తెలుగు కంటెంట్ | telugu content | Sakshi
Sakshi News home page

తెలుగు కంటెంట్

Published Mon, Sep 2 2013 11:26 PM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM

తెలుగు కంటెంట్

తెలుగు కంటెంట్

ఆధునిక కవులు-కావ్యాలు, రచనలు-రచయితలు
 1.    నవ్యాంధ్ర కవిత్వానికి భావ కవిత్వమని పేరు  పెట్టిన రచయిత?
     1) రాయప్రోలు
     2) గాడిచర్ల హరి సర్వోత్తమరావు
     3) దేవులపల్లి
     4) తల్లావ జఝల శివశంకర శాస్త్రి
 
 2.    భావ కవిత్వంపై ఉన్న ఆంగ్ల కవితా ధోరణి ప్రభావం?
     1) మిస్టిసిజం    2) సింబాలిజం
     3) రొమేంటిసిజం    4) సర్రీయలిజం
 
 3.    భావగీతమనే పదాన్ని తొలిసారిగా ప్రయో గించిన కవి?
     1) రాయప్రోలు   2) కృష్ణశాస్త్రి
     3) బసవరాజు  4) నాయని సుబ్బారావు
 
 4.    కవి స్వీయానుభూతి వర్ణనకు ప్రాధాన్యం ఉన్న కవిత్వం?
     1) వస్త్వాశ్రయ    2) పరాశ్రయ
     3) ఆత్మాశ్రయ    4) వైయక్తిక
 
 5.    అమలిన శృంగార సిద్ధాంతాన్ని ప్రతిపాదిం చిన కవి?
     1) శివశంకర శాస్త్రి    2) రాయప్రోలు
     3) విశ్వనాథ    4) కృష్ణశాస్త్రి
 
 6.    1930లో తల్లావజఝల హృదయేశ్వరి మా ఉద్గ్రంథమని చెప్పిన కవి?
     1) విశ్వనాథ    2) దేవులపల్లి
     3) శ్రీశ్రీ    4) కరుణశ్రీ
 
 7.    తొలి జాతీయోద్యమ గీతం భరత ఖండంబు చక్కని పాడియావు - రాసిన కవి?
     1) పానుగంటి     2) గురజాడ
     3) రాయప్రోలు    4) చిలకమర్తి
 
 8.    మాకొద్దీ తెల్లదొరతనం గేయ రచయిత?
     1) వేములపల్లి శ్రీకృష్ణ
     2) గరిమెళ్ల సత్యనారాయణ
     3) చిలకమర్తి  4) మంగిపూడి వేంకటశర్మ
 
 9.    కృష్ణపక్షం కావ్య రచయిత?
     1) విశ్వనాథ     2) తల్లావ జఝల
     3) బసవరాజు   4) దేవులపల్లి కృష్ణశాస్త్రి
 
 10. ఆంధ్ర ప్రశస్తి ఖండ కావ్య రచయిత?
     1) కొడాలి సుబ్బారావు
     2) విశ్వనాథ సత్యనారాయణ
     3) వేదుల     4) మధునాపంతుల
 
 11. హంపీ క్షేత్రం కావ్య రచయిత?
     1) కొడాలి సుబ్బారావు   2) చిలకమర్తి
     3) పానుగంటి             4) విశ్వనాథ
 
 12. ఆంధ్ర పురాణం రచయిత?
     1) వేదుల సత్యనారాయణ
     2) మధునాపంతుల సత్యనారాయణ
     3) విశ్వనాథ సత్యనారాయణ
     4) పుట్టపర్తి
 
 13. శివతాండవం కావ్య కర్త?
     1) గడియారం శేషశాస్త్రి
     2) శేషేంద్రశర్మ
     3) పుట్టపర్తి నారాయణాచార్యులు
     4) దాశరథి
 
 14. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత?
     1) మల్లెమాల
     2) శంకరంబాడి సుందరాచారి
     3) డా॥
     4) వానమామలై వరదాచార్యులు
 
 15.    చిలకమర్తి లక్ష్మీ నరసింహం బిరుదు?
     1) ఆంధ్రా కాళిదాసు 2) ఆంధ్రా వర్‌‌డ్సవర్‌‌త
     3) ఆంధ్రా స్కాట్    4) ఆంధ్రా షేక్స్పియర్
 
 16. ఆంధ్రా వర్‌‌డ్సవర్‌‌త బిరుదున్న తెలుగు కవి?
     1) కృష్ణశాస్త్రి    2) శ్రీశ్రీ
     3) రాయప్రోలు
     4) కవికొండల వేంకటరావు
 
 17. అభ్యుదయ కవిత్వానికి నూతన కవాటాలు తెరిచిన శ్రీశ్రీ గేయం?
     1) కవితా, ఓ కవితా   2) జయభేరి
     3) ప్రతిజ్ఞ       4) జగన్నాథ రథ చక్రాలు
 
 18.    వర్గ సంఘర్షణ - విప్లవ ప్రబోధం - సమ సమాజ నిర్మాణం వంటి లక్షణాలతో వచ్చి న కవితా ధోరణి?
     1) భావ కవిత్వం
     2) అభ్యుదయ కవిత్వం
     3) విప్లవ కవిత్వం    4) దిగంబర కవిత్వం
 
 19.    మరోప్రస్థానం కావ్యకర్త?
     1) ఆరుద్ర    2) అనిశెట్టి
     3) శ్రీశ్రీ    4) దాశరథి
 
 20. త్వమేవాహమ్ కావ్యకర్త?
     1) దాశరథి    2) ఆరుద్ర
     3) అనిశెట్టి    4) కాళోజీ
 
 21.    సోమసుందర్ వజ్రాయుధంలో ఇతివృత్తం?
     1) వర్గ పోరాటం
     2) స్వాతంత్య్ర పోరాటం
     3) తెలంగాణ పోరాటం
     4) ప్రత్యేకాంధ్ర పోరాటం
 
 22.    డా॥రాసిన కర్పూర వసంత రాయలు, విశ్వంభర ఏ ప్రక్రియకు చెందిన గ్రంథాలు?
     1) పద్య కావ్యం - గేయ కావ్యం
     2) చారిత్ర గేయకావ్యం - వచన కవిత్వం
     3) వచన కవిత్వం - గేయ కావ్యం
     4) వచన కావ్యం - నాటకం
 
 23. కవితా పుష్పకం రచించిన కవి?
     1) కాళోజీ    2) ఆరుద్ర
     3) దాశరథి కృష్ణమాచార్యులు
     4) డా॥
 
 24. అనిశెట్టి అగ్నివీణ, గాలిమేడలు ఏ ప్రక్రియ కు చెందిన గ్రంథాలు?
     1) పద్య కావ్యం - నాటిక
     2) గేయ కావ్యం - నాటకం
     3) వచన కవిత్వం - నవల
     4) పద్య కావ్యం - కథానిక
 
 25.    వీరిలో దిగంబర కవులు?
     1) జ్వాలాముఖి - ఓల్గా - చెరబండరాజు
     2) మహాస్వప్న-సుప్రసన్న-సుగమ్‌బాబు
     3) జ్వాలాముఖి -మహాస్వప్న-చెరబండ
         రాజు
     4) నిఖిలేశ్వర్-సోమసుందర్ - అద్దేపల్లి
 
 26. ఈ దేశంలో, ఈ భూగోళంలో ఊపిరి పీల్చే ప్రతిమనిషి కోసం తపనపడి, అతని భావిని చూసి వెక్కి వెక్కి ఏడ్చి, పిచ్చెత్తి ప్రవచించిన కవిత?
     1) విప్లవ కవిత    2) పైగంబర కవిత
     3) స్త్రీవాద కవిత    4) దిగంబర కవిత
 
 27.    నీలిమేఘాలు కవితా సంపుటి ఏ
      ఉద్యమానికి సంబంధించింది?
     1) అభ్యుదయ కవిత
     2) దిగంబర కవిత
     3) స్త్రీవాద కవిత
     4) దళితవాద కవిత
 
 28. అసలు మా అమ్మే నడుస్తున్న వంట గదిలా ఉంది అన్న కవయిత్రి?
     1) ఓల్గా    2) విమల
     3) సావిత్రి    4) కొండేపూడి నిర్మల
 
 29.    విప్లవ రచయితల సంఘం ఏర్పడిన సంవత్సరం?
     1) 1974    2) 1975
     3) 1970    4) 1980
 
 30.    కష్టజీవులం మేము - కమ్యూనిస్టులం
     అవునన్నా కాదన్నా అదే ఇష్టులం అన్నకవి?
     1) శ్రీశ్రీ    2) గద్దర్
     3) వరవరరావు
     4) సుబ్బారావు పాణిగ్రాహి
 
 31. ప్రజను సాయుధం చేస్తున్న రెవెల్యూషనరీ నేటి కవి - అన్నవారు?
     1) గద్దర్     2) నగ్నముని
     3) శివసాగర్    4) జ్వాలాముఖి
 
 32.    రాయలసీమ కన్నీటి గాథ ఇతివృత్తంగా వచ్చిన కావ్యం?
     1) చితీ-చింత    2) పెన్నేటి పాట
     3) నాగులేటి పాట    4) మేఘ దూతం
 
 33.    ఆంధ్రా షెల్లీగా ప్రసిద్ధి చెందిన కవి?
     1) తల్లావ జఝల    2) విశ్వనాథ
     3) అబ్బూరి రామకృష్ణారావు
     4) దేవులపల్లి కృష్ణశాస్త్రి
 
 34. హేతువాద కవితా ఉద్యమకర్త?
     1) నార్ల వేంకటేశ్వరరావు
     2) త్రిపురనేని రామస్వామి చౌదరి
     3) తాపీ ధర్మారావు    4) గురజాడ
 
 35. త్రిపురనేని సూత పురాణం, శంబూక వధ అనే గ్రంథాలు ఏ ప్రక్రియకు చెందినవి?
     1) గేయకావ్యం - నవల
     2) పద్యకావ్యం - కథానిక
     3) పద్యకావ్యం - నాటకం
     4) వచన కావ్యం - నాటిక
 
 36.    వేమన పద్యాలను సేకరించి ప్రచురించిన పాశ్చాత్య పండితుడు?
     1) మెకంజీ    2) సి.పి.బ్రౌన్
     3) కాల్డ్వెల్    4) హెన్రీమోరిస్
 
 37. లాల్‌సలాం, కూలోల్ల పిల్ల పాటల ద్వారా ప్రజల్లో ఉత్తేజం కలిగించిన కవి?
     1) శివసాగర్    2) చెరబండరాజు
     3) వంగపండు ప్రసాదరావు    4) గద్దర్
 
 38. సాక్షి వ్యాసాల రచయిత?
     1) చిలకమర్తి    2) పానుగంటి
     3) గురజాడ      4) గిడుగు రామమూర్తి
 
 39.     తొలి స్త్రీవాద కవయిత్రి?
     1) జయప్రభ     2) సావిత్రి
     3) ఓల్గా    4) విమల
 
 40.    పాఠం ఒప్పజెప్పకపోతే పెళ్లిచేస్తానని పంతులుగారన్నప్పుడే భయం వేసింది  అన్న కవయిత్రి?
     1) ఓల్గా     2) సావిత్రి
     3) ఘంటసాల నిర్మల
     4) పాటిబండ్ల రజని
 
 41.    బతకడానికి నానాచావులు చస్తున్న వాళ్లం చావటానికి మా దగ్గరకు రాకండి అన్న కవయిత్రి?
     1) విమల     2) మహెజబీన్
     3) ఓల్గా     4) జయప్రభ
 
 42.    పంచమ వేదం కవితా సంపుటి కర్త?
     1) కత్తి పద్మారావు       2) సతీష్ చందర్
     3) ఎండ్లూరి సుధాకర్ 4) శిఖామణి
 
 43.    కవిని నేను వర్ణచాపాన్ని విరగ్గొట్టడానికి వచ్చిన దళిత కవిని నేను అని ప్రకటించిన కవి?
     1) సతీష్ చందర్     2) కత్తి పద్మారావు
     3) శిఖామణి     4) కొలకలూరి ఇనాక్
 
 44.    కట్టమంచి రామలింగారెడ్డి రచనల్లో కవిత్వ తత్వ విచారం, ముసలమ్మ మరణం ఏ ప్రక్రియలకు చెందినవి?
     1) విమర్శ- గేయ కావ్యం
     2) కవిత్వ- నవల
     3) వ్యాస సంపుటి - కథానిక
     4) విమర్శ - పద్య కావ్యం
 
 45.    రాయప్రోలు వారి రచనల్లో స్నేహలత, రమ్యాలోకం ఏ ప్రక్రియలకు చెందినవి?
     1) పద్య కావ్యం - నవల
     2) పద్య కావ్యం- లక్షణ గ్రంథం
     3) గేయ కావ్యం- కథా సంపుటి
     4) పద్య కావ్యం- వ్యాస సంపుటి
 
 46.    కృష్ణశాస్త్రి రచనల్లో రుతుచక్రం, అప్పుడు పుట్టి ఉంటే ఏ ప్రక్రియలకు చెందినవి?
     1) ఖండ కావ్యం- కథానిక
     2) యక్ష గానం- వ్యాస సంపుటి
     3) సంగీత రూపకం- వ్యాస సంపుటి
     4) సంగీత రూపకం- నవల
 
 47.    దువ్వూరి రామిరెడ్డి రచించిన కృషీ వలుడు- కాంగ్రెస్ వాలా ఏ ప్రక్రియలకు చెందినవి?
     1) పద్య కావ్యం - కథానిక
     2) పద్య కావ్యం- నాటకం
     3) గేయ కావ్యం- నాటిక
     4) పద్య కావ్యం- వ్యాస సంపుటి
 
 48.    ఎంకి పాటల రచయిత?
     1) బసవరాజు అప్పారావు
     2) కృష్ణశాస్త్రి     3) విశ్వనాథ
     4) నండూరి సుబ్బారావు
 
 49.    జాషువా  రచనల్లో గబ్బిలం, నా కథ ఏ ప్రక్రియలకు చెందినవి?
     1) ఖండ కావ్యం- జీవిత చరిత్ర
     2) సందేశ కావ్యం - స్వీయ చరిత్ర
     3) పద్య కావ్యం- నాటిక
     4) గేయ కావ్యం - నాటిక
 
 50.    కరుణశ్రీ రచనల్లో విజయశ్రీ, తెలుగుబాల ఏ ప్రక్రియలకు చెందినవి?
     1) ఖండ కావ్యం- నాటిక
     2) గేయ కావ్యం- శతకం
     3) ధ్వని కావ్యం - శతకం
     4) శతకం- నాటిక
 
 సమాధానాలు
 1) 2    2) 3    3) 1    4) 3    5) 2
 6) 3    7) 4    8) 2    9) 4    10) 2
 11) 1    12) 2    13) 3    14) 2    15) 3
 16) 3    17) 2    18) 2    19) 3    20) 2
 21) 3    22) 2    23) 3    24) 2    25) 3
 26) 4    27) 3    28) 2    29) 3    30) 4
 31) 3    32) 2    33) 4    34) 2    35) 3    
 36) 2    37) 4    38) 2    39) 3    40) 2    
 41) 3    42) 2    43) 3    44) 4    45) 2
 46) 3    47) 2    48) 4    49) 2    50) 3
 

Advertisement
Advertisement