Spoken English | Spoken English | Sakshi
Sakshi News home page

Spoken English

Published Thu, Apr 28 2016 3:52 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

Spoken English

Spoken English


 మనలో చాలామందికి ఇంగ్లిష్‌కు సంబంధించి చాలా సందేహాలున్నాయి. ఇలాంటివాటన్నిటిని తొలగించుకుంటే మనం ఇంగ్లిష్‌లో నిష్ణాతులు కావచ్చు. ఇంగ్లిష్‌కు సంబంధించి మనలో ఎలాంటి అపోహలున్నాయో తెలుసుకుందాం.  రీసెంట్‌గా జరిగిన పనిని Present perfect tenseలోనే చెప్పితీరాలి అని గట్టిగా నమ్మడం. సందర్భం: కెవిన్ అనే వ్యక్తి వరండాలో కూర్చొని పెయ్పర్ (పేపర్ అని పలకరు) చదువుకుంటున్నాడు. అతని భార్య లిసా ఏదో పనిలో ఉంది. వాళ్ల అబ్బాయి బాల్కనీలో ఆడుకుంటున్నాడు. ఇంతలో ఏదో  కింద పడ్డ శబ్దం వచ్చింది. అప్పుడు జరిగిన సంభాషణ..
 
 Kevin: Oh my God, did you hear that?
 (ఆ శబ్దం విన్నావా?)
 Lisa: Bob dropped his toy.
 (అబ్బాయి తన ఆట వస్తువును కింద పడేశాడు)  ఆ అబ్బాయి తన ఆట వస్తువును కింద పడేసి రెండు క్షణాలైనా కాలేదు. ఆ విషయం గురించి అతని తల్లిదండ్రులు Past simple tenseలో మాట్లాడుకుంటున్నారు. కాదూ కెవిన్ ఇక్కడ  Present perfect tenseనే వాడాలంటారా? అయితే Have you heard that?? అంటూ కెవిన్ ఈ సందర్భంలో Present perfect tenseలోనే మాట్లాడితే నష్టమేంటో చూద్దాం.
 
 Kevin: Oh my God, have you heard that?  
 (ఆ శబ్దం విన్నావా? ఇంకా విన్లేదా?)
 Lisa: I am busy now. I will hear it later (ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను. తర్వాత వింటాను)
 ఆట వస్తువును పై నుంచి కిందకి పడేస్తే వచ్చే శబ్దాన్ని అది వచ్చినప్పుడే వింటారుగానీ తీరిగ్గా తర్వాత వినడం ఏంటి అని నవ్వుకుంటున్నారా? నిజానికి అది నవ్వుకోవాల్సిన విషయమే.  have you heard అంటే ఇప్పటివరకు విన్నావా లేదా? అని అర్థం వస్తుంది.  Present perfect tensఛలో ఇలా ప్రశ్నిస్తే ఞట్ఛట్ఛ్ట వరకు అంటే ఇప్పటివరకు వినడం జరిగిందా లేదా అని అర్థం. అందుకే లిసా ‘తర్వాత వింటాను’ అని పరిహాసం చేసింది. అకస్మాత్తుగా వచ్చే శబ్దాలను అవి వచ్చినప్పుడు మాత్రమే వినడం సాధ్యమవుతుంది. అందువల్ల ఈ సందర్భంలో did you hear that?? అంటూ Past simple tenseలోనే మాట్లాడతారు. శబ్దం వచ్చి ఎంత సమయం గడిచింది అనే విషయానికి ఎలాంటి పట్టింపూ ఉండదు. (tenseను నిర్ణయించడంలో ఇది criteria కానేకాదు) సందర్భానికి, భావానికి ఏ tense సరిపోతుందో దాన్నే ఉపయోగిస్తాం.
   రామేశ్వర్‌గౌడ్,
 సబ్జెక్ట్ నిపుణులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement