వైఎస్సార్‌సీపీ వెల్లడి.. దీనిపై మీడియా దుష్ర్పచారాన్ని ఖండించిన పార్టీ
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను వివరాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సమర్పించిందని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. వైఎస్సార్‌సీపీ 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను వివరాలను సమర్పించలేదని జరుగుతున్న దుష్ర్పచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది.
2012-13 ఆర్థిక సంవత్సరపు ఆదాయపు పన్ను వివరాల పత్రాలను తమ పార్టీ.. నిర్దేశించిన నిబంధనలు, సెక్షన్ల ప్రకారం ఎన్నికల కమిషన్‌లోని ఐటీ విభాగానికి సమర్పించామని, ఆ మేరకు అక్నాలెడ్జ్‌మెంట్ కూడా పొందామని వివరిస్తూ, తమపై నిరాధారంగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు తెలిపింది. వాస్తవాలేమిటో కనీసం నిర్ధారించుకోకుండా, నిజానిజాలు తెలుసుకోవడానికి సంబంధిత వ్యక్తులనుగానీ, సంస్థలనుగానీ సంప్రదించకుండా ఇలాంటి నిరాధారమైన వార్తలను టీవీల్లో ప్రసారం చేయడం అనేది దురుద్దేశంతో కూడిన చర్య అని, దీనిని తాము ఖండిస్తున్నామని పేర్కొంది.
ఆదాయ పన్ను వివరాలు ఈసీకి సమర్పించాం
Published Mon, Apr 21 2014 1:34 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
Advertisement
Advertisement