ఆకర్షణీయ వేతనాలతో, కేంద్ర ప్రభుత్వ కొలువుల్లో కుదురుకునేందుకు వీలుకల్పించే పరీక్ష.. ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్)! ఇందులో విజయం సాధించడం ద్వారా ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్‌స్పెక్టర్, డివిజనల్ అకౌంటెంట్, ట్యాక్స్ అసిస్టెంట్ వంటి గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగాలను చేజిక్కించుకోవచ్చు. తాజాగా సీజీఎల్ పరీక్షకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల వివరాలు, పరీక్ష విధానం, సిలబస్, విజయానికి వ్యూహాలు తదితరాలపై స్పెషల్ ఫోకస్...
ఉద్యోగాల వివరాలు
గ్రూప్ బి: సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వంటి విభాగాల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు, ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్, సీబీఈసీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్), సబ్ ఇన్‌స్పెక్టర్ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోస్ట్స్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్), స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2(స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ).గ్రూప్ సి: కాగ్,సీజీడీఏ, సీజీఏ తదితరుల పరిధిలోని కార్యాలయాల్లో ఆడిటర్/ఆకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్. వివిధ విభాగాల్లో అప్పర్ డివిజన్ క్లర్క్, ట్యాక్స్ అసిస్టెంట్ (సీబీడీటీ/సీబీఈసీ), కంపైలర్ (రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా), సబ్ ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్), డివిజనల్ అకౌంటెంట్ (కాగ్), ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఐటీ.
అర్హత:
కంపైలర్ ఉద్యోగం: ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్/ మ్యాథమెటిక్స్ సబ్జెక్టుగా ఉండే గ్రూప్‌లో బ్యాచిలర్ డిగ్రీ. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2: 12వ తరగతిలో మ్యాథమెటిక్స్‌లో కనీసం 60 శాతం మార్కులుండాలి. దీంతోపాటు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.ఇతర ఉద్యోగాలు: గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ.శారీరక ప్రమాణాలు: ఇన్‌స్పెక్టర్ (సెంట్రల్ ఎక్సైజ్/ ఎగ్జామినర్/ ప్రివెంటివ్ ఆఫీసర్/ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ (సీబీఎన్) పోస్టులకు.. ఎత్తు: 157.5 సెం.మీ, ఛాతీ: 81 సెం.మీ. (గాలి పీలిస్తే 5 సెం.మీ. పెరగాలి). మహిళలు-152 సెం.మీ. బరువు: 48 కిలోలు. సీబీఐ-సబ్‌ఇన్‌స్పెక్టర్స్: పురుషులకు ఎత్తు 165 సెం.మీ., ఛాతీ: 76 సెం.మీ; మహిళలకు ఎత్తు 150 సెం.మీ. ఉండాలి.
వయసు:
2015, ఆగస్టు 1 నాటికి అసిస్టెంట్ (సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్)కు 20-27 ఏళ్లు, అసిస్టెంట్ (ఇంటెలిజెన్స్ బ్యూరో)కు 21-27 ఏళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ (సీబీఐ)కు 20-30 ఏళ్లు, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-2కు గరిష్ట వయసు 32 ఏళ్లు, సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎన్‌ఐఏ)కు గరిష్ట వయసు 30 ఏళ్లు. ఇతర ఉద్యోగాలకు 18-27 ఏళ్లు.ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ప్రిపరేషన్
జనరల్ ఇంటెలిజెన్స్: ఇది సులభమైన విభాగం. ఏదైనా ప్రామాణిక పుస్తకంలోని సమస్యలను బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ‘ఏ మోడర్న్ అప్రోచ్ టు వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్- ఆర్.ఎస్.అగర్వాల్’ పుస్తకం ఉపయోగకరం. గత ప్రశ్నపత్రాల ఆధారంగా వెయిటేజీని గుర్తించి ఆయా అంశాలను ప్రాక్టీస్ చేయాలి. ైఛీఛీ ఝ్చ ౌఠ్ట, కోడింగ్-డీకోడింగ్, అనాలజీ, క్లాసిఫికేషన్ చాప్టర్లు ముఖ్యమైనవి. మిర్రర్ ఇమేజస్ వంటి బొమ్మల ఆధారిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం తప్పనిసరి. తొలుత ముఖ్యమైన అంశాల ప్రిపరేషన్ పూర్తిచేసి గత ప్రశ్నపత్రాలను, మోడల్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయాలి.
జనరల్ అవేర్‌నెస్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ బేసిక్స్ కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు సరిపోతాయి. పాలిటీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ (ఆధునిక చరిత్ర ముఖ్యమైనది) సబ్జెక్టుల నుంచి ప్రాథమిక అంశాలపై, ఎకానమీకి సంబంధించి నిర్వచనాల నుంచి నేరుగా ప్రశ్నలు వస్తున్నాయి. కరెంట్ అఫైర్స్ కోసం వార్తాపత్రికలు, ఓ ప్రామాణిక మ్యాగజైన్ సరిపోతుంది.
జనరల్ ఇంగ్లిష్: ఇందులో వొకాబ్యులరీ, గ్రామర్, కాంప్రెహెన్షన్‌లకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. ఇడియమ్స్/ప్రేజెస్, ఫిల్ ఇన్‌ది బ్లాంక్స్, సినోనిమ్స్/ యాంటోనిమ్స్ వంటి అంశాలను ప్రాక్టీస్ చేయాలి. యాంటోనిమ్స్/సినోనిమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వెయిటేజీ తక్కువ కాబట్టి వాటికోసం ఎక్కువ సమయం కేటాయించడం అనవసరం. ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లిష్-ఆర్.ఎస్.అగర్వాల్, జనరల్ ఇంగ్లిష్-ఎస్‌బీ బక్షి వంటి పుస్తకాల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకొని, రెండు సార్లు చదవాలి.
జనరల్ ఇంగ్లిష్‌లో అంశాల వారీగా వస్తున్న ప్రశ్నలు:
అంశం టైర్-1 టైర్-2 మొత్తం
ఎర్రర్ డిటెక్షన్ 5 20 25
స్పెల్లింగ్ టెస్ట్ 2 3 5
పాసేజెస్ 10 30 40
ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ 5 5 10
సినోనిమ్స్ 3 3 6
యాంటోనిమ్స్ 3 3 6
ఇడియమ్స్ అండ్ ప్రేజెస్ 5 10 15
సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్ 10 22 32
వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్స్ 7 12 19
క్లోజ్ టెస్ట్ 25 25
స్క్రాంబుల్డ్ సెంటెన్సెస్ 20 20
వాయిస్ 20 20
స్పీచ్ 27 27
మొత్తం 50 200 250
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: కాన్సెప్టులను బాగా అర్థం చేసుకొని, చిన్నచిన్న ట్రిక్‌లతో సమస్యలను ప్రాక్టీస్ చేయడం ద్వారా అధిక మార్కులు సాధించవచ్చు. ఇటీవల కాలంలోని ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే టైర్-1లోని 50 ప్రశ్నల్లో 30 ప్రశ్నలు జామెట్రీ, ట్రిగనోమెట్రీ, పర్సంటేజీల అప్లికేషన్స్, ఆల్జీబ్రాల నుంచి వచ్చాయి. అందువల్ల వీటిని పదో తరగతి స్థాయిలో ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఆప్షన్ల నుంచి సమాధానాలు గుర్తించేలా సాధన చేయాలి. డేటా ఇంటర్‌ప్రిటేషన్ ముఖ్యమైన అంశం. బ్యాంకింగ్ మ్యాథ్స్, ఎస్‌ఎస్‌సీ మ్యాథ్స్ భిన్నమైనవి. దీన్ని గుర్తించి ప్రిపరేషన్ కోసం ప్రామాణిక పుస్తకాలను ఎంపిక చేసుకోవాలి.
వివిధ చాప్టర్లు-సగటున వస్తున్న ప్రశ్నలు:
అంశం టైర్-1 టైర్-2 మొత్తం
జామెట్రీ 9 22 53
ట్రిగనోమెట్రీ 8 12 32
ఆల్జీబ్రా 6 11 28
పర్సంటేజెస్ అప్లికేషన్స్ 8 21 50
యావరేజెస్+అలిగేషన్స్ 3 5 13
నంబర్ సిస్టమ్స్ 2 6 14
రేషియో, ప్రొపోర్షన్స్ 3 6 15
టైమ్ అండ్ వర్క్ 2 5 12
టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ 2 5 12
ఇతర అంశాలు 2 2 6
డేటా ఇంటర్‌ప్రెటేషన్ 5 5 15
మొత్తం 50 100 250
సమయపాలన కీలకం:
మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేసేటప్పుడు టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యమైనది. ఈ కింది విధానంలో ప్రాక్టీస్ చేస్తే అత్యధిక మార్కులు రావడం ఖాయం.
రీజనింగ్ (గరిష్టంగా 20-25 నిమిషాలు):
45+ మార్కులు సాధించాలి.
జనరల్ అవేర్‌నెస్ (గరిష్టంగా 30-35 నిమిషాలు):
30+మార్కులు సాధించాలి.
జనరల్ ఇంగ్లిష్ (గరిష్టంగా 20 నిమిషాలు):
30+మార్కులు సాధించాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (గరిష్టంగా 55 నిమిషాలు):
35+మార్కులు సాధించాలి.
గత ప్రశ్నపత్రాలు, నమూనా ప్రశ్నపత్రాల సాధన విజయానికి కీలకమైంది. దీనివల్ల నెగిటివ్ మార్కింగ్ నుంచి తప్పించుకోవచ్చు. వేగం, కచ్చితత్వం పెరుగుతుంది.
రోజువారీగా ప్రిపరేషన్ ప్రణాళికలను రూపొందించుకోవాలి. అవసరాన్ని బట్టి ఏ సబ్జెక్టుకు ఎంత సమయం కేటాయించాలో చూసుకోవాలి.
టైర్-1,టైర్-2 పరీక్షలను చూస్తే మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ చాలా ముఖ్య విభాగాలని తెలుస్తోంది. అందువల్ల ప్రిపరేషన్‌లో వాటికి ఎక్కువ సమయం కేటాయించాలి.
టైర్-1 కటాఫ్స్ (200 మార్కులకు)
కేటగిరీ 2013 2014
ఓపెన్ 96 96.50
ఓబీసీ 81.50 82
ఎస్సీ/ఎస్టీ 75.25/70.25 77/69.50
టైర్ 1+ై టెర్ 2 (600 మార్కులు)
(ఇంటర్వ్యూ/ఇంటర్వ్యూ లేని పోస్టులకు)
కేటగిరీ 2013
ఓపెన్ 424.50/401
ఓబీసీ 395.75/368.50
ఎస్సీ/ఎస్టీ 359.25/334 - 345.75/314
-ఎన్.వినయ్‌కుమార్ రెడ్డి, డెరైక్టర్,
Indian Academy for Competitive Exams(IACE)
ఎంపిక విధానం
మూడు దశల్లో ఉంటుంది. అవి.. టైర్-1 పరీక్ష, టైర్-2 పరీక్ష. టైర్-1లో అర్హత సాధించినవారు మాత్రమే టైర్-2 పరీక్ష రాసేందుకు వీలవుతుంది. రెండు పరీక్షల్లో సాధించిన ప్రతిభ ఆధారంగా మూడో దశ అయిన పర్సనాలిటీ టెస్ట్ కం ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
కేంద్ర కొలువులకు నగారా!
Published Thu, May 14 2015 5:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM
Advertisement
Advertisement