అంటువ్యాధులు - నివారణ | Infectious diseases - Prevention | Sakshi
Sakshi News home page

అంటువ్యాధులు - నివారణ

Published Tue, Feb 11 2014 11:29 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Infectious diseases - Prevention

1.    నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందే అంటు వ్యాధులు?
       డిఫ్తీరియా, కోరింతదగ్గు, క్షయ
 2.    మట్టి నుంచి గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా?
       క్లాస్ట్రీడియం టెటనై
 3.    ధనుర్వాతాన్ని కలిగించే బ్యాక్టీరియా?
       క్లాస్ట్రీడియం టెటనై
 4.    కల్తీ కల్లు తయారీకి ఉపయోగించే రసాయనం?
       డయజోఫాం, క్లోరల్ హైడ్రేట్
 5.    కల్తీ కల్లు వల్ల ప్రభావితమయ్యే వ్యవస్థ?
       కేంద్ర నాడీ వ్యవస్థ
 6.    జంతువుల లాలాజలం ద్వారా మానవుని శరీరంలోకి ప్రవేశించే వైరస్?
       రాబ్డో వైరస్
 7.    గర్భంలో ఎదిగే శిశువుకు తల్లి నుంచి సంక్రమించే వ్యాధి?
       ఎయిడ్‌‌స, సిఫిలిస్, హెపటైటిస్-బి
 8.     గర్భంలో ఉన్న శిశువుకు తల్లి నుంచి హెచ్‌ఐవీ సంక్రమించకుండా ఉపయోగించే ఔషధం?
       అజిడోథైమిడిన్ (జిడోవుడైన్/ZDV)
 9.    వైద్య పరిభాషలో ART అంటే?
       యాంటి రిట్రోవైరల్ థెరపీ
 10.    యాంటి రిట్రోవైరల్ థెరపీ ఏ వ్యాధికి సంబంధించింది?
       ఎయిడ్‌‌స
 11.    NACO అంటే?
       నేషనల్ ఎయిడ్‌‌స కంట్రోల్ ఆర్గనైజేషన్
 12.    ఎయిడ్‌‌స చికిత్సలో భాగమైన యాంటి రిట్రో వైరల్ థెరపి సెంటర్లుగా నిర్వహించేవి?
       మెడికల్ కాలేజీలు, జిల్లా ఆస్పత్రులు
 13.    ICMR అంటే?
       ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్‌‌చ
 14.    హన్‌సెన్ వ్యాధి అంటే?
       కుష్ఠు(లెప్రసీ)
 15.    క్షయ వ్యాధిగ్రస్థుల్లో అత్యంత ప్రమాదకరమైన క్షయవ్యాధి రకం?
       TDR-TB
 16.    TDR-TB అంటే?
       టోటల్లీ డ్రగ్ రెసిస్టెంట్ టి.బి.
 17.    DOT చికిత్స విధానం ఏ వ్యాధికి సంబంధించింది?
       క్షయ
 18.    మన దేశంలో నేషనల్ టీబీ ప్రోగ్రాం (జాతీయ టీబీ కార్యక్రమం) ప్రారంభమైన సంవత్సరం?
       1962
 19.    రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రాం (RNTCP) ప్రారంభించిన సంవత్సరం?
       1992
 20.    క్షయవ్యాధి నిరోధకత కోసం ఇచ్చే వ్యాక్సిన్?
       బీసీజీ
 21. ఏ వ్యాధుల నివారణకు  డీపీటీ వ్యాక్సిన్ ఇస్తారు?
       డిఫ్తీరియా, కోరింతదగ్గు, ధనుర్వాతం
 22.    టైఫాయిడ్ ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది?
       చిన్నపేగు
 23.    టైఫాయిడ్ వ్యాధిని గుర్తించడానికి చేసే పరీక్ష?
       వైడల్ పరీక్ష
 24.    ‘ఎంటరిక్ జ్వరం’గా దేన్ని పిలుస్తారు?
       టైఫాయిడ్
 25.    పేల (Lice) ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి?
       టైపస్ వ్యాధి
 26.    టైపస్ వ్యాధి కారకం?
       బ్యాక్టీరియా
 27.    హె ఫీవర్ (Hey fever) ను కలుగజేసే కారకం?
       కాలుష్యం(పుప్పొడి)
 28.    సిఫిలిస్ వ్యాధిని కలుగజేసే కారకం?
       బ్యాక్టీరియా (ట్రిపొనిమా పాలిడం)
 29.    ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ(ORT)ను ఏ వ్యాధి చికిత్సకు ఉపయోగిస్తారు?
       కలరా, డయేరియా
 30.    ఆంథ్రాక్స్ వ్యాధికారక బ్యాక్టీరియా వ్యాప్తి చెందే విధానం?
       గాలి ద్వారా
 31.    గొర్రెల్లో వచ్చే ఆంథ్రాక్స్ వ్యాధికి వ్యాక్సిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త?
       లూయిస్ పాశ్చర్
 32.    ఆంథ్రాక్స్ వ్యాధిని గుర్తించడానికి చేసే పరీక్ష?
       పాలిమరేజ్ చైన్ రియాక్షన్
 33.    ఏ బ్యాక్టీరియాను జీవ ఆయుధంగా వినియోగించొచ్చు?
       ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా(బాసిల్లస్ ఆంథ్రోసిస్)
 34.    MMRV వ్యాక్సిన్ ఏ వ్యాధుల నిరోధకత కోసం ఇస్తారు?
       మీజిల్స్, మంప్స్, రూబెల్లా, చికెన్‌పాక్స్
 35.    గవదబిళ్లలు/మంప్స్ ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తాయి?
       లాలాజల గ్రంథులు
 36.    పశువుల్లో గాలి కుంటు వ్యాధిని కలుగజేసేది?
       వైరస్
 37.    గాలి కుంటు వ్యాధికి మరో పేరు?
       ఫూట్ అండ్ మౌత్ డిసీస్
 38.    ‘అథ్లెట్ ఫూట్’ వ్యాధిని కలుగజేసే కారకం?
       శిలీంద్రం(Fungus)
 39.    తక్కువ కాలంలో ఎక్కువ ప్రభావాన్ని చూపే వ్యాధి?
       అక్యూట్ వ్యాధి
 40.    అక్యూట్ వ్యాధికి ఉదాహరణ?
       సార్‌‌స, స్వైన్ ఫ్లూ, కార్డియాక్ అరెస్ట్
     (హార్‌‌ట ఎటాక్)
 41.    శరీరంలో ఎక్కువ కాలంపాటు ఉండే వ్యాధి?
       క్రానిక్ వ్యాధి
 42.    క్రానిక్ వ్యాధికి ఉదాహరణ?
       క్షయ, కుష్ఠు
 43.    రైతులు ఎక్కువగా వాడే పెస్టిసైడ్‌లు ఆహారం ద్వారా మానవ శరీరంలోకి ప్రవేశించి ప్రధానంగా ఏ వ్యవస్థను దెబ్బ తీస్తాయి?
       నాడీ వ్యవస్థ(nervous system)
 44.    గెమాగ్జిన్ పౌడర్ రసాయన నామం?
       బెంజీన్ హెక్సాక్లోరైడ్ (BHC)
 45.    గెమాగ్జిన్ పౌడర్‌ను ఎక్కువగా వేటి నాశినిగా ఉపయోగిస్తున్నారు?
       నల్లులు, పేలు
 46.    DDT అంటే?
       డై క్లోరో డై ఫినైల్ ట్రై క్లోరో ఈథేన్
 47.    DDT ని ఎక్కువగా వేటి నాశినిగా ఉపయోగిస్తున్నారు?
       దోమలు
 48.    చిన్నపిల్లల్లో శారీరక అభివృద్ధికి తోడ్పడే పోషకం?
       ప్రోటీన్లు
 49.    అమీబియాసిస్‌ను కలుగజేసే కారకం?
       {పోటోజోవా (ఎంటమీబా
         హిస్టాలిటికా)
 50.    సోరియాసిస్ వ్యాధి కారకం?
       పోషకాహార లోపం
 51.    ప్లేగు వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా?
       ఎర్సినియా పెస్టిస్
 52.    ప్లేగు వ్యాధిని వ్యాపింపజేసే కీటకం?
       రాట్ ఫ్లీ
 53.    హెపటైటిస్-బి వైరస్‌కు రిజర్వాయర్‌గా పనిచేసే జీవి?
       మానవుడు
 54.    రేబిస్ వ్యాప్తి చెందే విధానం?
       జంతువులు కరవడం ద్వారా (కుక్క, కోతి, పిల్లి, ఇతర జంతువులు)
 55.    శిలీంద్రాల వల్ల కలిగే వ్యాధులు ప్రధానంగా శరీరంలో ఏ భాగాన్ని ప్రభావితం చేస్తాయి?
       చర్మం
 56.    రింగ్‌వార్‌‌మ వ్యాధి కారకం?
       శిలీంద్రం
 57.    సుఖవ్యాధులు (sexual trans-mitted diseases)గా పరిగణించే వ్యాధులు?
       గనేరియా, సిఫిలిస్
 58.    {Osెకోఫైటాన్ శిలీంద్రం వల్ల కలిగే వ్యాధి?
       అథ్లెట్ ఫూట్
 59.    కాలా అజార్ వ్యాధిని కలుగజేసే కారకం?
       ప్రోటోజోవా(లైష్మానియా)
 60.    టీనియాసిస్ వ్యాధి వల్ల ప్రభావితమయ్యే భాగం?
       పేగు
 61.    మన దేశంలో నులిపురుగులు వ్యాధి వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం?
       ఆరుబయట మల విసర్జన.
     మరుగుదొడ్లను వాడటం, పరిశుభ్రతను పాటించడం అంటే భోజనానికి ముందు, మల విసర్జన తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కోవడం ద్వారా కింది వ్యాధులను నియంత్రించవచ్చు.
     1. అమీబియాసిస్(డీసెంట్రి)
     2. డయేరియా(అతిసార)
     3. వైరల్ డయేరియా
     4. కలరా
     5. టైఫాయిడ్
     6. పోలియో
     7. నులిపురుగులు
     8. ఏలికపాములు(ఆస్కారియాసిస్)
     9. టీనియాసిస్
     10. హెపటైటిస్ మొదలైనవి.
 62.    శరీరం నుంచి కొన్ని కణాలు లేదా కణజాలాన్ని వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షించే విధానం?
       బయాప్సి
 63.    {పపంచంలో ఒక వ్యాధి ఎక్కువ ప్రాంతాల్లో చాలా వేగంగా వ్యాప్తి చెందినట్లయితే ఆ వ్యాధి?
       పాండమిక్ వ్యాధి
 64.    ఒక ప్రాంతంలోని ప్రజల్లో ఏదైనా వ్యాధి ప్రబలినట్లయితే ఆ వ్యాధి?
       ఎపిడమిక్ వ్యాధి
 65.    కాంప్ ఫీవర్ (camp fever)గా పిలిచేది?
       టైపస్ వ్యాధి
 66.    ఆంటిబయాటిక్ మందులు ముఖ్యంగా వేటిని నాశనం చేస్తాయి?
       బ్యాక్టీరియా
 67.    ఆంటి బయాటిక్ మందులకు నిరోధకతను పెంచుకున్న సూక్ష్మజీవులను ఏమంటారు?
   సూపర్‌బగ్స్
 68.    మానవుని ఆరోగ్యాన్ని క్షీణింపజేసే వైద్య వ్యర్థాలు సూక్ష్మజీవులు, విషాలు మొదలైనవాటిని ఏమంటారు?
       బయో హజార్‌‌డ్స
 69.    ఆముదాల గింజల్లో ఉండే అత్యంత విషపూరిత పదార్థం?
       రిసిన్
 70.    జీర్ణనాళ సంబంధమైన బ్యాక్టీరియల్ వ్యాధి?
       టైఫాయిడ్, కలరా
 71.    కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాప్తి చెంది నీళ్ల విరేచనాలు, వాంతులను కలుగజేసే ప్రోటోజోవన్ వ్యాధి?
       డయేరియా(జియార్డియాసిస్)
 72.    జింజివైటిస్ వ్యాధి ఏ శరీర భాగానికి సంబంధించింది?
       పంటిచిగుళ్లు
 73.    కలుషిత నీరు, రక్తమార్పిడి ద్వారా సంక్రమించే అవకాశం ఉన్న బ్యాక్టీరియల్ వ్యాధి?
       హెపటైటిస్
 74.    ‘గంజినీళ్ల లాంటి విరేచనాలు’ ఏ వ్యాధి లక్షణం?
       కలరా
 75.    చిన్నపిల్లల్లో తీవ్రమైన డయేరియాకు కారణమయ్యే వైరస్?
       రోటా వైరస్
 76.    ఇతర జంతువుల ద్వారా మానవుడికి సంక్రమించే వ్యాధులు?
       జూనోసిస్ వ్యాధులు
 77.    హెండ్రా వైరస్ ఏ జంతువులకు వ్యాధి కలిగిస్తుంది?
       గుర్రం, మానవుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement