సాక్షి, నల్లగొండ : సార్వత్రక ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు నియమితులయ్యారు. మండల స్థాయిలో ఎన్నికల నిర్వహణను ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. మొత్తం 59 మండలాలకు అధికారులను జిల్లా ఎన్నికల అధికారి టి. చిరంజీవులు ఆదివారం నియమించారు. ఒక్కో అధికారికి ఒకటి రెండు మండలాల బాధ్యతలు అప్పగించారు.
వీరంతా ఈ నెల 27 నుంచి 30వ తేదీన ఎన్నికలు ముగిసే వరకు ప్రత్యేక ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులుగా విధులు నిర్విహ స్తారు. సంబంధిత రిటర్నింగ్ అధికారులతో వీరు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ఎన్నికలు ప్రశాంతగా ముగిసేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మండలాల్లో విస్తృతంగా తిరిగి పోలింగ్ ప్రక్రియను తెలుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి వీరికి సూచించారు.
ఓట్ల లెక్కింపు కేంద్రాల తనిఖీ
నల్లగొండ : సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.చిరంజీవులు, జేసీ హరిజవహర్‌లాల్ ఆదివారం తనిఖీ చేశారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రమైన ఎఫ్‌సీఐ గోదామును కలెక్టర్ పరిశీలించి ఏర్పాట్లపై సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కేంద్రమైన దుప్పలపల్లి ఎఫ్‌సీఐ గోదాములో జరుగుతున్న ఏర్పాట్లను జేసీ హరిజవహర్‌లాల్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ లోక్‌సభ వ్యయ పరిశీలకులు ఎ.ధనరాజ్, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికలకు ఫ్లయింగ్ స్క్వాడ్‌ల నియామకం
Published Mon, Apr 28 2014 3:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM
Advertisement