంగాణ ఎంబీబీఎస్ బీ కేటగిరీ సీట్ల స్థానిక సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసరి రవిప్రసాద్ పేర్కొన్నారు. కటాఫ్ కూడా మారిందన్నారు. కటాఫ్ తగ్గుతుంది బీ కేటగిరీ సీట్లలో రాష్ట్ర విద్యార్థులకు 85 శాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల కటాఫ్ మార్కులు గతంతో పోలిస్తే తగ్గుతున్న మాట వాస్తవమే. ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా చాలా తక్కువగా దరఖాస్తు చేయడంవల్ల ఈ పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు బీ కేటగిరీ సీట్లకు ఇంకా రెండు విడతల కౌన్సెలింగ్ ఉన్నందున ఎంతమేరకు కటాఫ్ తగ్గే అవకాశాలున్నాయో ఇంకా స్పష్టత రాలేదు. – డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, కాళోజీ హెల్త్ వర్సిటీ వీసీ -
Telangana Govt: ‘పోలీస్’ కటాఫ్ మార్క్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహించనున్న పోలీస్ పరీక్షలకు ఎస్సీ, ఎస్టీ కటాఫ్ మార్క్‌గా 40 మార్కులను ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 200 మార్కులకు బీసీలకు 50, ఓసీలకు 60 కటాఫ్ మార్కులుగా పేర్కొంటూ తాజాగా జీవో విడుదల చేసింది. గతంలో ఈ మార్కులు ఓసీలకు 80 (40%), బీసీలకు 70(35%), ఎస్సీ, ఎస్టీలకు 60 (30%)గా ఉండేది. అయితే ఎస్సై, కాని స్టేబుల్ ఎగ్జామ్ రాసిన వారికి కటాఫ్ మార్కులు తగ్గిస్తూ కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రకటన మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్, టీఎస్ ఎల్పీఆర్బీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 30% మార్కులు సాధిస్తే వారు అర్హత సాధిస్తారని ప్రకటించింది. దీంతో జనరల్ కేటగిరీతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలకు సైతం 30% మార్కులను కటాఫ్‌గా పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా తాము నష్టపోతున్నామని హైకోర్టులో ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరుగుతుండగానే, ప్రభుత్వం కొత్త కటాఫ్ మార్కులను ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ విషయాన్ని ప్రభుత్వ న్యాయవాది న్యాయస్థానానికి వెల్లడించారు. దీంతో ఈ పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం కొట్టివేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది చిల్ల రమేశ్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ తాజా నిర్ణయం పిటిషనర్లకు ఆమోదయోగ్యంగా ఉండటంతో ధర్మాసనం వాదనలు ముగించింది. -
పోలీసు కొలువులకు తగ్గిన కటాఫ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగార్థులకు ఊరట లభించింది. కటాఫ్ మార్కుల విషయంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఆదివారం సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమినరీ రాత పరీక్షలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ కేటగిరీలకు కటాఫ్ మార్కులు తగ్గాయి. సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 30% మార్కులు సాధించిన వారు మాత్రమే అర్హత సాధిస్తారని ప్రకటించింది. వాస్తవానికి గత నియామకాల సమయంలో జనరల్ కేటగిరీకి 40% మార్కులు అర్హతగా ఉండగా.. బీసీ అభ్యర్థులకు 35%, ఎస్సీలకు 30% కటాఫ్‌గా నిర్ధారించారు. ఈసారి జనరల్ కేటగిరీతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలకు సైతం 30% మార్కులు కటాఫ్‌గా ఖరారు చేసి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అన్ని కేటగిరీలకు ఒకే రకమైన మార్కులు నిర్దేశించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో కటాఫ్ తగ్గిస్తూ కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జనరల్ కేటగిరీకి కటాఫ్ మార్కులు 10% తగ్గడంతో.. మిగ తా కేటగిరీలకు కటాఫ్ తగ్గిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కేటగిరీల వారీగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. టీఎస్ఎల్పీఆర్బీ ఆదివారం కటాఫ్ మార్కులు తగ్గిస్తూ అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకా రం బీసీ అభ్యర్థులకు 25%, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగ కేటగిరీకి 20% మార్కులు కటాఫ్‌గా ఖరారు చేసింది. తాజా నోటిఫికేషన్‌ను టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు వారి వివరాలను అప్లోడ్ చేసేందుకు ఈనెల 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ రాత పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్ మార్కులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈ ఏడాది వెలువడిన కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ప్రభుత్వం అందరికీ ఒకే కటాఫ్‌ను నిర్ధారించింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత కోసం అన్ని కేటగిరీలకు 60 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించింది. దీంతో, ప్రతిపక్ష నేతలు, కొందరు అభ్యర్థులు కటాఫ్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్టీ, ఎస్సీలకు కటాఫ్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కటాఫ్ మార్కులు తగ్గేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
గ్రూప్–1 ప్రిలిమ్స్ కటాఫ్ తీరే వేరు!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. జూలై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఇప్పటికే నోటిఫికేషన్లో వెల్లడించింది. పరీక్షల గడువు సమీపిస్తుండటంతో అభ్యర్థులు కూడా మరింత సన్నద్ధతతో దీక్ష చేస్తున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికే మెయిన్ పరీక్షలకు అవకాశం ఉంటుంది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్ పరీక్షలకు ఎంపిక చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 503 గ్రూప్–1 ఉద్యోగాలకు రాష్ట్రవ్యాప్తంగా 25,150 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. దీంతో ఎక్కువ మార్కులు సాధించిన వారికే మెయిన్స్‌కు అవకాశం దక్కనుండగా.. ఈ ఎంపిక విధానంలోనూ టీఎస్పీఎస్సీ మల్టీజోన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, జెండర్, ఈడబ్ల్యూఎస్, డిజేబుల్, స్పోర్ట్స్ కేటగిరీలో మెరిట్ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఒక్కో పోస్టుకు 700 మంది... ఇప్పటివరకు గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో జనరల్ మెరిట్ ప్రకారం ఎంపిక జరిగేది. దీంతో కటాఫ్ మార్కులు ఒక సంఖ్య దగ్గర ఆగిపోయేవి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత స్థానిక అభ్యర్థులకే ఉద్యోగాలు దక్కాలనే ఉద్దేశంతో తెచ్చిన నూతన జోనల్ విధానంతో ఎంపిక విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో గ్రూప్–1 కటాఫ్ మార్కులు ఒక్కో జోన్లో, ఒక్కో కేటగిరీలో ఒక్కో రకంగా ఉండనున్నాయి. రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు ఉండగా.. ఒక్కో మల్టీజోన్‌లో కటాఫ్ మార్కులు ఒక్కోలా ఉంటాయి. అదేవిధంగా రిజర్వేషన్లు, జెండర్ ప్రకారం కటాఫ్ మార్కులు మరోవిధంగా ఉంటాయి. గ్రూప్–1 కొలువులకు ఇప్పటివరకు 3.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. మరో రెండ్రోజుల్లో దరఖాస్తులు మరిన్ని వచ్చే అవకాశముంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే ఒక్కో పోస్టుకు సగటున 700 మంది పోటీపడుతున్నారు. పోటీ ఎక్కువగా ఉండటం, కటాఫ్ నిర్ధారణలోనూ జోన్ల వారీగా వేర్వేరుగా ఉండటంతో అభ్యర్థులు మరింత కఠిన సాధన చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రిలిమ్స్ మార్కులను కేవలం మెయిన్ పరీక్షల ఎంపిక వరకే పరిగణిస్తామని, తుది ర్యాంకింగ్‌లో వీటిని పరిగణించబోమని టీఎస్పీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. కటాఫ్ ఇలా... అభ్యర్థుల స్థానికత ఆధారంగా మల్టీజోన్లను కేటాయిస్తారు. ఈ క్రమంలో గ్రూప్–1 మెయిన్స్‌కు ఎంపిక రెండు మల్టీజోన్ల ఆధారంగా చేపడతారు. ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు, డిజేబుల్, స్పోర్ట్స్ రిజర్వేషన్లను అమలు చేస్తూ అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీంతో కటాఫ్ మార్కులు ఒక్కో జోన్లో ఒక్కో రకంగా ఉంటాయి. ఉదాహరణకు మల్టీజోన్–1లోని బీసీ–ఏ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థి మార్కులు.. మల్టీజోన్–2లో బీసీ–ఏ కేటగిరీలో ఎంపికైన అభ్యర్థి మార్కులు ఒకేరకంగా ఉండవు. ఇదే తరహాలో మిగిలిన కేటగిరీల్లో ఒక్కో జోన్లో కటాఫ్ మార్కులు ఒక్కోవిధంగా ఉండనున్నాయి. గ్రూప్–1 ఒక్క పోస్టుకు 756 మంది పోటీ.. మొత్తం దరఖాస్తులు 3,80,202 రాష్ట్ర సివిల్ సరీ్వసుగా చెప్పుకునే గ్రూప్–1 కొలువుకు పోటీ విపరీతంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా చేపడుతున్న గ్రూప్–1 ఉద్యోగాలను దక్కించుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగానే కుస్తీ పడుతున్నారు. పలు ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–1 కేటగిరీలో ఉన్న 503 ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ ఏప్రిల్ నెలాఖరులో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మే 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. జూన్ 4 నాటికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియగా 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తులు సమరి్పంచినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఇందులో పురుషులు 2,28,951, మహిళలు 1,51,192, ట్రాన్స్జెండర్లు 59 ఉన్నారు. ఇక డిజేబుల్ కేటగిరీలో 6,105, ప్రభుత్వ ఉద్యోగులు 51,553 మంది ఉన్నారు. ఈక్రమంలో ఒక్కో ఉద్యోగానికి సగటున 756 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. జూలై లేదా ఆగస్టు నెలలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు, డిసెంబర్లో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఇప్పటికే నోటిఫికేషన్లో తెలిపింది. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన 312 గ్రూప్–1 ఉద్యోగాలకు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయి. -
సివిల్స్ కోచింగ్‌కు కటాఫ్ మార్కులు
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద సివిల్స్‌లో ఉచిత కోచింగ్ ఇప్పించేందుకు అభ్యర్థుల ఎంపికలో కటాఫ్ మార్కులు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు కటాఫ్ మార్కులు లేకుండా ఆయా సంక్షేమ శాఖలు నిర్ణయించిన ప్రకారం టార్గెట్ వరకు మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల నుంచి మొత్తం 3,850 మందిని ఎంపిక చేయాల్సి ఉంది. కోచింగ్ కోసం మూడు నెలల క్రితం ఎంట్రెన్స్ పరీక్ష రాశారు. పరీక్ష రాసిన నెల రోజుల తరువాత ఫలితాలు ప్రకటించారు. అయితే రెండు నెలలుగా ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. కటాఫ్ మార్కులపై తేల్చని ప్రభుత్వం.. మొత్తం 150 మార్కులకు పరీక్ష పెట్టారు. ఇందులో ఎన్ని మార్కుల వరకు కటాఫ్ పెట్టాలనే విషయంలో ప్రభుత్వం తేల్చుకోలేకపోతున్నది. దాదాపు 95శాతం మందికి వందలోపు మార్కులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సివిల్స్‌కు కోచింగ్ తీసుకునే వారు 80 శాతం మార్కులతో ఎంట్రెన్స్ పాస్ అయితే ఆలోచించవచ్చునని, అలా కాకుండా 50 శాతం లోపు మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేస్తే ఫలితాలు రావడం లేదనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం కింద కోచింగ్ కోసం ప్రభుత్వం కోచింగ్ సెంటర్లకు తొమ్మిది నెలలకు కలిపి సుమారు రూ. 40 కోట్లు ఖర్చుచేస్తున్నది. అందుకని కటాఫ్ కనీస మార్కులు ఎంత పెట్టాలనే విషయం తేల్చుకోలేకపోతున్నది. దీనిపై ఈనెల 26న సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో అన్ని సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనూ ఎటూ తేల్చలేదు. ఇప్పటికే రెండు నెలల నుంచి పరీక్షలు రాసిన 45,447 మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్, దివ్యాంగులకు 0.3శాతం రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సి ఉంది. దీనిపైనా కసరత్తు జరుగుతోంది. గత సంవత్సరం బీసీలకు మహిళా రిజర్వేషన్, కటాఫ్ మార్కులు అమలు చేయాలనుకుంటే చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. చివర్లో ఆ ప్రతిపాదన విరమించుకొని మెరిట్ ప్రకారం ఇచ్చారు. సివిల్స్‌కు ఎంపిక కావడం లేదని.. సివిల్స్‌లో ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నా.. తగిన ఫలితాలు రావడం లేదు. మూడు సంవత్సరాలుగా సంవత్సరానికి 3,850 మందికి కోచింగ్ ఇప్పిస్తున్నా ఒక్కరు కూడా ఎంపిక కాలేదు. అందువల్ల కటాఫ్ మార్కుల అంశం తెరపైకి వచ్చింది. రెండు నెలలుగా ఎదురు చూపులు సివిల్స్ శిక్షణకు ఎంట్రెన్స్ ఫలితాలు ప్రకటించి రెండు నెలలైనా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటి నుంచి కోచింగ్ ప్రారంభిస్తారో వెల్లడించలేదు. సరైన శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్‌ను ఎంపిక చేసి విద్యార్థులను అందులో చేర్పించాలని ప్రభుత్వం భావించింది. అందుకోసం ఆయా సంక్షేమ శాఖల నుంచి ఉన్నతాధికారులతో కమిటీలు వేసి దేశ వ్యాప్తంగా పంపించి రిపోర్టులు తెప్పించింది. రిపోర్టు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి వద్ద ఉంది. ఇంకా ఈ రిపోర్టుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. -
తగ్గిన జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ మార్కులు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహిం చిన జేఈఈ అడ్వాన్స్డ్ కటాఫ్ మార్కులు భారీగా తగ్గాయి. ఈ మేరకు సవరించిన కటాఫ్ మార్కుల జాబితాను ఐఐటీ బాంబే శనివారం తమ వెబ్సైట్లో పొందుపరించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విద్యార్థి అర్హతను నిర్ధారించేందుకు పరిగణనలోకి తీసుకునే కటాఫ్ మార్కులను గతంలోనే ఐఐటీ బాంబే ప్రకటించినా జవాబుల కీలపై విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తాజాగా కటాఫ్ మార్కులను తగ్గించింది. గతంలో జనరల్‌లో విద్యార్థి 35 శాతం (177) పైగా మార్కులు సాధిస్తేనే అర్హుడని పేర్కొనగా తాజాగా వాటిని 24.5 శాతానికి (124 మార్కులు) తగ్గించింది. అలాగే ఇతర రిజర్వేషన్ కేటగిరీలవారీగా అర్హతకు పరిగణనలోకి తీసుకునే తగ్గించిన కటాఫ్ మార్కుల వివరాలను జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్లో పొందుపరిచింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మొత్తం మార్కులు 504 (పేపర్-1లో 264, పేపర్-2లో 240) కాగా ప్రతిసబ్జెక్టులో 168 మార్కులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులోని(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) పేపర్-1లో 88 మార్కులు ఉం డగా, పేపర్-2లో 80 మార్కుల చొప్పున ఉన్నాయి. మరోవైపు విద్యార్థుల అభ్యంతరాల మేరకు సవరిం చిన తాజా కీలను కూడా తమ వెబ్సైట్లో పొందుపరిచింది. ఇక ఈ నెల 18న జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను ప్రకటించనుంది. వీటి ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించనుంది. ఐఐటీలవారీగా సీట్లు, రిజర్వేషన్ల వివరాలను తాజా సమాచారాన్ని వెబ్సైట్లో విద్యార్థుల కోసం అందుబాటులో ఉంచింది. -
ఆర్బీఐ అసిస్టెంట్స్ పోస్టుల పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. అసిస్టెంట్స్ పోస్టుల పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? - ఫాతిమా బేగం, రాజేంద్రనగర్ కాంపిటీటివ్ కౌన్సెలింగ్: ఆర్బీఐ అసిస్టెంట్స్ పరీక్షలో న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 40 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానాలకు 1/4 వంతు మార్కుల కోత ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీని ముఖ్యంగా మూడు విభాగాలుగా విభజించవచ్చు. అవి.. అర్థమెటిక్, డేటా అనాలిసిస్, టాపిక్ వైజ్ ప్రాబ్లమ్స్. వేగం, కచ్చితత్వం, సమయపాలన ఉంటే న్యూమరికల్ ఎబిలిటీలో ఎక్కువ మార్కులు సాధించొచ్చు. ఈ మూడింటిలో నైపుణ్యం సాధించాలంటే వీలైనన్ని పాత, మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ప్రధానంగా సింప్లిఫికేషన్స్ మీద అభ్యర్థులు దృష్టి సారించాలి. అంటే బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్, స్క్వేర్స్, స్క్వేర్‌రూట్స్, క్యూబ్స్, క్యూబిక్ రూట్స్తోపాటు కొన్ని సూత్రాలను కంఠస్తం చేయాలి. టాపిక్ వైజ్ ప్రాబ్లమ్స్లో నైపుణ్యం సాధించడానికి మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయడంతోపాటు ప్రశ్నను సాధించడానికి కావాల్సిన అవగాహనను పెంపొందించుకోవాలి. లాజిక్+కాలిక్యులేషన్ = సొల్యూషన్ అనే విధంగా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ మార్కులు సాధించొచ్చు. అభ్యర్థులు ముఖ్యంగా కాలిక్యులేషన్ పరంగా చాలా ప్రశ్నలకు తప్పు సమాధానాలను గుర్తిస్తున్నారు. కాబట్టి కాలిక్యులేషన్స్పై ఎక్కువ దృష్టి సారించాలి. ప్రశ్నల్లోని వ్యాల్యూస్, కండీషన్స్ మారొచ్చు. కానీ, ప్రశ్న కాన్సెప్ట్ మారదు. ఇంటర్నెట్లో మాదిరి ప్రశ్నపత్రాలు ఎన్నో లభిస్తున్నాయి. వీటిని వీలైనంత ఎక్కువ సాధన చేస్తే మంచి మార్కులు సాధించవచ్చు. www.sakshieducation.com లో బ్యాంక్స్ మాక్, ఆన్లైన్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించుకోవచ్చు. పరీక్ష ఆన్లైన్లో కాబట్టి.. మాక్ టెస్టులను సాధన చేస్తే వేగం అలవడి నిర్దేశిత టైమ్‌లోగా సమాధానాలు గుర్తించడానికి అవకాశం ఉంటుంది. డేటా ఎనాలిసిస్లో పట్టిక, వెన్ డయాగ్రమ్, గ్రాఫ్, పై చార్ట్, బార్ గ్రాఫ్‌ల నుంచి ఒకటి లేదా రెండు డయాగ్రమ్స్కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తున్నారు. దీనివల్ల ప్రశ్నలు సాధించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకుని సమాధానం గుర్తించాల్సి ఉంటుంది. శాతాలు, బారువడ్డీ, చక్రవడ్డీ, నిష్పత్తులు, లాభనష్టాలు, భాగస్వామ్యం, వైశాల్యాలు, ఘన పరిమాణాలు, కాలం -పని, కాలం - దూరం వంటివాటిపై ప్రశ్నలు అడుగుతారు. ఈ అంశాలన్నింటినీ సాధన చేయాలి. ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు మ్యాథ్స్ పాఠ్య పుస్తకాల్లో ఈ అంశాలను ప్రాక్టీస్ చేస్తే అధిక మార్కులు సాధించొచ్చు. మిగిలిన విభాగాలకు కేటాయించిన సమయం పోగా దాదాపు 35 నుంచి 40 నిమిషాల సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. కష్టమైన ప్రశ్నలకు సమాధానం రాకపోతే వదిలేయాలి. వీటినే చేస్తూ కూర్చొంటే సమయం హరించుకుపోతుంది. - ఇన్పుట్స్: ఈ.సంతోష్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ జనరల్ నాలెడ్‌జ: జాతీయ గేయం (వందేమాతరం) - 1950, జనవరి 24న జాతీయ గేయంగా వందేమాతరంను ఆమోదించారు. దీన్ని బంకించంద్ర ఛటర్జీ 1882లో రచించిన ఆనంద్‌మఠ్ నవల నుంచి స్వీకరించారు. 1896 కలకత్తాలో జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో తొలిసారిగా ఆలపించారు. గ ఈ గేయాన్ని ‘అరబిందో ఘోష్’ ఆంగ్లంలోకి అనువదించారు. జాతీయ జంతువు (పెద్దపులి) భారత ప్రభుత్వం పెద్దపులిని (రాయల్‌బెంగాల్ టైగర్) జాతీయ జంతువుగా 1972లో గుర్తించింది. పెద్దపులి శాస్త్రీయ నామం ‘ఫాంథారా టైగ్రిస్’ - 1972కు ముందు ‘సింహం మన జాతీయ జంతువుగా ఉండేది. - 1973 నుంచి ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించి పులుల సంరక్షణ చేపట్టారు. అంతరిక్ష రంగంలో మైలురాళ్లు - మొదటి మహిళా అంతరిక్ష యాత్రికురాలు-వాలెంటీనా తెరిష్కోవా, రష్యా (1968) ఒ అంతరిక్షంలో నడిచిన మొదటి మానవుడు-అలెక్సియే లినో, రష్యా (1965) - అంతరిక్షంలో నడిచిన తొలి మహిళ-స్వెత్లానా సవిత్సకయా - అంతరిక్షంలో నడిచిన మొదటి అమెరికా వాసి-ఎడ్వర్డ హెచ్వైట్ (1965) ఒ చంద్రునిపై అడుగుపెట్టిన మొదటి మానవులు-నీల్ ఆర్మస్ట్రాంగ్ (అమెరికా), ఎడ్విన్ ఇ. ఆలిడ్రిన్ (1969, జూలై, 20, అపోలో - 11 అనే అంతరిక్ష నౌక ద్వారా) ఒ మొదటి అమెరికన్ అంతరిక్ష యాత్రికురాలు-షాలి కె రైడ్ (1983, ఛాలెంజర్ నౌక ద్వారా) ఒ అంతరిక్షయానం చేసిన మొదటి భారతీయుడు- రాకేశ్ శర్మ (1984, ఏప్రిల్ 3, సోయజ్ - టి11 నౌక ద్వారా) ఒ మొదటి భారత సంతతి మహిళా వ్యోమగామి-కల్పనాచావ్లా (1997, కొలంబియా నౌక ద్వారా) ఒ రెండో భారత సంతతి మహిళా వ్యోమగామి-సునీతా విలియమ్స్ (2006, డిసెంబర్ 9) ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ప్రధాన కార్యాలయం: జెనీవా (స్విట్జర్లాండ్) ప్రారంభం: 1995, జనవరి 1 సభ్య దేశాలు: 153 ప్రధాన లక్ష్యాలు: ప్రపంచదేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 1948లో GATT (General Agreement on Tariff and Trade) ఏర్పడింది. - 1995, జనవరి 1న ఎఅఖీఖీ స్థానంలో డబ్ల్యూటీఓను ఏర్పాటు చేశారు. - డబ్ల్యూటీఓ ఇప్పటివరకు తొమ్మిది సమావేశాలు నిర్వహించింది. (1995-సింగపూర్, 1998 - జెనీవా, 1999-సియాటెల్, 2001- దోహా, 2003-కాన్కున్ (మెక్సికో), 2005-హాంకాంగ్‌లు ముఖ్యమైనవి) -
ఐఐటీల్లో ఓబీసీలకు తగ్గిన కటాఫ్ మార్క్
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ టాప్-20 పర్సంటైల్‌కు నిర్ధారించిన కటాఫ్ మార్కుల్లో తలెత్తిన అశాస్త్రీయతను ఐఐటీ ఖరగ్‌పూర్ సరిదిద్దింది. ఐఐటీ కటాఫ్‌పై అయోమయం శీర్షికన ‘సాక్షి’ ఈనెల 2న ప్రచురించిన కథనంపై స్పందించింది. ఓబీసీ కేటగిరీలో టాప్-20 పర్సంటైల్ కటాఫ్‌లో 25 మార్కులను శుక్రవారం తగ్గించింది. ఓబీసీ కటాఫ్ మార్కులను 503 మార్కుల నుంచి 478కి కుదించింది. ఈ మేరకు తమ వెబ్‌ైసైట్‌లో (జ్ట్టిఞ://్జ్ఛ్ఛ్చఛీఠి.జీజ్టీజుజఞ.్చఛి.జీ) వివరాలను పొందుపరిచింది.