సీపీఎం ‘మాస్టర్’ ప్లాన్! | CPM to hit Mamata banerjee with Master plan in general elections | Sakshi
Sakshi News home page

సీపీఎం ‘మాస్టర్’ ప్లాన్!

Published Wed, Apr 23 2014 1:04 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

సీపీఎం ‘మాస్టర్’ ప్లాన్! - Sakshi

సీపీఎం ‘మాస్టర్’ ప్లాన్!

* దీదీని ఢీకొనేందుకు సరికొత్త ఎత్తుగడ
* ఉపాధ్యాయ అభ్యర్థుల్ని దించిన సీపీఎం
* ఆరుగురు తృణమూల్ ఎంపీలకు సవాలు

 
రాజశేఖర్, సాక్షి-న్యూఢిల్లీ:
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఢీకొనేందుకు సీపీఎం ఈసారి ‘మాస్టర్’ ప్లాన్ వేసింది. తృణమూల్‌కు గట్టి ప్రాబల్యమున్న స్థానాల్లో ఉపాధ్యాయ నేపథ్యం గల అభ్యర్థులను బరిలోకి దించింది. ఆరుగురు తృణమూల్ సిట్టింగ్ ఎంపీలను ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులను రంగంలోకి దించిన సీపీఎం, మరో నాలుగు స్థానాల్లోనూ ‘మాస్టర్స్’నే పోటీకి నిలిపింది. వారి వివరాలు ఓసారి చూద్దాం..   
 
 నియోజకవర్గం:  బంగావ్  దేబాశీష్ దాస్ (సీపీఎం)
 జాదవ్‌పూర్ వర్సిటీ నుంచి టెలీ కమ్యునికేషన్, ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్‌డీ చేసిన ఈయన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అధ్యాపకునిగా పనిచేశారు. తర్వాత సీపీఎంలో చేరి, 1991, 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 
 కపిల్‌కృష్ణ ఠాకూర్ (తృణమూల్)
 మతువా సామాజికవర్గానికి చెందిన కపిల్ తండ్రి గురుచంద్ ఠాకూర్‌కు దళిత నేతగా మంచి పేరు ఉంది. కపిల్ తల్లి మంజులాకృష్ణ ఠాకూర్ ఇదివరకు ఎమ్మెల్యేగా, మమత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
 
 నియోజకవర్గం:  కంతి  తపస్ సిన్హా  (సీపీఎం)
 విద్యాసాగర్ వర్సిటీలో పట్టభద్రుడైన తపస్
 సిన్హా రంగస్థల నటుడిగా ప్రసిద్ధుడు. థియేటర్ ఆర్‌‌ట్సలో అధ్యాపకుడిగా వ్యవహరించారు.
 
 శిశిర్ అధికారి (తృణమూల్)

 మన్మోహన్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. గతంలో కంతి మునిసిపాలిటీ చైర్మన్‌గా పాతికేళ్లు కొనసాగారు. ప్రస్తుతం కంతి ిసిటింగ్ ఎంపీ.
 
 నియోజకవర్గం:  దక్షిణ కోల్‌కతా
 నందినీ ముఖర్జీ (సీపీఎం)
 ఈమె జాదవ్‌పూర్ వర్సిటీ నుంచి ఎంఈ, మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం నందినీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
 
 సుబ్రతా బక్షీ (తృణమూల్)
 సుబ్రతా బక్షీ ఇది వరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం దక్షిణ కోల్‌కతా సిటింగ్ ఎంపీగా ఉన్నారు.  
 
 నియోజకవర్గం:  డమ్‌డమ్  దాస్‌గుప్తా (సీపీఎం)
 కోల్‌కతా వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అసీమ్‌కుమార్ దాస్‌గుప్తా.. అమెరికాలోని ఎంఐటీ వర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు.
 
 సౌగతారాయ్ (తృణమూల్)
 ఇదివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మన్మోహన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
 
 నియోజకవర్గం:  కృష్ణానగర్ శంతన్ ఝా (సీపీఎం)
 బిధాన్‌చంద్ర వర్సిటీ నుంచి వ్యవసాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. అదే వర్సిటీలో ఫ్రొఫెసర్‌గా పనిచేశారు. కళ్యాణి మున్సిపాలిటీకి చైర్మన్‌గా పనిచేశారు.
 
 తపస్ పాల్ (తృణమూల్)
 ప్రఖ్యాత నటుడు. దాదాపు యాభైకి పైగా సినిమాల్లో నటించారు. ఇదివరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.  
 
 నియోజకవర్గం:  రాణాఘాట్ అర్చనా బిశ్వాస్ (సీపీఎం)

 హోమియోపతిలో డిప్లొమా చేసిన అర్చనా బిశ్వాస్, చాలాకాలం బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. గతంలో ఐద్వాలో పనిచేసిన ఆమె 2011లో సీపీఎంలో చేరారు.
 
 సౌగత బర్మన్(తృణమూల్)
 ఇక్కడి నుంచి సిటింగ్ ఎంపీగా ఉన్న సుచల్‌రంజన్ స్థానంలో మమత సౌగతను ఎంపిక చేశారు. స్థానిక పార్టీ బలం, ఆర్థిక బలం సౌగతకు సానుకూలాంశాలు.
 
 మరికొందరు...
 వీరితో పాటే అధ్యాపక వృత్తిలో కొనసాగిన మరికొందరిని కూడా సీపీఎం ఈ ఎన్నికల్లో బరిలోకి దించింది. జాల్పాయిగుడి స్థానం నుంచి మహేంద్రకుమార్ రాయ్, పురులియా నుంచి నరహరి మెహతా, జర్‌ద్వాన్‌పుర్జా నుంచి ఈశ్వరచంద్ర బోస్, బర్‌ద్వాన్-దుర్గాపూర్ నుంచి సైదల్ హఖీ పోటీ చేస్తున్నారు. వీరంతా ఇదివరకు ఉపాధ్యాయులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement