ఫిజికల్ సైన్స్- మెథడాలజీ టెట్+డీఎస్సీ పేపర్-2 | PHYSICAL SCIENCE -METHODOLOGY TET DSC PAPER 2 | Sakshi
Sakshi News home page

ఫిజికల్ సైన్స్- మెథడాలజీ టెట్+డీఎస్సీ పేపర్-2

Published Fri, Sep 20 2013 10:48 PM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

ఫిజికల్ సైన్స్- మెథడాలజీ టెట్+డీఎస్సీ పేపర్-2

ఫిజికల్ సైన్స్- మెథడాలజీ టెట్+డీఎస్సీ పేపర్-2

1.    సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. ఇది?    
 1) యథార్థం     2) సత్యం
 3) భావన     4) పరికల్పన
 
 2.    ఏదైనా భౌతిక, జీవశాస్త్ర ప్రపంచానికి సంబంధించిన సామాన్యీకరణలే భావనలు అని తెలిపిన వారు?
 1) జేమ్స్ బి కోనెంట్ 2) ఆక్స్‌ఫర్‌‌డ
 3) జెడినోవెక్       4) కార్‌‌ల పియర్‌సన్
 
 3.    ధ్వని వేగానికి, పీడనానికి సంబంధం లేదని  చెప్పడం?
 1) నల్ ప్రకల్పన     
 2) ప్రకటనాత్మక ప్రకల్పన
 3) ప్రశ్నా ప్రకల్పన     
 4) ప్రాగుక్తీ ప్రకల్పన
 
 4.    ఆమోదించిన సిద్ధాంతం?
 1) నియమం     2) సూత్రం
 3) ప్రయోగం     4) పరికల్పన
 
 5.    శాస్త్రాన్ని అవలంబించే వ్యక్తి... శాస్త్రాన్ని అభివృద్ధి చేసే ప్రక్రియను వివరించడం?
 1) ద్రవ్యాత్మక నిర్మాణం
 2) విషయాత్మక నిర్మాణం
 3) ప్రక్రియాత్మక నిర్మాణం
 4) ఏదీకాదు
 
 6.    {పకృతి, పరిసరాలకు పరిమితమై సంచిత క్రమీకరించిన అభ్యసనమే విజ్ఞాన శాస్త్రం అని నిర్వచించింది?
 1) ఆక్స్‌ఫర్‌‌డ డిక్షనరీ     
 2) కొలంబియా ఎన్‌సైక్లోపీడియా
 3) పాట్రిక్     4) జేమ్స్
 
 7.    విజ్ఞానశాస్త్రం సంచిత అంతులేని అనుభవా త్మక పరిశీలనల సమూహం అని నిర్వచిం చింది?
 1) కార్‌‌ల పియర్‌సన్    2) ఫిట్జ్ పాట్రిక్
 3) అర్హీనియన్     4) జేమ్స్
 
 8.    విజ్ఞాన శాస్త్రం నేటి సత్యం గురించి మాట్లా డుతుంది. ఎల్లవేళలా ఉండే సత్యం గురించి మాట్లాడదు. ఇది?
 1) మూలభావన     2) పరికల్పన
 3) యథార్థం     4) భావన
 
 9.    వేడిచేసినపుడు ఇనుము సాగుతుంది. ఇది?
 1) యథార్థం    2) భావన
 3) పరికల్పన     4) ప్రాగుక్తీకరించడం
 
 10.    విద్యార్థి భావోద్రేకాలతో సంఘటితమై ఉండేవి?
 1) యథార్థాలు     2) సామాన్యీకరణలు
 3) భావనలు      4) పరికల్పనలు
 
 11.    పరిశీలించిన దృగ్విషయాల వివరణకు మూలాధార ఊహ?
 1) యథార్థం     2) భావన
 3) పరికల్పన     4) ప్రాగుక్తీకరించడం
 
 12.    శాస్త్రీయ ఫలితాలను సమర్థంగా వివరించేవి?
 1) యథార్థం    2) భావనలు
 3) ప్రాగుక్తీకరణలు     4) సిద్ధాంతాలు
 
 13.    శాస్త్ర ప్రక్రియ నిర్మాణంలో ఏ కృత్యం ప్రముఖ పాత్ర వహిస్తుంది?
 1) పరిశీలన     2) మాపనం
 3) వర్గీకరణ     4) పైవన్నీ
 
 14.    విజ్ఞాన శాస్త్ర పరిధి ఏ రంగానికి చెందుతుంది?
 1) లలిత కళలు     2) చిత్ర లేఖనం
 3) శిల్పకళ     4) పైవన్నీ
 
 15.    విజ్ఞానశాస్త్రంలో సిద్ధాంతాలు నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. అనేది?
 1) మెటాఫిజికల్ అప్రోచ్
 2) డెలైక్టిక్ అప్రోచ్
 3) పెరైండూ     4) ఏదీకాదు
 
 16.    కాంతి ఏడు రంగుల మిశ్రమం. ఇది ఏ రకమైన ప్రకల్పన?
 1) శూన్య ప్రకల్పన     2) ప్రశ్నా ప్రకల్పన
 3) ప్రాగుక్తీ ప్రకల్పన
 4) ప్రకటనాత్మక ప్రకల్పన
 
 17.    శాస్త్రీయ ప్రక్రియ నిర్మాణంలో ఇమడని కృత్యం?
 1) ప్రశ్నించడం    2) పరిశీలించడం
 3) నమ్మడం    4) ఊహించడం
 
 18.    జ్ఞాన సముపార్జనకు దోహదపడేది?
 1) తర్కం     2) స్పందన
 3) కంఠస్తం     4) అధికారత్వం
 
 19.    సాధారణీకరించిన ఊహ లేదా ఆలోచన?
 1) యథార్థం     2) సిద్ధాంతం
 3) సూత్రం     4) భావన
 
 20.    నిర్మాణంలో ఉన్న భవనంతో సైన్‌‌స నిర్మా ణాన్ని పోల్చవచ్చు అని పేర్కొన్నవారు?
 1) హెన్రీ పోయింకర్, ఆర్.సి. శర్మ
 2) జేమ్స్    3) రిచర్‌‌డ్స
 4) కొనాంట్
 
 21.    చేతి పనులకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలను కనుగొన్నవారు?
 1) హోమోసోపియన్‌‌స     
 2) బాబిలోనియన్‌లు
 3) మెసపొటోనియన్‌లు
 4) రష్యన్‌లు
 
 22.    భౌతిక శాస్త్ర పితామహుడు?
 1) గెలీలియో     2) బోర్
 3) న్యూటన్     4) హైగెన్‌‌స
 
 23.    ఞ విలువను కనుగొన్న శాస్త్రవేత్త?
 1) ఐన్‌స్టీన్     2) గెలీలియో
 3) ఆర్యభట్ట     4) న్యూటన్
 
 24.    లీలావతి గణితాన్ని రాసింది?
 1) ఆర్యభట్ట     2) భాస్కరాచార్యుడు
 3) లీలావతి     4) రామానుజన్
 
 25.    ఎట్రియటైస్ రాన్ కరె అనే పుస్తకాన్ని రాసిన శాస్త్రవేత్త?
 1) కోపర్నికస్     2) టైకోబ్రాహి
 3) ఐన్‌స్టీన్     4) గెలీలియో
 
 26.    లఘులోలకాన్ని కనుగొన్నవారు?
 1) గెలీలియో     2) విన్సెన్జీ
 3) హైగెన్‌‌స     4) న్యూటన్
 
 27.    గాలి అనేక వాయువుల మిశ్రమం అని తెలియజేసిన వారు?
 1) న్యూటన్     2) లెవోయిజర్
 3) హైగెన్‌‌స     4) పాల్ డి రాక్
 
 28.    ఉష్ణమాపకాన్ని కనుగొన్నవారు?
 1) సెల్సియస్     2) ఫారన్‌హీట్
 3) కెల్విన్     4) గెలీలియో
 
 29.    దిక్సూచిని కనుగొన్నవారు?
 1) గెలీలియో     2) హైగెన్‌‌స
 3) న్యూటన్     4) మాగ్నస్
 
 30.    ది లాస్ ఆఫ్ మోషన్ అనే గ్రంథ రచయిత?
 1) న్యూటన్     2) గెలీలియో
 3) ఫారడే     4) కోపర్నికస్
 
 31.    డైలాగ్ ఆన్ ది న్యూ సైన్‌‌స అనే పుస్తకాన్ని రాసిన వారు?
 1) ఐన్‌స్టీన్     2) ఫారడే
 3) గెలీలియో     4) న్యూటన్
 
 32.    పదార్థాలు మండటానికి, తుప్పు పట్టడా నికి, శ్వాస క్రియకు ఆక్సిజన్ అవసరమని నిరూపించినవారు?
 1) గెలీలియో    2) లెవోయిజర్
 3) న్యూటన్     4) హైగెన్‌‌స
 
 33.    మూలకాలు, సంయుక్త పదార్థాల గురించి శాస్త్రీయ పద్ధతిలో మొదట చెప్పిన శాస్త్రవేత్త?
 1) గెలీలియో     2) నీల్స్‌బోర్
 3) జాన్ డాల్టన్     4) రూథర్‌ఫర్‌‌డ
 
 34.    ఉష్ణోగ్రతతో పాటు నీటి సాంద్రత మారు తుంది అని కనుగొన్నవారు?
 1) నీల్స్‌బోర్     2) హైగెన్‌‌స
 3) జాన్ డాల్టన్     4) రూథర్‌ఫర్‌‌డ
 
 35.    అణుశాస్త్ర పితామహుడు?
 1) డాల్టన్     2) న్యూటన్
 3) నీల్స్‌బోర్     4) హైగెన్‌‌స
 
 36.    పరమాణు నిర్మాణం ప్రతిపాదనకు నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త?
 1) రూథర్‌ఫర్‌‌డ     2) నీల్స్‌బోర్
 3) మాక్స్‌వెల్     4) సోమర్‌ఫీల్డ్
 
 37.    ఆటమ్స్ ఫర్ పీస్ అవార్‌‌డ పొందిన శాస్త్రవేత్త?
 1) నీల్స్‌బోర్     2) హైగెన్‌‌స
 3) న్యూటన్     4) ఛాడ్విక్
 
 38.    డైనమో సృష్టికర్త?
 1) ఐన్‌స్టీన్     2) న్యూటన్
 3) ఫారడే     4) ఫ్లెమింగ్
 
 39. ఆన్ ఫారడేస్ లైన్‌‌స ఆఫ్ ఫోర్‌‌స అనే గ్రంథ రచయిత?
 1) ఫారడే     2) ఫ్లెమింగ్
 3) మాక్స్‌ఫ్లాంక్     4) మాక్స్‌వెల్
 
 40.    ఫారడే సిద్ధాంతాన్ని గణిత రూపంలోకి మార్చిన శాస్త్రవేత్త?
 1) మాక్స్‌వెల్     2) మాక్స్‌ఫ్లాంక్
 3) ఫ్లెమింగ్     4) ఐన్‌స్టీన్
 
 41.    ఆన్ ఫిజికల్ లైన్ ఆఫ్ ఫోర్‌‌స గ్రంథ రచయిత?
 1) మాక్స్‌ఫ్లాంక్     2) మాక్స్‌వెల్
 3) ఫారడే     4) పాల్ డి రాక్
 
 42.    విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదిం చిన శాస్త్రవేత్త?
 1) మాక్స్‌వెల్     2) న్యూటన్
 3) మాక్స్ ఫ్లాంక్     4) ఫారడే
 
 43.    ఎలక్ట్రాన్ తరంగ స్వభావ వివరణపై నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్త?
 1) ష్రోడింజర్     2) డీబ్రోగ్లీ
 3) ఫారడే     4) ఫ్లెమింగ్
 
 44.    ద ఫిజికల్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ క్వాంటం థియరీని ప్రచురించిన శాస్త్రవేత్త?
 1) మాక్స్‌వెల్     2) హైగెన్‌‌స
 3) హైసన్‌బర్‌‌గ     4) న్యూటన్
 
 45.    ఫిజిక్స్ అండ్ ఫిలాసఫీ, ఫిజిక్స్ అండ్ బియాండ్ గ్రంథాల రచయిత?
 1) మాక్స్‌వెల్     2) హైసన్ బర్‌‌గ
 3) మాక్స్‌ఫ్లాంక్     4) న్యూటన్
 
 46.    క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది?
 1) మాక్స్‌వెల్     2) మాక్స్‌ఫ్లాంక్
 3) న్యూటన్     4) హైగెన్‌‌స
 
 47.    సౌర గడియారాన్ని తొలుత తయారు చేసిన వారు?
 1) మెసపొటోనియన్లు
 2) బాబిలోనియన్లు
 3) ఈజిప్షియన్‌లు    4) గ్రీకులు
 
 48.    కింది వాటిలో విజ్ఞాన శాస్త్రాన్ని అభ్యసిం చటం ద్వారా విద్యార్థి పొందే ప్రయోజనా లను, యోగ్యతలను తెలియపరిచేవి?
 1) ఉద్దేశాలు     2) విలువలు
 3) పై రెండూ     4) ఏదీకాదు
 
 49.    విద్యార్థుల్లో ఆశించే నిర్ణీత ప్రవర్తనా మార్పులకు వేటిని రూపొందించుకోవాలి?
 1) బోధనా లక్ష్యాలు 2) ప్రవర్తనా లక్ష్యాలు
 3) పై రెండూ      4) ఏదీకాదు
 
 50.    దీర్ఘకాలికంగా చేరుకోవాల్సిన లక్ష్యం?
 1) గమ్యం     2) ఉద్దేశం
 3) లక్ష్యం     4) స్పష్టీకరణ
 
 51.    ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశిత మైనవే గమ్యాలు అని చెప్పినవారు?
 1) రిచర్‌‌డ వైట్ ఫీల్డ్     2) జె.కె.సూద్
 3) వివేకానంద     4) గాంధీజీ
 
 52.    కింది వాటిలో నియమిత కాలంలో చేరుకునేవి?
 1) గమ్యం     2) ఉద్దేశం
 3) లక్ష్యం     4) స్పష్టీకరణ
 
 53.    విద్యార్థిలో విలువలను పెంపొందించడం?
 1) గమ్యం     2) ఉద్దేశం
 3) లక్ష్యం     4) స్పష్టీకరణ
 
 54.    పాఠ్యాంశంలో విజ్ఞానశాస్త్ర స్థానాన్ని నిర్ణయించేవి?
 1) గమ్యాలు     2) ఉద్దేశాలు
 3) లక్ష్యాలు     4) స్పష్టీకరణలు
 
 55.    బోధనకు, మూల్యాంకనాలకు ఆధారమైనవి?
 1) ఉద్దేశాలు    2) గమ్యాలు
 3) లక్ష్యాలు     4) స్పష్టీకరణలు
 
 సమాధానాలు
 1) 1;    2) 3;    3) 1;    4) 1;     5) 3;
 6) 2;    7) 2;    8) 1;    9) 1;    10)3;
 11) 3;    12) 4;    13) 4;    14) 4;    15)2;
 16) 4;    17) 3;    18) 3;    19) 4;    20)1;
 21) 1;    22) 3;    23) 2;    24) 2;    25)1;
 26) 1;    27) 2;    28) 4;    29) 1;    30)2;
 31) 3;    32) 2;    33) 3;    34) 3;    35)1;
 36) 2;    37) 1;    38) 3;    39) 4;    40)1;
 41) 2;    42) 1;    43) 2;     44) 3;     45)2;
 46) 2;    47) 3;    48) 2;    49) 1;    50) 1.
 51) 2;    52) 2;    53) 2;    54) 2;    55) 3.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement