నైసర్‌లో ప్రవేశాలకు | National Entrance Screening Test | Sakshi
Sakshi News home page

నైసర్‌లో ప్రవేశాలకు

Published Mon, Jan 2 2017 3:58 AM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

నైసర్‌లో ప్రవేశాలకు

నైసర్‌లో ప్రవేశాలకు

దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఫిజికల్, కెమికల్, మ్యాథమెటికల్,బయలాజికల్‌ సైన్సెస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ కోర్సులు చదవాలంటే మార్గం.. నేషనల్‌ ఎంట్రెన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (నెస్ట్‌). జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా నైసర్‌ – భువనేశ్వర్, యూఎం–డీఏఈ సీఈబీఎస్‌ల్లో ప్రవేశం పొందొచ్చు. అంతేకాకుండా ప్రతిభావంతులకు ఐదేళ్లపాటు ప్రతి నెలా రూ.5,000 ఇన్‌స్పైర్‌  స్కాలర్‌షిప్‌ ఇస్తారు.2017కు సంబంధించి నెస్ట్‌ ప్రకటన వెలువడిన నేపథ్యంలో అర్హతలు, పరీక్ష విధానంపై ఫోకస్‌..

నెస్ట్‌ ద్వారా ప్రవేశం కల్పించే విద్యా సంస్థలు
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌    అండ్‌ రీసెర్చ్‌ (నైసర్‌) – భువనేశ్వర్‌: కేంద్ర ప్రభుత్వంలోని అణుశక్తి శాఖ నైసర్‌ను ఏర్పాటు చేసింది. బేసిక్‌ సైన్సెస్‌లో విద్యార్థులకు అత్యుత్తమ పరిశోధన నైపుణ్యాలు అందించడమే ధ్యేయంగా నైసర్‌ కృషి చేస్తోంది. కోర్సులు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ (బయలాజికల్, కెమికల్, మ్యాథమెటికల్, ఫిజికల్‌ సైన్సెస్‌). కోర్సులు పూర్తిచేసినవారికి ప్రముఖ పరిశోధన సంస్థ హోమీబాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (హెచ్‌బీఎన్‌ఐ) సర్టిఫికెట్లు అందిస్తుంది.

మొత్తం సీట్లు: 170 (ఆలిండియా) + 2
(జమ్మూకశ్మీర్‌ విద్యార్థులకు)
వెబ్‌సైట్‌: http://www.niser.ac.in/


∙యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై – డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (యూఎం–డీఏఈ – సీఈబీఎస్‌) అందించే కోర్సులు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ (బయలాజికల్, కెమికల్, మ్యాథమెటికల్, ఫిజికల్‌ సైన్సెస్‌).
మొత్తం సీట్లు: 45 (ఆలిండియా) +2
  (జమ్మూ కశ్మీర్‌ విద్యార్థులకు)
వెబ్‌సైట్‌: http://www.cbs.ac.in/

అర్హత: u 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం) మార్కులతో ఇంటర్మీడియెట్‌ లేదా 10+2 ఉత్తీర్ణులు అర్హులు. అయితే విద్యార్థులు 2015/2016లో ఇంటర్మీడియెట్‌ పూర్తిచేసి ఉండాలి. 2017 మార్చి/ఏప్రిల్‌లో ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌ పరీక్షలు రాయనున్న విద్యార్థులు అర్హులే.

 నెస్ట్‌లో మెరిట్‌ జాబితాలో చోటు సాధించాలి.
వయోపరిమితి: జనరల్‌/ఓబీసీలు ఆగస్టు 1, 1997న లేదా తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

పరీక్ష విధానం
 మూడు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో మొత్తం ఐదు విభాగాలుంటాయి. మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ప్రశ్నలడుగుతారు. మొదటి సెక్షన్‌ జనరల్‌. దీనికి 30 మార్కులు కేటాయించారు. ఇతర నాలుగు సెక్షన్లలో బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌ల నుంచి ప్రశ్నలడుగుతారు. ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు ఉంటాయి. జనరల్‌ సెక్షన్‌ మినహాయించి సబ్జెక్టు విభాగాలకు నెగెటివ్‌ మార్కులుంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. జనరల్‌ సెక్షన్‌తోపాటు ఏవైనా మూడు విభాగాల్లో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి
తీసుకుంటారు.

ఎన్‌సీఈఆర్‌టీ/సీబీఎస్‌ఈ బుక్స్‌ చదివితే..
నెస్ట్‌ 10+2 స్థాయిలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ ఆధారంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు
ఎన్‌సీఈఆర్‌టీ ఎనిమిది, తొమ్మిది, పది, +1, +2 బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌
పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. సబ్జెక్టుల
వారీగా ముఖ్యమైన ప్రాథమిక భావనలు, నిర్వ
చనాలు, సిద్ధాంతాలను అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో చదవాలి. ముఖ్యాంశాలను చాప్టర్లవారీగా నోట్స్‌లా రూపొందించుకోవాలి.

జనరల్‌ సెక్షన్‌కు ఎలాంటి సిలబస్‌ లేదు. ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్‌ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ల్లో చారిత్రక సంఘటనలు, ముఖ్యాంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సైంటిఫిక్‌ ప్యాసేజ్‌ ఇచ్చి విశ్లేషణాత్మక సామర్థ్యాలు, సంగ్రహణ నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఈ విభాగంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి పదో తరగతి మ్యాథ్స్‌పై పట్టు సాధించాలి.

వెబ్‌సైట్‌లో పాత ప్రశ్నపత్రాలు
నెస్ట్‌ పరీక్ష విధానం, ప్రశ్నల శైలిని తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లో 2007 నుంచి 2016 వరకు నిర్వహించిన ప్రశ్నపత్రాలు, సమాధానాలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు వీటిని పరిశీలించి పరీక్ష విధానంపై అవగాహన పొందొచ్చు.

ప్రతి నెలా రూ.5000 స్కాలర్‌షిప్‌
నెస్ట్‌లో ర్యాంకు సాధించి ప్రవేశం లభించిన విద్యార్థులకు నివాస వసతి కల్పిస్తారు. రెండు క్యాంపస్‌ల్లో అత్యాధునిక లేబొరేటరీలు, కంప్యూటర్‌ సెంటర్లు, గ్రంథాలయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఆయా సబ్జెక్టుల్లో నిష్ణాతులు విద్యార్థులకు బోధిస్తారు.

నైసర్‌లో 60 మందికి, సీఈబీఎస్‌లో 25 మందికి ఐదేళ్లపాటు ప్రతి నెలా రూ.5000 ఇన్‌స్పైర్‌ స్కాలర్‌షిప్‌ ఇస్తారు. దీంతోపాటు సమ్మర్‌ ప్రాజెక్ట్‌ కోసం ఏటా రూ.20,000 చెల్లిస్తారు.

రెండు విద్యా సంస్థల్లో ఐదేళ్ల కోర్సు పూర్తిచేసుకొని మంచి గ్రేడ్‌ సాధించిన ప్రతిభావంతులను బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (బార్క్‌) ట్రైనింగ్‌ స్కూల్‌లో ప్రవేశాలకు ఇంటర్వూ్యకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులు రూ.700; ఎస్సీ, ఎస్టీలు, అన్ని కేటగిరీల మహిళలు, దివ్యాంగులు రూ.350 క్రెడిట్‌ కార్డ్‌/
డెబిట్‌ కార్డ్‌/నెట్‌ బ్యాంకింగ్‌ల ద్వారా చెల్లించాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌.

ముఖ్య తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం:
జనవరి 2, 2017
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది:
మార్చి 6, 2017
అడ్మిట్‌ కార్డ్స్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం:
ఏప్రిల్‌ 14, 2017
పరీక్ష తేది: మే 27, 2017
ఫలితాల ప్రకటన: జూన్‌ 16, 2017
వెబ్‌సైట్‌: https://nestexam.in/

గ్రాడ్యుయేట్స్‌ స్పెషల్‌

Advertisement

పోల్

Advertisement