బ్యాంకింగ్ కొలువుల బొనాంజా... | Small Industries Development Bank of India 880 Posts Release Notification | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్ కొలువుల బొనాంజా...

Published Thu, Jul 10 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

బ్యాంకింగ్ కొలువుల బొనాంజా...

బ్యాంకింగ్ కొలువుల బొనాంజా...

 బ్యాంకింగ్ రంగం మరోసారి కొలువుల బొనాంజాను సిద్ధం చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ), స్మాల్ ఇండ స్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి)లు.. వివిధ హోదాల్లో 880 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి.. ఈ నేపథ్యంలో సంబంధిత నియామక ప్రక్రియ విధివిధానాలపై విశ్లేషణ..
 
 స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిడ్బి)
     హోదా:    అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఎ జనరల్ స్ట్రీమ్)
     ఖాళీలు:    80 (జనరల్-23, ఎస్సీ-12, ఎస్టీ-6,
     ఓబీసీ-21, పీడబ్ల్యూడీ-18)
 
 ఎంపిక విధానం:
 రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్షలో నిర్దేశించిన అర్హత మార్కులు సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఎంపికైన ప్రతి అభ్యర్థి విధిగా మూడేళ్లపాటు బ్యాంకుకు తమ సేవలు అందిస్తామని సర్వీస్ బాండ్‌ను సమర్పించాలి.ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. దీన్ని నాలుగేళ్లకు కూడా పెంచవచ్చు.అర్హత: 60 శాతం(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55శాతం) మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా మాస్టర్స్ డిగ్రీ. సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏ, ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ వం టి ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
 
     వయసు: 21-28 ఏళ్లు (జూలై 1, 2014 నాటికి)
     దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
     దరఖాస్తు ఫీజు: రూ. 500 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు మినహాయింపునిచ్చారు)
     ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జూలై 20, 2014.
     ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూలై 20, 2014.
     దరఖాస్తును ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ:
 ఆగస్టు 8, 2014.
     వివరాలకు:
     http://ibps.sifyitest.com, www.sidbi.in
 
 
 క్లరికల్ స్థాయి ప్రశ్నలు..
 సాధారణంగా ఇటువంటి రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అడిగే ప్రశ్నలు క్లిష్టంగా కాకుండా.. సులభంగా కాకుండా మధ్యస్తంగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఐబీపీఎస్ క్లరికల్ కేడర్ పోస్టులకు నిర్వహించే పరీక్ష స్థాయి ప్రశ్నలు ఈ పరీక్షల్లో ఎదురవుతాయని చెప్పొచ్చు. కాబట్టి అటువంటి ప్రిపరేషన్ సరిపోతుంది. ఇంటర్వ్యూల్లో ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుత పరిస్థితులపై ప్రశ్నలు వస్తాయి. సంబంధిత రంగం పట్ల అవగాహనను పరీక్షిస్తారు. ఈ క్రమంలో నూతన బ్యాంకుల ఏర్పాటు, లెసైన్స్ విధానం, ప్రస్తుతం దేశంలో బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ఎన్‌పీఏ, బ్యాంకింగ్ టెక్నాలజీ వంటి అంశాలపై ఎక్కువ శాతం ప్రశ్నలు అడుగుతారు. సమకాలీన అంశాల (కరెంట్ అఫైర్స్)పై కూడా ప్రశ్నలు వస్తాయి. బ్యాంకింగ్ రంగానికి మీరు ఏవిధంగా సరిపోతారు, ముఖ్యంగా ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడానికి కారణాలు, భవిష్యత్ లక్ష్యం వంటి అంశాలను నిశితంగా పరిశీలిస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను కూడా గమనిస్తారు.
 -కె.వి.జ్ఞాన కుమార్,
 బ్యాంకింగ్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
 
 ఐడీబీఐ
     హోదా:    అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ
     ఖాళీలు:    500
     (జనరల్-238, ఎస్సీ-75, ఎస్టీ-37, ఓబీసీ-135, పీడబ్ల్యూడీ-15)
 
 ఎంపిక విధానం:
 రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ రెండు దశల్లో నిర్దేశించిన విధంగా మార్కులను సాధించిన అభ్యర్థులకు మాత్రమే తుది జాబితాలో చోటు లభిస్తుంది. నిర్దేశించిన కేంద్రాల్లో ఓబీసీ/ఎస్టీ/ఎస్సీ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్‌ను కూడా బ్యాంక్ అందిస్తుంది.
 
 రాత పరీక్ష:
 రాత పరీక్షను ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. రెండు గంటల (120 నిమిషాలు)పాటు జరిగే ఈ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. అవి..
 విభాగం    ప్రశ్నలు    మార్కులు
 రీజనింగ్    50    50
 ఇంగ్లిష్ లాంగ్వేజ్    50    50
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్    50    50
 జనరల్ అవేర్‌నెస్ (స్పెషల్
 రిఫరెన్స్ టు బ్యాంకింగ్ సెక్టార్)    50    50
 మొత్తం    200    200
 
 నేరుగా కాదు:
 ఎంపికైన అభ్యర్థులకు నేరుగా పోస్టింగ్ ఇవ్వరు. తమ అవసరాలకనుగుణంగా శిక్షణ ఇవ్వడానికి ఐడీబీఐ, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌తో అవగాహన కుదుర్చుకుంది. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులు ఐడీబీఐ-మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్-బెంగళూరు, అందించే ఏడాది వ్యవధి గల పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(పీజీడీబీఎఫ్) కోర్సులో చేరాల్సి ఉంటుంది. ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు మణిపాల్ యూనివర్సిటీ నుంచి పీజీడీబీఎఫ్ పట్టాను ప్రదానం చేయడమే కాకుండా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్-ఎ హోదాను ఖరారు చేస్తారు.
 
 స్టైపెండ్-బాండ్:
 పీజీడీబీఎఫ్ కోర్సులో మొదటి 9 నెలలు శిక్షణనిస్తారు. తర్వాతి 3 నెలలు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. మొదటి 9 నెలల శిక్షణ కాలంలో నెలకు రూ. 2,500 స్టైపెండ్ చెల్లిస్తారు. ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ. 10,000 స్టైపెండ్ లభిస్తుంది. కోర్సులో చేరే ముందే ప్రతి అభ్యర్థి విధిగా మూడేళ్లపాటు బ్యాంకుకు తమ సేవలు అందిస్తామని సర్వీస్ బాండ్‌ను సమర్పించాలి. కోర్సు ఫీజు: రూ. 3 లక్షల 50 వేలు (నివాస, వసతి, కోర్సు ఫీజు తదితరాలు కలిపి). అయితే అవసరమైన అభ్యర్థులకు నిబంధనల మేరకు ఐడీబీఐ.. విద్యారుణాలను అందజేస్తుంది.
 
 నోటిఫికేషన్ సమాచారం:
     అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్
     వయసు: 26 ఏళ్లు (జూన్ 1, 2014 నాటికి)
     దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
     దరఖాస్తు ఫీజు: రూ. 600 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 100)
     దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ:
 జూలై 12, 2014
 
     ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూలై 12, 2014
     రాత పరీక్ష తేదీ: ఆగస్టు 22, 2014
     వెబ్‌సైట్: www.idbi.com
 
 బ్యాంక్ ఆఫ్ బరోడా
 
     హోదా:    పొబేషనరీ ఆఫీసర్
     (జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/స్కేల్-1)
     ఖాళీలు:    300 (జనరల్-151, ఎస్సీ-45, ఎస్టీ-23,
     ఓబీసీ-81, పీడబ్ల్యూడీ-15)
 
 ఎంపిక విధానం: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. రాత పరీక్షలో అర్హత సాధించిన వారు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ దశలకు హాజరు కావాల్సి ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు 1:4 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తారు. ఈ మూడు దశల్లో నిర్దేశించిన విధంగా మార్కులను సాధించిన అభ్యర్థులకు మాత్రమే తుది జాబితాలో చోటు లభిస్తుంది.
 రాత పరీక్షను ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు. రెండు గంటల (120 నిమిషాలు)పాటు జరిగే ఈ పరీక్షలో నాలుగు విభాగాలు ఉంటాయి. అవి..
 
 విభాగం    ప్రశ్నలు    మార్కులు
 రీజనింగ్    50    50
 ఇంగ్లిష్ లాంగ్వేజ్    50    50
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్    50    50
 జనరల్ అవేర్‌నెస్    50    50
 మొత్తం    200    200
 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు.
 
 కోర్సును పూర్తి చేస్తేనే:
 ఎంపికైన అభ్యర్థులను నేరుగా సర్వీస్‌లోకి తీసుకోరు. వీరు ముందుగా బ్యాంక్ నిర్దేశించిన విధంగా శిక్షణను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌తో అవగాహన కుదుర్చుకుంది. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులు బరోడా-మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్-బెంగళూరు, అందించే ఏడాది వ్యవధి గల పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్)లో చేరాల్సి ఉంటుంది. కోర్సు సమయంలో సంవత్సరానికి రూ. 52,500 స్టైపెండ్ చెల్లిస్తారు. ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి మాత్రమే ప్రొబేషనరీ ఆఫీసర్ (జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/స్కేల్-1) పోస్టును ఖరారు చేస్తారు. వార్షిక వేతనం రూ. 3 లక్షలు. కోర్సులో చేరే ముందే ప్రతి అభ్యర్థి విధిగా రెండేళ్లపాటు బ్యాంకుకు తమ సేవలు అందిస్తామని సర్వీస్ బాండ్‌ను సమర్పించాలి. కోర్సు ఫీజు: రూ. 3 లక్షల 45 వేలు (నివాస, వసతి, కోర్సు ఫీజు, తదితరాలు కలిపి). అవసరమైన అభ్యర్థులకు 8 శాతం వడ్డీతో బ్యాంక్ ఆఫ్ బరోడా విద్యారుణాలను మంజూరు చేస్తుంది.
 
 నోటిఫికేషన్ సమాచారం:
 అర్హత: 60 శాతం (ఎస్సీ/ఎస్టీ/పీడ బ్ల్యూడీ అభ్యర్థులకు 55 శాతం) మార్కులతో గ్రాడ్యుయేషన్/తత్సమానం.
 
     వయసు: 20-28 ఏళ్లు (జూలై 16, 2014)
     దరఖాస్తు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
     దరఖాస్తు ఫీజు: రూ. 550 (ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ. 50)
     ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: జూలై 16, 2014
     ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూలై 16, 2014.
     రాత పరీక్ష తేదీ: ఆగస్టు 14, 2014.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement