సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల పరిశీలన శుక్రవారం జరిగింది. జిల్లాలోని 46 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 627 నామినేషన్లు దాఖలైన విషయం తెల్సిందే. ఇందులో 618 సక్రమంగానే ఉండగా తొమ్మిదింటిని అధికారులు తిరస్కరించారు. 685 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 5,509 నామినేషన్లు రాగా వీటి లో 4,436 నామినేషన్లు పరిశీలనలో ఆ మోదం పొందాయి. వేర్వేరు కారణాల తో 1,074 ఎంపీటీసీ తిరస్కరణకు గురయ్యాయి.
జిల్లా పరిషత్ కార్యాలయం లో జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, డిప్యూటీ సీఈఓ కరీం, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి జెడ్పీటీసీ నామినేషన్లను పరిశీలించారు. స్థా నిక సంస్థల ఎన్నికల పరిశీలకులు హరి ప్రీత్‌సింగ్ నామినేష్ల పరిశీలనను పర్యవేక్షించారు. 200 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్ల పరిశీలనకు హాజరయ్యారు. మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారులు ఎంపీటీసీ నామినేషన్లను పరిశీలించారు. తిరస్కరణకు గురైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లపై శనివారం అధికారులు అప్పీళ్లను స్వీకరిస్తారు.
తిరస్కరణకు గురైన నామినేషన్లు..
జెడ్పీటీసీ నామినేషన్లలో తొమ్మిదింటిని అధికారులు తిరస్కరించారు. ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ అనంతరం తిరస్కరణ వివరాలు ప్రకటించారు. తొగుట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జ్యోతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన వయస్సులేకపోవటంతో, సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కె.కిష్టమ్మ రెండు నామినేషన్లను ముగ్గురు పిల్లలు ఉన్నందున, సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఎర్ర యాదమ్మ పేరు ఓటరు జా బితాలో లేకపోవటంతో తిరస్కరించా రు. దుబ్బాక నుంచి టీడీపీ తరఫున నామినేషన్ వేసిన కమలమ్మ పేరును ప్రతిపాదించిన వ్యక్తిఓటు ఓటరు జాబి తాలో లేదు.
దీంతో ఆమె నామినేషన్ తిరస్కరించారు. పటాన్‌చెరు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరికి ముగ్గురు పిల్లలు ఉన్న ట్టు ఫిర్యాదు రావడంతో నామినేషన్ తిరస్కరణకు గురైంది. కంగ్టి నుంచి నామినేషన్ వేసిన కాంగ్రెస్ నాయకుడు సంజీవ కానిస్టేబుల్‌గా పనిచేస్తుండడం తో నామినేషన్ తొలగించారు. మెదక్ నుంచి సీపీఎం తరఫున నామినేషన్ వేసిన బాలమ్మ పేరు ఓటరు జాబితాలో లేకపోవడంతో తిరస్కరణకు గురైంది. కోహీర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నజీమా సుల్తానా డిపాజిట్ చెల్లించకపోవడంతో అధికారులు నామినేషన్‌ను తిరస్కరించారు.
జెడ్పీటీసీకి 618 నామినేషన్లు ఓకే
Published Sat, Mar 22 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 5:00 AM
Advertisement
Advertisement