Human civilization
-
యుగాంతం వస్తే .. భూమ్మీద నిలిచే సజీవ సాక్ష్యాలివే
-
పల్నాడులో మూడు వేల ఏళ్లనాటి నాగరికత గుర్తింపు.. ప్రత్యేకత ఇదే?
పల్నాడు.. పౌరుషగడ్డ. పల్నాడు అంటే.. రాజ్యాల మధ్య కాలుదువ్విన కోడిపుంజులు కనిపిస్తాయి. వెయ్యేళ్ల కిందట అధికారం, ఆధిపత్యం కోసం సాగిన యుద్ధభేరీ వినిపిస్తుంది. వీరులకు గుడికట్టిన సంప్రదాయం కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు చరిత్ర. కానీ.. కృష్ణానది ఒడ్డున పల్నాట క్రీస్తుపూర్వం 3 వేల ఏళ్లనాడే గొప్ప మానవ నాగరికత విలసిల్లింది. కిలోమీటర్ల మేర బృహత్ శిలాయుగపు (మెగాలిథిక్) సమాధుల రూపంలో నిక్షిప్తమైంది. మాచర్ల, వెల్దుర్ది మండలాల్లో పురావస్తు అధికారులు, పరిశోధకుల వెలికితీతతో ఆదిమ మానవ జీవనం ప్రపంచానికి పరిచయం అవుతోంది. సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా మాచర్ల మండలం అచ్చమ్మకుంట తండా అటవీ ప్రాంతంలో కృష్ణాతీరం వెంబడి ఆదిమ మానవ సంస్కృతి విస్తరించింది. ఇక్కడ దాదాపు ఐదు కిలోమీటర్ల మేర 300 నుంచి 400 వరకు సమాధులు బయటపడ్డాయి. ఇంత పెద్ద ఎత్తున వరుసక్రమంలో ప్రాచీన కాలపు సమాధులు దేశంలో ఎక్కడా లేవు. ఇక్కడ అత్యధిక సంఖ్యలో గృహ సమాధి (డాల్మెన్), గూడు సమా«ధులు (సిస్ట్ బరియల్) ఉన్నాయి. ఈ సమాధుల నిర్మాణంలో వాస్తుశా్రస్తాన్ని పాటించడం విశేషం. అన్నింటిని దక్షిణం వైపు ద్వారం ఉండేలా నిరి్మంచారు. ప్రతి సమాధి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కృష్ణానది పరీవాహక ప్రాంతంలోనే ఉన్నాయి. దీంతో అప్పటి ప్రజలు కృష్ణానది ఎగువభాగంలో నివసించినట్టు తెలుస్తోంది. వ్యవసాయంతోపాటు పశువులపై ఆధారపడి జీవనం సాగించారని, ముఖ్యంగా జొన్నలు, సజ్జలు, కందులు పండించారని లభ్యమైన ఆధారాలను బట్టి తెలుస్తోంది. పూసలు, ప్రత్యేకమైన ఎరుపు, నలుపు రంగు మట్టిపాత్రల అవశేషాలను బట్టి అప్పటి ప్రజలు అలంకార ప్రియులుగా భావిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మొదటగా బృహత్ శిలాయుగంలో ఇనుమును వినియోగించినట్టు పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతంలో ముడి ఇనుము అధికంగా లభ్యమవడంతో ప్రజలు ఇక్కడ నివసించేవారని తెలుస్తోంది. ముఖ్యంగా కృష్ణా, తుంగభద్ర, గోదావరి, పెన్నానది తీరాల్లో వీటి ఆనవాళ్లు తరచు బయటపడుతున్నాయి. ప్రత్యేక నిర్మాణ శైలిలో సమాధులు ప్రాచీన శిలాయుగంలో మానవుడు మృతదేహాలను ప్రకృతికే వదిలేశాడు. నవీన శిలాయుగానికి వచ్చేసరికి మృతదేహాన్ని క్రమపద్ధతిలో పాతిపెట్టడం నేర్చుకున్నాడు. బృహత్ శిలాయుగంలో మానవ మృతదేహాన్ని జంతువులు పీక్కుతినకుండా, ఖనన సామగ్రిని పాడుచేయకుండా పెద్దపెద్ద శిలలతో సమాధులు నిరి్మంచారు. వీటిలో మృతుడు ఉపయోగించిన యుద్ధ, వ్యవసాయ సామగ్రి, మట్టిపాత్రలు, పెంపుడు జంతువులను కూడా సమాధి చేసేవారు. ఈ సమాధుల చుట్టూ పెద్ద బండరాళ్లను పేర్చేవారు. ఇవే రాక్షసగూళ్లు. వీటి ఆనవాళ్లు ప్రపంచం అంతటా ఉన్నాయి. ముఖ్యంగా ఐరోపా, ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. గతంలో విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోను బృహత్ శిలాయుగపు సమాధులు బయటపడ్డాయి. చదునైన బండరాళ్లతో నలువైపులా స్వస్తిక్ ఆకారంలో పేర్చి గది మాదిరి తయారు చేశారు. ఇందులో భూమి లోపల కొంత, భూ ఉపరితలంపై కొంతభాగం కనబడే విధంగా నిర్మించారు. ఈ సమాధులు పెద్ద బండరాళ్లతో ఉండటం, అక్కడ లభించిన మట్టిపాత్రలు, అస్థి పంజరాలను బట్టి ఇవి సామాన్య మానవులకు ఇది సాధ్యం కాదనే ఉద్దేశంతో.. వీటిని రాక్షసుల స్థావరంగా నమ్మి రాక్షసగూళ్లుగా పిలిచేవారు. ఇలాంటి రాక్షసగూళ్లు అచ్చమ్మకుంటలో భారీగా ఉన్నాయి. వీటిలో కొన్ని అప్పటికప్పుడు నిర్మించినవైతే.. మరికొన్ని ముందే నిర్మించుకున్నట్టు తెలుస్తోంది. వీటిలో కొన్ని సామూహిక సమాధులున్నాయి. వీటిలో రెండురకాలున్నాయి. మృతదేహాన్ని ఖననం చేసినవి ప్ర«థమశ్రేణి సమాధులుగా, మృతదేహాన్ని దహనం చేయగా మిగిలిన అవశేషాలను పూడ్చిపెట్టినవి ద్వితీయశ్రేణి సమాధులుగా వర్గీకరించారు. ముగ్గుదిన్నె కాలువకు ఇరువైపులా.. వెల్దుర్తి మండలం గంగలకుంటలోని కృష్ణానది కుడిగట్టుపైన.. ముగ్గుదిన్నె కాలువకు ఇరువైపులా దాదాపు మూడుచదరపు కిలోమీటర్లమేర వెయ్యికిపైగా ఇనుపయుగపు స్మారక కట్టడాలున్నాయి. ఇక్కడ 5–10 మీటర్ల వ్యాసార్థంతో, 1–2 మీటర్ల ఎత్తులో స్థానిక నాపరాళ్లను గుండ్రంగా పేర్చి, గులకరాళ్లతో ఉబ్బెత్తుగా అమర్చిన సమాధులు కనిపిస్తాయి. ఈ సమాధులకు ఉత్తరాన 10–25 అడుగుల ఎత్తు, 3–5 అడుగుల వెడల్పు, 6 అంగుళాల మందంతో చనిపోయినవారికి గుర్తుగా రాళ్లను నిలువుగా ఏర్పాటు చేశారు. వాటిపై ఇనుపయుగపు అంత్యక్రియ పద్ధతులను తెలిపే ఎద్దు, చదరం, గండ్రం, ముగ్గును పోలిన రేఖాచిత్రాలున్నాయి. ‘గంగలకుంటలో గతంలో వందలాది నిలువురాళ్లు, రాకాసిగుళ్లు ఉండేవి. ఇప్పుడు పదో, పదిహేనో మిగిలాయని స్థానికులు ద్వారా తెలుసుకున్నాం. రైతులు నీళ్లగొట్టాలు వేసినప్పుడు, మైనింగ్ కారణంగా దాదాపు 500 సమాధులు, 700 నిలువురాళ్లు ధ్వంసమయ్యాయి. ఇక్కడ లభ్యమైన 25 అడుగుల నిలువురాయి (మెన్హిర్) రాష్ట్రంలోనే అతి పెద్దది. ఇంతటి మానవచరిత్రను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..’ అని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికీ చెక్కు చెదరలేదు నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఇంతటి గొప్ప నాగరికత విలసిల్లిందంటే సంతోషంగా ఉంది. నా పరిశోధనలో బృహత్ శిలాయుగపు సమాధులు కనుగొన్నప్పుడు వాటిని చూసి ఆశ్చర్యపోయాను. సమాధులు 10–15 కిలోమీటర్ల మేర విస్తరించినట్టు అంచనా వేస్తున్నాం. స్థానికులు వీటిని బండరాళ్లుగా భావించి కొన్ని చెదరగొట్టారు. మిగిలిన సమాధులు చెక్కు చెదరలేదు. ఈ సమాధులకు పక్కనే ఎండిపోయిన నదీపాయ ఉండటంతో అప్పటి ప్రజలు దిగువన సువిశాల ప్రాతంలో వ్యవసాయం చేసుకుని జీవించినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ ఆ ప్రాంతం సాగులో ఉంది. ఇక్కడ తవ్వకాలు జరిగితే ఆ నాటి ప్రజల సాంస్కృతిక, సామాజిక జీవనం, వర్తకవాణిజ్య వివరాలు వెలుగులోకొస్తాయి. – ఎం.స్వామినాయక్, ఏపీ పురావస్తు, ప్రదర్శనశాలల అసిస్టెంట్ డైరెక్టర్ -
హ్యాపీ న్యూ ఇయర్ 2015
జనవరి నెలకు ఆ పేరు జానూస్ అనే దేవుడి పేరు మీదుగా వచ్చింది. జానూస్ రెండు ముఖాలున్న దేవుడు. ఒకటి గతం వైపు చూస్తుంటే, మరోటి భవిష్యత్ముఖంగా చూస్తుంది. మానవ నాగరికతలో దాదాపు నాలుగు వేల సంవత్సరాల నుంచి నూతన సంవత్సర వేడుకలను జరుపుకొనే సంప్రదాయం ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 శాతం మంది న్యూ ఇయర్ సందర్భంగా తమ జీవితంలో సరికొత్త మార్పును ఆహ్వానించాలని తాపత్రయపడుతున్నారు. న్యూ ఇయర్ రెజల్యూషన్‌ను పెట్టుకొంటున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువమందికి ‘బరువు తగ్గడం’ అనేదే లక్ష్యం. డబ్బును పొదుపు చేయాలి, స్మోకింగ్ మానేయాలి, జిమ్‌కు వెళ్లాలి... అనేవి న్యూఇయర్ రెజల్యూషన్స్‌లో మిగతా ప్రాధాన్యతాంశాలు. నూతన సంవత్సర వేడుకలు మొదట మొదలయ్యేది న్యూజిలాండ్‌లో. కాలమాన ప్రకారం తొలుత జనవరి ఒకటో తేదీ వచ్చేది వాళ్లకే! ప్రపంచవ్యాప్తంగా 66 శాతం మంది జనవరి ఒకటో తేదీన దైవ ప్రార్థన తప్పనిసరి అని అంటున్నారు. నూతన సంవత్సరం మొదలయ్యే క్షణాన్ని లవర్‌ను కిస్చేస్తూ గ డపాలని 44 శాతం మంది అమెరికా యువతీయువకులు భావిస్తున్నారు. నూతన సంవత్సరం వచ్చే క్షణంలో సంబరాల ప్రస్తావనేమీ లేకుండా నిద్రకే ప్రాధాన్యం ఇస్తున్న వారి శాతం దాదాపు 60! నూతన సంవత్సర సంబరాల్లో అత్యధికంగా వైన్‌ను వినియోగించేది అమెరికన్స్. అమెరికాలోని లాస్‌వెగాస్, డిస్నీ వరల్డ్, న్యూయార్క్ సిటీల్లో జరిగే నూతన సంవత్సర వేడుకలను చూడటానికి ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులు వెళ్తారు. సంబరాల్లో పాలుపంచుకుంటారు. న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో జరిగే బాల్డ్రాప్ కార్యక్రమాన్ని దాదాపు పది లక్షలమంది చూస్తారు. ఈ సంబరాల హోరులో దొంగతనాలు కూడా జోరుగానే సాగుతుంటాయని క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హ్యాంగోవర్ తగ్గాకా తమ బైక్ పోయిందని, కారు పోయిందని పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కేవాళ్లు ప్రతియేటా, ప్రతిదేశంలోనూ భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు. స్థానిక సంప్రదాయాల ప్రకారం వేరే సంవత్సరాదులను కలిగి ఉన్నా... ఆంగ్ల సంవత్సరాది సంబరాల్లో ఉత్సాహంగా జతకలిసేది భారతీయులే! -
మొదటి మానవ నాగరికత ఎక్కడ ప్రారంభమైంది?
1. పాచీన శిలాయుగం నాటి పని ముట్లు ఏ నదీ పరివాహక ప్రాంతంలో లభించాయి? ఎ) గంగా బి) బ్రహ్మపుత్ర సి) సింధూ డి) సోన్ 2. మొనదేలిన శిలా పరికరాలను మానవుడు మొదట ఏ యుగంలో ఉపయోగించాడు? ఎ) లోహ యుగం బి) ప్రాచీన శిలా యుగం సి) మధ్యరాతి యుగం డి) కొత్తరాతి యుగం 3. ఏ కాలంలో కుమ్మరి చక్రాన్ని కనుగొన్నారు? ఎ) క్రీ.పూ. 5000-1000 సంవత్సరాల మధ్య బి) క్రీ.పూ. 8000-6000 సంవత్సరాల మధ్య సి) క్రీ.పూ. 10000-8000 సంవత్సరాల మధ్య డి) క్రీ.పూ. 2000-100 సంవత్సరాల మధ్య 4. తెలంగాణలోని ఏ ప్రాంతంలో నవీన శిలా యుగంలోని నివాస స్థలాలు కనిపించాయి? ఎ) ఉట్నూరు బి) పాలంపేట సి) విజయపురి డి) గుండాల 5. మధ్య శిలా యుగం: నిప్పు:: నవీన శిలా యుగం:--? ఎ) ఆభరణాలు బి) ఉన్ని వస్త్రాలు సి) కుమ్మరి చక్రం డి) మొనదేలిన పని ముట్లు 6. నవీన శిలాయుగ మానవులు ఏయే దేశాలతో విదేశీ వ్యాపారం చేసేవారు? ఎ) పోర్చుగల్, స్పెయిన్ బి) గ్రీకు, ఈజిప్టు సి) గ్రీకు, రోమ్, అరేబియా డి) ఈజిప్టు, రోమ్, పోర్చుగల్ 7. మానవుడు మొట్ట మొదట ఏ యుగంలో వ్యవసాయం చేయడం ప్రారంభించాడు? ఎ) పాతరాతి యుగం బి) మధ్యరాతి యుగం సి) కొత్తరాతి యుగం డి) లోహ యుగం 8. లోహ యుగం ఎప్పుడూ ప్రారంభమైంది? ఎ) క్రీ.పూ. 6000 సంవత్సరం బి) క్రీ.పూ. 5000 సంవత్సరం సి) క్రీ.పూ. 3500 సంవత్సరం డి) క్రీ.పూ. 2750 సంవత్సరం 9. మానవుడు మొదట ఉపయోగించిన లోహం? ఎ) రాగి బి) తగరం సి) కాంస్యం డి) ఇనుము 10. చరిత్ర పూర్వ యుగాన్ని రాతి యుగం అని ఎందుకు పిలుస్తారు? ఎ) ఆది మానవుడు రాతి గుహల్లో నివసించడంతో బి) ప్రాచీన మానవుడు రాళ్లపై చిత్రాలు గీయడం వల్ల సి) ఆది మానవుడి చరిత్రకు ఆధారం రాళ్లపై చెక్కిన బొమ్మలు కావడం డి) {పాచీన యుగ మానవుడు ఉపయోగించిన వస్తువులు రాతితో చేసినవి కావడంతో 11. పాలియోలిథిక్ అంటే? ఎ) లోహ యుగం బి) నవీన శిలాయుగం సి) పాతరాతి యుగం డి) కాంస్య యుగం 12. పూర్వ చారిత్రక యుగాన్ని తెలుసుకోవడానికి ఆధారం? ఎ) లిఖిత గ్రంథాలు బి) లోహ శాస్త్రం సి) పురావస్తు శాస్త్రం డి) పైవన్నీ 13. ఉత్ఖాతనం అంటే? ఎ) పురావస్తు తవ్వకాలు బి) రాతి పనిముట్లు సి) పురాతత్వవేత్తల పరిశోధనలు డి) ఆదిమ కాలం నాటి మట్టి దిబ్బలు 14. సింధులోయ నాగరికత గురించి మొదట అధ్యయనం చేసిన పురాతత్వ శాస్త్రవేత్త? ఎ) మార్టిమర్ వీలర్ బి) సర్ జాన్ మార్షల్ సి) ఎస్.ఆర్. రావ్ డి) ఆర్.సి. దత్ 15. సింధు నాగరికతకు సమకాలీనమైన నాగరికతలు? ఎ) ఈజిప్టు, మెసపటోమియా బి) మెసపటోమియా, చైనా సి) రోమ్, గ్రీక్ డి) ఈజిప్టు,చైనా, రోమ్ 16. పురాతన పనిముట్లను మార్టిమర్ వీలర్ ఏమని వర్ణించాడు? ఎ) అమూల్యమైన శిలాజాలు బి) ఆదిమకాల జీవులు సి) పురాతత్వ ప్రాణులు డి) ప్రాచీన కాల మనుషులు 17. భూమిపై ఆవిర్భవించిన మొదటి ప్రాణి? ఎ) మానవుడు బి) లార్వా సి) ప్లాజిలెట్టం డి) ఏప్ 18. ఆధునిక మానవునికి సమీప పూర్వీకులుగా ఏవరిని భావిస్తారు? ఎ) హోమెఎరక్టస్ మానవుడు బి) నియాన్డెర్తల్ నరుడు సి) అస్ట్రోఫిథికస్ డి) హోమోసెపియన్స్ 19. కింది వాటిలో సరైంది? ఎ) పాతరాతి యుగం-బలమైన సాంఘిక సంబంధాలు బి) మధ్యశిలా యుగం-స్థిర నివాసం సి) నవీన శిలాయుగం-రాగితో చేసిన పనిముట్లు డి) లోహ యుగం-చేనేత కళ ఆరంభం 20. మొదటి మానవ నాగరికత ఎక్కడ ప్రారంభమైంది? ఎ) సింధు నదిలోయ ప్రాంతంలో బి) నైలు నది పరివాహక ప్రాంతంలో సి) మెసపటోమియాలో డి) చైనాలో 21. ఏ సంవత్సరంలో జరిపిన తవ్వకాలలో సింధులోయ నాగరికత గురించి మనకు తెలిసింది? ఎ) క్రీ.శ. 1922 బి) క్రీ.శ. 1879 సి) క్రీ.శ. 1857 డి) క్రీ.శ. 1918 22. సింధు నాగరికత కాలం నాటి మహాస్నాన వాటికను ఏ నగరంలో గుర్తించారు? ఎ) మొహంజోదారో బి) హరప్పా సి) కాళీభంగన్ డి) లోథాల్ 23. హరప్పా నాగరికత ప్రజలను ఎలా పిలుస్తారు? ఎ) సింధులు బి) ఆర్యులు సి) ఆటవికులు డి) ద్రావిడులు 24. {దావిడులకు తెలియని లోహం? ఎ) రాగి బి) తగరం సి) ఇనుము డి) కంచు 25. సింధు లోయ నాగరికత ప్రజల ప్రధాన ఆహారం? ఎ) వరి బి) బార్లీ సి) రాగులు డి) చిరు ధాన్యాలు 26. మొట్ట మొదట పెదవులకు రంగులు వాడిన మహిళలు? ఎ) ద్రావిడులు బి) ఆర్యులు సి) మెసపటోమియన్లు డి) చైనీయులు 27. సింధు ప్రజలకు ఏయే దేశాలతో వాణిజ్య సంబంధాలుండేవి? ఎ) ఈజిప్టు, రోమ్ బి) గ్రీక్, టర్కీ సి) ఇరాన్, ఇరాక్ డి) సిరియా, సాదీ అరేబియా 28. సింధు నాగరికత కాలం నాటి ముఖ్య రేవు పట్టణం? ఎ) హరప్పా బి) లోథాల్ సి) చన్హుదారో డి) మొహంజోదారో 29. హరప్పా ప్రజల ఆరాధ్య దేవత? ఎ) అమ్మతల్లి బి) భూమాత సి) ప్రకృతి దేవత డి) ఏవీకావు 30. సింధులోయ నాగరికత ప్రజల లిపిని బొమ్మలిపిగా పిలుస్తారు. ఈ లిపిని రాయటాన్ని సర్పలేఖనం అంటారు. సర్పలేఖనం అంటే? ఎ) ఒక వరుసను కుడి నుంచి ఎడమకు తర్వాతి వరుసను ఎడమ నుంచి కుడికి రాయడం బి) ఒక వరుసను కుడి నుంచి ఎడమకు తర్వాతి వరుసను వదిలి తిరిగి కుడి నుంచి ఎడమకు రాయడం సి) ఒక వరుసను ఎడమ నుంచి కుడికి తర్వాతి వరుసను కుడి నుంచి ఎడమకు రాయడం డి) ఒక వరుసను ఎడమ నుంచి కుడికి తర్వాతి వరుసను కూడా ఎడమ నుంచి కుడికి రాయడం 31. సింధు ప్రజల లిపికి ఏయే దేశాల ప్రాచీన లిపులతో పోలికలు ఉన్నట్లుగా తెలుస్తోంది? ఎ) చైనా, అరేబియా బి) గ్రీస్, ఈజిప్టు సి) గ్రీస్, మెసపటోమియా డి) ఈజిప్టు, మెసపటోమియా 32. కింది వాటిలో సరికానిది? ఎ) కాళీభంగన్-ఉత్తరప్రదేశ్ బి) ధోల్వీరా-గుజరాత్ సి) బన్సాలీ-హర్యానా డి) రోపార్-పంజాబ్ 33. కింది వాటిలో హరప్పా నాగరికతకు సంబంధించని విశేషం? ఎ) మాతృస్వామిక వ్యవస్థ బి) పశుపోషణ ప్రధాన వృత్తి సి) అలంకార ప్రియత్వం డి) పట్టణ సమాజం 34. సింధులోయ నాగరికత ప్రజలు ఏ లోహంతో తయారైన వంట సామాగ్రిని ఉపయోగించేవారు? ఎ) ఇనుము బి) రాగి సి) కంచు డి) అల్యూమినియం 35. హరప్పా నాగరికత విలసిల్లిన కాలం? ఎ) క్రీ.పూ. 3000-1500 మధ్య బి) క్రీ.పూ. 2750-1000 మధ్య సి) క్రీ.పూ. 2500-1250 మధ్య డి) క్రీ.పూ. 2300-1750 మధ్య 36. సూక్ష్మ శిలాయుగంగా పేరుగాంచింది? ఎ) నవీన శిలా యుగం బి) లోహయుగం సి) పాతరాతి యుగం డి) మధ్య శిలాయుగం 37. {పపంచంలో అతి పురాతన గ్రామం? ఎ) బటాక్వెస్ (మెక్సికో) బి) అస్ట్రఖాస్ (రష్యా) సి) జెరిఖో (జోర్డాన్) డి) కాళీభంగన్ (ఇండియా) 38. సింధులోయ ప్రాంతంలో నివసించిన ప్రజల అవశేషాలు, శిధిలాలను ఎక్కడ కనుగొన్నారు? ఎ) బెలుచిస్థాన్ బి) మొహంజాదారో సి) హరప్పా డి) అలంగీర్పూర్ 