చంద్రబాబుకు మైనంపల్లి ఝలక్ | mainampally hanumantharao joins congress party | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు మైనంపల్లి ఝలక్

Published Mon, Apr 7 2014 12:56 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

చంద్రబాబుకు మైనంపల్లి ఝలక్ - Sakshi

చంద్రబాబుకు మైనంపల్లి ఝలక్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఝలక్ ఇచ్చారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ ఇస్తామని చెప్పి, నిన్న మొన్నటి వరకు పార్టీ కోసం బోలెడంత ఖర్చు పెట్టించి తీరా ఇప్పుడు ఆ స్థానాన్ని కాస్తా పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చేశామని చెప్పడంతో ఆయన తీవ్ర నిరాశా నిస్పహలకు లోనయ్యారు.

మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉన్న తనను మల్కాజిగిరి తీసుకొచ్చి, ఈ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారని, నాలుగేళ్ల నుంచి ఈ మాట చెబుతూ వచ్చి ఇప్పుడు తీరాచూస్తే ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించి తనను అన్యాయం చేశారని మైనంపల్లి వాపోయారు. అందుకే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ఢిల్లీ వెళ్లి, దిగ్విజయ్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన మల్కాజిగిరి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement