మొదటి మానవ నాగరికత ఎక్కడ ప్రారంభమైంది?
1. పాచీన శిలాయుగం నాటి పని ముట్లు ఏ నదీ పరివాహక ప్రాంతంలో లభించాయి?
ఎ) గంగా బి) బ్రహ్మపుత్ర
సి) సింధూ డి) సోన్
2. మొనదేలిన శిలా పరికరాలను మానవుడు మొదట ఏ యుగంలో ఉపయోగించాడు?
ఎ) లోహ యుగం బి) ప్రాచీన శిలా యుగం
సి) మధ్యరాతి యుగం డి) కొత్తరాతి యుగం
3. ఏ కాలంలో కుమ్మరి చక్రాన్ని కనుగొన్నారు?
ఎ) క్రీ.పూ. 5000-1000 సంవత్సరాల మధ్య
బి) క్రీ.పూ. 8000-6000 సంవత్సరాల మధ్య
సి) క్రీ.పూ. 10000-8000 సంవత్సరాల మధ్య
డి) క్రీ.పూ. 2000-100 సంవత్సరాల మధ్య
4. తెలంగాణలోని ఏ ప్రాంతంలో నవీన శిలా యుగంలోని నివాస స్థలాలు కనిపించాయి?
ఎ) ఉట్నూరు బి) పాలంపేట
సి) విజయపురి డి) గుండాల
5. మధ్య శిలా యుగం: నిప్పు:: నవీన శిలా యుగం:--?
ఎ) ఆభరణాలు బి) ఉన్ని వస్త్రాలు
సి) కుమ్మరి చక్రం డి) మొనదేలిన పని ముట్లు
6. నవీన శిలాయుగ మానవులు ఏయే దేశాలతో విదేశీ వ్యాపారం చేసేవారు?
ఎ) పోర్చుగల్, స్పెయిన్
బి) గ్రీకు, ఈజిప్టు
సి) గ్రీకు, రోమ్, అరేబియా
డి) ఈజిప్టు, రోమ్, పోర్చుగల్
7. మానవుడు మొట్ట మొదట ఏ యుగంలో వ్యవసాయం చేయడం ప్రారంభించాడు?
ఎ) పాతరాతి యుగం బి) మధ్యరాతి యుగం
సి) కొత్తరాతి యుగం డి) లోహ యుగం
8. లోహ యుగం ఎప్పుడూ ప్రారంభమైంది?
ఎ) క్రీ.పూ. 6000 సంవత్సరం
బి) క్రీ.పూ. 5000 సంవత్సరం
సి) క్రీ.పూ. 3500 సంవత్సరం
డి) క్రీ.పూ. 2750 సంవత్సరం
9. మానవుడు మొదట ఉపయోగించిన లోహం?
ఎ) రాగి బి) తగరం
సి) కాంస్యం డి) ఇనుము
10. చరిత్ర పూర్వ యుగాన్ని రాతి యుగం అని ఎందుకు పిలుస్తారు?
ఎ) ఆది మానవుడు రాతి గుహల్లో నివసించడంతో
బి) ప్రాచీన మానవుడు రాళ్లపై చిత్రాలు గీయడం వల్ల
సి) ఆది మానవుడి చరిత్రకు ఆధారం రాళ్లపై చెక్కిన బొమ్మలు కావడం
డి) {పాచీన యుగ మానవుడు ఉపయోగించిన వస్తువులు రాతితో చేసినవి కావడంతో
11. పాలియోలిథిక్ అంటే?
ఎ) లోహ యుగం బి) నవీన శిలాయుగం
సి) పాతరాతి యుగం డి) కాంస్య యుగం
12. పూర్వ చారిత్రక యుగాన్ని తెలుసుకోవడానికి ఆధారం?
ఎ) లిఖిత గ్రంథాలు బి) లోహ శాస్త్రం
సి) పురావస్తు శాస్త్రం డి) పైవన్నీ
13. ఉత్ఖాతనం అంటే?
ఎ) పురావస్తు తవ్వకాలు
బి) రాతి పనిముట్లు
సి) పురాతత్వవేత్తల పరిశోధనలు
డి) ఆదిమ కాలం నాటి మట్టి దిబ్బలు
14. సింధులోయ నాగరికత గురించి మొదట అధ్యయనం చేసిన పురాతత్వ శాస్త్రవేత్త?
ఎ) మార్టిమర్ వీలర్ బి) సర్ జాన్ మార్షల్
సి) ఎస్.ఆర్. రావ్ డి) ఆర్.సి. దత్
15. సింధు నాగరికతకు సమకాలీనమైన నాగరికతలు?
ఎ) ఈజిప్టు, మెసపటోమియా
బి) మెసపటోమియా, చైనా
సి) రోమ్, గ్రీక్ డి) ఈజిప్టు,చైనా, రోమ్
16. పురాతన పనిముట్లను మార్టిమర్ వీలర్ ఏమని వర్ణించాడు?
ఎ) అమూల్యమైన శిలాజాలు
బి) ఆదిమకాల జీవులు
సి) పురాతత్వ ప్రాణులు
డి) ప్రాచీన కాల మనుషులు
17. భూమిపై ఆవిర్భవించిన మొదటి ప్రాణి?
ఎ) మానవుడు బి) లార్వా
సి) ప్లాజిలెట్టం డి) ఏప్
18. ఆధునిక మానవునికి సమీప పూర్వీకులుగా ఏవరిని భావిస్తారు?
ఎ) హోమెఎరక్టస్ మానవుడు
బి) నియాన్‌డెర్తల్ నరుడు
సి) అస్ట్రోఫిథికస్
డి) హోమోసెపియన్స్
19. కింది వాటిలో సరైంది?
ఎ) పాతరాతి యుగం-బలమైన సాంఘిక సంబంధాలు
బి) మధ్యశిలా యుగం-స్థిర నివాసం
సి) నవీన శిలాయుగం-రాగితో చేసిన పనిముట్లు
డి) లోహ యుగం-చేనేత కళ ఆరంభం
20. మొదటి మానవ నాగరికత ఎక్కడ ప్రారంభమైంది?
ఎ) సింధు నదిలోయ ప్రాంతంలో
బి) నైలు నది పరివాహక ప్రాంతంలో
సి) మెసపటోమియాలో
డి) చైనాలో
21. ఏ సంవత్సరంలో జరిపిన తవ్వకాలలో సింధులోయ నాగరికత గురించి మనకు తెలిసింది?
ఎ) క్రీ.శ. 1922 బి) క్రీ.శ. 1879
సి) క్రీ.శ. 1857 డి) క్రీ.శ. 1918
22. సింధు నాగరికత కాలం నాటి మహాస్నాన వాటికను ఏ నగరంలో గుర్తించారు?
ఎ) మొహంజోదారో బి) హరప్పా
సి) కాళీభంగన్ డి) లోథాల్
23. హరప్పా నాగరికత ప్రజలను ఎలా పిలుస్తారు?
ఎ) సింధులు బి) ఆర్యులు
సి) ఆటవికులు డి) ద్రావిడులు
24. {దావిడులకు తెలియని లోహం?
ఎ) రాగి బి) తగరం
సి) ఇనుము డి) కంచు
25. సింధు లోయ నాగరికత ప్రజల ప్రధాన ఆహారం?
ఎ) వరి బి) బార్లీ
సి) రాగులు డి) చిరు ధాన్యాలు
26. మొట్ట మొదట పెదవులకు రంగులు వాడిన మహిళలు?
ఎ) ద్రావిడులు బి) ఆర్యులు
సి) మెసపటోమియన్లు డి) చైనీయులు
27. సింధు ప్రజలకు ఏయే దేశాలతో వాణిజ్య సంబంధాలుండేవి?
ఎ) ఈజిప్టు, రోమ్ బి) గ్రీక్, టర్కీ
సి) ఇరాన్, ఇరాక్ డి) సిరియా, సాదీ అరేబియా
28. సింధు నాగరికత కాలం నాటి ముఖ్య రేవు పట్టణం?
ఎ) హరప్పా బి) లోథాల్
సి) చన్హుదారో డి) మొహంజోదారో
29. హరప్పా ప్రజల ఆరాధ్య దేవత?
ఎ) అమ్మతల్లి బి) భూమాత
సి) ప్రకృతి దేవత డి) ఏవీకావు
30. సింధులోయ నాగరికత ప్రజల లిపిని బొమ్మలిపిగా పిలుస్తారు. ఈ లిపిని రాయటాన్ని సర్పలేఖనం అంటారు. సర్పలేఖనం అంటే?
ఎ) ఒక వరుసను కుడి నుంచి ఎడమకు తర్వాతి వరుసను ఎడమ నుంచి కుడికి రాయడం
బి) ఒక వరుసను కుడి నుంచి ఎడమకు తర్వాతి వరుసను వదిలి తిరిగి కుడి నుంచి ఎడమకు రాయడం
సి) ఒక వరుసను ఎడమ నుంచి కుడికి తర్వాతి వరుసను కుడి నుంచి ఎడమకు రాయడం
డి) ఒక వరుసను ఎడమ నుంచి కుడికి తర్వాతి వరుసను కూడా ఎడమ నుంచి కుడికి
రాయడం
31. సింధు ప్రజల లిపికి ఏయే దేశాల ప్రాచీన లిపులతో పోలికలు ఉన్నట్లుగా తెలుస్తోంది?
ఎ) చైనా, అరేబియా
బి) గ్రీస్, ఈజిప్టు
సి) గ్రీస్, మెసపటోమియా
డి) ఈజిప్టు, మెసపటోమియా
32. కింది వాటిలో సరికానిది?
ఎ) కాళీభంగన్-ఉత్తరప్రదేశ్
బి) ధోల్‌వీరా-గుజరాత్
సి) బన్సాలీ-హర్యానా
డి) రోపార్-పంజాబ్
33. కింది వాటిలో హరప్పా నాగరికతకు సంబంధించని విశేషం?
ఎ) మాతృస్వామిక వ్యవస్థ
బి) పశుపోషణ ప్రధాన వృత్తి
సి) అలంకార ప్రియత్వం
డి) పట్టణ సమాజం
34. సింధులోయ నాగరికత ప్రజలు ఏ లోహంతో తయారైన వంట సామాగ్రిని ఉపయోగించేవారు?
ఎ) ఇనుము బి) రాగి
సి) కంచు డి) అల్యూమినియం
35. హరప్పా నాగరికత విలసిల్లిన కాలం?
ఎ) క్రీ.పూ. 3000-1500 మధ్య
బి) క్రీ.పూ. 2750-1000 మధ్య
సి) క్రీ.పూ. 2500-1250 మధ్య
డి) క్రీ.పూ. 2300-1750 మధ్య
36. సూక్ష్మ శిలాయుగంగా పేరుగాంచింది?
ఎ) నవీన శిలా యుగం బి) లోహయుగం
సి) పాతరాతి యుగం డి) మధ్య శిలాయుగం
37. {పపంచంలో అతి పురాతన గ్రామం?
ఎ) బటాక్వెస్ (మెక్సికో) బి) అస్ట్రఖాస్ (రష్యా)
సి) జెరిఖో (జోర్డాన్) డి) కాళీభంగన్ (ఇండియా)
38. సింధులోయ ప్రాంతంలో నివసించిన ప్రజల అవశేషాలు, శిధిలాలను ఎక్కడ కనుగొన్నారు?
ఎ) బెలుచిస్థాన్ బి) మొహంజాదారో
సి) హరప్పా డి) అలంగీర్‌పూర్
39. {పపంచంలోనే అత్యంత ఎక్కువ మొత్తంలో విస్తరించిన నాగరికత?
ఎ) ఆర్య బి) సింధు
సి) నైలు డి) యుఫ్రటిస్
40. సింధు నాగరికత కాలం నాటి నర్తకి బొమ్మ ఎక్కడ తవ్వకాల్లో బయటపడింది?
ఎ) సుక్తాజెండార్ బి) కోట్‌డిజి
సి) చన్హుదారో డి) మొహంజాదారో
41. వేదం అంటే?
ఎ) పవిత్ర గ్రంథం
బి) పవిత్ర ఆధ్యాత్మిక గ్రంథం
సి) పవిత్ర వాక్కు
డి) పవిత్ర ఆభరణీయ సూత్రాలు
42. అతి పురాతన వేదం?
ఎ) అధర్వణ వేదం బి) సామ వేదం
సి) రుగ్వేదం డి) యజుర్వేదం
43. తొలి వేద (రుగ్వేద) నాగరికత కాలం?
ఎ) క్రీ.పూ. 1000-600 బి) క్రీ.పూ.1500-600
సి) క్రీ.పూ. 1500-1000 డి) క్రీ.పూ. 1000-200
44. ఆర్యులు స్థిరపడిన ప్రాంతం?
ఎ) గంగా-యమునా మధ్య ప్రాంతం
బి) సింధు-సట్లేజ్ మధ్య ప్రాంతం
సి) సోన్-బెట్కా మధ్య ప్రాంతం
డి) నర్మద-తపతి పరివాహక ప్రాంతం
45. ఆర్యులు ద్రావిడులను ఏమని పిలిచేవారు?
ఎ) ఆటవికులు బి) బ్రాహ్మణులు
సి) దస్యులు డి) పురులు
46. ఆర్యులు భారతదేశంలో స్థిరపడిన విధానాన్ని తెలిపే చారిత్రక ఆధారం?
ఎ) రామాయణం బి)మహాభారతం
సి)భగవద్గీత డి) రుగ్వేదం
47. దశమ రాజ్య యుద్ధం ఎవరెవరికి జరిగింది?
ఎ) ఆర్యులు, ఆర్యేతరులు
బి) ఆర్యులు, ద్రావిడులు
సి) భరతులు, ఆర్య తెగల కూటమి
డి) ఆర్య తెగల కూటమి, దస్యుల కూటమి
48. రుగ్వేదంలో అత్యంత సాధారణ నేరంగా పేర్కొంది?
ఎ) పశువులను దొంగిలించడం
బి) కిడ్నాప్ సి) హత్య డి) మానభంగం
49. ఆర్యనాగరికతలో తండ్రిని ఏమని పిలిచే వారు?
ఎ) ఆర్యన్ బి) రాజన్
సి) గృహస్థ డి) గృహపతి
50. రుగ్వేద ఆర్యుల ప్రధాన ధనం?
ఎ) గోవులు బి) బంగారు నగలు
సి) భూమి డి) వేదాలు
సమాధానాలు:
1) డి; 2)సి; 3) ఎ; 4) ఎ; 5) సి;
6) బి; 7) బి; 8) బి; 9) ఎ; 10) డి;
11) సి; 12) సి; 13) ఎ; 14) బి; 15)ఎ;
16) డి; 17) బి; 18) డి; 19) బి; 20) సి;
21) ఎ; 22) ఎ; 23) డి; 24) సి; 25) బి;
26) ఎ; 27) సి; 28) బి; 29) ఎ; 30) సి;
31) డి; 32) ఎ; 33) బి; 34) సి; 35) డి;
36) డి; 37) సి; 38) సి; 39) బి; 40) డి;
41) బి; 42) సి; 43) బి; 44) ఎ; 45) సి;
46) డి; 47) సి; 48) ఎ; 49) డి; 50) ఎ.