39. {పపంచంలోనే అత్యంత ఎక్కువ మొత్తంలో విస్తరించిన నాగరికత? ఎ) ఆర్య బి) సింధు సి) నైలు డి) యుఫ్రటిస్ 40. సింధు నాగరికత కాలం నాటి నర్తకి బొమ్మ ఎక్కడ తవ్వకాల్లో బయటపడింది? ఎ) సుక్తాజెండార్ బి) కోట్‌డిజి సి) చన్హుదారో డి) మొహంజాదారో 41. వేదం అంటే? ఎ) పవిత్ర గ్రంథం బి) పవిత్ర ఆధ్యాత్మిక గ్రంథం సి) పవిత్ర వాక్కు డి) పవిత్ర ఆభరణీయ సూత్రాలు 42. అతి పురాతన వేదం? ఎ) అధర్వణ వేదం బి) సామ వేదం సి) రుగ్వేదం డి) యజుర్వేదం 43. తొలి వేద (రుగ్వేద) నాగరికత కాలం? ఎ) క్రీ.పూ. 1000-600 బి) క్రీ.పూ.1500-600 సి) క్రీ.పూ. 1500-1000 డి) క్రీ.పూ. 1000-200 44. ఆర్యులు స్థిరపడిన ప్రాంతం? ఎ) గంగా-యమునా మధ్య ప్రాంతం బి) సింధు-సట్లేజ్ మధ్య ప్రాంతం సి) సోన్-బెట్కా మధ్య ప్రాంతం డి) నర్మద-తపతి పరివాహక ప్రాంతం 45. ఆర్యులు ద్రావిడులను ఏమని పిలిచేవారు? ఎ) ఆటవికులు బి) బ్రాహ్మణులు సి) దస్యులు డి) పురులు 46. ఆర్యులు భారతదేశంలో స్థిరపడిన విధానాన్ని తెలిపే చారిత్రక ఆధారం? ఎ) రామాయణం బి)మహాభారతం సి)భగవద్గీత డి) రుగ్వేదం 47. దశమ రాజ్య యుద్ధం ఎవరెవరికి జరిగింది? ఎ) ఆర్యులు, ఆర్యేతరులు బి) ఆర్యులు, ద్రావిడులు సి) భరతులు, ఆర్య తెగల కూటమి డి) ఆర్య తెగల కూటమి, దస్యుల కూటమి 48. రుగ్వేదంలో అత్యంత సాధారణ నేరంగా పేర్కొంది? ఎ) పశువులను దొంగిలించడం బి) కిడ్నాప్ సి) హత్య డి) మానభంగం 49. ఆర్యనాగరికతలో తండ్రిని ఏమని పిలిచే వారు? ఎ) ఆర్యన్ బి) రాజన్ సి) గృహస్థ డి) గృహపతి 50. రుగ్వేద ఆర్యుల ప్రధాన ధనం? ఎ) గోవులు బి) బంగారు నగలు సి) భూమి డి) వేదాలు సమాధానాలు: 1) డి; 2)సి; 3) ఎ; 4) ఎ; 5) సి; 6) బి; 7) బి; 8) బి; 9) ఎ; 10) డి; 11) సి; 12) సి; 13) ఎ; 14) బి; 15)ఎ; 16) డి; 17) బి; 18) డి; 19) బి; 20) సి; 21) ఎ; 22) ఎ; 23) డి; 24) సి; 25) బి; 26) ఎ; 27) సి; 28) బి; 29) ఎ; 30) సి; 31) డి; 32) ఎ; 33) బి; 34) సి; 35) డి; 36) డి; 37) సి; 38) సి; 39) బి; 40) డి; 41) బి; 42) సి; 43) బి; 44) ఎ; 45) సి; 46) డి; 47) సి; 48) ఎ; 49) డి; 50) ఎ.