
ఆక్లాండ్: ప్రపంచవ్యాప్తంగా కొత్త సంవత్సరపు వేడుకలు అప్పుడే ప్రారంభమయ్యాయి. అంబరాన్నంటేలా న్యూఇయర్ వేడుకలు జరుగుతున్నాయి. అందరికంటే ముందే న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి 12 గంటలు కొట్టగానే ప్రజలు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి.. సంబరాలు చేసుకున్నారు. పరస్పరం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపి.. ఆనంద డొలికల్లో తేలియాడారు. ఆక్లాండ్ వాసులు ఘనంగా కొత్త సంవత్సరం 2018కు స్వాగతం పలికారు. ఇటు ఆస్ట్రేలియాలోనూ కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సిడ్నీలో అట్టహాసంగా కొత్త వసంతపు వేడుకులు జరుగుతున్నాయి. బ్రెజిల్‌లోనూ కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment