నేడే ఆఖరు | last day for nominations to general elections | Sakshi
Sakshi News home page

నేడే ఆఖరు

Published Wed, Apr 9 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM

last day  for nominations to general elections

 కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్‌సభ, శాసనసభ స్థానాలకు నామినేషన్ల ఘట్టం బుధవారంతో ముగియనుంది. ఈనెల 2వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. సోమవారం వరకు అసెంబ్లీ స్థానాలకు 48, పార్లమెంట్ స్థానాలకు ఎనిమిది నామినేషన్లు  వచ్చాయి. ఏడో రోజైన మంగళవారం అసెంబ్లీ స్థానాలకు 45, ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి మంగళవారం రెండు, పెద్దపల్లి ఎంపీ స్థానానికి రెండు నామినేషన్లు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు పది అసెంబ్లీ స్థానాలకు 93, రెండు పార్లమెంట్ స్థానాలకు 10 నామినేషన్లు వచ్చాయి. ఆదిలాబాద్‌కు కాంగ్రెస్ పార్టీ నుంచి సిడాం గణపతి, మరో స్వాతంత్ర అభ్యర్థి ముసలి చిన్నయ్య ఎంపీ స్థానానికి నామినేషన్ వేశారు. పెద్దపల్లి ఎంపీ స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి కాల్వల సంజీవ్ నామినేషన్ వేయగా, బీఎస్పీ నుంచి పి. శంకర్ లాల్ నామినేషన్ దాఖలు చేశారు.

 ఏడో రోజు నామినేషన్లు ఇలా..
 జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు ఏడో రోజైన మంగళవారం 45 నామినేషన్లు వచ్చాయి. సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి 4, చెన్నూర్‌కు 4, బెల్లంపల్లికి 9, మంచిర్యాలకు 4, ఆసిఫాబాద్‌కు 4, ఖానాపూర్‌కు 1, ఆదిలాబాద్‌కు 8, బోథ్‌కు 2, నిర్మల్‌కు 4, ముథోల్ నియోజకవర్గానికి 5 నామినేషన్లు వచ్చాయి.

     సిర్పూర్‌కు స్వతంత్ర అభ్యర్థి మోబినొద్దీన్, బీఎస్పీ నుంచి కోనేరు కోనప్ప, టీడీపీ నుంచి గొల్లపల్లి బుచ్చిలింగం, బీఎస్పీ నుంచి కోనేరు వంశీకృష్ణ నామినేషన్లు వేశారు.

     చెన్నూర్‌కు స్వతంత్ర అభ్యర్థి ఓ. శ్రీనివాస్, ఆర్‌పీకే నుంచి సోగల సంజీవ్, టీఆర్‌ఎస్ నుంచి నల్లాల ఓదేలు, స్వతంత్ర అభ్యర్థి బిరుదుల ప్రదీప్ నామినేషన్ వేశారు.

     బెల్లంపల్లి స్థానానికి ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు రత్నం, శ్రీకాంత్, అంబాల మహేందర్, పెరుగు రాందాస్, బడికెల సంపత్‌కుమార్, మొగురం కన్నయ్యలు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేకల వెంకటేశం, బీజేపీ నుంచి గందం రమేష్, టీడీపీ నుంచి శలం రాజలింగు, ఏఐఎఫ్‌బీ నుంచి బి.మధులు నామినేషన్లు వేశారు.

 మంచిర్యాలకు బీజేపీ నుంచి ఎం. మల్లారెడ్డి, జి. వెంకటానంద్ కృష్ణారావులు, స్వతంత్ర అభ్యర్థిగా బి. మల్లేష్, టీడీపీ నుంచి బి. రఘునందన్‌లు నామినేషన్లు వేశారు.

 చెన్నూర్‌కు టీడీపీ నుంచి ఎం. సరస్వతీ, రాథోడ్ చారులత, ఆత్రం భగవంత్‌రావులు, ఎంఎస్‌పీ నుంచి కోట్నాక్ విజయ్‌కుమార్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.

 ఖానాపూర్‌కు టీఆర్‌ఎస్ నుంచి చౌహాన్ ప్రేమలత నామినేషన్ వేశారు.

 ఆదిలాబాద్‌కు టీడీపీ నుంచి మునిగెల నర్సింగ్, ఐయూఎంఎల్ నుంచి మహ్మద్ రఫీక్, టీఆర్‌ఎస్ నుంచి జోగురామన్న, కాంగ్రెస్ నుంచి భార్గవ్‌దేశ్‌పాండే, బీఎస్పీ నుంచి భూమారెడ్డి, పాటిల్ కమల, బీజేపీ నుంచి పాయల శంకర్, ఆర్‌కేసీపీ నుంచి విఠల్‌లు నామినేషన్లు వేశారు.

 బోథ్‌కు టీడీపీ నుంచి సోయం బాపురావు, టీఆర్‌ఎస్ నుంచి సబావత్ రాములు నాయక్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.

 నిర్మల్‌కు టీడీపీ నుంచి ఎం. యాసిన్‌బేగ్, భూషన్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా కె. ప్రవీణ్‌కుమార్, టీఆర్‌ఎస్ నుంచి కూచాడి శ్రీదేవిలు నామినేషన్లు వేశారు.

ముథోల్‌కు టీడీపీ నుంచి ఓంప్రకాష్ లడ్డా, టీడీపీ నుంచి ఎల్. నారాయణరెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా లాలుతాటివార్, ఆర్‌పీఐ నుంచి కాంబ్లే దిగంబర్, శివసేన నుంచి టి. పండిత్‌రావులు నామినేషన్లు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement