1. అగ్నికుల క్షత్రియులు కాని రాజపుత్ర
వంశం?
1) ఘార్జర ప్రతీహారులు
2) సోలంకీలు 3) పరమారులు 4) గహద్వాలులు
2. పంపకవితో ఘార్జర రాజ అని పిలిపించుకున్న ప్రతీహారరాజు?
1) మొదటి నాగభటుడు
2) మిహిర భోజుడు
3) మహీపాలుడు
4)మహేంద్ర పాలుడు
3. ఆదివరాహ అనే బిరుదు కలిగిన ప్రతీహార రాజు?
1) మిహిర భోజుడు
2) రెండో నాగభటుడు
3) వత్సరాజు 4) ధర్మ పాలుడు
4. అరబ్బుల దాడి నుంచి పశ్చిమ భారత దేశాన్ని కాపాడినవారు?
1) దంతి దుర్గుడు
2) మొదటి నాగభటుడు
3) మహీపాలుడు 4) గోపాలుడు
5. సులేమాన్ అనే అరబ్ యాత్రికుడు ఎప్పుడు భారత్‌ను సందర్శించాడు?
1) క్రీ.శ.851 2) క్రీ.శ.815
3) క్రీ.శ.805 4) క్రీ.శ.850
6. రాజశేఖరుడు ఎవరి ఆస్థానకవి?
1) మహేంద్ర పాలుడు
2) మిహిర భోజుడు
3) అమోఘ వర్షుడు
4) మొదటి నాగభటుడు
7. అల్‌మసూది ప్రకారం భారతదేశంలో అతి బలమైన అశ్విక దళాన్ని కలిగిన రాజులు?
1) ప్రతీహారులు 2) రాష్ర్టకూటులు
3) చౌహాన్‌లు 4) పాలరాజులు
8. మహ్మద్ గజిని దాడితో రాజధాని కనౌజ్‌ను వదిలి పారిపోయిన ప్రతీహార రాజు?
1) యశ పాలుడు 2) రాజ్య పాలుడు
3) రెండో భోజుడు 4) విజయ పాలుడు
9. దాసరూప గ్రంథాన్ని రచించిన పరమారుల ఆస్థాన కవి?
1) హలాయుధుడు 2) ధనిక
3) ధనుంజయ 4) పద్మగుప్త
10. కవి రాజు అనే బిరుదు ఉన్న రాజులు?
1) హాలుడు 2) సముద్ర గుప్తుడు
3) భోజుడు 4) అందరూ
11. పతంజలి యోగసూత్రాలపై వ్యాఖ్యానం రాసిన రాజు?
1) ముంజ 2) భోజ
3) మొదటి భీమ 4) కర్ణ
12. ఏ రాజు పాలనా కాలంలో మహ్మద్ గజనీ సోమనాథ్ దేవాలయంపై దాడి చేశాడు?
1) మొదటి భీమ
2) మొదటి నాగభటుడు
3) మొదటి భోజ
4) జయసింహ సిద్ధరాజ
13. సిద్ధ హేమచంద్ర అనే ప్రముఖ వ్యాకరణ గ్రంథ రచయిత?
1) సోమదేవుడు 2) హేమచంద్రుడు
3) మహావీరాచార్యుడు
4) శ్రీహర్షుడు
14. తన రాజ్యంలో జంతువధను నిషేధించిన జైనరాజు?
1) జయసింహ సిద్ధరాజ
2) అమోఘవర్ష 3) కుమారపాల
4) వాక్పతి ముంజ
15. కలికాల సర్వజ్ఞ అనే బిరుదు కలిగిన జైనకవి?
1) సోమదేవసూరి
2) హరి విజయసూరి
3) కాలకాచార్యుడు
4) హేమ చంద్రుడు
సమాధానాలు:
1) 4; 2) 3; 3) 1; 4) 2; 5) 1; 6) 1; 7) 1; 8) 2; 9) 3; 10) 4; 11) 2; 12) 1; 13) 2; 14) 3; 15) 4;
మాదిరి ప్రశ్నలు
Published Mon, Sep 16 2013 6:01 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
Advertisement
Advertisement