జగన్ను ప్రజలు నమ్మారు: వైఎస్ విజయమ్మ | Andhra Pradesh People faith ys jagan mohan reddy, says ys vijayamma | Sakshi
Sakshi News home page

జగన్ను ప్రజలు నమ్మారు: వైఎస్ విజయమ్మ

Published Wed, May 7 2014 8:25 PM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

జగన్ను ప్రజలు నమ్మారు: వైఎస్ విజయమ్మ - Sakshi

జగన్ను ప్రజలు నమ్మారు: వైఎస్ విజయమ్మ

విశాఖపట్నం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ప్రజలందరూ తమ గుండెల్లో ఉంచుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్‌ఆర్ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ప్రజలకు నమ్మకం కలిగిందని చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి లేని లోటును జగన్ తీరుస్తాడని ప్రజలందరూ నమ్ముతున్నారని అన్నారు.

విలువలకు, విశ్వసనీయతకే ప్రజలందరూ ఓటేశారని విజయమ్మ వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్న విశ్వాసాన్ని ఇమె వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో పోలింగ్ సరళిని ఆమె పరిశీలించారు. విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయమ్మ పోటీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement