ఉద్యోగాలు | IBPS Common Written Test | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Tue, Jun 17 2014 9:58 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

IBPS Common Written Test

 ఐబీపీఎస్ కామన్ రిటెన్ టెస్ట్

 వివిధ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల(ఆర్‌ఆర్‌బీ)లో కింది ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఉమ్మడి రాత పరీక్ష(సీడబ్ల్యూఈ) నోటిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాం కింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) విడుదల చేసింది.
 పోస్టులు: ఆఫీసర్ స్కేల్-1,2,3), ఆఫీస్ అసిస్టెంట్స్(మల్టీపర్పస్)
 అర్హతలు:
ఆఫీసర్ స్కేల్-1: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండ్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కో ఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ అభ్యర్థులకు ప్రాధాన్యం. సంబంధిత ప్రాంతీయ భాషలో తగిన ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అదనపు అర్హతగా పరిగణిస్తారు.
 వయసు: 28 ఏళ్లకు మించకూడదు(జూన్ 3, 1986 నుంచి  మే 31, 1996 మధ్య జన్మించినవారు).
ఆఫీసర్ స్కేల్-2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చరల్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండ్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కో ఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ అభ్యర్థులకు ప్రాధాన్యం. సంబంధిత రంగంలో రెండేళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 21 నంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి
 (జూన్ 3, 1982 నుంచి మే 31, 1993 మధ్య జన్మించినవారు).
ఆఫీసర్ స్కేల్-2(స్పెషలిస్ట్ ఆఫీసర్స్): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్, చార్టర్డ్ అకౌంటెంట్,  లా ఆఫీసర్. 50 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు ఏడాది అనుభవం.
 వయసు: 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి
 (జూన్ 3, 1986 నుంచి మే 31, 1996 మధ్య జన్మించినవారు).
ఆఫీసర్ స్కేల్-3: 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్,  ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండ్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్, కో ఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీలో డిగ్రీ/డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం. సంబంధిత రంగంలో ఆఫీసర్‌గా ఐదేళ్ల అనుభవం ఉండాలి.
 వయసు: 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
 (జూన్ 3, 1974 నుంచి మే 31, 1993 మధ్య జన్మించినవారు)
ఆఫీస్ అసిస్టెంట్స్(మల్టీపర్పస్):
ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. సంబంధిత ప్రాంతీయ భాషలో ప్రావీ ణ్యం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
 వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి(జూన్  2, 1986 నుంచి జూన్ 1, 1996 మధ్య జన్మించి ఉండాలి)
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూలై 9
 వెబ్‌సైట్: www.ibps.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement