Combined Defence Services Examination
-
సీడీఎస్ఈ... త్రివిధ దళాల్లో తిరుగులేని కెరీర్
దేశం కోసం పని చేయాలనే ఆశయం కలిగిన యువతకు ఉన్నత హోదాతో కూడిన ఉద్యోగాన్ని అందిస్తుంది.. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీడీఎస్ఈ). దీనిలో అర్హత సాధిస్తే త్రివిధ దళాల్లో చాలెంజింగ్ కెరీర్‌ను సొంతం చేసుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సీడీఎస్ఈ(2)-2015 నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో పరీక్ష వివరాలపై స్పెషల్ ఫోకస్..... యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఏటా రెండు సార్లు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్(సీడీఎస్ఈ) నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీ(ఐఎంఏ), ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీ(ఐఎన్ఏ), హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడ మీ, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిని త్రివిధ దళాల్లో ఉన్నత కొలువుల్లో నియమిస్తారు. ఖాళీల వివరాలు: అకాడమీ ఖాళీలు ఇండియన్ మిలటరీ అకాడమీ 200 ఇండియన్ నావల్ అకాడమీ 45 ఎయిర్ ఫోర్స్ అకాడమీ 32 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(పురుషులు) 175 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(మహిళలు) 11 మొత్తం 463 అర్హతలు: ఇండియన్ మిలటరీ అకాడమీలో ప్రవేశాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ. ఇండియన్ నావల్ అకాడమీలో ప్రవేశాలకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ఇన్స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ప్రవేశాలకు డిగ్రీతో పాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు చదివుండాలి. డిగ్రీ చివరి ఏడాది/సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారంతా తుది నియామక సమయంలో సర్వీసెస్ సెలక్షన్ బోర్డు(ఎస్ఎస్బీ)కి తమ డిగ్రీ ఉత్తీర్ణత ఒరిజినల్స్ అందివ్వాలి. వయసు: ఐఎంఏ, ఐఎన్ఏల్లో ప్రవేశాలకు 1992 జూలై 2 నుంచి 1997 జూలై 1 మధ్య జన్మించిన అవివాహిత పురుషులు అర్హులు. ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ప్రవేశాలకు 2016 జూలై1 నాటికి 20-24 ఏళ్ల మధ్య ఉండాలి. 1992 జూలై 2 నుంచి 1996 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నుంచి కరెంట్ కమర్షియల్ పైలట్ లెసైన్స్ ఉన్న వారికి 26 ఏళ్లు వరకు గరిష్ట వయోపరిమితి ఉంటుంది. ఇరవై ఐదేళ్లు దాటిన వివాహిత పురుషులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(పురుషులు)లో ప్రవేశాలకు వివాహ/అవివాహ పురుషులు 1991జూలై 2 నుంచి 1997 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(మహిళలు)లో ప్రవేశాలకు అవివాహ మహిళలు 1991 జూలై 2 నుంచి 1997 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. శారీరక ప్రమాణాలు: ఎత్తు, బరువు వంటి శారీరక ప్రమాణాలు నోటిఫికేషన్లో నిర్దేశించిన విధంగా ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూ(స్టేజ్ 1, స్టేజ్ 2); దేహదారుఢ్య, వైద్య, ఆరోగ్య పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థుల ప్రతిభ, ప్రాథమ్యాలను పరిగణనలోకి తీసుకుని వారిని సర్వీస్‌కు ఎంపిక చేస్తారు. రాత పరీక్ష విధానం: రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకు రెండు గంటల వ్యవధి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు కోత విధిస్తారు. సమాధానాలను గుర్తించేందుకు బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించాలి. పరీక్ష, మార్కులు వివరాలు. ఇండియన్ మిలటరీ అకాడమీ, నావల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ సబ్జెక్టు మార్కులు ఇంగ్లిష్ 100 జనరల్ నాలెడ్జ్ 100 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 100 మొత్తం 300 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ సబ్జెక్టు మార్కులు ఇంగ్లిష్ 100 జనరల్ నాలె డ్జ్ 100 మొత్తం 200 ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్: సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్ఎస్బీ) నిర్వహించే ఈ ఎంపిక ప్రక్రియ రెండంచెల్లో ఉంటుంది. స్టేజ్-1లో ఆఫీసర్ ఇంటెలిజెన్స్‌లో రేటింగ్‌లో భాగంగా పిక్చర్ పర్సెప్షన్, డిస్క్రిప్షన్ టెస్ట్‌లు ఉంటాయి. స్టేజ్-2లో ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్ టాస్క్స్, సైకాలజీ టెస్ట్‌లు ఉంటాయి. స్టేజ్-1లో అర్హత సాధించిన వారికి స్టేజ్-2లోకి అనుమతిస్తారు. ఈ పరీక్షలను నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం-ఫీజు: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.200. ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో నేరుగా చెల్లించవచ్చు. లేదా డెబిట్/ క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. సిలబస్: ఇంగ్లిష్: ఇంగ్లిష్‌లో అభ్యర్థుల ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు.జనరల్ నాలెడ్జ్: సమకాలీన అంశాలు, సంఘటనలు, ఈవెంట్స్, చరిత్ర, భూగోళశాస్త్రం, పాలిటీ, ఎకానమీ నుంచి ప్రశ్నలు ఇస్తారు. కరెంట్ అఫైర్స్ కోసం దినపత్రికలు చదవాలి.మ్యాథమెటిక్స్: పదో తరగతి స్థాయిలోని సంఖ్యా సమితి, సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, శాతాలు, లాభ నష్టాలు, కాలం-దూరం, కాలం-పని మొదలైన అర్థమెటిక్ అంశాలతోపాటు, బీజగణితం, త్రికోణమితి, రేఖాగణితం, క్షేత్రమితి, సాంఖ్యక శాస్త్రం నుంచి ప్రశ్నలు అడుగుతారు. ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2015 ఆగస్టు 14 పరీక్ష తేది: 2015 నవంబరు 1 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. -
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2015
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (1), 2015కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మిలటరీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ త్రివిధ దళాల్లో ఉన్నతమైన హోదాతో కెరీర్‌ను ప్రారంభించవచ్చు. ఈ నేపథ్యంలో అర్హత, పరీక్షా విధానం, సంబంధిత వివరాలు.. ఖాళీలు: ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్) 200 ఇండియన్ నావల్ అకాడమీ (ఎజిమలా) 45 ఎయిర్‌ఫోర్స్ అకాడమీ (హైదరాబాద్) 32 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై) (పురుషులు) 175 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (చెన్నై) (మహిళలు) 12 ఎంపిక ప్రక్రియ: ఎంపిక ప్రక్రియలో మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు తర్వాతి దశ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి నియామకాన్ని ఖరారు చేస్తారు. రాత పరీక్ష: రాత పరీక్ష ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. ఎంపిక చేసుకున్న విభాగాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది. ఇండియన్ మిలిటరీ, నావల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ సబ్జెక్ట్ వ్యవధి మార్కులు ఇంగ్లిష్ 2 గంటలు 100 జనరల్ నాలెడ్జ్ 2 గంటలు 100 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 2 గంటలు 100 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ: సబ్జెక్ట్ వ్యవధి మార్కులు ఇంగ్లిష్ 2 గంటలు 100 జనరల్ నాలెడ్జ్ 2 గంటలు 100 ఈ పరీక్షలో ప్రశ్నల క్లిష్టత ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ పదో తరగతి స్థాయిలో ఉంటుంది. అర్హత: అన్ని విభాగాలకు అవివాహితులైనవారు మాత్రమే అర్హు లు. ఇండియన్ మిలిటరీ అకాడెమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. నావల్ అకాడమీకి బీటెక్/బీఈ. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి లేదా ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే మహిళలు అర్హులు. వయోపరిమితి: ఇండియన్ మిలిటరీ అకాడమీ, నావల్ అకాడెమీల కోసం జనవరి 2, 1992- జనవరి 1, 1997 మధ్య, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ పోస్టులకు జనవరి 2, 1992- జనవరి 1, 1996 మధ్య, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ (పురుషులు, మహిళలు) పోస్టులకు జనవరి 2, 1991- జనవరి 1, 1997 మధ్య జన్మించి ఉండాలి. దరఖాస్తు విధానం: ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష తేదీ: ఫిబ్రవరి 15, 2015. వెబ్సైట్: www.upsc.gov.in -
తివిధ దళాలకు దరిచేర్చే..‘సీడీఎస్ఈ’..
నేటి యువత ఉద్యోగం ఎంపికలో బరువైన వేతన ప్యాకేజీల కంటే ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. పింక్ స్లిప్పుల ఊసే లేకుండా, పే స్లిప్పులకే నెలవైన కొలువునే కోరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నత ఉద్యోగం, ఆకర్షణీయ వేతనం, ఉద్యోగ భద్రత.. అన్నింటికీ మించి ధైర్యసాహసాలను ప్రదర్శించి, దేశానికి సేవ చేసే అవకాశం అందుకోవాలన్న యువతకు త్రివిధ దళాలు స్వాగతం పలుకుతున్నాయి. తాజాగా త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలకు బాటలు వేసే యూపీఎస్సీ.. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ)కు నోటిఫికేషన్ విడుదలైంది.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) ప్రకటనను విడుదల చేసింది. ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు. సీడీఎస్ఈ ద్వారా డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఎజిమలలోని ఇండియన్ నావల్ అకాడమీ, హైదరాబాద్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలలో ప్రవేశాలు కల్పిస్తారు. అకాడమీలలోని కోర్సుల్లో ప్రవేశం లభించిన వారికి, శిక్షణ అనంతరం ఉన్నత హోదాతో ఉద్యోగం లభిస్తుంది. ఖాళీల వివరాలు: అకాడమీ ఖాళీలు ఇండియన్ మిలిటరీ అకాడమీ 200 ఇండియన్ నావల్ అకాడమీ 45 ఎయిర్‌ఫోర్స్ అకాడమీ 32 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (పురుషులు) 175 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (మహిళలు) 12 మొత్తం 464 విద్యార్హతలు: ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలకు డిగ్రీ లేదా తత్సమాన అర్హత. ఇండియన్ నావల్ అకాడమీకి ఇంజనీరింగ్ డిగ్రీ. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి) లేదా ఇంజనీరింగ్ డిగ్రీ. చివరి సంవత్సరంలో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు ధ్రువీకరణపత్రాలను తర్వాత సమర్పించాల్సి ఉంటుంది. వయసు: ఇండియన్ మిలిటరీ అకాడమీకి అవివాహ పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. 1991, జూలై 2- 1996, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి అవివాహ పురుష అభ్యర్థులు 1992, జూలై 2-1996, జూలై1 మధ్య జన్మించి ఉండాలి.ఇండియన్ నావల్ అకాడమీకి అవివాహ పురుష అభ్యర్థులు 1991, జూలై 2- 1996, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (పురుషులు)కి వివాహ/ అవివాహ అభ్యర్థులు 1990, జూలై 2- 1996, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (మహిళలు)కి అవివాహ మహిళలు 1990, జూలై 2- 1996, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.శారీరక ప్రమాణాలు: ఎత్తు, బరువు తదితరాలకు సంబంధించి నోటిఫికేషన్లో నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి. రాత పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు రెండు గంటల వ్యవధి ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.ఇండియన్ మిలిటరీ అకాడమీ, నావల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీ సబ్జెక్టు మార్కులు ఇంగ్లిష్ 100 జనరల్ నాలెడ్జ్ 100 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 100 మొత్తం 300 ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ సబ్జెక్టు మార్కులు ఇంగ్లిష్ 100 జనరల్ నాలెడ్జ్ 100 మొత్తం 200 శిక్షణ తీరుతెన్నులు: రాత పరీక్ష; ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ (స్టేజ్ 1, స్టేజ్ 2); దేహదారుఢ్య, వైద్య, ఆరోగ్య పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తిచేసిన తర్వాత అభ్యర్థుల ప్రాధమ్యాలు, చూపిన ప్రతిభను బట్టి సర్వీసుకు ఎంపిక చేస్తారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ, నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలలో శిక్షణ ఇస్తారు. శత్రువుల వ్యూహాలను తిప్పికొట్టడం, లక్ష్యసాధన, ఆత్మ విశ్వాసం పెరిగేలా చేయడం శిక్షణ లక్ష్యం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో శిక్షణ నిర్వహిస్తారు. మొత్తంమీద దేశ రక్షణకు అవసరమైన అంశాల్లో రాణించేలా తర్ఫీదునిస్తారు. శిక్షణలో నివాస సౌకర్యం, పుస్తకాలు, యూనిఫామ్, వైద్య సౌకర్యాలు అందిస్తారు. అంతేకాకుండా నెలకు దాదాపు రూ.21 వేలు స్టైఫండ్‌గా లభిస్తుంది. కెరీర్: శిక్షణ పూర్తయిన తర్వాత ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్, ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లైయింగ్ ఆఫీసర్, నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాతో కెరీర్ ప్రారంభమవుతుంది. ఈ మూడూ సమాన హోదా ఉద్యోగాలే. ఏ సర్వీసులో చేరినప్పటికీ కెరీర్ ప్రారంభంలో అన్ని అలవెన్సులూ కలుపుకొని నెలకు రూ.45 వేల వరకు వేతనం లభిస్తుంది. ఇతర ప్రయోజనాలు: ఉన్నత స్థాయి వసతులు, అన్నిటిలోనూ రాయితీలు, సివిల్స్ లాంటి పరీక్షలకు గరిష్ట వయోపరిమితిలో పదేళ్ల వరకు సడలింపు, జీవితాంతం కుటుంబమంతటికీ ఉచితంగా పూర్తిస్థాయి వైద్య సదుపాయాలు, బీమా రక్షణ, సబ్సిడీ ధరలకు ఆహార సామగ్రి, విమాన, రైలు ప్రయాణాల్లో తగ్గింపులు, బంజరు భూముల కేటాయింపు, తక్కువ వడ్డీకి రుణాలు, ఉన్నత చదువుల కోసం వేతనంతో కూడిన సెలవు వంటి సదుపాయాలుంటాయి. పిల్లలకు ఉచిత చదువులు, ఉపకారవేతనాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉంటుంది. పదోన్నతులు: స్వల్ప వ్యవధిలోనే పదోన్నతులు లభిస్తాయి. ఆర్మీలో రెండేళ్ల సర్వీసు తర్వాత కెప్టెన్, తర్వాత మేజర్, లెఫ్టినెంట్ కల్నల్, కల్నల్ ఇలా పదోన్నతులు లభిస్తాయి. ఎయిర్ ఫోర్స్‌లో అయితే ఫ్లెయిట్ లెఫ్టినెంట్, స్క్యాడ్రన్ లీడర్, వింగ్ కమాండర్ వరుసలో పదోన్నతులు ఉంటాయి. ప్రతికూలతలు: ఇతర ఉద్యోగాల్లా నచ్చిన చోట పనిచేసే అవకాశం అన్ని వేళలా లభించదు. దేశంలో ఏ మూలనైనా పనిచేయాల్సి రావడం... కొండలు, లోయలు, గుట్టలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వర్తించాలి. అనుకున్న వెంటనే సెలవు దొరకకపోవడం, కొన్నిచోట్ల క్వార్టర్స్ సదుపాయం లేకపోవడంతో కుటుంబానికి దూరంగా గడపడం లాంటివి ఉద్యోగంలో ఎదురవుతాయి. ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 19, 2014. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 18, 2014. పరీక్ష తేదీ: అక్టోబర్ 26, 2014. పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ఫీజు రూ.200. ఎస్సీ, ఎస్టీ, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చు. లేదంటే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, ఎస్బీహెచ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. వెబ్సైట్: www.upsconline.nic.in ఇంగ్లిష్ అభ్యర్థులు ఇంగ్లిష్ భాషను ఏమాత్రం అర్థం చేసుకుంటున్నారో పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. ఇందులో బేసిక్ ఇంగ్లిష్ గ్రామర్, సరైన వాక్యాలను గుర్తించడం, యాంటోనిమ్స్, సినోనిమ్స్పై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్ పత్రికలను చదువుతూ వొకాబ్యులరీపై పట్టు సాధించవచ్చు. కొత్త పదాలను నేర్చుకోవడం, వాటిని వాక్యాల్లో ప్రయోగిస్తున్న సందర్భాలను గుర్తించడం చేయాలి. ఒక కొత్త పదాన్ని తెలుసుకుంటే వాటి యాంటోనిమ్స్, సినోనిమ్స్ను గుర్తించాలి. ప్రిపరేషన్‌కు రెన్ అండ్ మార్టిన్ హైస్కూల్ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకం, నార్మన్ లూయీస్ రాసిన వర్డ్ పవర్ మేడ్ ఈజీ బాగా ఉపయోగపడతాయి. The dacoit /many heinous crimes(P)/ had committed(Q)/who carried a reward of fifty thousand rupees (R)/ on his head(S) The correct sequence should be.. a) PQRS b) QPSR c) RQPS d) RSQP జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ కోసం దినపత్రికలు చదవాలి. న్యూస్ బులెటెన్లను చూడాలి. స్టాక్ జీకే కోసం ఏదైనా ప్రామాణిక జనరల్ నాలెడ్జ్ పుస్తకం చదివితే సరిపోతుంది. చరిత్ర, భూగోళశాస్త్రం, పాలిటీ, ఎకానమీ ప్రశ్నల కోసం ఎన్సీఈఆర్టీ 8, 9, 10 తరగతుల సోషల్ పుస్తకాలు చదవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డులు, ఆవిష్కరణల కోసం మనోరమ ఇయర్‌బుక్‌ను ఉపయోగించుకోవాలి. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇందులో పదో తరగతి లేదా తత్సమాన స్థాయిలోని అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థులు నంబర్ సిస్టమ్; ఫండమెంటల్ ఆపరేషన్స్; టైమ్ అండ్ వర్క్; సింపుల్, కాంపౌండ్ ఇంట్రస్ట్; రేషియో అండ్ ప్రొపోర్షన్, హెచ్‌సీఎఫ్, ఎల్సీఎం వంటి అంశాలపై పట్టుసాధించాలి. వీటికి ఆర్ఎస్ అగర్వాల్ అర్థమెటిక్ పుస్తకం ఉపయోగపడుతుంది. ట్రిగనోమెట్రీ, జియోమెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్లకు సంబంధించిన అంశాలు కూడా చాలా ముఖ్యమైనవి. సీబీఎస్ఈ లేదా స్టేట్ సిలబస్‌లోని 9, 10 తరగతుల పుస్తకాల్లోని వివిధ అంశాల సమస్యలను క్షుణ్నంగా ప్రాక్టీస్ చేయాలి. An aeroplane covers a certain distance at a speed of 240km-ph in 5 hours. To cover the same distance in 12/3hours, it must travel at a speed of: a) 300 km-ph b) 360 km-ph c) 600 km-ph d) 720 km-ph -
ఉద్యోగాలు
యూపీఎస్సీ - సీడీఎస్ఈ 2014 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఐఐ)-2014 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ విభాగాల్లో 464 పోస్టులను భర్తీ చేస్తారు. పోస్టులు: ఇండియన్ మిలిటరీ అకాడమీ: 200 ఇండియన్ నావెల్ అకాడమీ: 45 ఎయిర్‌ఫోర్స్ అకాడమీ: 32 ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ: పురుషులు-175, మహిళలు-12 అర్హతలు: అవివాహితులై ఉండాలి. సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీ పోస్టులకు 1990 జూలై 2 నుంచి 1996 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. మిలిటరీ అకాడమీ, నావెల్ అకాడమీ పోస్టులకు 1991 జూలై 2 నుంచి 1996 జూలై 1; ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు 1992 జూలై 2 నుంచి 1996 జూలై 1 మధ్య జన్మించి ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: ఆగస్టు18 రాత పరీక్ష తేది: అక్టోబరు 26 వెబ్సైట్: www.upsc.gov.in ఎస్ఎస్సీ- సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ 2014 స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ)‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ -2014’ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా 991 లోయర్ డివిజనల్ క్లర్క్, 1006 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తారు. అర్హతలు: ఇంటర్/ తత్సమాన అర్హతతో పాటు టైపింగ్ స్కిల్స్ ఉండాలి. వయసు: 18నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్టు ద్వారా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది:ఆగస్టు 19 రాత పరీక్ష తేది: నవంబరు 2, 9 వెబ్సైట్: http://ssc.nic.in