ఉద్యోగాలు | jobs notifications | Sakshi

ఉద్యోగాలు

Published Sun, Jul 20 2014 10:19 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

jobs notifications

యూపీఎస్సీ - సీడీఎస్‌ఈ 2014
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఐఐ)-2014 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ విభాగాల్లో 464 పోస్టులను భర్తీ చేస్తారు.
 
 పోస్టులు:

  •      ఇండియన్ మిలిటరీ అకాడమీ: 200
  •      ఇండియన్ నావెల్ అకాడమీ: 45
  •      ఎయిర్‌ఫోర్స్ అకాడమీ: 32
  •      ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ:
  •      పురుషులు-175, మహిళలు-12

 అర్హతలు: అవివాహితులై ఉండాలి. సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
 వయసు: ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ పోస్టులకు 1990 జూలై 2 నుంచి 1996 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. మిలిటరీ అకాడమీ, నావెల్ అకాడమీ పోస్టులకు  1991 జూలై 2 నుంచి 1996 జూలై 1; ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు 1992 జూలై 2 నుంచి 1996 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఆగస్టు18
 రాత పరీక్ష తేది: అక్టోబరు 26
 వెబ్‌సైట్: www.upsc.gov.in
 
 
ఎస్‌ఎస్‌సీ- సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ 2014

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ -2014’ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 991  లోయర్ డివిజనల్ క్లర్క్, 1006 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తారు.
 అర్హతలు: ఇంటర్/ తత్సమాన అర్హతతో పాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి.
 వయసు: 18నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష, డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్టు ద్వారా.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది:ఆగస్టు 19
 రాత పరీక్ష తేది: నవంబరు 2, 9
 వెబ్‌సైట్: http://ssc.nic.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement