సీమాంధ్ర రాజధాని ఎలా ఉండాలి?
- సీమాంధ్ర కు కొత్త రాజధాని ఎలా ఉండాలి? అది మరో హైదరాబాద్ కావాలా? లేక మరైదైనా కావాలా?
- తెలంగాణకి, సీమాంధ్రకి మధ్య ఉన్న భౌగోళిక తేడాలను దృష్టిలో ఉంచుకుని సీమాంధ్ర రాజధాని విషయంలో కొత్తగా ఆలోచించాలా?
- అటు ఇచ్ఛాపురం నుంచి ఇటు తడ దాకా సముద్రతీరం వెంబడి విస్తరించిన రాష్ట్రంగా ఉండబోతోంది మిగిలిన ఆంధ్రప్రదేశ్. దానికి రాయలసీమ నాలుగు జిల్లాలు కలిసి భీముడి గద రూపం సంతరించుకుంది. దీని మధ్య సమతౌల్యం సాధించడమెలా? (సీమాంధ్ర కొత్త సీఎం చేయాల్సిన 5 ప్రధాన పనులేంటి?)
- ఒకే రాజధాని - హైదరాబాద్ లా అన్నీ ఒకే చోట కేంద్రీకృతం అయి, అధికారమంతా ఒకే చోట ఉండేలా చేయడం. రాష్ట్రానికే తలమానికంలా ఉండే రాజధానిని నిర్మించుకోవడం. అభివృద్ధికి ఒక నమూనాను రూపొందించి ప్రజల ముందు ఉంచడం.
- రెండు రాజధానులు - పొరుగున ఉన్న కర్నాటకలో రెండు రాజధానులున్నాయి. ఒకటి బెంగుళూరు. మరొకటి బెల్గామ్. కొత్తగా ఏర్పడిన ఉత్తరాఖండ్ కి రెండు రాజధానులున్నాయి. ఒకటి డెహ్రాడూన్. కొండ ప్రాంతాల్లో ఏడాదికి ఒకసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ నమూనా ఎలా ఉంటుంది?
- పాలనా కేంద్రం ఒకచోట, చట్టసభ ఇంకొక చోట, హైకోర్టు ఒక చోట ఇలా వికేంద్రీకరిస్తే ఎలా ఉంటుంది? దీని వల్ల సమతౌల్యం వస్తుందా?
- లేక పెద్ద రాజధాని కన్నా ఈ ఇంటర్నెట్ యుగంలో ఈ గవర్నమెంట్ ను ప్రోత్సహిస్తే మంచిదా? చిన్న భవనాలు, కొద్ది సిబ్బందితో పనిచేస్తే ఎలా ఉంటుంది?
- వరదలు, తుఫాన్ల సమస్య ఎక్కువగా ఉండే సీమాంధ్రలో రాజధాని సురక్షితంగా ఉండటం అవసరం. దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు.
మన ముందున్న రాజధాని నమూనాలు ఇవిః
రాజధాని ఎక్కడ అన్న ప్రశ్న కన్నా రాజధాని ఎలా ఉండాలన్నది నిర్ణయించుకోవడం ముఖ్యం. అందుకే సీమాంధ్రకు కాబోయే ముఖ్యమంత్రికి మీరిచ్చే సలహా ఏమిటి? నిర్మాణాత్మక సలహాలతో ముందుకు రండి. మీ సలహా కొత్త ఆంధ్రప్రదేశ్ కి రాచబాట కావచ్చు.
ఇంకెందుకు ఆలస్యం. మౌస్ పట్టండి. కీ బోర్డు నొక్కండి....