సాక్షి, నెల్లూరు : టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పోరుబాటను వీడలేదు. జిల్లాకు చెందిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతోపాటు కొత్తగా పార్టీలో చేరిన సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరెడ్డి, సిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలతో పాటు దాదాపు జిల్లా టీడీపీ శ్రేణులు మొత్తం ఏకమయ్యాయి.
అధినేత చంద్రబాబు సైతం తగిన ప్రాధాన్యమిచ్చి న్యాయం చేస్తామని చెప్పారు తప్ప టికెట్ ఇస్తానని చెప్పలేదు. అయినా సరే కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి నెల్లూరు సిటీ టికెట్ కోసం తన పోరుబాటను వీడలేదు. ఎన్‌టీఆర్, బాలకృష్ణలపై ఉన్న అభిమానాన్ని అడ్డుపెట్టి టికెట్ కోసం అన్ని ప్రయత్నాలను సాగిస్తున్నారు. అలుపెరగని పోరాటంతో ముందుకు వెళుతున్నారు. బాలకృష్ణ ఆశీస్సులు తనకే ఉన్నాయని, చివరకు నెల్లూరు సిటీ టీడీపీ టికెట్ తనకే అని కోటంరెడ్డి గట్టి భరోసాతో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ మేరకు బాలకృష్ణ తనకు స్పష్టమైన హామీ కూడా ఇచ్చారని కోటంరెడ్డి ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీలో వర్గవిభేదాలు సమసిపోయేలా కన్పించడంలేదు. బుధవారం లెజెండ్ సినిమా విజయోత్సవ యాత్ర సందర్భంగా నెల్లూరుకు వచ్చిన బాలకృష్ణకు స్వాగతం పలకడం దగ్గర నుంచి కోటంరెడ్డి అన్నీతానై చూసుకున్నారు.
తన అనుచరులతో ర్యాలీ నిర్వహించి బాలకృష్ణ అభిమానాన్ని మరోమారు చూరగొన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలవేళ బాలకృష్ణ నగరానికి రాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర మొక్కుబడిగా వచ్చి వెళ్లాడు తప్పించి ఆయనతో ఉండలేదు. ఇక టీడీపీ నేతలెవరూ బాలకృష్ణ దరిదాపులకు రాలేదు. ఇంకేముంది కోటంరెడ్డి అన్నీతానై దగ్గరుండి చూసుకొని బాలకృష్ణ వద్ద మార్కులు కొట్టేశారు. మరోవైపు ఆదాలతో పాటు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి ఇటీవలే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం విదితమే. వీరి రాకకు ఆదినుంచీ కోటంరెడ్డి అడ్డుతగులుతూనే ఉన్నారు. కాంగ్రెస్‌లో అవినీతికి పాల్పడి కోట్లు దండుకున్న నేతలను ఎలా పార్టీలో చేర్పించుకుంటారంటూ కోటంరెడ్డి విలేకరుల సమావేశంపెట్టి మరీ ప్రశ్నించారు. సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం వారిపై పిర్యాదులు చేశారు.
ఇవేమీ ఖా తరు చేయని బాబు ఆదాల వర్గాన్ని పార్టీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల గొడవ రోడ్డుకెక్కింది. పాతకాపులకు టికెట్లు ఇవ్వలేదం టూ ఇటు కోటంరెడ్డి, అటు మాజీ మంత్రి రమేష్‌రెడ్డిలు మళ్లీ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో పేరుకు కొన్ని సీట్లు కేటాయించినా కోటంరెడ్డి అనుచరులను ఓడించేకుట్రకు పాల్పడ్డారన్న ప్రచారం ఉంది. ఇంత జరుగుతున్నా ఆశవదలని కోటంరెడ్డి నెల్లూరు సిటీ టికెట్ కోసం పోరాటాన్ని ఆపలేదు. బావ చంద్రబాబును వదలి బావమరిది బాలకృష్ణను గట్టిగా పట్టారు. పదేపదే బాలకృష్ణకు ఆదాల వర్గంపై పిర్యాదుల పరంపర కొనసాగించినట్లు తెలుస్తోంది.
చివరకు బాలకృష్ణ వద్ద ప్రచారరథ ం పొంది ఆయన మద్దతు తనకే అన్న భరోసాతో నెల్లూరుకు తిరిగి వచ్చారు. టికెట్ తనకే అం టూ విస్తృత ప్రచారం సాగిస్తున్నారు. తాజాగా బాలకృష్ణ లెజెండ్ యాత్ర ఆయనకు కలిసొచ్చింది. బాలకృష్ణ మద్దతు తనకేనని మరోమారు ప్రజలకు సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీలో బాలకృష్ణకే సరైన ప్రాధాన్యం లేదని, అలాం టిది ఇక కోటంరెడ్డిని పలకరించేవారెవరని ప్రత్యర్థి వర్గం నేతలు కొట్టిపారేస్తున్నారు. అయితే ఎన్‌టీఆర్ వీరాభిమాని, మాజీమంత్రి రమేష్‌రెడ్డి మాత్రం బాలకృష్ణ ర్యాలీలో కన్పించకపోవడం గమనార్హం. మొత్తంగా టీడీపీలో టికెట్ల లొల్లి సమసేలా లేదు.
అభిమానంతో చెక్
Published Thu, Apr 3 2014 3:15 AM | Last Updated on Mon, Oct 22 2018 8:50 PM
Advertisement
Advertisement