మానవాభివృద్ధి నివేదికను విడుదల చేసే సంస్థ? | Human Development Report released the company? | Sakshi
Sakshi News home page

మానవాభివృద్ధి నివేదికను విడుదల చేసే సంస్థ?

Published Thu, Aug 28 2014 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM

Human Development Report released the company?

 1.    ఏ దేశ రాజ్యాంగ న్యాయ స్థానం 2014 మేలో ఇంగ్లక్ షినవత్రను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించింది?
     ఎ) వియత్నాం     బి) మలేషియా
     సి) థాయ్‌లాండ్     డి) కాంబోడియా
 
 2.    2014 ఏప్రిల్‌లో బోకో హరామ్ తీవ్రవాద సంస్థ ఏ దేశంలో 276 మంది బాలికలను అపహరించింది?
     ఎ) అల్జీరియా     బి) నైజీరియా
     సి) సుడాన్         డి) దక్షిణ సుడాన్
 
 3.    భారతీయ మహిళా బ్యాంక్ తొలి చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్?
     ఎ) విజయలక్ష్మి అయ్యర్    బి) చందా కొచ్చర్
     సి) అరుంధతి భట్టాచార్య
     డి) ఉషా అనంత సుబ్రమణ్యం
 
 4.    మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలైన రచయిత్రి?
     ఎ) అరుంధతి రాయ్    బి) కిరణ్ దేశాయ్
     సి) ఎలినార్ కాటన్     డి) హిలరీ మాంటెల్
 
 5.    ఐక్యరాజ్యసమితి ఏ రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది?
     ఎ) అక్టోబర్ 24     బి) అక్టోబర్ 2
     సి) అక్టోబర్ 16     డి) అక్టోబర్ 31
 
 6.    సుష్మా స్వరాజ్ మధ్యప్రదేశ్‌లోని ఏ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు?
     ఎ) భోపాల్         బి) దేవాస్
     సి) ఖజురహో     డి) విదిశ
 
 7.    నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రిగా ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారు?
     ఎ) మే 12     బి) మే 13     సి) మే 26     డి) మే 16
 
 8.    ఏ దేశంలో బహుళ జాతి ప్రజాస్వామ్యానికి 2014 ఏప్రిల్ 27 నాటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి?
     ఎ) సెర్బియా     బి) దక్షిణాఫ్రికా
     సి) ఉగండా         డి) స్పెయిన్
 
 9.    2014 కామన్వెల్త్ క్రీడలలో ఎన్ని దేశాలు/జట్లు పాల్గొన్నాయి?
     ఎ) 53     బి) 54     సి) 71     డి) 74
 
 10.    ఏ ప్రైజ్/అవార్డును ఆసియా నోబెల్‌గా అభివర్ణిస్తారు?
     ఎ) టెంపుల్‌టన్ ప్రైజ్     బి) జెనిసిస్ ప్రైజ్
     సి) రైట్ లైవ్లీహుడ్ అవార్డు
     డి) రామన్ మెగసెసె అవార్డు
 
 11.    {పపంచంలో అత్యధిక సంఖ్యలో ముస్లిం జనాభాగల దేశం?
     ఎ) పాకిస్థాన్     బి) ఇరాన్
     సి) బంగ్లాదేశ్     డి) ఇండోనేషియా
 
 12.    2014 జూలైలో భారత్‌లో పర్యటించిన విలియం హేగ్ ఏ దేశ విదేశాంగ మంత్రి?
     ఎ) యుఎస్‌ఏ     బి) బ్రిటన్
     సి) కెనడా         డి) నెదర్లాండ్స్
 
 13.    యూరోపియన్ యూనియన్‌లోని సభ్య దేశాల సంఖ్య?
     ఎ) 26     బి) 27     సి) 28     డి) 29
 
 14.    2015 జనవరి ఒకటో తేదీ నుంచి యూరో కరెన్సీని అమల్లోకి తెస్తున్న దేశం?
     ఎ) లాత్వియా     బి) లిథుయేనియా
     సి) ఎస్టోనియా     డి) స్లోవేనియా
 
 15.    తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితురాలైన క్రీడాకారిణి?
     ఎ) సైనా నెహ్వాల్     బి) గుత్తా జ్వాల
     సి) నిఖిత్ జరీన్     డి) సానియా మీర్జా
 
 16.    అణుశక్తి సహకారానికి సంబంధించి 2014 జూలైలో రష్యా ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది?
     ఎ) బ్రెజిల్         బి) దక్షిణాఫ్రికా
     సి) అర్జెంటీనా     డి) పెరూ
 
 17.    రోజాటమ్ ఏ దేశంలోని ప్రభుత్వ అణుశక్తి కార్పొరేషన్?
     ఎ) జపాన్     బి) రష్యా     సి) ఫ్రాన్స్     డి) జర్మనీ
 
 18.    మానవాభివృద్ధి నివేదికను ప్రతి ఏటా విడుదల చేసే సంస్థ?
     ఎ) యూఎన్‌డీపీ     బి) డబ్ల్యూహెచ్‌వో
     సి) యూనిసెఫ్     డి) యునెస్కో
 
 19.    2014 జూలైలో విడుదలైన మానవాభివృద్ధి నివేదికలో భారత స్థానం?
     ఎ) 165     బి) 145     సి) 135     డి) 125
 
 20.    2014 జూలైలో భారత్‌లో పర్యటించిన జిమ్ యాంగ్ కిమ్ ఎవరు?
     ఎ) దక్షిణ కొరియా అధ్యక్షుడు
     బి) ఉత్తర కొరియా అధ్యక్షుడు
     సి) ఆసియా అభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడు
     డి) ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు
 
 21.    ఏ దేశ జనాభా 2014, జూలై 27 నాటికి 100 మిలియన్లకు చేరింది?
     ఎ) ఫిలిప్పీన్స్     బి) మలేషియా
     సి) బంగ్లాదేశ్     డి) వియత్నాం
 
 22.    2014, జూలై 21న అంతర్జాతీయ పుట్‌బాల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన స్టీవెన్ గార్రార్డ్ ఏ దేశానికి కెప్టెన్‌గా వ్యవహరించాడు?
     ఎ) స్కాట్లాండ్     బి) ఇంగ్లండ్
     సి) ఆస్ట్రేలియా     డి) న్యూజిలాండ్
 
 23.    2014, జూలై 20న జర్మనీ గ్రాండ్‌ప్రి ఫార్ములా చాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది?
     ఎ) లూయిస్ హామిల్టన్     బి) మార్క్ వెబర్
     సి) నికో రోస్‌బర్గ్     డి) ఎవరూ కాదు
 
 24.    2013 గాంధీ శాంతి బహుమతిని ఎవరికి ప్రదానం చేశారు?
     ఎ) ఇలాభట్     బి) ఇలా గాంధీ
     సి) సుందర్‌లాల్ బహుగుణ
     డి) చాందీప్రసాద్ భట్
 
 25.    డ్యురాండ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ఈ సంవత్సరం ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది?
     ఎ) మిజోరం     బి) గోవా
     సి) పశ్చిమ బెంగాల్    డి) రాజస్థాన్
 
 26.    సిరియా అధ్యక్షుడి పదవీ కాలం?
     ఎ) నాలుగేళ్లు     బి) ఐదేళ్లు
     సి) ఆరేళ్లు         డి) ఏడేళ్లు
 
 27.    2014, జూలై 16న సిరియా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నికైంది?
     ఎ) హఫీజ్ అల్ అసద్     బి) అబ్దుల్ హలీమ్ ఖద్దామ్
     సి) బషర్ అల్ అసద్     డి) మహమ్మద్ ముస్తఫా
 
 28.    లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీలో 47వ సభ్యుడిగా ఎంపికైన భారత మాజీ క్రికెటర్?
     ఎ) సచిన్ టెండూల్కర్     బి) సునీల్ గవాస్కర్
     సి) సౌరవ్ గంగూలీ     డి) రాహుల్ ద్రావిడ్
 
 29.    2014, జూలై 22న రామ్‌నాయక్ ఏ రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు?
     ఎ) మహారాష్ట్ర     బి) ఉత్తరప్రదేశ్
     సి) బీహార్         డి) రాజస్థాన్
 
 30.    హవానా ఏ దేశానికి రాజధాని?
     ఎ) జమైకా         బి) కోస్టారికా
     సి) క్యూబా         డి) బార్బడోస్
 
  సమాధానాలు:
     1) సి;    2) బి;    3) డి;    4) సి;    5) బి;
     6) డి;    7) సి;    8) బి;    9) సి;    10) డి;
     11) డి;    12) బి;    13) సి;    14) బి;    15) డి;
     16) సి;    17) బి;    18) ఎ;    19) సి;    20) డి;
     21) ఎ;    22) బి;    23) సి;    24) డి;    25) బి;
 26) డి;    27) సి;    28) డి;    29) బి;    30) సి.
 
 వర్తమాన వ్యవహారాలను చదివేటప్పుడు..
 వాటికి సంబంధించిన ప్రతి అంశాన్ని
 నిశితంగా పరిశీలించాలి. ఆ సంఘటన
 పూర్వాపరాలను కూడా క్షుణ్నంగా
 గమనించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం
 జరిగిన అతి పెద్ద క్రీడాసంరంభమైన
 ఫిఫా ప్రపంచకప్ సాకర్- 2014కు
 సంబంధించిన కీలక ఘట్టాలను పరిశీలిస్తే..
 
 ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ 1930లో ప్రారంభమైంది. ఉరుగ్వే తొలిసారి ఈ పోటీలకు ఆతిథ్యం ఇచ్చింది. అప్పటి నుంచి ప్రతి నాలుగేళ్లకోసారి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942,46లలో నిర్వహణ సాధ్యం కాలేదు. ఇప్పటి వరకు ఈ పోటీలు 20సార్లు జరిగాయి. ఇందులో అత్యధికంగా బ్రెజిల్ ఐదు సార్లు విజేతగా నిలిచింది. తర్వాత జర్మనీ, ఇటలీ చెరి నాలుగుసార్లు ఈ ఘనత సాధించాయి. అర్జెంటీనా, ఉరుగ్వే రెండుసార్లు, ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్పెయిన్ ఒక్కోసారి ప్రపంచకప్‌ను గెలుచుకున్నాయి.
 
 2014 ప్రపంచకప్ బ్రెజిల్‌లో జరిగింది. జూన్ 12న ప్రారంభమై జూలై 13న ముగిసింది. మొత్తం 32 దేశాలు పాల్గొన్నాయి. బ్రెజిల్‌లోని 12 నగరాల్లో ఈ పోటీలను నిర్వహించారు. మొత్తం 64 మ్యాచ్‌లలో 171 గోల్స్ నమోదయ్యాయి. సావ్‌పోలోలో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్రెజిల్ క్రొయేషియాను ఓడించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో అడుగుపెట్టిన స్పెయిన్ తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించింది. కొలంబియా, కోస్టారికా దేశాలు తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. జర్మనీ, నెదర్లాండ్స్, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. తద్వారా వరుసగా నాలుగు టోర్నమెంట్‌లలో సెమీఫైనల్‌కు చేరుకున్న తొలి దేశంగా జర్మనీ ఘనత దక్కించుకుంది.
 
 రియోడిజెనీరోలో జరిగిన ఫైనల్లో అర్జెంటీనాను ఓడించి జర్మనీ నాలుగోసారి విజేతగా నిలిచింది. గతంలో 1954, 1974, 1990లలో కూడా జర్మనీ ఈ ఘనతను సాధించింది. జర్మనీ జట్టుకు 35 మిలియన్ డాలర్లు, రన్నరప్ అర్జెంటీనాకు 25 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. బ్రెజిల్‌ను ఓడించి నెదర్లాండ్స్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. జర్మనీ ఆటగాడు మిరోస్లావ్ క్లోజ్ ఈ టోర్నమెంట్ ద్వారా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన అటగాడిగా రికార్డు సృష్టించాడు (గత రికార్డు 15 గోల్స్‌తో బ్రెజిల్‌కు చెందిన రొనాల్డో పేరిట ఉంది). ఈ సందర్భంగా ప్రదానం చేసిన అవార్డుల వివరాలు..
 
 గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారునికి ఇచ్చే అవార్డు): జేమ్స్ రోడ్రిగ్వెజ్ (కొలంబియా- 6 గోల్స్)గోల్డెన్ బాల్ (అత్యుత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారుడు): లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)
 గోల్డెన్ గ్లోవ్: జర్మనీ గోల్ కీపర్ మాన్యుయెల్ న్యూర్
 బెస్ట్ యంగ్ ప్లేయర్ (21 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఆటగాడికి ఇస్తారు): పాల్ పోగ్బా (ఫ్రాన్స్)
 ఫెయిర్ ప్లే: కొలంబియా జట్టు
 
 ప్రపంచకప్ టోర్నమెంట్‌కు ఆతిథ్యమివ్వడం బ్రెజిల్‌కు ఇది రెండోసారి. 1950లో బ్రెజిల్‌లో మొదటిసారి ఈ టోర్నీని నిర్వహించారు. తదుపరి ప్రపంచ కప్ పోటీలకు 2018లో రష్యా, 2022లో ఖతార్ ఆతిథ్యమివ్వనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement