1. ఖజురహో దేవాలయాల గురించి తొలిసారిగా ప్రస్తావించిన విదేశీ చరిత్రకారుడు/ రచయిత?
1) సులేమాన్, అల్‌మసూదీ
2) అల్‌బెరూనీ, ఇబ్న్‌బతూతా
3) అబ్దుల్ రజాక్, అబ్దుల్ రహీం
4) వి.ఎ. స్మిత్, రాబర్‌ట సీవెల్
2. పంజాబ్ హిందూషాహీరాజు ఆనంద పాలుడి కూటమిలో చేరి మహ్మద్ గజనీ దాడిని ఎదుర్కొన్న చాందేల రాజు?
1) ధంగ 2) గండ
3) జయపాల 4) యశోవర్మన్
3. ఖజురహోలోని కందరీయ మహాదేవ ఆలయ నిర్మాత?
1) విద్యాధర 2) గండ
3) ధంగ 4) నన్నుక
4. కుతుబుద్దీన్ ఐబక్ దాడిని ఎదుర్కొన్న చాందేల రాజు?
1) త్రిలోక్య వర్మన్ 2) మదన వర్మన్
3) పరమార్థి దేవ 4) వీరవర్మన్
5. ఖజురహో దేవాలయాలను ఏ వాస్తు శిల్పకళాశైలికి పరాకాష్టగా భావిస్తారు?
1) ద్రావిడ 2) నగర
3) వెస్సార 4) ఇండో-పర్షియన్
6. తొలిసారిగా హిందీలో శాసనాలను జారీ చేసినవారు?
1) చౌహాన్‌లు 2) చాందేలులు
3) గహద్వాలులు 4) ప్రతీహారులు
7. కామసూత్ర శిల్పాలతో దేవాలయాలను నిర్మించినవారు?
1) చాందేలులు 2) చోళులు
3) పరమారులు 4) పాలరాజులు
8. కనౌజ్ రాజధానిగా పాలించిన రాజ వంశాలు?
1) మౌఖరీలు
2) మౌఖరీలు, ప్రతీహారులు
3) మౌఖరీలు, ప్రతీహారులు గహద్వాలులు
4) ఎవరూ కాదు
9. తురుష్క దండన అనే పన్నును విధించిన రాజు?
1) మూడో పృథ్వీరాజ్ చౌహాన్
2) గహద్వాల జయచంద్ర
3) చంద్రదేవ 4) ఆనంద పాలుడు
10. లక్ష్మీధరుడు కృత్యకల్పతరు గ్రంథాన్ని ఎవరి ఆస్థానంలో రచించాడు.
1) సిద్ధరాజ జయసింహ
2) గోవింద చంద్ర
3) పృథ్వీరాజ 4) జయచంద్ర
11. బంగారు నాణేలను జారీ చేసిన ఏకైక గహద్వాల రాజు?
1) గోవిందచంద్ర 2) జయచంద్ర
3) విజయచంద్ర
4) యశోవిగ్రహ
12. నైషధ చరితం గ్రంథకర్త?
1) శ్రీహర్షుడు 2) శ్రీనాథుడు
3) లక్ష్మీధరుడు 4) జయచంద్రుడు
13. మహ్మద్‌ఘోరీ ఏ యుద్ధంలో గహ ద్వాలులను అంతం చేశాడు?
1) మొదటి తరైన్
2) రెండో తరైన్
3) బనారస్ యుద్ధం
4) చాందావార్ యుద్ధం
14. కల్హణుడు ఏ కాశ్మీర్ రాజుకు సమకాలీనుడు?
1) హర్ష 2) క్షేమగుప్త
3) అవంతీవర్మన్
4) లలితాదిత్య ముక్తాపీడ
15. దిలికపుర (ఢిల్లీ) నగరాన్ని నిర్మించిన రాజవంశం?
1) చౌహాన్‌లు 2) ప్రతీహారులు
3) గహద్వాలులు 4) తోమారులు
సమాధానాలు:
1) 2; 2) 2; 3) 1; 4) 3; 5) 2; 6) 2; 7) 1; 8) 3; 9) 3; 10) 2; 11)1; 12) 1; 13) 4; 14) 1; 15) 4.
మాదిరి ప్రశ్నలు
Published Tue, Oct 8 2013 11:05 PM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement