రాజుగారి దెబ్బా... మజాకా?! | Blow to the plans of the king ...?! | Sakshi
Sakshi News home page

రాజుగారి దెబ్బా... మజాకా?!

Published Mon, May 5 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 AM

రాజుగారి దెబ్బా... మజాకా?!

రాజుగారి దెబ్బా... మజాకా?!

  •      బినామీ క్వారీలతో రవాణా వ్యవస్థ ధ్వంసం
  •      కూలిపోయిన బొడ్డేరు, జంపెన వంతెనలు
  •      రాత్రి, పగలూ రవాణాతో జనం ఆగ్రహం
  •  చోడవరం,న్యూస్‌లైన్: గ్రానైట్ వ్యాపారంతో జిల్లాలో వెలిగిపోతున్న చోడవరం మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు రాళ్ల దెబ్బలు అటు జనం సహనాన్ని, ఇటు రోడ్లను దెబ్బతీస్తున్నాయి. నాలుగేళ్లుగా అక్రమ రవాణాతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్క రోడ్డు, కల్వర్టు  నిర్మించని రాజు  చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లోని ప్రధాన రహదారులు దెబ్బతినడానికి మాత్రం కారణమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి.

    అధికారంలో లేకపోవడం వల్లే నియోజకవర్గం అభివృద్ధి చేయలేకపోయానని చెప్పే రాజు తన సొంత అభివృద్ధికి మాత్రం పెద్దపీట వేసుకున్నారు. మాడుగుల, రావికమతం తదితర మండలాల్లో కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే తెల్లగ్రానైట్ క్వారీలు 20 వరకు ఆయనకున్నాయని సమాచారం.

    కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు,  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  సహకారంతో  కోట్లు విలువచేసే గ్రానైట్ క్వారీల లీజులు తెచ్చుకున్న ఎమ్మెల్యే రాజు నియోజకవర్గం సమస్యలను పరిష్కరించడానికి ఎందుకు చొరవ చూపలేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.

    కొత్త సమస్యలు
     
    నిత్యం 40 టన్నులకు మించిన సామర్థ్యం ఉన్న వాహనాలు రోడ్లపై ప్రయాణిస్తుండడంతో చాలావరకు కల్వర్టులు, వంతెనలు దెబ్బతిన్నా యి. రోడ్లు ధ్వంసమయ్యాయి. జాతీ య రహదారిపై తప్ప గ్రామీణ రోడ్లై పై 15 టన్నులకు మించి బరువున్న వాహనాలు ప్రయాణించకూడదు. నిబంధనలను అతిక్రమించి భారీ వా హనాలు తిరగడంతో బి.ఎన్.రోడ్డు, మాడుగుల, గొటివాడ-వీరవిల్లి అగ్రహారం, చింతలూరు, కవగుంట, వి.జె.పురం-రావికమతం రోడ్లలో వంతెనలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి.  

    మూడేళ్ల కిందటే చోడవరం సమీపంలో బొడ్డేరు వంతెన కూలి పోగా, ఏడాది కిందట పెద్దేరు నదిపై జంపెన వంతెన కూలిపోయింది.  పెద్దేరు, తాచేరు, శారదా నదులపై ఉన్న వడ్డాది, వీరవిల్లి, గోవాడ వంతెనలతోపాటు ఈరోడ్లలోని చాలా కల్వర్టులు కూలిపోయే స్థితికి చేరాయి. ఇవి ఎప్పుడు కూలిపోతాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

    దెబ్బతిన్న రోడ్లపై ప్రయాణికులు నానాపాట్లు పడుతున్నారు. అధికారుల హెచ్చరికలతో పగటిపూట రవా ణా నిలిచిపోయినా రాత్రిపూట కొనసాగుతోంది. ప్రజాసమస్యలను గాలి కి వదిలేసి సొంత అభివృద్ధికే పెద్దపీట వేసిన ఇటువంటి నాయకులను పక్కనపెట్టి తమకోసం పనిచేసే వారిని గెలిపించుకోవాలని నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement