వైఎస్సార్ సీపీ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుల దాడి
నెల్లిమర్ల రూరల్, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు భౌతికదాడులకు దిగుతున్నారు. ఓటింగ్ ప్రక్రియకు కొన్ని గంటలే గడువు ఉండడంతో నయానో, భయానో తమ వైపు తిప్పుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తమ మాట వినని వారిపై బెదిరింపులు, కక్ష సాధింపులకు దిగుతున్నారు. తాజాగా నెల్లిమర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గంటా అప్పలరాజు, ఆయన సోదరులు గంటా సతీష్, మధు ఆదివారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బురిడి మహేష్‌పై దాడి చేశారు. బాధితుడు గతంలో షాడోనేత వద్ద పనిచేసేవాడు. అయితే ఇటీవలే మహేష్, అతని కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు ఇలా భౌతిక దాడులకు దిగారు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం... మహేష్ ఆదివారం రాత్రి విజయనగరం నుంచి వస్తుండగా నెల్లిమర్లలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద గంటా అప్పలరాజు, గంటా సతీష్, గంటా మధు మాట్లాడాలిరా అంటూ కార్యాలయ ప్రాంగణంలోకి తీసుకెళ్లారు. అక్కడ ‘‘నిన్న టివరకు మా వెంట ఉండి ఈ రోజు వైఎస్సార్ సీపీలో ఎలా తిరుగుతావ్, నీవాళ్లందరి సంగతి తేలుస్తాం’’ అంటు హెచ్చరించారు. అయితే దీనికి మహేష్ నాకు నచ్చిన పార్టీలో ఉంటా.. అడగడానికి మీరు ఎవ రూ అని అడగడంతో అప్పలరాజు తన చేతిలో ఉన్న ఇనుప రాడ్డుతో తన ము ఖంపై కొట్టాడని, సతీష్ కత్తితో బెదిరించాడని, మధు పిడుగుద్దులు గుద్దాడని తెలిపారు.
వారిని తప్పించుకొని పారిపోతుండగా మరో ముగ్గురు వచ్చి తన ను వెనక్కి లాక్కెళ్లి అందరూ కలిసి దాడి చేసినట్లు తెలిపాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే అట్రాసిటి కేసు పెట్టిస్తామని బె దిరించారన్నారు. అయితే వారి బెదిరింపులకు లొంగక తనపై దాడికి దిగిన అప్పలరాజు, సతీష్, మధులతో పాటు హోంగార్డు వాసు, సళ్లి నారాయణరావు, కిషోర్‌లుపై పోలీసులకు ఫిర్యా దు చేసినట్టు చెప్పారు. గత కొంతకాలంగా తన సోదరుడు సన్యాసిరావుపై దాడికి ప్రయత్నిస్తున్నారని, అతడు దొరక్కపోవడంతో తనపై దాడి చేసినట్లు బాధితుడు చెబుతున్నాడు.
గంటా అప్పలరాజు ఎంపీ బొత్స ఝాన్సీ వద్ద పీఏగా చేశాడని, వారి అండ ఉందన్న ఉద్దేశంతోనే గ్రామంలో రాజకీయలు నడుపుతున్నాడని చెప్పాడు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా త న దారికి రాని వారిని బెదిరింపులకు దిగడం, కక్షసాధిం పులు చేయడం చేస్తున్నాడని బాధితుడు మహేష్ తెలిపారు. వారి కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు నెల్లిమర్లలో చాలామంది ఉన్నారని తెలిపారు. అప్పలరాజు మండలంలోని ఒక గ్రామానికి పంచాయతీకి కార్యదర్శిగా పని చేస్తున్నాడని, రాజకీయాలు నడుపుతున్న అతనిపై చర్యలు తీసుకోవాలని మహేష్ కోరాడు. ప్రస్తుతం బాధితుడు స్థానిక మిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.