
సీమాంధ్రలో బీసీని సీఎం చేస్తారా?
హైదరాబాద్: తెలంగాణలో ఓటమి ఖాయమని తెలిసే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీ మంత్రం జపిస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, టీఆర్ఎస్ నాయకుడు జూపల్లి కృష్ణారావు అన్నారు. ఓటమి భయంతోనే బీసీ సీఎం అంటున్నారని ఎద్దేవా చేశారు. సీమాంధ్రలో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చరిత్ర అవినీతిమయం అని జూపల్లి ఆరోపించారు. పదేళ్లగా చంద్రబాబు కోలుకోవడం లేదన్నారు.
పార్టీని విలీనం చేయలేదంటూ టీఆర్‌ఎస్ పార్టీని, కేసీఆర్‌ను విమర్శించే అర్హత తెలంగాణ కాంగ్రెస్ నేతలకెక్కడదని దుయ్యబట్టారు. వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.