‘లగడపాటితో కేటీఆర్‌కు వ్యాపార బాంధవ్యం’ | KTR Business deal with Lagadapati Rajagopal, says Daruvu Ellanna | Sakshi
Sakshi News home page

‘లగడపాటితో కేటీఆర్‌కు వ్యాపార బాంధవ్యం’

Published Fri, Apr 25 2014 3:12 PM | Last Updated on Wed, Aug 15 2018 7:56 PM

ఆరెపల్లి మోహన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న ఎల్లన్న - Sakshi

ఆరెపల్లి మోహన్‌తో కలిసి విలేకరులతో మాట్లాడుతున్న ఎల్లన్న

శంకరపట్నం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా అడుగడుగునా అడ్డుకున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో కేసీఆర్ కొడుకు కె.తారకరామారావుకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఓయూ జేఏసీ నేత దరువు ఎల్లన్న ఆరోపించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారంలో మానకొండూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆరెపల్లి మోహన్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కావడి కింద పెడితే విద్యార్థులం చదువులు పక్కనపెట్టి కావడి భుజాన ఎత్తుకున్నామన్నారు. సకలజనుల సమ్మె అన్ని కులాలు, ఉద్యోగ సంఘాలు చేపడితే గులాబీ కండువాలు కప్పుకొని టీఆర్‌ఎస్ నాయకులు ఫొటోలకు పోజులిచ్చుకున్నారని విమర్శించారు. దళితుడిని ముఖ్యమంత్రి, ముస్లింను ఉపముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ అధికారం కోసం మాట తప్పుతున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణను అడ్డుకున్న ద్రోహులకు, వ్యాపారవేత్తలకు టీఆర్‌ఎస్ టికెట్లు ఇచ్చిందని ఆరోపించారు. మరోసారి కుట్రలకు మోసపోవద్దని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం పది బృందాలుగా ఏర్పడి కాంగ్రెస్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. కేసీఆర్‌కు అధికారం అప్పగిస్తే  ఫాంహౌస్‌లు జిల్లాకు ఒకటి సంపాదించుకుంటాడని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement