హ్యాపీ న్యూ ఇయర్ 2015
జనవరి నెలకు ఆ పేరు జానూస్ అనే దేవుడి పేరు మీదుగా వచ్చింది. జానూస్ రెండు ముఖాలున్న దేవుడు. ఒకటి గతం వైపు చూస్తుంటే, మరోటి భవిష్యత్ముఖంగా చూస్తుంది.
మానవ నాగరికతలో దాదాపు నాలుగు వేల సంవత్సరాల నుంచి నూతన సంవత్సర వేడుకలను జరుపుకొనే సంప్రదాయం ఉంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 శాతం మంది న్యూ ఇయర్ సందర్భంగా తమ జీవితంలో సరికొత్త మార్పును ఆహ్వానించాలని తాపత్రయపడుతున్నారు. న్యూ ఇయర్ రెజల్యూషన్‌ను పెట్టుకొంటున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువమందికి ‘బరువు తగ్గడం’ అనేదే లక్ష్యం. డబ్బును పొదుపు చేయాలి, స్మోకింగ్ మానేయాలి, జిమ్‌కు వెళ్లాలి... అనేవి న్యూఇయర్ రెజల్యూషన్స్‌లో మిగతా ప్రాధాన్యతాంశాలు.
నూతన సంవత్సర వేడుకలు మొదట మొదలయ్యేది న్యూజిలాండ్‌లో. కాలమాన ప్రకారం తొలుత జనవరి ఒకటో తేదీ వచ్చేది వాళ్లకే!
ప్రపంచవ్యాప్తంగా 66 శాతం మంది జనవరి ఒకటో తేదీన దైవ ప్రార్థన తప్పనిసరి అని అంటున్నారు.
నూతన సంవత్సరం మొదలయ్యే క్షణాన్ని లవర్‌ను కిస్‌చేస్తూ గ డపాలని 44 శాతం మంది అమెరికా యువతీయువకులు భావిస్తున్నారు.
నూతన సంవత్సరం వచ్చే క్షణంలో సంబరాల ప్రస్తావనేమీ లేకుండా నిద్రకే ప్రాధాన్యం ఇస్తున్న వారి శాతం దాదాపు 60!
నూతన సంవత్సర సంబరాల్లో అత్యధికంగా వైన్‌ను వినియోగించేది అమెరికన్స్.
అమెరికాలోని లాస్‌వెగాస్, డిస్నీ వరల్డ్, న్యూయార్క్ సిటీల్లో జరిగే నూతన సంవత్సర వేడుకలను చూడటానికి ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులు వెళ్తారు. సంబరాల్లో పాలుపంచుకుంటారు. న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో జరిగే బాల్‌డ్రాప్ కార్యక్రమాన్ని దాదాపు పది లక్షలమంది చూస్తారు.
ఈ సంబరాల హోరులో దొంగతనాలు కూడా జోరుగానే సాగుతుంటాయని క్రైమ్ రికార్డ్స్ చెబుతున్నాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హ్యాంగోవర్ తగ్గాకా తమ బైక్ పోయిందని, కారు పోయిందని పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కేవాళ్లు ప్రతియేటా, ప్రతిదేశంలోనూ భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు.
స్థానిక సంప్రదాయాల ప్రకారం వేరే సంవత్సరాదులను కలిగి ఉన్నా... ఆంగ్ల సంవత్సరాది సంబరాల్లో ఉత్సాహంగా జతకలిసేది భారతీయులే!